![YSRCP Leader Thadi Shakuntala Slams Yamini Sadineni - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/31/Yamini-Sadineni.jpg.webp?itok=zw5t3fhq)
సాక్షి, విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే స్థాయి యామినీకి లేదని చురకలంటించారు. ఆమె తన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత నీకు లేదు. టీడీపీలో ఉన్న మీరంతా వలస పక్షులు. వైఎస్ జగన్ పెంపకంపై యామినీ మాడ్లాడటం హాస్యాస్పదం. నెల జీతానికి పనిచేసే యామినీ వైఎస్ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం ఆమె తెలివి తక్కువతనానికి నిదర్శనం. తేడా నేతలు అంటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ కుటుంబం ప్రజలతో ఎలా మమేకం అయ్యిందో చరిత్ర చూసి తెలుసుకోవాలి’ అని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment