
‘శాకుంతలం’ అనే దృశ్యకావ్యాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ మీద చూపించనున్నారాయన. ‘శాకుంతలం’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రేమకావ్యంలో హీరోయిన్‌గా సమంత కనిపించనున్నారు. ఈ విషయాన్ని కొత్త సంవత్సరం సందర్భంగా చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలమా గుణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment