‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ | Gandhi Tatha Chettu Movie Review And Rating In Telugu, Check Storyline, Cast And Film Highlights | Sakshi
Sakshi News home page

Gandhi Tatha Chettu Review: సుకుమార్‌ కూతురు నటించిన ‘గాంధీ తాత చెట్టు’ ఎలా ఉందంటే..?

Published Thu, Jan 23 2025 3:47 PM | Last Updated on Thu, Jan 23 2025 9:19 PM

Gandhi THatha Chettu Movie Review And Rating In Telugu

టైటిల్‌: గాంధీ తాత చెట్టు
నటీనటులు:  సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ 
నిర్మాతలు: వీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు 
రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాది
సంగీతం: రీ
సినిమాటోగ్రఫీ: శ్రీజిత్‌ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల
విడుదల తేది: జనవరి 24, 2025

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi THatha Chettu Review). ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్‌లో సుకుమార్‌ కూడా పాల్గొనడంతో ‘గాంధీ తాత చెట్టు’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య రేపు (జనవరి 24) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మీడియా కోసం ఈ సినిమా స్పెషల్‌ షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సుకుమార్‌ తనయ డెబ్యూతోనే హిట్‌ కొట్టిందా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..?
నిజామాబాద్‌ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు. 

అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్‌(రాగ్‌ మయూర్‌) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ.  దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ.(Gandhi THatha Chettu Review))

ఎలా ఉందంటే.. 
గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని, ఓ చెట్టుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేదే ఈ సినిమా కథ. టైటిల్‌ తగ్గట్టే ఈ సినిమా కథంతా గాంధీ, తాత, చెట్టు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దర్శకురాలు ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా జన్యూన్‌గానే ఇచ్చింది. అయితే సందేశం బాగున్నప్పటికీ సాగదీసి చెప్పినట్లుగా అనిపిస్తుంది. మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ.. అహింసవాదం గొప్పదనాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయి. కానీ వాస్తవికానికి కాస్త దూరంగా ఉంటుంది.

ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభంలోనే తాత,గాంధీ పాత్రలను పరిచయం చేసి.. అసలు కథను ప్రారంభించారు దర్శకురాలు. ఒకపక్క గాంధీ జర్నీని చూపిస్తూనే..మరోపక్క తాత, చెట్టుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు. మహాత్మా గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం బాగుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని తెలియకుండానే మన కళ్లు చెమ్మగిల్లుతాయి. 

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌ సాగినప్పటికీ.. సెకండాఫ్‌ మాత్రం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అలాగే కథనం మొత్తం ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు లేకుండా ఊహకు అందినట్లే సాగుతుంది. ‘నువ్వు ఒక్క మొక్క అయినా నాటావా? చెట్టును నరికే హక్కు ఎవరిచ్చారు? నువ్వు పీల్చుకున్న గాలి ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చిందే కానీ..నువ్వు సంపాదించుకున్నది ఏమి లేదంటూ బిజినెస్‌ మ్యాన్‌తో తాత చెబుతుంతుంటే.. ‘నిజమే కదా.. మనం కూడా చెట్లను పెంచలేదు. ఒక్కటైనా పెంచుదాం’ అనే ఆలోచన కొంతమందికి అయినా వస్తుంది.

 ‘ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త టైం పడుతుంది’, ‘చెడుని దులిపేయాలి...మంచిని పట్టుకోవాలి’, ‘పంట పండే స్థలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని వ్యభిచారానికి పంపించినట్లే’ అంటూ తాత చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏమేరకు సక్సెస్‌ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం అందించింది. 

ఎవరెలా చేశారంటే..
సుకుమార్‌ ముద్దుల కూతురు సుకృతి వేణి నటించిన డెబ్యూ మూవీ ఇది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం నిజంగామే ఆమె గుండు గీసుకుంది అంటే.. ఎంత ఇష్టపడి నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్‌ సీన్లలోనూ చక్కగా నటించింది. 

ఇక తాత రామచంద్రయ్య పాత్రకి ఆనంద్‌ చక్రపాణి పూర్తి న్యాయం చేశాడు. బిజినెస్‌ మ్యాన్‌ సతీష్‌గా రాగ్‌ మయూర్‌  తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు మిగిలిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ వారి వారి పాత్రల పరిధిమేర చక్కగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన పాటలలో పాటు నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నీవేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement