![Valentines day 2025 special chitchat with sivarapalli fame rag mayur](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/ragmayur-sivarapalli.jpg.webp?itok=9Jg5KV_e)
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్‌తో సాక్షి.డాట్ స్పెషల్ల్గా ముచ్చటించింది.
సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్‌ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.
ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!
ఇపుడు తన కరియర్‌లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.
సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్‌చాట్‌ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి.
సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment