
ప్రయాణంలో పదనిసలు..!
ఓ యథార్థ ఘటన నేపథ్యంలో ప్రియాంత్, యామినీ జంటగా నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపూ విశాల్ సోలంకి నిర్మిస్తున్న చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’.
ఓ యథార్థ ఘటన నేపథ్యంలో ప్రియాంత్, యామినీ జంటగా నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపూ విశాల్ సోలంకి నిర్మిస్తున్న చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. చైతన్యకొండ దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి పూరిజగన్నాథ్ క్లాప్ ఇవ్వగా, ఎన్.శంకర్ గౌరవ దర్శకత్వం విహ ంచారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’తో నా కెరీర్ మొదలుపెట్టా. ఓ సోషల్ ఎలిమెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్.కె.సూరపనేని.