త్రిష ఉన్నారు సామీ | Trisha is back to Saamy Square, says director Hari. But her mum says no | Sakshi
Sakshi News home page

త్రిష ఉన్నారు సామీ

Jan 9 2018 12:25 AM | Updated on Jan 9 2018 12:25 AM

Trisha is back to Saamy Square, says director Hari. But her mum says no - Sakshi

... అంటున్నారు డైరెక్టర్‌ హరి. ఇంతకీ త్రిష ఎక్కడ ఉన్నారు? ఉన్న సంగతిని హరి ఎందుకు కన్ఫార్మ్‌ చేస్తున్నారనే విషయానికి వస్తే.. విక్రమ్, త్రిష జంటగా 2003లో వచ్చిన సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ ‘సామీ’కి సీక్వెల్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులోనూ కథానాయికగా త్రిషను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది జరిగి చాలా రోజులైంది. ఆ తర్వాత మరో కథానాయికగా కీర్తీ సురేష్‌ని తీసుకోవడం, తన పాత్ర నిడివి తక్కువగా ఉందని త్రిష ఫీలై సినిమా నుంచి తప్పుకోవడం జరిగిందనే వార్తలు వచ్చాయి.

‘‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నా’’ అని సోషల్‌ మీడియా ద్వారా త్రిష స్వయంగా చెప్పారు కూడా. అయితే.. ‘‘ఈ సినిమాలో త్రిష ఉన్నారు’’ అని తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో హరి స్పష్టం చేశారు. మరి.. కీర్తీ సురేష్‌ లేరా? అంటే ఆమె కూడా ఉన్నారు. ముందు కాదన్న త్రిష తర్వాత ఒప్పుకున్నారంటే.. హరి ఆమెను కన్విన్స్‌ చేసి ఉంటారనేగా అర్థం. త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement