
నెట్టికంటుడిని దర్శించుకున్న ఢిల్లీ డీఐజీ
గుంతకల్లు రూరల్ : ఢిల్లీ డీఐజీ యామినీ ప్రియ గురువారం కుటుంబసమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన యామినీ ప్రియ ప్రస్తుతం ఢిల్లీ డీఐజీగా పని చేస్తున్నారు. యామినీ ప్రియ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.