
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ నాయకురాలు తాడి శకుంతల హెచ్చరించారు. అనురాధ వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో ప్రసాద్ ఇండ్రస్టీ పేరుతో పేద బ్రాహ్మణలకి వేద పాఠశాల కోసం కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేసింది నువ్వు కాదా అని దుయ్యబట్టారు. ఇష్టానుసారం మాట్లాడే అనురాధ.. కనకాంబ ట్రస్ట్‌పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విజయవాడలో మాజీ మేయర్లకు మంచి పేరు ఉందని.. ఆ పేరును ఆమె చెడగొట్టారని నిప్పులు చెరిగారు. అనురాధకు ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత లేదన్నారు. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని శకుంతల డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment