సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అధికార కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా వారిపై పలు అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు గురి చేస్తోంది.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇంటిలో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు చేపట్టారు. ఎందుకొచ్చారోకూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు తీరుపై జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల క్రితం జోగి రమేష్ ఇంటిపై రాళ్లతో దాడులు
ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. జూన్ 16న జోగి రమేష్‌పై రాళ్ల దాడి చేశారు.
ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment