yamini
-
పాకల బీచ్‌లో పెను విషాదం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ అనంతరం తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెండు బృందాలుగా సముద్ర స్నానానికి వచ్చినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరిని వారి స్నేహితులు, స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామం శివన్నపాలేనికి చెందిన నోసిన మాధవ (24), అతని భార్య నవ్య (21), పిన్ని నోసిన సువర్ణరాణి, చెల్లెలు నోసిన జెస్సిక (13), మరదలు కందుకూరు మండలం కొళ్లగుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(14), మరో 10 మంది బంధువులతో కలిసి ఆటోలో పాకల బీచ్‌కు వచ్చారు. మగవారు మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లగా... మహిళలు ముందుగా సముద్రంలోకి దిగారు. వారు దిగిన ప్రాంతంలో చిన్నపాటి గుంతలు ఉన్నాయి. వాటిని గమనించకుండా వీరు ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా అలలు ఉధృతంగా వచ్చి ముంచేశాయి. మాధవ, నవ్య, జెస్సిక, యామిని, సువర్ణరాణి సముద్రంలో కొట్టుకుపోయారు. సముద్రపు అలలపై దూరంగా నవ్య, సువర్ణరాణి తేలియాడుతూ కనిపించడంతో స్థానిక మత్స్యకారుడు సైకం శ్రీను, మాధవ స్నేహితుడు విశాల్ పడవలో వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత మాధవ, జెస్సిక, యామిని మృతదేహాలు అలలపై కనిపించడంతో పోలీసులు బయటకు తీసుకొచ్చి కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పండుగ కోసం స్నేహితుడు మాధవతో కలిసి ఇక్కడికి వచ్చానని, ఆనందంగా గడిపామని, తిరిగి వెళ్లే ముందు ఈ దుర్ఘటన జరిగిందని తెలంగాణలోని మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన కళ్లముందే ఐదుగురు సముద్రంలో మునిగిపోయారని, మత్స్యకారుల సహకారంతో ఇద్దరిని కాపాడామని, స్నేహితుడు మాధవ మరణించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు.స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు గల్లంతుఅదే సమయంలో సింగరాయకొండ శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి పవన్ (22) కూడా తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చాడు. అలల ఉధృతికి పవన్ సముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. పాకాల బీచ్‌ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించి మెరైన్ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పవన్ ఆచూకీ తెలిసే వరకు అదనపు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టాలని మెరైన్ పోలీసులకు ఎస్పీ దామోదర్ సూచించారు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త యాక్టర్స్ వస్తూనే ఉంటారు. అప్పటికే ఫామ్‌లో నటీనటులు సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు మాత్రం హిట్ మూవీస్ చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎందుకో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అలా దాదాపు 22 ఏళ్ల క్రితం తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఓ పాప ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు యామిని శ్వేత. డైరెక్టర్ తేజ తీసిన హిట్ సినిమా 'జయం'లో హీరోయిన్ సదా చెల్లెలిగా నటించిన పాప గుర్తుందా? ఆమెనే ఈమె. సీరియల్ నటి జయలక్ష్మి కూతురు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల రావడానిక ముందు 10 సీరియల్స్‌లో చేసింది. అలా నటిస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఈమె తండ్రి డైరెక్టర్ తేజకు ఫొటోలు పంపారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంపికైంది.'జయం'త పాటు ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు సినిమాల్లోనూ బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. చదువు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసిన యామిని.. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిలైంది. తాజాగా ఈమెని చూసిన కొందరు.. 'జయం' నటి ఏంటి ఇంతలా మారిపోయిందని మట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
రెస్టారెంట్ లో సర్వర్ నుంచి కోట్ల విలువైన కంపెనీకి సీఈఓ యామిని రంగన్ సక్సెస్ స్టోరీ
-
సరికొత్త కథతో...
విరాట్ కార్తీక్, యామినీ రాజ్, ప్రియాంక రెవ్రి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. ‘‘లవ్, కామెడీ, మంచి ఎమోషన్స్‌తో ఓ సరికొత్త కథతో ఈ సినిమాని రూపొందించాం. అజయ్ పట్నాయక్ సంగీతం, శివ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ఓ హైలైట్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. -
స్టార్ హీరోపై నటి తీవ్ర ఆరోపణలు.. ‘నన్ను లైంగికంగా వేధించాడు’
ఓ స్టార్ హీరోపై నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్‌పై నటి యామిని సింగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ సింగ్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా భోజ్‌పూరి నటి అయిన యామిని సింగ్ అక్కడ స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె పవన్ సింగ్ లేటెస్ట్ మూవీ బాస్‌లో నటించే చాన్స్ అందుకుంది. ఇటీవల సెట్‌పై వెళ్లిన ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే సడెన్‌గా ఆమెను ఈ సినిమా నుంచి తొలగించినట్లు ఇటివల వార్తలు వచ్చాయి. చదవండి: నా పిచ్చికి, బాధకు ఇదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్ ఆమె తీరు నచ్చకే ఈ సినిమాలో నుంచి తొలగించారంటూ రకరకాలు పుకార్లు వినిపించాయి. తాజాగా తనపై వస్తున్న రూమార్స్‌పై యామిని సింగ్ స్పందించింది. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. పవన్ సింగ్‌తో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. ఆయన సినిమాల్లో లేడీ యాక్టర్స్‌కు సరైన పాత్రలు ఉండవని చెప్పింది. అదే విధంగా ‘పవన్ సింగ్ తన సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలోనే అందరు అనుకుంటున్నారు. చదవండి: కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్ కానీ అది నిజం కాదు. బాస్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది డైరెక్టర్ అరవింద్ చౌబే. ఈ సినిమా నుంచి నన్ను ఎవరు తీసేయలేదు. నేనే తప్పుకున్నా. పవన్ చాలా మంచి నటుడు అని ఈ సినిమా ముందు వరకు అనుకున్నాను. కానీ అతడు అసలు స్వరూపం తర్వాత బయటపడింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రావాలని చెప్పాడు. అయితే రాత్రి అయ్యింది నేను రాలేనని చెప్పాను. దీంతో అతడు సినిమా చేయాలని ఉందా? లేదా? అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నువ్వు నటించాలంటే ఇప్పుడు రావాల్సిందే అంటూ బెదిరించాడు. ఇక నేను కాల్ కట్ చేసి సినిమా నుంచి తప్పుకున్నాను’ అంటూ యామిని చెప్పుకొచ్చింది. -
Jayam Child Artist Yamini Latest Photos: ‘జయం’ ఫేమ్ యామిని శ్వేత (ఫోటోలు)
-
Yamini Saraswathi: యామినీ విలాసం
కాస్త పొట్టి ఆకారం! తెల్లగా మెరిసిపోయే బిళ్లంచు ఖద్దరు ధోవతి; నాజూగ్గా కట్టుకున్న తీరు.అంతే తెల్లని జుబ్బా, రింగులు తిరిగిన ముంగురులు. ముఖానికే అందమిచ్చే కళ్ల జోడు. మనిషి అసలే అందగాడు. ఆహార్యం ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తుంటుంది. భుజాల మీద కప్పుకున్న పండిత శాలువా, అదీ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లోవే. నడక లోనూ నాజూకుతనం. మాటలో సుకుమార్యం. సౌహార్దం, కాసింత సున్నిత హాస్యం అప్పుడప్పుడూ పండిత కవి మిత్రులతోనైతే వ్యంగ్యా స్త్రాలు సంధించే నైజం. డిగ్రీలో గణితమే ప్రధానాంశమైనా, తాత్కాలిత గణిత ఉపాధ్యాయుడిగా అక్కడ క్కడే కొలువు చేసినా, ఆయన అభిమాన మంతా తెలుగు సాహిత్యం మీదే. అందుకే ప్రాచీన నవీన రచనలెన్నింటినో ఆపోశన పట్టారు. ఊరక చదివింది కాదు, వాటిలోని ప్రశస్తమైన పద్యగద్యాలు, ఆసక్తికర సన్ని వేశాలు, సంభాషణలు, పద్యాలు చలోక్తులూ వంటివెన్నింటినో పుక్కిట బట్టారు. సందర్భాలకు తగినట్టుగా వాటిని ప్రయోగించేవారు. అలాగే ఆధునిక కవులనూ, రచయితలనూ, రచనలనూ తన మనోమందిరంలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఈ ‘సాహిత్య వ్యసనం’ ఎంతగా మారిపోయిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూల సాహిత్య సభ జరిగినా తన హాజరు ఆవశ్యం ఉండేలా చూసుకునేవారు. ఆ రీతిగా ఎందరో కవులు, పండితులు, రచయితలు, రచయిత్రులతో పరిచయం పెంచుకున్నారు. ప్రాచీనులలో కవిత్రయము, శ్రీనాథ పోతనలు, ప్రబంధ కవులూ మిక్కిలి అభి మానం. పదకర్తలంటే ప్రత్యేక గౌరవం. మొదట్లో శతకం వంటి రచనలు చేసినా తర్వాత వచనరచయితగా, రూపాంతరం చెందారు. అతివ–అభిజాత్యం నవలతో మొదలైన ఆయన రచనా ప్రస్థానం స్వతంత్ర నవలలు, పలు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలలు ముద్రణ పొందడంతో యావదాంధ్రలో ఆయన పేరుపొందారు. ఆయనే యామినీ సరస్వతి. ఇది కలంపేరు. సరస్వతి ఆయన భార్యపేరు. ఆయన అసలు పేరు డీవీ సుబ్బారావు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ఫిర్కాలోని జిల్లేళ్ల గ్రామం స్వస్థలం. ఆగస్టు 3, 1941న జన్మించారు. కానీ సాహిత్య సంచారానికీ, రచనా రంగానికీ నంద్యాలనే ఆవాసం చేసు కున్నారు. నండూరు రామకృష్ణమాచార్య, గుంటూరు శేషేంద్రశర్మ, కొండవీటి వెంకట కవి, బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ సినారె వంటి ప్రముఖులెందరితోనే పరిచయం ఏర్పర్చుకుని నిత్య చర్చలు జరిపేవారు. నంద్యాల నూతన సారస్వత సంఘం కార్యదర్శిగా పని చేశారు. దాదాపు యాబై పైగా నవలలు, వంద కుపైగా కథలు రాశారు. తన రచనా వ్యాసం గంతోనే కొండవీటి వెంకటకవికి, దాసరి నారాయణరావుకు సహరచయితగా మారారు. సినీ, టీవీ రచయితగా పేరొందారు. టీవీలో విశ్వామిత్ర సీరియల్‌కి, సినిమాకు రచయితగా, తాండ్రపాపారాయుడు, విశ్వనాథనాయకుడు సినిమాలకు సహరచయితగా పనిచేశారు. సాహిత్యారాధన కోసం స్వగ్రామంలో తనకున్న ఆస్తులను కరిగించేశారు. 2004 సెప్టెంబర్ 5న ఆప్తులను, ఆత్మీయులను, హిత మిత్రులను వదిలి కీర్తిశేషులయ్యారు. రాయల సీమలో పేరెన్నికగన్న నవలా రచయితల్లో యామిని ఒకరు. కానీ రచనా రంగంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల కంటే కర్నూలు వెనుకబడినందున కాబోలు ఆయనకు రావలసినంత పేరు రాలేదనే చెప్పాలి. సాహిత్యరంగంలో ఒకరికి పేరు రావడానికీ, మరొకరికి పేరు రాకపోవడానికీ మధ్య నడిచే బోలెడు కథల బాగోతంలో చిక్కిన బడుగు రచయితల్లో యామిని కూడా ఒకరయ్యారని చెప్పడం సబబు. - దినకర్, విశ్రాంత తెలుగు పండితుల -
‘వరుస’ తప్పి.. ప్రేమికుడిని మట్టుబెట్టి..
వరంగల్: ఆ యువతి ప్రేమ వరుస తప్పింది. వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని ప్రేమించింది. అంతకుముందు ఆ సోదరుడి స్నేహితుడిని ప్రేమించింది. తమ వ్యవహారం సాఫీగా కొనసాగాలంటే తొలుత ప్రేమించిన వ్యక్తిని హత్య చేయాలని సోదరుడిని ఒప్పించి మట్టుపెట్టించింది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలను వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇద్దరు స్నేహితులు.. నడుమ యువతి వరంగల్ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌కు చెంది న కోమటి విజయ్, రెడ్డిమల్ల రాంకీ స్నేహితులు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే క్రమంలో రాంకీ పెద్దనాన్న కూతురు, కాజీపేటకు చెందిన రెడ్డిమల్ల యా మిని పరిచయమైంది. విజయ్‌తో ఆమె ప్రేమలో పడగా, వీరి వివాహానికి విజయ్ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయినా ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అదే సమయంలో వరుసకు తమ్ముడైన రాంకీతోనూ యామిని శారీరక సంబంధం ఏర్పర్చుకుంది. వీరిద్దరూ వరంగల్ డాక్టర్స్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నా రు. ఓ రోజు రాంకీ తన స్వగ్రామమైన వర్ధన్నపేట కు యామినిని తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. తాను విజయ్‌తో కలిసినప్పటి ఫొటోలను స్నేహితులకు పంపిస్తున్నాడని, అతడి అడ్డు తొలగించాలని, దీంతో తమ సంబంధం సాఫీగా సాగుతుందని సోదరుడిని ఒప్పించింది. కెనాల్లోకి తోసి... రాంకీ ఈ నెల 4న విజయ్ను తన ఇంటికి పిలిచా డు. వివిధ ప్రాంతాల్లో కారులో తిరిగిన అనంతరం 5న గీసుకొండ శివారు కాకతీయ కెనాల్ వద్ద ఇద్ద రూ కల్లు తాగారు. మత్తులో ఉన్న విజయ్ ముఖం పై రాంకీ బలంగా గుద్ది కెనాల్లోకి తోసేయడంతో నీటిలో కొట్టుకుపోయాడు. ఈ నెల 7న వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం శివారులోని కాకతీయ కెనాల్లో మృతదేహం కొట్టుకురా గా గుర్తు తెలియని వ్యక్తిదిగా పోలీసులు కేసు నమో దు చేశారు. అదేసమయంలో తన కుమారుడు కానరావడం లేదని విజయ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మృతదేహం విజయ్‌దిగా పోలీసులు తేల్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అసలు విషయం వెలుగు చూసింది. పక్కా సమాచారంతో రాంకీ, యామినిని శనివారం అరెస్టు చేశారు. -
స్క్రాప్‌బుక్‌లో ఎన్నెన్నో భావాలు
‘మిస్ యూ!’ మిస్సైన ఫీల్ ఏదిరా.. ఎక్కడా?! ‘లవ్ యూ!’ దేవుడా రొటీన్. చంపేయ్ పోనీ. ‘కంగ్రాట్స్!’ ఏ బడి సార్ మీది? మొక్కుబడా? బీడే బేబీ! నాకేనా, ఫోన్‌లోనా?! జీవం ఉండట్లేదు ఎక్కడా మన ఎక్స్‌ప్రెషన్స్‌లో. ఇంకా ఎలా చెప్పాలి? ‘ఇంకా’నా! అసలేం చెప్పారని? హార్ట్‌ని టచ్ చేశారా? లేదు! అది ముఖ్యం కదా.. ఓ పని చేయండి. మీట్ మిస్ యామినీ పేర్నపాటి. మీ ఫీలింగ్స్‌ని ఆమె చక్కటి స్క్రాప్‌బుక్‌లో పెట్టి ఇస్తారు. ఆ బుక్‌ని ప్రెజెంట్ చెయ్యండి చాలు. ఎన్నెన్నో భావాలు..ఏవేవో రాగాలు..! ఆత్మీయులకు మరిచిపోలేని కానుక ఇవ్వాలంటే మనం యామిని చేతుల్లో రూపుదిద్దుకునే అరుదైన కళను ఎంచుకోవాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాన్ని అందమైన కథగా కళ్లకు కట్టే ఆ కానుక మన కళ్ల ముందు ఎప్పటికీ నిలిచి ఉండే ఓ సజీవ దీపిక. సూక్ష్మ చిత్రాల రూపకల్పనతో అందమైన కానుకలు తయారు చేస్తూ తన కళతో అబ్బురపరుస్తుంది యామిని పేర్నపాటి. హైదరాబాద్‌కు చెందిన యామిని ఫ్యాషన్ డిజైనింగ్‌ని వృత్తిగా మార్చుకోవాలని ఆశపడింది. కానీ, తల్లిదండ్రుల ఇష్టం మేరకు బిటెక్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. ఇప్పుడు ప్రత్యేకంగా జీవన సన్నివేశ చిత్రాలను జీవం ఒలికించేలా రూపొందిస్తూ కస్టమైజ్డ్ గిఫ్ట్ మేకింగ్‌లో అడుగుపెట్టి ఉపాధి పొందుతోంది. ఆ వివరాలను ఇలా కథలా కళ్లకు కట్టింది... ఆన్లైన్ నైపుణ్యాలు.. ‘‘ఐదేళ్ల క్రితం కాలేజీ రోజుల్లో నేషనల్ ఎంటర్ప్రెన్యూర్ నెట్‌వర్క్‌లో భాగం అయ్యాను. అప్పుడే సొంతంగా ఉపాధి పొందడం పట్ల ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేదాన్ని. డ్రెస్ డిజైనింగ్‌లోనే కాదు క్విల్లింగ్ జ్యువెలరీ తయారీలోనూ ప్రశంసలు పొందాను. ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేయాలనుకున్నాను. కానీ, ‘కళ ఒక అభిరుచి. అది తిండి పెట్టదు’ అన్నారు పెద్దలు. అందుకే, ఇంజనీరింగ్ వైపు వెళ్లాను. కానీ, నా అభిరుచిని వదులుకోలేదు. ఆన్లైన్ సాయంతోనే పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్రియేటివ్ స్టూడియోస్’ పేరుతో పేజీని నిర్వహించాను. అయితే, తమ్ముడు చదువుకు ఫీజు చెల్లించడం కోసం నాన్న కష్టపడుతుండటం చూసి బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో చేరిపోయాను. కానీ, కళ లేని జీవితం అసంపూర్ణమనే భావన రోజూ బాధపెడుతుండేది. ప్రేయసికి బహుమతి నా సహోద్యోగి ఒకరు తన ప్రేయసికి బహుమతి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ సూచించమని అడిగాడు. కాలేజీ రోజుల్లో నా ఫ్రెండ్స్‌కి డిజైన్ చేసి ఇచ్చిన స్క్రాప్ బుక్స్ గుర్తుకువచ్చాయి. నేనే స్వయంగా ఒకటి రూపొందించి ఇస్తే.. అని ఆలోచన వచ్చింది. ‘మీ బంధం ప్రత్యేకత చెప్పమ’ని అడిగాను. అతను చెప్పిన ప్రేమకథను ఆధారం చేసుకుంటూ ఒక అందమైన గిఫ్ట్‌ను తయారుచేసి ఇచ్చాను. ఆ కళాకృతికి అబ్బురపడి నాకు కొంతమొత్తాన్ని ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అతని స్నేహితురాలికి బాగా నచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఆ రోజు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాకు ఎక్కడ సంతృప్తి ఉందో.. అదే పని చేస్తే చాలా సంతోషంగా ఉంటానని అర్ధమైంది. అన్నాళ్లూ వదిలేసిన నా కళకు కొత్తగా జీవం పోయాలనుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో we_craft16 పేరుతో కొత్త పేజీని రూపొందించాను. ఏడాదిన్నరగా ఈ పేజీని విజయవంతంగా నిర్వహిస్తున్నాను. మొదట రెండు మూడు ఆర్డర్లే! ఇప్పుడు నాకు నెలలో 30 నుంచి 40వరకు ఆర్డర్లు అందుతున్నాయి. కానీ, మొదటి రెండు నెలలు మూడు, నాలుగు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. చాలా నిరాశగా అనిపించేది. ఉద్యోగం చేస్తూనే స్క్రాప్ బుక్ డిజైన్స్ చేసేదాన్ని. ఓ వైపు ఆఫీసు పని భారం, మరొవైపు స్క్రాప్ బుక్ డిజైన్లు. కొన్ని రాత్రులు అస్సలు నిద్రపోయేదాన్నే కాదు. ముందు ఆర్డర్లు విరివిగా రావడం కోసం కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాను. గిఫ్ట్ బాక్స్ తెరిచి చూసినప్పుడు మనం చెప్పాలనుకున్న విషయం అందులోని సూక్ష్మచిత్రాలతో ఇట్టే అర్ధమైపోవాలి. అందుకోసం చాలా శోధించాను. చాలా కృషి చేశాను. దీంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకమైన శైలి కస్టమర్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటాను. వారి మధ్య ఉన్న అందమైన సన్నివేశాన్ని తెలుసుకుంటాను. దానికి తగ్గట్టు క్రాఫ్టింగ్ చేస్తాను. ‘ఈ కళ ఎక్కడ నేర్చుకున్నారు?’ అని అడుగుతుంటారు. ఇది నాకు నేనుగా సృష్టించుకున్న కళ. అలాగని, నా వరకే పరిమితం అవ్వాలనుకోను. మరికొందరిని ఇందులో భాగస్వాములను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ నా ఆలోచనల శైలిని అప్‌గ్రేడ్ చేస్తుంటాను కాబట్టి, ఎవరూ దీనిని కాపీ చేయలేరు అని గట్టిగా చెప్పగలను. ఐటి కంపెనీ నాకు చెల్లించే దానికంటే ఎక్కువ సంపాదించగలను అనే నమ్మకం పెరిగింది. నా అభిరుచితోపాటు నా వృత్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలో నేర్చుకున్నాను’’ అని యామిని ఆనందంగా వివరించింది. ఉద్యోగం చేసుకుంటూనే నచ్చిన అభిరుచిలో ఉపాధి పొందుతున్న యామిని ఇప్పుడు కళాత్మకంగా రాణిస్తోంది. – నిర్మలారెడ్డి -
సాధినేని యామినిపై పోలీస్ కేసు
సాక్షి, తిరుపతి: ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు. (కరోనాతో భార్యాభర్తలు మృతి.. మరో ఆరుగురికి కూడా..) ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ తర్వాతి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా సోషల్ మీడియా ద్వారా ఆమె తాజా రాజకీయ పరిణామాలపై కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. -
అనంతలో టీడీపీకి మరో షాక్!
సాక్షి, అనంతపురం : జిల్లాలో టీడీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల శమంతకమణి, యామిని బాల అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీలో కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వటంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దళితులను పక్కన పెడుతున్నారని వీరు మనస్తాపం చెందారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో టీడీపీ విప్ జారీ చేసినా కూడా శమంతకమణి హాజరు కాకపోవడం గమనార్హం. టీడీపీపై అసంతృప్తితో ఉన్న తల్లికూతుళ్లు త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు కార్యకర్తలకు సంకేతాలు పంపినట్లుగా సమాచారం. -
టీడీపీకి సాదినేని యామిని రాజీనామా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం తరువాత.. యామిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉన్న యామిని... తర్వాతి కాలంలో సైలెంట్ అయిపోయారు. గత కొంత కాలంగా ఆమె పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఒక సందర్భంలో యామిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో.. ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే యామిని వాటిని ఖండించారు. -
టీడీపీకి యామిని గుడ్ బై!
సాక్షి, గుంటూరు : ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. గత ఎన్నికల సమయంలో సాధినేని యామిని సోషల్ మీడియాలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె సోషల్ మీడియాలో పోస్టులను తగ్గిస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఆమె చేసిన పోస్టులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. -
‘సాధినేని యామినిని అరెస్ట్ చేయాలి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభ్యంతరకర ట్వీట్ చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై ఫిర్యాదు నమోదైంది. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్ సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధినేని యామినిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యామిని వ్యాఖ్యలు టీడీపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఇష్టానుసారం నోరుపారేసుకొంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. -
యామిని, రవితేజలను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడి కుమార్తె వివాహానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. బొత్స సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహం విశాఖకు చెందిన రవితేజతో జరిగింది. రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరిగిన ఈ వేడుకకు వైఎస్ జగన్ హాజరై నూతన జంటకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకలో వైఎస్ జగన్‌తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అవంతి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ, మళ్ల విజయ ప్రసాద్, గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజ్, చెట్టి ఫాల్గుణ, బూడి ముత్యాలనాయుడు, గొట్టేటి మాధవి, కుంభ రవిబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, రొంగలి జగన్నాధం, కొండా రాజీవ్, పుష్పశ్రీ వాణి, రాజశ్రీ, అంబటి రాంబాబు, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, కిల్లి కృపారాణి, వరుదు కల్యాణి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు కుమార్తె వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు, విజయలక్ష్మిల కుమారుడు రవితేజల వివాహం శనివారం రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరగనుంది. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన వైఎస్ జగన్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వివాహ వేదిక వద్దకు వెళతారు. నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించిన అనంతరం అదే రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ఇక వైఎస్ జగన్ వెంట విశాఖ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, మళ్ళ విజయ్ ప్రసాద్, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి, అవంతి శ్రీనివాస్, అదీప్ రాజ్, చెట్టి ఫాల్గుణ, బూడి ముత్యాలనాయుడు, గొట్టేటి మాధవి, కోలా గురువులు, కుంభ రవిబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, రొంగలి జగన్నాధం, కొండా రాజీవ్‌తో సహా సీనియర్ పార్టీ నేతలు ఉన్నారు. -
అలా మాట్లాడితే.. సమాజం హర్షించదు
సాక్షి, గుంటూరు రూరల్: రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిని విమర్శించే అర్హత సాధినేని యామిని, వేమూరి ఆనంద్ సూర్యలకు లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీష్‌శర్మ ధ్వజమెత్తారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు. బ్రాహ్మణ మహిళలను రాజకీయ నాయకులు గౌరవిస్తారు కాబట్టి పేరులో శర్మ అని తగిలించుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చనుకుంటోందని ఎద్దేవా చేశారు. విమర్శలు హుందాగా ఉండాలి కానీ, బజారు మనుషులు మాట్లాడినట్లు మాట్లాడితే సమాజం హర్షించదన్నారు. చంద్రబాబు మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తిరుమల శ్రీవారి బంగారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారని చెప్పకనే చెప్పినట్లుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని మంత్రులు విమర్శిస్తున్న వైనం చూస్తుంటే రూ.లక్షల కోట్ల ప్రభుత్వ అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జంగా జయరాజు, శేషం సుబ్బారావు, వడ్రానం శివ, తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
యామినీకి అంత సీన్ లేదు : తాడి శకుంతల
సాక్షి, విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే స్థాయి యామినీకి లేదని చురకలంటించారు. ఆమె తన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత నీకు లేదు. టీడీపీలో ఉన్న మీరంతా వలస పక్షులు. వైఎస్ జగన్ పెంపకంపై యామినీ మాడ్లాడటం హాస్యాస్పదం. నెల జీతానికి పనిచేసే యామినీ వైఎస్ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం ఆమె తెలివి తక్కువతనానికి నిదర్శనం. తేడా నేతలు అంటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ కుటుంబం ప్రజలతో ఎలా మమేకం అయ్యిందో చరిత్ర చూసి తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. -
తెలుగింటి ముగ్గు
ముత్యాల ముగ్గు భూమిగా యామిని తెలుగింటి వారికి సుపరిచితమే. ఇతర భాషా హీరోయిన్స్ మన తెలుగు సీరియల్స్‌ను ఏలేస్తున్నా యామిని మాత్రం తన అందం, అభినయంతో వారికి గట్టిపోటీ ఇస్తూ సీరియల్స్‌లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ‘కళ్లతో అన్నీ కనిపిస్తాయి కానీ కొన్ని మాత్రం మనసుతోనే చూడాలి’ అంటూ జీ తెలుగు సీరియల్లో ప్రసారమయ్యే మీనాక్షి సీరియల్ ద్వారా మరోసారి ఆకట్టుకోనుంది యామిని. ‘మొదటిసారి తెలుగు సీరియల్లో అనుకోకుండా ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. చాలా ప్రయాసమీద అమ్మానాన్నలను ఒప్పించి మరీ చేశాను. జీ తెలుగు మంచి ప్రాజెక్ట్స్‌తో నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. భూమిగా ముత్యాలముగ్గు సీరియల్లో చాలా మంచి పేరొచ్చింది. నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. తెలుగమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను ఇండస్ట్రీలో. డిగ్రీ పూర్తి చేశాను. స్కూల్లో ఉన్నప్పుడు కల్చరల్ ఈవెంట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. డ్యాన్స్ అంటే ఉండే ఇష్టం వల్ల ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా సందడి చేసేదాన్ని. ఈవెంట్స్ ఆర్గనైజర్ ద్వారా సీరియల్ అవకాశం వచ్చింది. ముత్యాల ముగ్గు సీరియల్ ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. దీనికి ముందు చిన్నకోడలు, పుట్టింటిపట్టుచీర.. వంటి సీరియల్స్ చేశాను. ఒక్కో సీరియల్‌కి ఒక్కో ప్రాధాన్యత ఉంది. మనసున్న మీనాక్షి పల్లెటూరి అమ్మాయిగా, పెద్దింట్లో కోడలుగా చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే అంధురాలిగా యాక్ట్ చేసే పాత్ర ఒక సవాల్. మీనాక్షి సీరియల్ నాకా అవకాశం ఇచ్చింది. ఆడిషన్స్ టెస్ట్ చేసిన డైరెక్టర్ నేనే ఆ పాత్రకు సూటబుల్ అవుతాను అన్నారు. బ్లైండ్ క్యారెక్టర్ ఎలా చేయాలి అని భయంతో ముందు వద్దనుకున్నాను. అలాగే రెండు సీరియల్స్ ఒకే టైమ్‌లో ఎలా చేయడం అని సందేహించాను. కానీ, నా టీమ్ ఇలాంటి అవకాశాలు కావాలనుకున్నా దొరకవు అన్నారు. అప్పుడే ఇదొక ఛాలెంజ్‌గా ఎంచుకున్నాను. మీనాక్షి పాత్ర చాలా జోవియల్‌గా అంతకుమించి ధైరస్తురాలిగా ఉంటుంది. ముత్యాల ముగ్గు సీరియల్లో భూమి క్యారెక్టర్‌కు నాకు చాలా దగ్గర పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ కూచిని... నాకు మా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే అమ్మను నాతోపాటే ఉండమని కోరాను. మా అమ్మ రోజుమొత్తం నాతోనే ఉంటుంది. తనకు చాలా సహనం ఎక్కువ. తన సపోర్ట్ లేకపోతే నేను లేను. నెలలో ఇరవై రోజులు షూటింగ్లో పాల్గొంటే మిగతా రోజులు ఇల్లు వదిలి బయటకి రాను. ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ గడిపేస్తాను. పాత సినిమా అయినా సరే మళ్లీ మళ్లీ చూస్తాను. ఇతర భాషల కథానాయికలు ఇక్కడ తెలుగమ్మాయిలకూ మంచి స్కోప్ ఉంది. అయితే, ఇతర భాషల అమ్మాయిలు ఎక్కువ కనిపించడానికి కారణం వాళ్లు ఈ వాతావరణంలో త్వరగా అడ్జెస్ట్ అవుతారని, ఫ్యామిలీ దూరంగా ఉన్నా భయపడరు, బాధపడరు అని. ఈ ఇండస్ట్రీ గురించి వారికి ఎక్కువ అవగాహన ఉంది. మన దగ్గరా ఈ రంగం పట్ల ఆసక్తి చూపేవారున్నారు. టర్నింగ్ పాయింట్స్ మాది పెద్ద కుటుంబం. మంచి జాబ్ ఉండాలి. ట్యాగ్వేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాలి అనుకున్నదాన్నే. కానీ, లైఫ్‌లో చాలా టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. వాటిని నేర్పుగా మలచుకోవాలని నా జీవితం నుంచే నేను నేర్చుకున్నాను. నా ఫెర్ఫార్మెన్స్ పట్ల మాత్రమే నేను శ్రద్ధ పెడతాను. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోను. చాలా మంది సినీనటి సౌందర్య లాగా అనిపిస్తారు అని అంటుంటారు. నాకు ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. వారి మాటలకోసమైనా ఆమెలా నటించేందుకు ప్రయత్నిస్తుంటాను. నా కోసం తెలుగులో అవకాశాలు ఉన్నంతవరకు ఈ ఫీల్డ్‌లో కొనసాగుతాను’. – నిర్మలారెడ్డి -
యానీ
‘‘ప్రెషర్ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’’ అన్నాడు సత్య. ‘‘కానీ జీవితమే ప్రెషర్గా అనిపిస్తున్నప్పుడు జీవితాన్ని కూడా ముందుగానే కదా ముగించుకోవాలి సత్యా?’’ అంది యామిని.చటుక్కున తల తిప్పి చూశాడు సత్య. అతడి కళ్లలోకే చూస్తూ ఉంది యామిని. ‘‘ఏమంటున్నావ్ యానీ.. జీవితం నీకు ప్రెషర్గా అనిపిస్తోందంటే.. నా ప్రేమ నీకు ప్రెషర్గా అనిపిస్తోందనేనా! అనుకున్నాం గుర్తులేదా, ప్రేమే మన జీవితం అని. ఇప్పుడెందుకిలా జననం.. మరణం.. అంటున్నావ్? ప్రేమ ఎక్కడికి పోయింది? ఏమైంది నీకు’’ అన్నాడు çసత్య. యామినిని అతడు యానీ అంటాడు. ‘‘ప్రేమ ఎక్కడికి పోయింది అని అడిగావ్. కానీ అడగాల్సింది నేను సత్యా. నాపై నీకుందని నువ్వు చెప్పిన ప్రేమ, నాపై నీకు ఉందని నేను నమ్మిన ప్రేమ ఎక్కడికో పోయిందని నాకు అనిపిస్తోంది కాబట్టే.. నాకూ ఇక్కడఉండాల్సిన పని లేదనిపిస్తోంది’’‘‘ఇక్కడ అంటే?’’‘‘ఈ లోకంలో..’’‘‘ఎందుకు నన్ను, ఈ ప్రపంచాన్ని ఒంటరిని చేసి వెళ్లాలనుకుంటున్నావ్ యానీ? ఊహు, ఒంటరిని కాదు, అనాథను చేసి.’’‘‘కవిత్వం ఆపు సత్యా. నేను లేకపోతే ప్రపంచం ఒంటరి, అనాథ అవడం ఏంటి? నేనే ఇక్కడ ఒంటరిగా, అనాథగా ఉండలేక వెళ్లి పోవాలని అనుకుంటున్నాను.’’ ‘‘నేను ఉన్నా కూడానా?’’‘‘ఉన్నావ్. కానీ నా కోసంలేవు’’ ‘‘చచ్చిపో.. యానీ.. ఇలా నన్ను చంపే బదులు’’‘‘పీడ విరగడ అవుతుందనే కదా.. మాటల్లో మాటల్లో నన్ను చావు దాకా తెచ్చావ్?’’‘‘మరేంటి యానీ! హాయిగానే ఉన్నాం కదా. కలుస్తున్నాం.మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ఇళ్లకు వాళ్లం వెళ్లిపోతున్నాం. ఇంటికి వెళ్లాక కూడా ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ హాని జరిగింది మన ప్రేమకు. ముందిది చెప్పు. ప్రెషర్ ఎందుకు?’’ ‘‘ఈ మాట నువ్వు ముందే అడగలేదంటే.. నువ్వే నా ప్రెషర్ అని నీకు అర్థమయిందనే కదా నేను అర్థం చేసుకోవాలి సత్యా’’‘‘భగవంతుడా.. ఏం కావాలి నీకిప్పుడు?’’‘‘నీకేం అవసరం లేదా సత్యా?’’‘‘ఏదైనా తక్కువైతే ఆ తక్కువైంది అవసరం అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్‌లో ఉండగా నాకేం తక్కువవుతుంది? నాకేం అవసరం అవుతుంది?’’‘లైఫ్‌లో ఉండడం అంటే ఇలా ఎవరికి వాళ్లం ఉండడమేనా? ఇద్దరంఒకరిగా ఉండలేమా? ఒకే ఇంట్లో. ఒకే సమయంలో. ఒకే చోట?’’‘‘పెళ్లి గురించేనా?’’‘పెళ్లి గురించేనంటే.. అప్పుడు నువ్వుంటావ్.. ‘ఇప్పుడూ పెళ్లయిట్లే కదా ఉంటున్నాం’ అని. కానీ మనిద్దరం ఒకటే అని ప్రపంచానికి తెలియడం ముఖ్యం సత్యా. అప్పుడు నాకు ఏ ప్రెషరూ ఉండదు’’‘ఇప్పుడు మాత్రం.. ఎందుకుండాలి యానీ.. నీకు ప్రెషర్?’’‘‘తెలీదు. కానీ ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. లోకం నిన్ను నిన్నుగా కాకుండా, నన్ను నన్నుగా కాకుండా మనిద్దర్ని కలిపి చూసేవరకూ నాకు ప్రెషరే. నిన్ను చూస్తే నేను గుర్తుకు రావాలి. నన్ను చూస్తే నువ్వు గుర్తుకు రావాలి.. ఈ లోకానికి’’. ‘‘కవిత్వం నువ్వు మాట్లాడుతున్నావ్ యానీ ఇప్పుడు’’‘‘కవిత్వం మాట్లాడ్డం కాదు. హృదయంతో మాట్లాడుతున్నాను.’’‘‘సరే, పెళ్లి చేసుకుందాం’’‘‘సరే ఏంటి! నీకక్కర్లేదా పెళ్లి? నాకోసం సరేనంటున్నావా? నేను ప్రెషర్ ఫీలవుతానని, నేను నా పిచ్చి హృదయపు భాషలో మాట్లాడి నిన్ను చంపడం మానేస్తానని. అంతేకదా! పెళ్లయ్యాక కూడా నాహృదయపు పిచ్చి భాష ఎక్కడికీ పోదు. ఎందుకంటే.. నీపై నా ప్రేమఎక్కడికీ పోదు. ‘‘ఇప్పుడేంటి?’’‘‘నీకు ఉద్యోగం వచ్చేవరకు, మా వాళ్లు తెస్తున్న సంబంధాలను నేను ఆపగలను సత్యా. కానీ నీకు ఉద్యోగం వచ్చి, నన్ను పెళ్లి చేసుకునే వరకు మన ప్రేమను నాకడుపులోనే దాచి ఉంచలేను’’ అంది యామిని. ‘‘కమ్ అగైన్’’ అన్నాడు సత్య. ‘‘అవును’’ అంది యామిని. ఒక్కసారిగా ఆమెను దగ్గరికి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు సత్య. యామిని ఏడుస్తోంది. ‘‘నీకు ప్రేమను మాత్రమే పంచాలనుకున్నాను సత్యా. కానీ ప్రెషర్ని ఒక్కదాన్నీ భరించే శక్తి లేకపోయింది’’ అంది. సత్య ఇంకా ఆమెను హత్తుకునే ఉన్నాడు. యామిని కూడా అతడి గుండెలపై అలాగే ఉండిపోయింది.ఆ తర్వాత.. కొద్దిసేపటికి.. మెల్లగా ‘‘సత్యా’’ అంది. ‘‘ఊ..’’ అన్నాడతను. ‘మనం పెళ్లి చేసుకుందాం. నేను ప్రెగ్నెంట్‌నని తెలియజెప్పడానికైనా పెళ్లిచేసుకుందాం’’ అంది.‘‘సరే’’ అన్నాడు సత్య. ‘‘ఇవాళే.. ఇప్పుడే’’ అంది యామిని. ‘‘ఇవాళా! ఇప్పుడా?’’ నవ్వాడు సత్య. ‘‘అవును’’ అంది. ‘‘సరే’’ అన్నాడు. ‘సరే’ అన్న తర్వాత యామినికి మళ్లీ కనిపించలేదు సత్య. ఎప్పటికీ కనిపించలేదు. ‘‘ఎవరు? నీ కూతురా! చక్కగా ఉంది. నీలాగే’’ అన్నాడు సత్య. చాచి సత్య చెంప మీద కొట్టింది యామిని.‘‘సిగ్గుందా. ఇది మన కూతురు. అడుగో నా భర్త. ధైర్యవంతుడు. ధైర్యంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ముందే చెప్పేశాను నా కడుపులో బిడ్డ ఉందని. పెళ్లి చేసుకోడానికి ముందు నన్ను నా భర్త ఏమడిగాడో తెలుసా? ‘ఎవరతను? నేను వెతికి తెచ్చేదా?’ అని! వద్దన్నాను. ‘పిరికివాడిని పట్టి తెచ్చినా, మళ్లీపారిపోతాడు. వద్దు’ అన్నాను. ఏమన్నాడో తెలుసా? ‘అలా అనకు. ఎందుకు రాలేకపోయాడో’ అన్నాడు! సత్య కళ్ల నిండా నీళ్లు. ‘‘ఎందుకు పారిపోయావ్? నీ కడుపులో కాదు కదా బిడ్డ ఉంది.నువ్వెందుకు భయపడి పారిపోయావ్?’’సత్య మాట్లాడ్డం లేదు. కన్నీళ్లు అతడి చెంపల మీదుగా జారుతున్నాయి. ‘‘చెప్పు.. ఎందుకు పారిపోయావ్?’’ అడుగుతోంది యామిని. యామిని కూతురు తల్లి చేతుల్లోంచి ముందుకు వాలి సత్య కన్నీళ్లను తుడవడానికి తన చిట్టి చేతులతో ప్రయత్నిస్తోంది! అంత దగ్గరగా నిలుచుని ఉంది యామిని.. సత్యకు. నిండు పున్నమి ఆ రోజు. బయటì గేటుకు తలుపు వేసి ఇంట్లోకి వస్తుండగా.. ఆ వెన్నెల్లో గేటు బయట నిలుచుని కనిపించాడు సత్య! సత్య, యామినీ మొదట కలుసుకున్నదీ పున్నమి రోజే. ‘‘ప్రెషర్ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’అని నేనన్నప్పుడు.. నువ్వేమన్నావో గుర్తొచ్చింది యానీ’’ అన్నాడు సత్య. యామినికి ఆ మాట అర్థమయ్యేలోపే.. ఇంట్లోంచి పెద్దగా అరుపు వినిపించింది. ‘‘యామినీ.. పిల్ల పడిపోతోంది!’’ అని. గభాల్న, బిడ్డను పడిపోకుండా పట్టుకుంది యామిని. సత్య ఇంకా అక్కడ ఉండగనే యామిని భర్త పరుగున వచ్చి, కూతుర్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘‘ఎవరూ లేరు కదా! ఇంతసేపూ ఎవరితోమాట్లాడుతున్నావ్ యామినీ’’ అని లోపలికి వెళ్లిపోయాడు. యామిని మాట్లాడలేదు. కళ్ల నిండా నీళ్లతో సత్యనే చూస్తూ ఉంది. - మాధవ్ శింగరాజు -
దేశ రహస్యం ఎవరి చేతిలో?
దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో ‘రోజులు మారాయి’ ఫేమ్ దర్శకుడు ముడిదాని మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరం’. నవీద్, నూకరాజు హీరోలుగా యామిని హీరోయిన్గా నటిస్తున్నారు. రాజా రవీంద్ర ముఖ్య పాత్ర చేస్తున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న మిలటరీ ఆఫీసర్ దేశ రహస్యాల మీద ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ మిస్ ఐతే? అది ఎవరి చేతికైనా చిక్కితే? అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఎరోల్ల గ్రూప్ అదినేత డా. ఎరోల్ల సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ – ‘‘నాకు ఇష్టమైన సతీష్ గారు, శ్రీనివాస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాం. కాన్సెప్ట్ ఎలా చెప్పానో అలానే సినిమాగా మలిచారు మురళి. కథ, మాటలు అందించిన రవి నంబూరికి థ్యాంక్స్. నవీద్, నూకరాజులు బాగా చేశారు’’ అన్నారు. ‘‘మారుతిగారి సినిమా అంటే నా సొంత సినిమాలా భావిస్తాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘మారుతిగారు మంచి కాన్సెప్ట్‌తో నిర్మాతకు నాలుగు రూపాయిలు మిగిలేలా చూస్తారు. తెలుగు టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందుంటారు. ఈ సినిమా మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు యస్.కె.ఎన్. ‘‘రెండో అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. టీమ్ అంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేశాం. నిర్మాత సతీష్‌గారి సహకారంతో సినిమాను చాలా బాగా చేశాం. రవి నంబూరి మాటలు ఎసెట్ అవుతాయి. మా డార్క్ కామెడీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు మురళీ కృష్ణ. ‘‘మారుతి అందించిన కాన్సెప్ట్‌తో మురళి చాలా బాగా తెరకెక్కించాడు. ట్రైలర్ అందరికీ నచ్చింది. సమ్మర్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘మారుతిగారు కాన్సెప్ట్ ఇవ్వటమే సక్సెస్ కొట్టేశాం. డైరెక్టర్‌గారు ఫుల్ క్లారిటీ తో తెరకెక్కించారు. టైక్నికల్గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది’’ అన్నారు నవీద్. ‘‘మంచి పాత్ర ఇచ్చిన మారుతిగారికి, మురళీగారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు నూకరాజు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌరా, సహ నిర్మాతలు : పిడమర్తి రవి, రెహమాన్. లైన్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్. -
రాగాల సంక్రాంతి
-
శ్రీవారి లడ్డూలో బొగ్గు పలుకులు
తిరుపతి : శ్రీవారి లడ్డూలో బొగ్గు పలుకులు వచ్చాయి. యామిని అనే భక్తురాలు క్యూలో నిలుచుని శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకుంది. ఎంతో పవిత్రమైన ప్రసాదాన్ని ఆరగిద్దామని లడ్డూను తుంచుగా అందులో బొగ్గు పలుకులు వచ్చాయి. దీంతో ఆ భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. లడ్డూలో బొగ్గు పలుకులు వచ్చిన విషయాన్ని టీటీడీ అధికారులు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న టీటీడీ ఆరోగ్య శాఖ అధికారిణి శర్మిష్టా బూందీ పోటును శనివారం తనిఖీ చేశారు. అక్కడి పోటు అధికారురులతో పాటు తయారీ దారులను బొగ్గు పలుకులు ఎలా వచ్చాయని శర్మిష్టా ఆరా తీశారు. అయితే బూందీ మాడటం వల్లే బొగ్గు పలుకులుగా మారిందని అక్కడి సిబ్బంది వివరించారు. దీంతో శర్మిష్ట మీడియాతో మాట్లాడుతూ లడ్డూల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ నాణ్యత విషయంలో రాజీ వుండదన్నారు. బూందీ ఎక్కువగా మాడిపోవడం వల్లే నల్లగా బొగ్గు పలుకులుగా మారాయన్నారు. అవి లడ్డూలో కలవడం వల్లే బొగ్గుగా కనిపించిందని ఆమె తెలిపారు. కాగా గతంలోనూ లడ్డూలో జెర్రి, ఇనుప నట్లు, బోల్టులు వచ్చిన విషయం తెలిసిందే. -
నెట్టికంటుడిని దర్శించుకున్న ఢిల్లీ డీఐజీ
గుంతకల్లు రూరల్ : ఢిల్లీ డీఐజీ యామినీ ప్రియ గురువారం కుటుంబసమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన యామినీ ప్రియ ప్రస్తుతం ఢిల్లీ డీఐజీగా పని చేస్తున్నారు. యామినీ ప్రియ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.