టీడీపీ నేత బండారును అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అంటే ఆ పార్టీలోనే ఓ విధమైన వణుకు, జంకు. ఆయన నోరు అలాంటిది. ఎవరినైనా వినలేని, రాయలేని అత్యంత భాషలో తిట్టడం ఆయన నైజం. ఆయనకు వచ్చిన ఒకే ఒక్క విద్య బూతులే అని టీడీపీ నేతలే అంటుంటారు. బండారు బూతు పురాణం ఆయన కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకునేలా ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే.. ఎవరినైనా కనీస విచక్షణ లేకుండా జుగుప్సాకరంగా మాట్లాడతారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిని అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, సభ్యత, విచక్షణ మరిచి ఆయన లక్ష్యంగా చేసుకున్న వారిపై బూతులతో విరుచుకుపడుతుంటారు.
తన తప్పుల్ని ఎత్తిచూపిన ప్రతి వారిపైనా బూతులు లంఖించుకుంటారు. అందుకే ఆయన్ను ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా బూతుల సత్యనారాయణ అని అంటుంటారు. మంత్రిగా వెలగబెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రి, మంత్రి రోజాపైనా ఇటీవల నోరు పారేసుకున్నారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకొనేలా చేశాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, యావత్ మహిళాలోకం మండిపడ్డాయి. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: అనుచిత వ్యాఖల కేసులో బండారు అరెస్టు
మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు
ఇటీవల బండారు సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి రోజాపై రాయలేని వీలు లేని భాషలో జుగుప్సాకరమైన పదాలను ఉపయోగిస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. రోజా బతుకు ఎవరికి తెలీదని అన్నారు. బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారని, అవన్నీ తమ దగ్గర ఉన్నాయని, ఆమె బతుకు బయటపెట్టకూడదని వాటిని రిలీజ్ చేయలేదన్నారు. బజారు మనిషని నోరు పారేసుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిపై కూడా తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు.
బండారు అరెస్ట్‌పై హెబియస్ కార్పస్.. హైకోర్టు తిరస్కరణ
సాక్షి, అమరావతి: మంత్రి రోజానుద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సోదరుడు సింహాద్రిరావు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. బండారు వ్యాఖ్యల వ్యవహారంపై గుంటూరు అరండల్‌పేట, నగరపాలెం పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చి అరెస్ట్ చేసేందుకు విశాఖ జిల్లా వెన్నలపాలెంలోని బండారు ఇంటికి గుంటూరు పోలీసులు వెళ్లారు.
ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తితో పాటు టీడీపీ హంగామా సృష్టించారు. పోలీసులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో బండారు సోదరుడు సింహాద్రిరావు హైకోర్టును ఆశ్రయించారు. హౌస్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఈలోపు పోలీసులు బండారుకు నోటీసులిచ్చారు. చట్టప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పూర్తిచేశారు. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు సిద్ధమవుతున్న దశలో హైకోర్టు రిజిస్ట్రీకి ఓ సమాచారం అందింది. సత్యనారాయణమూర్తి విషయంలో పోలీసులు సీఆర్‌పీసీ చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిసింది. దీంతో పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించి, ఆ విషయాన్ని పిటిషనర్ న్యాయవాదికి తెలిపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment