
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దొంగకోళ్లు పట్టేవాడికి, టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు తేడా లేదని.. మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణ ప్రసాద్‌ను మైలవరం వీరప్పన్‌గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్నా వసంత కృష్ణప్రసాద్‌కు కమీషన్లు ఇవ్వాలి’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘గతంలో కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడనే నేను మైలవరానికి ఏనాడూ రాలేదు. వసంత కృష్ణప్రసాద్‌కు మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘‘పర్వతనేని ఇంటి ముందు సీటు కోసం అబ్బా కొడుకులు తిట్టుకుని, కొట్టుకున్నారు. ఎన్ని పుస్తకాలు రాసినా మీ చరిత్రకి సరిపోవు. సిగ్గుమాలిన, సంస్కారం లేని కుటుంబం మీది. వసంత కృష్ణప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతాం’’ అని జోగి రమేష్ హెచ్చరించారు.
జగన్, జోగి రమేష్ ఫోటోలు చూస్తే భయమా? బ్యానర్లు తీసేయమని అధికారులకు చెబుతున్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడిని ఒప్పిస్తా.. నువ్వు కూటమికి రాజీనామా చెయ్యి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా మైలవరంలో పోటీచేద్దాం... సిద్ధమా?. రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్సార్‌సీపీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 2027 తర్వాత కృష్ణ ప్రసాద్ చాప, దిండు సర్దుకుని వెళ్లిపోతాడు’’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
Comments
Please login to add a commentAdd a comment