Habeas corpus petition
-
సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై హైకోర్టు సీరియస్
-
లోకేష్‌ను మా ముందు హాజరుపర్చండి: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో ఇవాళ హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిగింది. పిటిషన్ల విచారణ సందర్భంగా.. ఓ ఎస్సై స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేయడం గమనార్హం. తిరుపతి లోకేష్ అనే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు. ఈ విచారణకు ఎస్సై జానకీ రామయ్య హాజరు కాగా, ఆయన స్టేట్మెంట్ను కోర్టు నమోదు చేసింది.‘‘ఐదో తేదీనే 41 నోటీస్ ఇచ్చి లోకేష్‌ను వదిలేశాం. బెయిల్ షూరిటీల విషయంలో ఏడో తారీఖు రావాలని చెప్పాం’’ అని ఎస్సై జానకి రామయ్య కోర్టుకు తెలిపారు. అయితే.. లోకేష్ 5వ తేదీన బయటకు వెళ్లి ఇంటికి రాలేదని, పోలీసులు అతన్ని అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.దీంతో.. లోకేష్‌ను సోమవారం ఉదయం పదిన్నర గంటలకల్లా తమ ముందు హాజరు పర్చాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ ను సీల్డ్ కవర్ లో సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే.. జింకల రామాంజనేయులు కేసులో కూడా సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించాలని ఆదేశించింది.వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులైన జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి-వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాజాభాషాలను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ వాళ్ల కుటుంబ సభ్యులు ఆరు హెబియస్ కార్పస్ పిటిషన్లను దాఖలు చేశారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సిబ్బంది అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలి. ఈ నెల 4 నుంచి ఇవాళ్టి వరకు సీసీ ఫుటేజీలను స్థానిక మెజిస్ట్రేలకు సమర్పించాలి. పౌరస్వేచ్ఛను కాపాడడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉంది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా?. ప్రొసీజర్ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తాం అంటూ ప్రభుత్వానికి ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం.. హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇన్నేసి పిటిషన్లు దాఖలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. మధ్యాహ్నాం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కాగా.. ఇవన్నీ తప్పుడు పిటిషన్లని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇవన్నీ నిజమైన పిటిషనలేనని, బాధిత కుటుంబ సభ్యులే వీటిని వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో..ఏజీ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అదే టైంలో.. పిటిషన్లు వేసిన వాళ్లందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ వాదనపై న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘మీ మాటలు మేము ఎలా నమ్మాలి. మీరు వదిలేశారు అనడానికి ఆధారాలు ఏంటి?’’ అని ప్రశ్నిస్తూ.. ఆ ఆరుగురు ఎక్కడ ఉన్నారో వెంటనే కనుక్కుని చెప్పాలి’’ని ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే టైంలో పీఎస్‌ల సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి(11వ తేదీకి) వాయిదా వేసింది. -
నా కుమార్తెను వ్యభిచారంలోకి దించేందుకు నా ఫ్రెండ్ ప్రయత్నిస్తోంది
సాక్షి, అమరావతి: తన కుమార్తెను తన స్నేహితురాలు డబ్బు కోసం వ్యభిచార వృత్తిలో దించేందుకు ప్రయత్నిస్తోందని, తన కుమార్తెను తనకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ బాలికను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఆ బాలికను కోర్టు ముందు హాజరుపరచగా.. మంగళగిరి వద్ద ఉన్న ఉజ్వలా హోంలో ఉంచాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఆ బాలిక వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేయాలంది. అంతేకాక ఈ కేసులో సదరు జిల్లా ఎస్పీని ప్రతివాదిగా చేర్చింది. అలాగే పిటిషనర్ తన స్నేహితురాలిగా పేర్కొన్న మహిళ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. తాను కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని, ఆ బాలికను తాను అక్రమంగా నిర్భంధించలేదని ఆ మహిళ తెలిపారు. ఆ బాలిక తన వద్దకు వచ్చి మూడు నెలలు ఉందని, ఆ సమయంలో ఆ బాలికకు టైలరింగ్ నేర్పించానని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదన వినాలని నిర్ణయించి అప్పుడు విచారణను వాయిదా వేసింది. విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి.. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరయ్యారు. ఆ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. బాధిత బాలిక సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, నిస్సహాయ బాలికలు, మహిళలను మానవ అక్రమ రవాణాదారుల నుంచి కాపాడాలని, ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే మానవ అక్రమ రవాణాదారుల ఉచ్చులో నుంచి బయటపడిన బాలికలు, మహిళల పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలంది. ప్రస్తుతం చట్టంలో విటులను బాధితులుగా పేర్కొన్నారని, వాస్తవానికి వారిని నిందితులుగా పేర్కొనాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, మానవ అక్రమ రవాణాదారుల నుంచి బాలికలు, మహిళలను కాపాడే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామని నివేదించారు. సమగ్ర వివరాలతో విధానపరమైన నివేదిక సమర్పిస్తామన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి దర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
బండ బూతుల ‘బండారు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అంటే ఆ పార్టీలోనే ఓ విధమైన వణుకు, జంకు. ఆయన నోరు అలాంటిది. ఎవరినైనా వినలేని, రాయలేని అత్యంత భాషలో తిట్టడం ఆయన నైజం. ఆయనకు వచ్చిన ఒకే ఒక్క విద్య బూతులే అని టీడీపీ నేతలే అంటుంటారు. బండారు బూతు పురాణం ఆయన కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకునేలా ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే.. ఎవరినైనా కనీస విచక్షణ లేకుండా జుగుప్సాకరంగా మాట్లాడతారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిని అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, సభ్యత, విచక్షణ మరిచి ఆయన లక్ష్యంగా చేసుకున్న వారిపై బూతులతో విరుచుకుపడుతుంటారు. తన తప్పుల్ని ఎత్తిచూపిన ప్రతి వారిపైనా బూతులు లంఖించుకుంటారు. అందుకే ఆయన్ను ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా బూతుల సత్యనారాయణ అని అంటుంటారు. మంత్రిగా వెలగబెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రి, మంత్రి రోజాపైనా ఇటీవల నోరు పారేసుకున్నారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకొనేలా చేశాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, యావత్ మహిళాలోకం మండిపడ్డాయి. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: అనుచిత వ్యాఖల కేసులో బండారు అరెస్టు మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల బండారు సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి రోజాపై రాయలేని వీలు లేని భాషలో జుగుప్సాకరమైన పదాలను ఉపయోగిస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. రోజా బతుకు ఎవరికి తెలీదని అన్నారు. బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారని, అవన్నీ తమ దగ్గర ఉన్నాయని, ఆమె బతుకు బయటపెట్టకూడదని వాటిని రిలీజ్ చేయలేదన్నారు. బజారు మనిషని నోరు పారేసుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిపై కూడా తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. బండారు అరెస్ట్‌పై హెబియస్ కార్పస్.. హైకోర్టు తిరస్కరణ సాక్షి, అమరావతి: మంత్రి రోజానుద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సోదరుడు సింహాద్రిరావు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. బండారు వ్యాఖ్యల వ్యవహారంపై గుంటూరు అరండల్‌పేట, నగరపాలెం పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి అరెస్ట్ చేసేందుకు విశాఖ జిల్లా వెన్నలపాలెంలోని బండారు ఇంటికి గుంటూరు పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తితో పాటు టీడీపీ హంగామా సృష్టించారు. పోలీసులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో బండారు సోదరుడు సింహాద్రిరావు హైకోర్టును ఆశ్రయించారు. హౌస్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఈలోపు పోలీసులు బండారుకు నోటీసులిచ్చారు. చట్టప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పూర్తిచేశారు. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు సిద్ధమవుతున్న దశలో హైకోర్టు రిజిస్ట్రీకి ఓ సమాచారం అందింది. సత్యనారాయణమూర్తి విషయంలో పోలీసులు సీఆర్పీసీ చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిసింది. దీంతో పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించి, ఆ విషయాన్ని పిటిషనర్ న్యాయవాదికి తెలిపినట్లు సమాచారం. -
పిల్లలు తండ్రి వద్దే ఉంటామంటే.. అక్రమ నిర్బంధం కాదు
సాక్షి, అమరావతి : ‘పిల్లలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా తండ్రి వద్ద ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు. పిల్లలకు తండ్రే సహజ సంరక్షకుడు. సహజ సంరక్షకుడిగా పిల్లలను తన సంరక్షణలో పెట్టుకునేందుకు తండ్రి అర్హుడు. హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు అక్రమ నిర్బంధమే పరమావధి. అక్రమ నిర్బంధం లేదా అక్రమ కస్టడీ లేనప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. తన పిల్లలను తన భర్త అక్రమంగా నిర్బంధించారంటూ ఓ మహిళ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. పిల్లల అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. తండ్రి వద్దే ఉంటామని పిల్లలు స్పష్టంగా చెప్పినందున, పిల్లల కస్టడీ కావాలనుకుంటే చట్ట ప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని ఆ మహిళకు సూచించింది. ఆమె పిటిషన్ దాఖలు చేసుకుంటే తాము వ్యక్తపరిచిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా విచారించాలని కింది కోర్టును ఆదేశించింది. తన పిల్లలను తన భర్త డాక్టర్ భానుమూర్తి అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన దేవప్రియ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను, అలాగే ఏడేళ్ల కుమారుడిని తన భర్త బలవంతంగా తీసుకెళ్లిపోయారని తెలిపింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ భర్త ఆమెను వదిలేసి మరో మహిళతో ఉంటున్నారని, అలాంటి వ్యక్తి వద్ద పిల్లలను ఉంచడం ప్రమాదకరమని అన్నారు. ధర్మాసనం ఆదేశాల మేరకు ఇద్దరు పిల్లలను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. పిల్లలతో న్యాయమూర్తులు మాట్లాడారు. 17 ఏళ్ల కుమార్తె మానసికంగా చాలా పరిపక్వతతో ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది. హాస్టల్ నుంచి తనను తండ్రి బలవంతంగా తీసుకెళ్లలేదని, పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో తండ్రి వద్ద ఉండేందుకు తానే వెళ్లానని కుమార్తె చెప్పినట్లు పేర్కొంది. ఏడేళ్ల కుమారుడు కూడా తండ్రితోనే ఉంటానని చెప్పాడని తెలిపింది. తండ్రితో పాటు ఉంటున్న మహిళతో కలిసి తాము తండ్రి వద్దే సంతోషంగా ఉంటామని వారిద్దరూ ధర్మాసనానికి తెలిపారు. పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తండ్రి వద్ద ఉండటం పిల్లలకు ప్రమాదకరం కాదని స్ప ష్టం చేసింది. వారి ఇష్టానుసారమే తండ్రి వద్ద ఉంటున్నారని తెలిపింది. దీనిని అక్రమ నిర్బంధంగా చెప్పడం సాధ్యం కాదంది. దేవప్రియ శిరీష దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. -
చిత్రమైన కేసు... ఏనుగుని వ్యక్తిగా పరిగణించాలంటూ పిటిషన్
The elephant is being imprisoned against her will: న్యూయార్క్ అత్యున్నత న్యాయస్థానం ఓ చిత్రమైన కేసుని విచారిస్తోంది. 51 ఏళ్ల హ్యపీ అనే ఆసియా ఏనుగుని బ్రోంక్స్ జూలో చట్టవిరుద్ధంగా నిర్బంధించారంటూ జంతుహక్కుల సంస్థ నాన్హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. నిజానికి హెబియస్ కార్పస్ అనేది ఒక వ్యక్తిని నిర్బంధించడం చట్టబద్ధమైనదో కాదో నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. అయితే ఏనుగు తరుపు న్యాయవాది స్టీవెన్ వైస్.. ఏనుగు ఇష్టానికి వ్యతిరేకంగా జూలో ఖైదీగా నిర్బంధించబడిందని, ఏనుగు జ్ఞానపరంగా తెలివైన జంతువు కాబట్టి మనుషులకు ఉండే అన్ని రకాలు హక్కులు దీనికి ఉండాలని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఏనుగు 1977 నుంచి జూ లోనే నిర్బంధించి ఉంటుందని అందువల్ల దీనిని ఇప్పుడైనా ఏనుగుల అభయారణ్యంలోకి తరలించాలని అభ్యర్థించారు. కానీ బ్రోంక్స్ జూ మాత్రం ఏనుగుని బాగా చూసుకుంటున్నామని, ఏనుగు నిర్బంధం చట్టవిరుద్ధం కాదని వాదిస్తోంది. 2018 నుంచి దాఖలైన ఈ విచిత్రమైన కేసులో జంతు హక్కుల సంస్థ అనేక దిగువ కోర్టుల్లో ఓడిపోతూ వస్తోంది. అయితే ధర్మాసనం ఈ విచిత్రమైన కేసులో ఏనుగుని వ్యక్తిగా పరిగణిస్తుందా లేదా అనే దాని పైనే తీర్పు ఆధారపడి ఉందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పర్కొంది. అంతేగాదు ఈ న్యూయార్క్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చేవరకు కూడా హ్యాపీ జూలోనే ఉండాల్సిందేనని తెలిపింది. Happy has spent 16 yrs in isolation at the Bronx Zoo: 2x longer than Kaavan, the “world’s loneliest elephant” before a Pakistan judge freed him from a zoo to a sanctuary. In his decision, he rightly called Happy an inmate. #FreeHappy https://t.co/YX9Mv22CHS pic.twitter.com/eHXZ5K0z4r — Nonhuman Rights (@NonhumanRights) May 17, 2022 -
‘ఇన్‌స్టా’ ప్రేమ టు హెబియస్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన యువతికి ఆన్లైన్ ట్యూటోరియల్ ప్రోగ్రాం ద్వారా అహ్మదాబాద్ వాసితో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అప్పటికే వివాహితుడైనప్పటికీ అతను ఆ విషయం దాచి సదరు యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెనక్కు వచ్చేయడంతో సైబర్ వేధింపులకు దిగాడు. దీంతో అతడిపై హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు అహ్మదాబాద్‌లోని వెజల్పూర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతగాడు అరెస్టులు తప్పించుకోవడానికి గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగరం నుంచి న్యాయమూర్తితో మాట్లాడిన యువతి అసలు విషయం వివరించింది. నగరానికి వచ్చి యువతిని తీసుకెళ్లి.. అహ్మదాబాద్‌కు చెందిన ముసద్ధిఖ్ సోన్యావాలాకు (30) అతడి సోదరి నిర్వహించే ఆన్లైన్ ట్యుటోరియల్ ప్రోగ్రామ్ ద్వారా కిషన్‌బాగ్‌కు చెందిన యువతితో (18) పరిచయమైంది. ఆపై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చాటింగ్ చేసుకున్న వీళ్లు ప్రేమికులయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చిన ముసద్ధిఖ్ ఆమెను తీసుకెళ్లి అహ్మదాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. యువతి అదృశ్యమైనట్లు భావించిన ఆమె తల్లిదండ్రులు గాలింపు చేపట్టి అసలు విషయం తెలుసుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి అహ్మదాబాద్ వెళ్లినప్పటికీ ఆమెను తమ వెంట తీసుకురాలేకపోయారు. ఆమె వెనక్కు రావడంతో వేధింపులు... ముసద్ధిఖ్ తనను రెండో పెళ్లి చేసుకున్నాడని యువతికి తెలిసింది. భార్యతో సన్నిహితంగా ఉండగా సెల్ఫోన్లో రికార్డు చేసుకోవడం అతడి బలహీనతగా గుర్తించింది. దీంతో విసుగు చెందిన ఆమె ఈ ఏడాది మార్చిలో తిరిగి వచ్చేసింది. విచక్షణ కోల్పోయిన ముసద్ధిఖ్ తన వద్ద ఉన్న ‘వీడియోలు’ లీక్ చేసి ఆమెను వేధించాడు. యువతితో సన్నిహితంగా ఉండగా చిత్రీకరించిన 12 వీడియోలు, ఫొటోలను ఆమెకే పంపిస్తూ ‘సెక్స్ యాద్ రఖ్నా’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కంగుతిన్న బాధితురాలు మార్చిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ముసద్ధిఖ్పై కేసు నమోదైంది. అహ్మదాబాద్ వెళ్లిన యువతి కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అతడి సెల్‌ఫోన్‌ను వారి ఆధీనంలోకి చేర్చారు. అక్కడి ఠాణాలో మరో ఫిర్యాదు... బాధితురాలు అక్కడి వెజల్పూర్ ఠాణాలోనూ భర్త వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే నిందితుడు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అరెస్టు తప్పించుకోవడానికి ఇటీవల తన న్యాయవాది ద్వారా గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. హైదరాబాద్ వెళ్లి కనిపించకుండా పోయిన తన భార్యను వెతికి అప్పగించాలని కోరాడు. దీంతో అహ్మదాబాద్ వెళ్లిన యువతి కుటుంబీకులు న్యాయవాది ద్వారా కౌంటర్ దాఖలు చేశారు. కేసును పక్కదారి పట్టించడానికే అతను ఈ పిటిషన్ దాఖలు చేయించాడని ఆరోపిస్తూ పూర్వాపరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ఉగ్ర’ కోణమూ వెలుగులోకి... గుజరాత్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన యువతి కుటుంబీకులు ‘ఉగ్ర కోణాన్నీ’ బయటపెట్టారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో పరారీలో ఉన్న ముఫ్తీ సూఫియాన్‌కు ముసద్ధిఖ్ సమీప బంధువని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న సూఫియాన్ సహాయంతో ఇతగాడూ దేశం దాటిపోయే ప్రమాదం ఉందని, అలా జరగకుండా నిరోధించాలంటూ కోర్టును కోరారు. అతడిపై ఉన్న కేసు విచారణ తప్పించుకోవడానికే హెబియస్ పిటిషన్ వేశాడని నివేదించారు. 2003 మార్చి 26న అహ్మదాబాద్‌లో జరిగిన హరేన్ పాండ్య హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. అప్పట్లో అక్కడి పోలీసులు నగరానికి వచ్చి నిందితులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బాధితురాలి వాంగ్మూలం.. వెజల్పూర్ పోలీసులు సైతం హైకోర్టుకు సమాధానం ఇస్తూ నిందితుడి ఫోన్ నుంచి 3200 ఫైల్స్ కాపీ చేశామని, వీటిలో అత్యధికం తన భార్యలతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలేనంటూ నివేదించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఆ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అమిత్ వసావను ఆదేశించింది. రెండు రోజుల క్రితం నగరం నుంచి సదరు యువతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ హైకోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. ఇందులో తనకు జరిగిన అన్యాయాన్ని, వాస్తవాలను వివరించింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: వెంబడించి లైంగిక దాడి.. చెప్తే చంపేస్తా.. భర్తకు ఆలస్యంగా తెలియడంతో) -
‘వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చెడ్డ తల్లి కాదు’
చండీగఢ్: చెడ్డ మహిళ ఉంటుంది కానీ.. చెడ్డ తల్లి ఉండదని పెద్దల మాట. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. సమాజం హర్షించనప్పటికి.. బిడ్డల బాగు కోసం ఆమె ఏం చేయడానికికైనా సిద్ధ పడుతుంది. తాజాగా పంజాబ్, హరియాణా కోర్టు కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన ఓ మహిళను చెడ్డ తల్లిగా పరిగణించలేము అని వ్యాఖ్యనించడమే కాక నాలుగున్నరేళ్ల కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించింది. వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. భర్త తన దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో పంజాబ్‌కు చెందిన ఓ మహిళ హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. దీని విచారణ సందర్భంగా జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ మాట్లాడుతూ.. ‘‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ నైతిక స్వభావంపై నిందలు మోపడం చాలా సహజం. ఎలాంటి ఆధారం లేకుండా మహిళ వ్యక్తిత్వంపై బురద జల్లుతారు. స్త్రీకి వివాహేతర సంబంధం ఉన్నా.. ఉందని ఊహించినా.. దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను మంచి తల్లి కాదని అనడానికి కానీ.. పిల్లలను ఆమె నుంచి దూరం చేయడం కానీ జరగదు’’ అని స్పష్టం చేశారు. కేసు వివరాలు... ఇక కేసు వివరాలకు వస్తే.. పిటీషనర్ పంజాబ్‌కు చెందిన ఫతేగార్ సాహిబ్‌కు, లుధియానాకు చెందిన ఆమె భర్త ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులు. 2013లో వీరికి వివాహం కాగా.. 2017లో ఓ కుమార్తె జన్మించింది. పిటీషన్‌దారైన మహిళ 2020, ఫిబ్రవరిలో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా వేరు చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ తన భర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని.. కానీ మాత్రం తాను ఆస్ట్రేలియాలో బాగానే స్థిరపడ్డానని.. సొంత ఇల్లు కూడా ఉందని.. కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని పిటీషన్లో తెలిపింది. మైనర్ కుమార్తె బాధ్యతను తనకు అప్పగించేలా తన భర్తను ఆదేశించాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. అంతేకాక సదరు మహిళ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుమార్తె కస్టడీని కోరుతూ.. ఫెడరల్ సర్క్యూట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మైనర్ బిడ్డను మహిళకు తిరిగి ఇవ్వమని ఆస్ట్రేలియా కోర్టు భర్తను ఆదేశించింది. ఇక భర్త వాదనల ప్రకారం అతడి భార్య తన దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అందుకే పాపను ఆమె దగ్గర నుంచి తీసుకువచ్చానన్నాడు. ఏడాదిగా తన కుమార్తె నానమ్మ, తాతయ్యల దగ్గర బాగా అలవాటయ్యిందని.. ఇప్పుడు బిడ్డను తన భార్యకు అప్పగిస్తే.. పాపపై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు.. ‘‘తల్లి నాలుగున్నరేళ్ల కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోరుతుంది. రానున్న సంవత్సారల్లో పాప నిర్మాణాత్మక అభివృద్ధిలో తల్లి ప్రేమ, సంరక్షణ, ఆప్యాయత, మార్గదర్శకత్వం అవసరం అవుతాయి. అంతేకాక హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం, 1956 లోని సెక్షన్ 6 ప్రకారం తల్లి ఐదేళ్ల వయస్సు వరకు పిల్లల సహజ సంరక్షకురాలు” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చదవండి: భార్య గుట్టు బయటపెట్టిన కాల్ రికార్డింగ్స్! -
వివాదంగా మారిన ఎమ్మెల్యే ప్రేమ వివాహం
చెన్నై: అన్నాడీఎంకే కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అది కాస్త ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ప్రభు తమ కుమార్తెని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ.. సౌందర్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను అప్పగించాలంటూ మద్రాస్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. ఈ కేసును మద్రాస్ హై కోర్టు ధర్మాసనం రేపు విచారించనుంది. ఇక వివాహం అనంతరం ప్రభు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘దానిలో ఇష్టపూర్వకంగానే మా వివాహం జరిగింది. దీనిలో ఎవరి బలవంతం లేదు. మేం నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నాం. నేను తనను కిడ్నాప్ చేశాననే మాట అవాస్తవం. వివాహం అనంతరం మేం సౌందర్య తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం వారి ఇంటికి వెళ్లాం. కానీ వారు మమ్మల్ని తిరస్కరించారు. ఈ పెళ్లికి మా తల్లిదండ్రుల అనుమతి ఉంది’ అని తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే ప్రేమ వివాహం ) ఇక సౌందర్య మాట్లాడుతూ.. ‘నేను ప్రభుని ప్రేమించాను. వివాహం చేసుకోవాలని నన్ను ఎవరు బలవంతం చేయలేదు’ అని తెలిపారు. సౌందర్య తండ్రి ఆమె ఊరి గుడిలో అర్చకుడిగా పని చేస్తున్నారు. కులాంతర వివాహం కావడంతో వారు ఈ వివాహాన్ని అంగీకరించడం లేదని సమాచారం. -
రిమాండ్‌లోని ముగ్గురూ హైకోర్టులో హాజరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ముగ్గురిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లుగా హైకోర్టు ప్రకటించింది. చైతన్య మహిళా సంఘం సంయుక్త కార్యదర్శులు డి.దేవేంద్ర, ఎం.స్వప్న, తెలంగాణ విద్యార్థి వేదిక ప్రధాన కార్యదర్శి ఎం.సందీప్‌లను పలు కేసుల్లో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని, దీనిలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండలోని చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ ముగ్గురినీ హైకోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ముగ్గురినీ హైకోర్టులో హాజరుపర్చారు. ముగ్గురి నుంచి స్టేట్మెంట్ను నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశాలపై వేరే రూపంలో న్యాయపోరాటం చేసేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఉందని.. హెబియస్ కార్పస్ పిటిషన్లో తమ పరిధి పరిమితమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఆ ముగ్గురితో వారి తల్లిదండ్రులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయంలో కలుసుకుని మాట్లాడుకునేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
వారిని రేపటిలోగా కోర్టులో హాజరుపరచాలి
సాక్షి, హైదరాబాద్: పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రజా సంఘాల నేతలను శుక్రవారం ఉదయంలోగా కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆదేశించారు. మావోయిస్టు సానుభూతిపరులనే ఆరోపణలపై చైతన్య మహిళా సంఘం సభ్యులైన దొంగరి దేవేంద్ర, దువ్వాసి స్వప్న, విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచు సందీప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అరెస్టు చేసిన వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఇంతకుమునుపే హైకోర్టు ఆదేశించింది. అయినా వారిని హాజరుపరచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. అరెస్ట్ చేసిన స్వప్న, దేవేంద్ర, సందీప్‌లను రేపటిలోగా కోర్టులో హాజరుపర్చలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. చైతన్య మహిళా సంఘం సభ్యులు దేవేంద్ర, స్వప్నతోపాటు హైదరాబాద్ నల్లకుంటకు చెందిన మెంచు సందీప్‌ను మంగళవారం అర్ధరాత్రి కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్చంద్ర ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్న పలు సంఘాల నాయకులపై అక్టోబరులో చర్ల పోలీస్ స్టేషన్లో ‘ఉపా’ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా పేర్కొని పరారీలో ఉన్నందునే దేవేంద్ర, స్వప్న, సందీప్‌ను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. -
వివాహితుడితో కలిసి ఉండేందుకు అనుమతిచ్చిన కోర్టు
జైపూర్ : రాజస్తాన్ హై కోర్టు సోమవారం సంచలన తీర్పిచ్చింది. వివాహితుడైన వ్యక్తిని ప్రేమించిన మహిళను అతనితోనే కలిసి జీవించవచ్చని పేర్కొంది. మొయినుద్దీన్ అబ్బాసి అనే వ్యక్తి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు సందీప్ మెహతా, వినిత్ కుమార్ మథూర్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. వివరాలు.. రూపాల్ సోనీ అనే మహిళ(26) మొయినుద్దీన్ అబ్బాసీ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. 2018, జూలై 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోనీని ఇంట్లో బంధించారు. దాంతో మొయినుద్దీన్ తన భార్యను చూపించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. విచారణలో భాగంగా గత ఏడాది మార్చి 13న పోలీసులు సోనీని కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొయినుద్దీన్‌కు ఇంతకు ముందే వివాహం జరిగిందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికి అతను సోనీని ఇంటర్ ఫెయిత్(నమ్మకం) వివాహం చేసుకున్నాడని.. తర్వాత దాన్ని రిజిస్టర్ చేయించాడని విచారణలో తెలీంది. ఆశ్యర్యపోయిన కోర్టు కేసుకున్న సున్నిత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సోనీని ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రభుత్వ మహిళా సంక్షేమ కేంద్రానికి పంపించింది. అనంతరం కోర్టు సోనీకి ఆమె భవిష్యత్తు గురించి.. తర్వాత ఎదుర్కొబోయే పరిణామాల గురించి కౌన్సిలింగ్ ఇప్పించింది. ఆపై నిన్నటి విచారణలో భాగంగా కోర్టు సోనీ నిర్ణయం గురించి ప్రశ్నించింది. అందుకు ఆమె తన బంధాన్ని కొనసాగిస్తానని.. మొయినుద్దీన్‌తోనే కలిసి ఉంటానని కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు ‘సదరు మహిళ మేజర్, పూర్తి మానసిక పరిపక్వత కల్గిన వ్యక్తి, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువల్ల కోర్టు ఆమె నిర్ణయాన్ని గౌరవించి మొయినుద్దీన్‌తో కలిసి ఉండేందుకు అనుమతిస్తూ తీర్పునిస్తున్ను’ట్లు పేర్కొంది. -
శాంతిభద్రతల కోసమే రేవంత్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్నికల సమయంలో వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగానే రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న సభ లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందువల్ల అధికారిక సీలు అందుబాటులో లేకపోయిందని వివరించారు. అదుపులోకి తీసుకునే ముందు బయటకు రావాలని రేవంత్‌ను పలుమార్లు పిలిచామని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో గేట్లు పగులగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని, వారికి రేవంత్ అరెస్ట్‌కు దారి తీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు కోరగా నిరాకరించారని ఆమె తెలిపారు. పోలీసులు చట్ట విరుద్ధంగా రేవంత్‌ను నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి అవకాశం ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
జయ మృతిపై అనుమానాలున్నాయి
-
జయ మృతిపై అనుమానాలున్నాయి
► ఆమె మృతదేహాన్ని వెలికితీసి ఎందుకు పరీక్షించకూడదో చెప్పండి ► కేంద్రంతో పాటు తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ప్రశ్న సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నందున ఆమె పార్థివదేహాన్ని వెలికితీసి ఎందుకు పరీక్షించకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్‌కే గాక తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయంతో పాటు కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, అపోలో ఆస్పత్రి చైర్మన్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘అమ్మ’ మృతి అనుమానాస్పదమని పేర్కొంటూ చెన్నైకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలో ఇంటికి చేరుకుంటారని అపోలో యాజమాన్యం ప్రకటిస్తూ వచ్చిందని, ఈ నెల 4న జయలలితకు గుండెపోటు రావడానికి కొద్దిసేపటికి ముందు కూడా జయ క్షేమంగా ఉన్నారని ప్రకటించారని పిటిషనర్ పేర్కొన్నాడు. 5వ తేదీ సాయంత్రం కూడా ఆమె మరణించిందనే వార్తలను ఖండించారని, కానీ అదే రోజు రాత్రి జయలలిత మరణించిందని చేసిన ప్రకటన అనేక సందేహాలకు తెరదీసిందని పిటిషనర్ పేర్కొన్నాడు. పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్ , జస్టిస్ వి.పార్తిబన్ తో కూడిన వెకేషన్ బెంచ్ గురువారం విచారించింది. సందేహాలు తొలగించాల్సిందే.. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. జయలలిత మృతిపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్ని విషయాలు తెలిసినప్పటికి కేంద్రప్రభుత్వం కూడా నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. గతంలో విదేశాల్లో చికిత్స పొందుతున్న సమయంలో మాజీ సీఎం ఎమ్జీఆర్ ఫొటోనే విడుదల చేసినప్పుడు.. చెన్నైలోనే చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోను ఎందుకు విడుదల చేయలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఒక న్యాయమూర్తి అనే విషయాన్ని పక్కనపెట్టి వ్యక్తిగతంగా తనకు కూడా అనేక అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ పేర్కొన్నారు. జయలలిత కోలుకుంటున్నారని ఒకరోజు, పేపర్లపై సంతకాలు చేస్తున్నారని మరోరోజు, చివరకు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారంటూ ప్రకటించారని, మరి హఠాత్తుగా ఆమె ఎలా మరణించారని ప్రశ్నించారు. అలాగే రక్త సంబంధీకులను కూడా జయను చూసేందుకు అనుమతించలేదని, వారు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదో అర్థం కావడం లేదన్నారు. జయ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయనే పక్షంలో.. ఇందుకు ఎం దుకు అనుమతించకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ వైద్యనాథన్ ప్రశ్నిం చారు. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేత అన్నాడీఎంకే కార్యకర్తల చేతిలో దాడికి గురైన శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలకన్ ను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ ను గురువారం మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. బెయిల్‌పై ఆయన ఇప్పటికే విడుదలైనందున విచారణ అవసరం లేదని జస్టిస్ ఎస్ వైదయనాథన్, జస్టిస్ వి. పార్థీభన్ లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
దయానీ తల్లి పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్ : స్నేక్‌గ్యాంగ్‌లో సభ్యుడంటూ అరెస్ట్ చేసిన తన కుమారుడు ఫైజల్ దయానీని కోర్టు ఎదుట హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ అతడి తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు దయానీని పహాడీషరీఫ్ పోలీసులు అక్రమంగా నిర్భందించారని, అతనిని కోర్టు ఎదుట హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తల్లి హుస్సేనీ గతవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, వివరణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాలని పహాడీఫరీఫ్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు మంగళవారం ధర్మాసనం ముందు హాజరై ఓ నివేదికను కోర్టు ముందుంచారు. స్నేక్‌గ్యాంగ్‌లో ఫైజల్ దయానీ కూడా నిందితుడని, అతనిని అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా, కోర్టు అతడికి జుడీషియల్ కస్టడీ విధించిందని అందులో వివరించారు. దీంతో సంతృప్తి చెందిన ధర్మాసనం, హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది