పోలీస్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వండి
హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
పౌర స్వేచ్ఛను కాపాడడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉంది
చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా?
ప్రొసీజర్ ఫాలో కాకపోతే భవిష్యత్తులో ఏం చేయాలో చేస్తాం అంటూ వార్నింగ్
సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్భందంపై ఏపీ హైకోర్టు సీరియస్
అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సిబ్బంది అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్‌ల నుంచి సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది.
పోలీస్ స్టేషన్‌ల నుంచి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలి. ఈ నెల 4 నుంచి ఇవాళ్టి వరకు సీసీ ఫుటేజీలను స్థానిక మెజిస్ట్రేలకు సమర్పించాలి. పౌరస్వేచ్ఛను కాపాడడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉంది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా?. ప్రొసీజర్ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తాం అంటూ ప్రభుత్వానికి ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది.
ఉదయం.. హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇన్నేసి పిటిషన్లు దాఖలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది.
మధ్యాహ్నాం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కాగా.. ఇవన్నీ తప్పుడు పిటిషన్లని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇవన్నీ నిజమైన పిటిషనలేనని, బాధిత కుటుంబ సభ్యులే వీటిని వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో..
ఏజీ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అదే టైంలో.. పిటిషన్లు వేసిన వాళ్లందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ వాదనపై న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘మీ మాటలు మేము ఎలా నమ్మాలి. మీరు వదిలేశారు అనడానికి ఆధారాలు ఏంటి?’’ అని ప్రశ్నిస్తూ.. ఆ ఆరుగురు ఎక్కడ ఉన్నారో వెంటనే కనుక్కుని చెప్పాలి’’ని ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే టైంలో పీఎస్‌ల సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి(11వ తేదీకి) వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment