Shakuntala
-
అప్పుడే ఓటీటీలో శాకుంతలం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించగా భరతుడిగా అల్లు అర్హ నటించింది. మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కు ముందు భారీ బజ్ క్రియేట్ అయినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర ఈ చిత్రం రాణించలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే శాకుంతలం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే చర్చ నడుస్తుంది. సినీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. భారీ ధరకే ఓటీటీకి విక్రయించినట్లు తెలుస్తుంది. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. -
వయసు: 102 ఆరోగ్యరహస్యం: సమాజసేవ
మంగళవారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్లుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాబితాలో102 ఏళ్ల శకుంతల చౌధురి పేరు కూడా ఉంది. ‘అస్సాంలో వందేళ్లు దాటిన ఏకైక మహిళ శకుంతల’ అనే మాటపై భేదాభిప్రాయాలు ఉండొచ్చుగానీ ‘ఆమె అలుపెరగని సమాజ సేవిక’ అనే వాస్తవాన్ని ఎవరూ విభేదించరు. అస్సాంలో ఏడుదశాబ్దాలకు పైగా ఆమె పేరు ‘సామాజిక సేవ’కు ప్రత్యామ్నాయంగా మారింది. గౌహతిలోని ‘కస్తూర్బా ఆశ్రమం’ కేంద్రంగా శకుంతలమ్మ ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ సేవాకేంద్రాలను స్థాపించడం ద్వారా ఎన్నో గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది. ‘స్త్రీ శక్తి జాగారణ్’ ఉద్యమంతో స్త్రీల అక్షరాస్యతకు కృషి చేసింది. స్త్రీ సాధికారత వైపు అడుగులు వేయించింది. శకుంతలమ్మ సుదీర్ఘ ఉపన్యాసాలేవి ఇవ్వదు. చాలా నిశ్శబ్దంగా సేవాకార్యక్రమాలు చేస్తూ పోతుంది. ఈ విధానం ఎంతోమందికి ఆదర్శం అయింది. ‘మనం మాట్లాడడం కంటే మనం చేసే పని మాట్లాడితేనే మంచిది’ అంటారు ఆమె. గాంధీజి, వినోభావే సిద్ధాంతాలతో ప్రభావితం అయిన శకుంతల చిన్న వయసులోనే సమాజసేవను ఊపిరిగా మలుచుకుంది. ‘శకుంతలమ్మను వ్యక్తి అనడం కంటే మహావిశ్వవిద్యాలయం అనడం సరిౖయెనది. ఆమె సైద్ధాంతిక జ్ఞానం, సేవాదృక్పథం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటారు ఆమె అభిమానులు. ‘సహాయం కోసం శకుంతలమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్లినట్లుగా అనిపించదు. మన ఇంటి పెద్ద దగ్గరికి ఆత్మీయంగా వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటారు సామాన్యులు. శకుంతలమ్మకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న... ‘ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?’ ఆమె చెప్పే సమాధానం: ‘సమాజసేవ’ శకుంతలమ్మ ఇచ్చిన చిన్న సమాధానంలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో కదా! -
ఆ తల్లి నిర్దోషి, ఇవన్ని ఆకాశరామన్న ఉత్తరాలే?!
సాక్షి, చెన్నై: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను హతమార్చి కసాయిగా ముద్ర పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ తల్లికి 17 ఏళ్లకు న్యాయం దక్కింది. ఆమె నిర్ధోషిగా పేర్కొంటూ మధురై ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. తిరుచ్చి జిల్లా తత్తయాన్‌కార పేట్టైకు చెందిన సెల్వరాజ్, శకుంతల (49) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2002 ఏడాదిన్నర చంటి బిడ్డను హతమార్చిన కసాయిగా అందరి దృష్టిలో శకుంతల మిగిలి పోయింది. సెల్వరాజ్ ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, శకుంతలను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. తిరుచ్చి మహిళా జైలులో శిక్ష అనుభవిస్తూనే న్యాయ పోరాటం మీద శకుంతల దృష్టి పెట్టారు. పిటిషన్ విచారణ సమయంలో ఆమెకు బెయిల్ లభించింది. అయితే, 2016లో బెయిల్ రద్దు కావడంతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు.పట్టు వదలకుండా న్యాయపోరాటం చేస్తూ వచ్చింది. ఏడాదిన్నర బిడ్డను బావిలో పడేసి హతమార్చినట్టుగా అభియోగం ఆమె మీద మోపినా, ఆధారాలన్నీ సృష్టించబడ్డట్టుగా, ఊహాజనితంగా, ఆకాశరామన్న ఉత్తరాలను తలపించే పొంతన లేనివిగా ఉన్నాయని బెంచ్ గుర్తించి ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. చదవండి: కోవాగ్జిన్ సింగిల్ డోస్?!: ఐసీఎంఆర్ -
శకుంతల ఫిక్స్
‘శాకుంతలం’ అనే దృశ్యకావ్యాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ మీద చూపించనున్నారాయన. ‘శాకుంతలం’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రేమకావ్యంలో హీరోయిన్గా సమంత కనిపించనున్నారు. ఈ విషయాన్ని కొత్త సంవత్సరం సందర్భంగా చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలమా గుణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
‘ఆ పేరును చెడగొట్టారు..’
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ నాయకురాలు తాడి శకుంతల హెచ్చరించారు. అనురాధ వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో ప్రసాద్ ఇండ్రస్టీ పేరుతో పేద బ్రాహ్మణలకి వేద పాఠశాల కోసం కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేసింది నువ్వు కాదా అని దుయ్యబట్టారు. ఇష్టానుసారం మాట్లాడే అనురాధ.. కనకాంబ ట్రస్ట్‌పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విజయవాడలో మాజీ మేయర్లకు మంచి పేరు ఉందని.. ఆ పేరును ఆమె చెడగొట్టారని నిప్పులు చెరిగారు. అనురాధకు ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత లేదన్నారు. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని శకుంతల డిమాండ్ చేశారు. -
యామినీకి అంత సీన్ లేదు : తాడి శకుంతల
సాక్షి, విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే స్థాయి యామినీకి లేదని చురకలంటించారు. ఆమె తన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత నీకు లేదు. టీడీపీలో ఉన్న మీరంతా వలస పక్షులు. వైఎస్ జగన్ పెంపకంపై యామినీ మాడ్లాడటం హాస్యాస్పదం. నెల జీతానికి పనిచేసే యామినీ వైఎస్ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం ఆమె తెలివి తక్కువతనానికి నిదర్శనం. తేడా నేతలు అంటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ కుటుంబం ప్రజలతో ఎలా మమేకం అయ్యిందో చరిత్ర చూసి తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. -
బాలూకి మాతృ వియోగం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతల (89) సోమవారం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు నెల్లూరులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారామె. ఎస్పీబీ తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి ప్రసిద్ధి చెందిన హరికథకుడు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం సమీపంలోని కోనేటమ్మపేట గ్రామానికి చెందిన శకుంతలతో వివాహం అయింది. వారి ప్రథమ సంతానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నెల్లూరు నగరం లోని తిప్పరాజువారి వీధిలో సాంబమూర్తి దంపతులు ఒక ఇంటిని కొనుక్కున్నారు. అక్కడే ఈ దంపతుల సంతానం బాలుతోపాటు గిరిజ, పార్వతి, జగదీష్, శైలజ, వసంతలక్ష్మి పెరిగి పెద్దవారయ్యారు. శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి భిక్షాటనాపూర్వక త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించేవారు. ఆ పరంపర ఇప్పటికీ నెల్లూరులో కొనసాగుతోంది. ఇంటిపై మమకారం సంతానం అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సాధించినప్పటికీ తాను ఉన్న ఇంటి పైనే శకుంతలకు మమకారం ఎక్కువ. భర్త మరణించి దాదాపు 40 ఏళ్లు అయినా ఆమె ఆ ఇంటిని వదలలేదు. భర్త కష్టార్జితం కావడం, జీవితంలో అన్ని ఘట్టాలతో పెనవేసుకున్న గృహం కావడంతో ఆమెకు ఆ ఇల్లంటే ప్రాణం. తండ్రి మరణానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన దగ్గర చెన్నైలో ఉండాలని కోరినా ఆమె ఒప్పుకోలేదు. తన జ్ఞాపకాలను, తన ఇంటిని దూరం చేయొద్దని బాలును ఒప్పించారామె. చేసేదేం లేక బాలు ఆమె కోసం ఒక కుటుంబాన్ని ఆమె వద్ద ఉంచి ఆమె ఆలనాపాలనా బాధ్యతలు చూసేలా చేశారు. ఓ సంగీత కచేరి నిమిత్తం లండన్ వెళ్లిన బాలు తల్లి మరణవార్త తెలియగానే ఇండియా బయలుదేరారు. శకుంతలమ్మ అంతిమ యాత్ర స్వస్థలమైన నెల్లూరులో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, తమ సంప్రదాయంలో భాగంగా నెల్లూరు బోడిగాడి తోటలో ఖననం చేయనున్నామని బంధుమిత్రులు తెలిపారు. – సాక్షి, నెల్లూరు -
ఆకాశం అందింది
శకుంతల కాలే. మహారాష్ట్ర స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్ పర్సన్. ఈ ఏడాది మహారాష్ట్ర ఎస్.ఎస్.సి. ఫలితాలు ఆవిడ చేతుల మీదుగానే విడుదల అయ్యాయి. ఎస్.ఎస్.సి. వరకైనా చదివే ఆర్థిక పరిస్థితి లేని ఒక పల్లెటూరి అమ్మాయి ఈ స్థాయికి చేరడం వెనుక ఉన్నవి కేవలం ఆమె కృషి, పట్టుదల, దీక్ష మాత్రమే. పుణే జిల్లా అంబేగావ్ అనే చిన్న పల్లెటూరు శకుంతలది. చిన్నతనంలోనే.. నాలుగో తరగతి చదువుతుండగానే తన తండ్రిని కోల్పోయింది. తల్లి నిరక్షరాస్యురాలు. భర్త పోయాక తప్పనిసరి పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లవలసి వచ్చింది. వ్యవసాయ కూలీగా వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు. శకుంతలను ఎలా చదివించగలదు. పైచదువులకు ఎలా పంపగలదు? ఎలాగో కష్టపడి పదో తరగతి వరకు చదివించింది కూతుర్ని. అంతకంటే ముందే.. పద్నాలుగో ఏటే శకుంతలకు పెళ్లి చేసేసింది. ఆ తరవాతే పదో తరగతి పరీక్షలు రాసింది శకుంతల. పద్నాలుగేళ్లకే పెళ్లి ‘‘మా ఊళ్లో జూనియర్ కాలేజీ లేదు. దూరాలకు పంపించి చదివించే స్థోమతా లేదు అమ్మకు. అందువల్లే నాకు అంత చిన్నవయసులో వివాహం చేసేసింది అమ్మ’’ అంటుంది శకుంతల. వివాహం అయ్యాక శకుంతల అత్తవారింటికి చేరింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అక్కడా అంతే. ఆడపిల్లల చదువుకి ప్రాధాన్యం లేదు. అయితే ‘‘నా అదృష్టం కొద్దీ మా అత్తమామలు కాస్త లోకాన్ని చూసినవారు. నన్ను చదువుకోమని ప్రోత్సహించారు’ అంటూ సంబరంగా చెబుతుంది శకుంతల. అలా ఇంట్లో అందరూ సహకరిస్తుండటంతో, ఏదో ఒకటి సాధించాలనే కోరిక బయలుదేరింది ఆమెలో. ఈ విషయంలో ‘సావిత్రి ఫూలే పుణే విశ్వవిద్యాలయానికి’ రుణపడ్డానని చెప్తుంది శకుంతల. ఆ కాలేజీలో దూర విద్య ఉంది. అందువల్ల ఆ సెంటర్ నుంచి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బీఏ, ఎంఏ (మరాఠీ) పూర్తి చేసింది. రేడియోనే ఎన్సైక్లోపీడియా ‘‘డీఈడీ పూర్తి చేసిన తరవాత, నేను చదువుకున్న పాఠశాలలోనే టీచర్‌గా పనిచేశాను. సౌకర్యాలు ఉంటే, ఎదగగలమని చాలామంది అభిప్రాయపడతారు. కాని ప్రతికూల పరిస్థితుల్లో, వ్యక్తిగా ఏ మాత్రం ఎదగడానికి అవకాశం లేని పరిస్థితుల్లోనే ఒక బలమైన శక్తి ఎలాగో వచ్చేస్తుందనుకుంటాను. నాలోనే ఆ శక్తి, పట్టుదల మొదలయ్యాయి. ఎలాగైనా సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసవ్వాలని దీక్ష పట్టాను’’ అని చెబుతుంది శకుంతల. పరీక్షలకు కావలసిన మెటీరియల్ అందుబాటులో లేవు, కనీసం వార్తలు చూద్దామంటే టీవీ సదుపాయం కూడా లేదు. ఆ గ్రామంలో ఏ సమాచారం తెలుసుకోవాలన్నా ఆమెకు రేడియోనే ఆధారం. తన కల నెరవేరాలంటే అందుబాటులో ఉన్న సాధనాన్నే వినియోగించుకోవాలనుకుంది శకుంతల. రేడియోలో వచ్చే వార్తలు వింటూనే జనరల్ నాలెడ్జి పెంచుకుంది. ఉమెన్స్‌డే రోజే పీహెచ్డీ ఉదయం మూడు గంటలకే లేవడం, గ్రామంలో దూరంగా ఉన్న బావి నుంచి నీళ్లు తోడి తెచ్చుకోవడం, ఇంటిపనులన్నీ పూర్తి చేసుకోవడం, స్కూల్‌కి వెళ్లడం.. ఇదీ శకుంతల దినచర్య. మధ్యలో కాస్త తీరిక దొరికినా, ఆ కాస్తలోనే ప్రిపరేషన్.అలా 1993లో సర్వీస్ కమిషన్ క్లాస్ 2 పరీక్ష పాస్ అయింది. ‘‘నా కల నెరవేరింది. ఆకాశాన్ని అందుకున్నంత ఆనందం కలిగింది. పట్టుదల ఉంటే ఎవరైనా, దేన్నైనా సాధించగలరు అని తెలుసుకున్నాను’’ అంటున్న శకుంతల కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందింది. షోలాపూర్‌లో విద్యాశాఖలో ఉద్యోగం సంపాదించింది.‘‘1995లో నేను క్లాస్ 1 ఆఫీసర్ని అయ్యాను. స్త్రీవిద్య విభాగానికి హెడ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాను. గ్రామీణ నవలా సాహిత్యంలో మహిళల పాత్రచిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేశాను. యాధృచ్చికంగా అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరమే నా పీహెచ్‌డి పట్టా అందుకున్నాను’’ అంటున్న శకుంతల మహిళలకు ఓ ఆదర్శం. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. – రోహిణి -
కోల్బెల్ట్తో తెలంగాణ శకుంతలకు అనుబంధం
గోదావరిఖని: నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు వచ్చి తెలంగాణను ఇంటిపేరుగా మార్చుకున్న శకుంతల శనివారం హైదరాబాద్‌లో గుండెపోటుకు గురై మరణించారు. ఆమె విలన్‌గా... తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించారు. చాలా సందర్భాల్లో గోదావరిఖనికి వచ్చిన శకుంతల మరణాన్ని ఈ ప్రాంతంలో ఆమెతో అనుబంధం ఉన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చెల్లెలు సాధన గోదావరిఖనిలో నివసిస్తున్నారు. ఆమె భర్త హరియాదవ్ సింగరేణి ఆర్జీ-1లోని 3వ గనిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చనిపోయారు. వీరి పిల్లలు గోదావరిఖనిలోనే నివాసముంటూ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా పోరు తెలంగాణ, నిర్భయ భారతం సినిమాల షూటింగ్ సందర్భంలో శంకుతల గోదావరిఖనిలోని వివిధ లోకేషన్లలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న యాపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో చిన్నారుల తన పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో ఆమెతో కలిసి సన్నిహితంగా మాట్లాడిన అభిమానులు శంకుతల మరణాన్న జీర్ణించుకోలేకపోతున్నారు. -
శకుంతల దీక్షకు మద్దతు
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ :కాపురాన్ని నిలబెట్టాలని శకుంతుల నాగార్జున చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ఆమెకు మద్దతు తెలుపుతూ శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు శకుంతుల దీక్ష చేస్తున్న ఇంటి వద్ద నుంచి వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ సెంటర్లోని శకుంతుల మామయ్య రామారావు నిర్వహిస్తున్న షాపు ఎదుట మెయిన్‌రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తాలూకా సెంటర్లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శివరాఘవయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి జంపాని చెన్నకేశవరావు, దేశభక్త ప్రజాతంత్ర ఉధ్యమం జిల్లా నాయకుడు సుబ్బారావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కోలా సంజీవరావు, మహిళా సంఘం నాయకులు, కృష్ణబలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. విద్యార్థినుల ర్యాలీ.. శకుంతులకు మద్దతు తెలుపుతూ ఏబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థినులతో మాట్లాడుతున్న సమయంలో తమ బాధలను చెప్పుకుంటూ విలపించిన శకుంతులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.కిరణ్, కె.బసవయ్య, ఎ.లలితాదేవి, సీహెచ్ మౌనిక, జ్యోతి, లక్ష్మీగంగ తదితరులు పాల్గొన్నారు. సోషల్ యాక్షన్ కమిటీ జిల్లా కోశాధికారి గిరిజ శకుంతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చైతన్యవేదిక కన్వీనర్ కొండపల్లి వెంకటేశ్వరరావు శకుంతులను కలసి న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాడతామని భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్ సీపీ నేత తాడి శకుంతలతో సాక్షి వేదిక