60 Year Old Woman Dancing To Bullet Bandi Song, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Bullet Bandi Song: బామ్మ స్టెప్పులు చూస్తే వావ్‌ అనాల్సిందే!

Published Thu, Sep 9 2021 11:50 AM | Last Updated on Thu, Sep 9 2021 2:05 PM

Old Lady Dancing Infront Of Husband Bullet Bandi Song Goes Viral - Sakshi

సోషల్‌మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్‌ అవుతుందో చెప్పలేం. అలా ఏదైనా ఓసారి నెటిజన్లను ఆకట్టుకుంటే అవి వైరల్‌గా మారి నెట్టింట రచ్చ చేస్తుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే వాటి హవా కొంత కాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ‘బుల్లెట్‌ బండి’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజలే గాక సెలబ్రిటీల సైతం ఈ పాటకి చిందేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ తన భర్త ముందు ‘బుల్లెట్‌ బండి’ పాటకు స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం.. శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్‌ బండి’ పాట ట్రెండ్‌ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్‌ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్‌ వినిపిస్తోంది. దీంతో ఈ పాటకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ అంతకంతకు క్రేజ్‌ పెరుగుతోంది. అయితే ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు తాను కూడా తక్కువకాదంటూ ఓ వృద్ధురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.

ఆ వీడియోలో.. దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ .. ‘బుల్లెట్‌ బండి’ సాంగ్‌కి అద్భుతమైన స్టెప్పులేసింది. తన భర్త మంచంపై కూర్చొని చూస్తుండగా.. సరిగ్గా సాంగ్‌లో రిథమ్‌కి తగ్గట్టు ఆమె డాన్స్‌ చేసింది. అయితే అతను మాత్రం కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు, బహుశా షాక్‌లో ఉన్నాడేమో! ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్‌ సూపర్‌ బామ్మ అంటున్నారు. కొందరు ఫన్నీగా ఉందని కామెంట్‌ పెడుతుంటే.. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్‌’ అని కామెంట్‌ పెడుతున్నారు.

చదవండి: Cat Drink Pig Milk: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్‌ అవుతున్న వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement