Bandaru SatyaNarayana
-
బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలని డిమాండ్.. బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
-
అనకాపల్లి జిల్లా టీడీపీలో బయటపడ్డ విభేదాలు..
-
ఉత్తరాంధ్రలో ఆగ్రహ జ్వాలలు.. కూటమిలో ప్రకంపనలు
పరవాడ/చీపురుపల్లి/పాడేరు/కామవరపుకోట/తిరుపతి తుడా: విపక్ష కూటమిలో ఏర్పడిన నిరసన జ్వాలలు రాష్ట్రవ్యాప్తంగా ఎగిపిపడుతూనే ఉన్నాయి. ఐదేళ్లపాటు డబ్బు ఖర్చు చేయించి తీరా టికెట్ కేటాయింపు వంతు వచ్చేసరికి డబ్బు మూటలతో దిగి, లాబియింగ్ చేసినవారికే కూటమిలో టికెట్ కేటాయిస్తున్నారంటూ టీడీపీపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తూ ఇంట్లో కూర్చున్నవారికి టికెట్ ఇస్తున్నారని, కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్లు కేటాయిస్తున్నారని తూర్పారబడుతున్నారు. టీడీపీ తనకు తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి భావోద్వేగానికి లోనయ్యారు. వెన్నలపాలెంలో బండారు స్వగృహంలో శనివారం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తాను ఏ పాపం చేశానని టికెట్ కేటాయించలేదని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తన భవిష్యత్తు ప్రయాణం ఉంటుందని చెప్పారు. నమ్మిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా నిలుస్తానని బండారు వారికి హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తలు స్పందిస్తూ మీ బాటలోనే మేం కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ పార్టీకి దూరంగా ఉంటూ లాబీయింగ్ చేసుకుంటే టికెట్లు వచ్చే పరిస్థితి టీడీపీలో ఉన్నదని విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ నాయకుడు కిమిడి నాగార్జున కంటతడి పెట్టుకున్నారు. చదువుకున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నా గానీ.. వచ్చాక తెలిసింది నమ్మించి గొంతు కోస్తారని, యువత రాజకీయాల్లోకి రావద్దని, పొరపాటున వస్తే జీవితాలను చంద్రబాబు చిదిమేస్తారని విమర్శించారు. ఆయన ఇంటి ముందు టీడీపీ భవిష్యత్‌కు గ్యారెంటీ, సూపర్ సిక్స్ కరపత్రాలను పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి మణికుమారి తదితరులు చెడు సంప్రదాయాలకు టీడీపీ తెరతీసింది: కోరాడ రాజబాబు ధ్వజం చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెరతీసి అవినీతి అనకొండ గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఇచ్చారని కోరాడ రాజబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆనందపురంలోని తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీని పట్టించుకోకుండా వ్యాపారాలు చేసుకున్న గంటాకు టికెట్ ఇవ్వడం ఏమి సంప్రదాయమని ప్రశ్నించారు. వే లంలో టికెట్లు అమ్ముకోవాలనుకుంటే చంద్రబాబు ఒక రేటు పెడితే తాను కూడా టికెట్ కొనుక్కునేవాడినన్నారు. మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ తెలియచేస్తానన్నారు. పాడేరు టీడీపీ అభ్యర్ధి కిల్లు వెంకట రమేష్‌నాయుడు ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. గిరిజనులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పాడేరు, కొయ్యూరులో చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పంటించి నిరసన తెలిపాయి. మాజీ మంత్రి మణికుమారి డబ్బులు కోసం ప్రస్తావిస్తూ తన అభ్యర్థిత్వాన్ని ఈ ఎన్నికల్లో పరిశీలించాలని టీడీపీ పెద్దలను కోరానని, అయితే డబ్బు ఎంత ఖర్చు పెట్టగలవు అన్ని ప్రశ్నిస్తే డబ్బుతో తూగలేక ఈసారికి డ్రాప్ అవుతానని చెప్పానన్నారు. కె.కోటలో కుమ్ములాటలు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మండలంలో ఆ పార్టీ కార్యాలయ ప్రారంభానికి వచ్చిన సందర్భంగా గంటా మురళికి పార్టీలోని మరో వర్గానికి మధ్య వివాదం వచ్చింది. అప్పటికే రగిలిపోతున్న ఆ వర్గం గంటా మురళిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గతంలో ఇక్కడ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్తూరులో ఏర్పాటుచేసిన టీడీపీ జిల్లా నాయకుల సమావేశంలోనూ ఈ రెండు వర్గాలూ ఇదేవిధంగా కొట్లాటకు దిగాయి. పొత్తులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే స్థానాన్ని జనసేనకు, తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విలేఖరుల సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు తోసేసిన వ్యక్తులను కూటమి అభ్యర్థులుగా ప్రకటించడాన్ని తప్పుబడుతూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు టీడీపీ నాయకుల తన గొంతుగోశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
బండారు రాజకీయ చాప్టర్ క్లోజ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీటు కోసం నోటికి పని చెప్పి... వయస్సును కూడా మరచిన బండారు బెండు వంచింది సొంత పార్టీ. రానున్న ఎన్నికల్లో పెందుర్తి నుంచి టికెట్ లేదంటూ ఆ పార్టీ అధినేత బండారుకు తేల్చిచెప్పినట్టు సమాచారం. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈ సీటును ఆ పార్టీకి కేటాయించనున్నట్టు పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల రాజకీయంలో ఉండాలంటే మాడుగుల నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తేల్చిచెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, మాడుగుల నుంచి బరిలోకి దిగేందుకు బండారు ససేమిరా అంటున్నారు. పెందుర్తి టికెట్ కావాలంటూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు వయస్సును కూడా మరచి మంత్రి రోజాపై అవాకులు చెవాకులు పేలారు. అయినప్పటికీ బండారుకు గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. పైగా ఆయన వ్యాఖ్యలతో మరింతగా పరిస్థితి దిగజారిపోయిందంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే ఇక బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ చాప్టర్ ముగిసిన అధ్యాయమేనని ఆయన వర్గీయులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా సీటు కోసం నోటికి పనిచెప్పి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని దిగజార్చుకున్నా ఫలితం లేకపోవడంతో తన సన్నిహితుల వద్ద పార్టీ అధినాయకత్వంపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి రోజాపై వ్యాఖ్యల తర్వాత బండారు రాజకీయ గ్రాఫ్ మరింత వేగంగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వాస్తవానికి గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా కూడా బండారు పనిచేశారు. గత ఎన్నికల్లో యువకుడైన అదీప్‌రాజ్ చేతిలో మట్టికరిచారు. అప్పటి నుంచి ఎలాగోలా వార్తల్లో ఉండేలా బండారు నోటికి పనిచెబుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ వార్తల్లో నిలిచే విధంగా చూసుకున్నారు. అయితే, ప్రజల్లో మద్దతు కోల్పోవడంతో ఆయనకు సీటు ఇచ్చినా గెలిచే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసినా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఆయన కుమారుడు వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకతను మరింతగా పెంచింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. కేవలం భూకబ్జాలకే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పెందుర్తి నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలంటూ జనసేన పార్టీ పట్టుబట్టింది. అయితే, పెందుర్తి నుంచి టికెట్ ఇవ్వకపోతే తన సత్తా చూపిస్తానంటూ బండారు సన్నిహితుల వద్ద తేల్చిచెబుతున్నట్టు తెలుస్తోంది. వయసైపోయిన నేపథ్యంలో తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుండటం.. ఇప్పటికీ వారసత్వంగా కొడుకును పరిచయం చేయకపోవడం బండారును చాలా బాధ పెడుతున్నట్టు తెలుస్తోంది. పెందుర్తి సీటుపై జనసేన కన్ను గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలవడంతో ఈ సీటు కోసం జనసేన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ పంచకర్ల రమేష్‌బాబు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారికంగా పార్టీ ప్రకటించనప్పటికీ ఈ సీటు తనదేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే, సీటు జనసేనకు కేటాయించినా తెలుగుదేశం పార్టీ వర్గాలు సహకరించేది కష్టమేననన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ సీట్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో తెలుగుదేశం–జనసేన కలిసి జెండాలు పట్టుకుని రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎక్కడా కలిసి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అధికారికంగా బండారుకు ఝలక్ ఇస్తే.. జనసేన అభ్యర్థికి సహకరించడం కష్టమేనని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఇరు పార్టీల పొత్తుకు ఇక్కడి నుంచే బీటలు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రోజాను ఎదుర్కొనలేకే వ్యక్తిగత ఆరోపణలు..!
-
ఆ మాటలు విని నా కూతురు ఒక్కటే చెప్పింది..!
-
బండారు కామెంట్స్ పై నా పిల్లల రియాక్షన్: ఆర్కే రోజా
-
బండారు పై అనిల్ కుమార్ యాదవ్ ఉగ్రరూపం
-
అలా మాట్లాడినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదా
-
ఇలాంటి మనుషులను ఏం చేయాలి అంటే: జొన్నలగడ్డ పద్మావతి
-
బండారు వంటి చీడపురుగులను ఏరిపారేయాలి...
-
టీడీపీ నేత బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. ‘‘మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు’’ అంటూ మంత్రి రోజా మండిపడ్డారు. చదవండి: ఆ మాటలనడానికి నోరెలా వచ్చింది ‘‘మాజీ మంత్రిగా పని చేసిన బండారు చాలా నీచంగా మాట్లాడారు. నాకు ఊహతెలిసినంతవరకూ ఎవరూ ఇంతలా ఒక మహిళ గురించి మాట్లాడలేదు. తన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు.. తన ఇంట్లో ఉన్న మహిళలకు ఎలాంటి గౌరవమిస్తాడో అర్ధమైంది. మహిళల పట్ల బండారుకు ఉన్న సంస్కారమేంటో తెలుస్తోంది. మంత్రిగా ఉన్న రోజాని అంటే తప్పించుకు తిరగొచ్చని బండారు అనుకుంటున్నారు. బండారు వంటి మగవాళ్లకు బుద్ధి చెప్పడానికే నేను పోరాటం చేస్తున్నాం. అరెస్ట్ చేసి బెయిల్ వస్తే బండారు తప్పు చేయనట్లు కాదు. బండారు చేసిన వ్యాఖ్యల వల్ల మేం చాలా అవమాన పడ్డాం. చట్టాల్లో మార్పు రావాలి. టీడీపీ, జనసేన ఉన్నది దిగజారుడు రాజకీయాలు చేయడానికే’’ అని ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
బండారు వ్యాఖ్యలపై మహిళాగ్రహం
-
టీడీపీ నేత బండారుపై సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం
-
మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై కోర్టు చర్యలు తీసుకోవాలని..
సాక్షి, హైదరాబాద్: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా కూడా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా నటి మీనా ఓ వీడియోలో మాట్లాడుతూ.. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలి. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయి. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి నాకు పూర్తిగా తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడితే రోజా భయపడుతుంది అనుకుంటున్నారా?. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నవా?. మంత్రి రోజా చేసే పోరాటానికి నేను అండగా ఉంటాను అని మీనా.. మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటించారు. -
మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై సినీనటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి రోజాకు పలువురు ప్రముఖులు అండగా నిలవగా, తాజాగా రమ్యకృష్ణ సైతం స్పందించారు. ‘మంత్రి రోజాని మాజీ మంత్రి బండారు అసభ్యంగా దూషించడం దారుణం.మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం. అలాంటి దేశంలో ఓ మహిళ పై ఇంత నీచంగా మాట్లాడతారా?, బండారు సత్యనారాయణని క్షమించకూడదు. pic.twitter.com/fsuJ7aa9Wk — Ramya Krishnan (@meramyakrishnan) October 7, 2023 మనదేశం ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?, కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి. నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా. ఈ దేశంలో మహిళలపై రేప్ లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరం. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బండారు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు రమ్యకృష్ణ. బండారు.. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?: నటి, ఎంపీ నవనీత్ కౌర్ -
బండారు సత్యనారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మహిళలు
-
తెలుగు మహిళల గౌరవాన్ని తగ్గించేలా బండారు తీరు ఉంది
-
మంత్రి ఆర్కే రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను ఖండించిన రాధికా
-
టీడీపీ సత్యనారాయణపై నటి రాధిక సీరియస్.. మంత్రి రోజాకు మద్దతు
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజాకు సినీనటి రాధికా శరత్‌కుమార్ అండగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా మరో సినీ నటి రాధిక.. మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?. దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. I condemn below the belt hitting , labelling women, objectifying and being unparliamentary, an ex minister #bandarasatyanarayana has no qualms with his language and attitude. I stand for minister /actor amd good friend @RojaSelvamaniRK #women #harassment #politics pic.twitter.com/nmGHyeLgi2 — Radikaa Sarathkumar (@realradikaa) October 6, 2023 బండారు సత్యనారాయణ వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి అని వీడియోలో రాధిక తెలిపారు. మంత్రి రోజాకు నటి కుష్బూ సపోర్ట్.. ఇదిలా ఉండగా, అంతకుముందు.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు సీరియస్ అయ్యారు. ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారు. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ నేత బండారు సత్యనారాయణపై కుష్బూ ఆగ్రహం
-
బండారుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా
-
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు ఏమాత్రం సహించదగినవి కావు
-
బండారు తట తీస్తాం..వైఎస్సార్సీపీ మహిళ నేతల మాస్ వార్నింగ్
-
మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు: కవిత
-
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు.. సినీ నటి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత హేయనీయం అని సినీ నటి కవిత మండిపడ్డారు. రాజకీయాలను టీడీపీ నేతలు దిగజారుస్తున్నారని, మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారన్నారు. బండారుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘ప్రజలు అసహ్యించుకునేవిధంగా నీచమైన భాషతో మహిళలపై టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. రోజాపైన బండారు చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా చెప్పుతో కొడతారు. బండారు ఇంట్లో ఉన్న మహిళలు ఇలాంటి మాటలను ఆమోదించగలరా.?. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బండారు వ్యాఖ్యలను ఖండించాలి. ఎన్టీఆర్ కడుపున పుట్టిన భువనేశ్వరి.. మహిళలపై టీడీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడితే ఖండించరా..?’’ అంటూ కవిత దుయ్యబట్టారు. చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? -
టీడీపీ దుశ్శాసన పార్టీ
ఒక మహిళపై టీడీపీ నేత బండారు అభ్యంతరకర ఆరోపణలు చేస్తే లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటు. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పారీ్టకి జాతీయ అధ్యక్షుడు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే.. ఇలాంటి వారున్న టీడీపీకి మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? తిరుపతి రూరల్/సాక్షి అమరావతి: విశ్వవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్న నేటి రోజుల్లో ఇంకా పాతకాలం నాటి సంకుచిత ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశిస్తూ నీచాతి నీచంగా విమర్శించడంపై సభ్య సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా, టీడీపీ అధిష్టానం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పైగా.. అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆయన అరెస్టును తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తోంది. మహిళలంటే టీడీపీకి ఇంత చిన్నచూపా అని మహిళాలోకం ప్రశ్నిస్తోంది. ఇంతలా స్త్రీలను కించపరుస్తున్న ఆ పార్టీ నేతలను కట్టడి చేయకుండా ఇంకా ప్రోత్సహించేలా వ్యవహరించడం ఏమిటని నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో.. తనకు ఎదురైన అవమానంపై మంత్రి రోజా మంగళవారం తిరుపతి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసత్య ఆరోపణలు, విమర్శలతో మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న టీడీపీ దుశ్సాసన పార్టీ అని ఆమె ఘాటుగా విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహిళా లోకాన్నే అవమానించేలా మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యక్తిగత విమర్శలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. బ్లూ ఫిలిమ్స్‌లో నటించింది అంటూ నన్ను టార్చర్ చేస్తున్నారు.. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు.. కానీ, ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేయడానికి? మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది. దమ్ముంటే సీడీలను ప్రజల్లోకి విడుదల చేయాలి. నాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదు. లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్యనారాయణ అరెస్టును ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా? మహిళపై అభ్యంతరకర ఆరోపణలు చేస్తే బండారు కుటుంబం, టీడీపీ ఖండించకుండా ఆయనకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు. ఎన్టీయార్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు. లోకేశ్ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం బ్రాహ్మణి మానుకుని జగన్న చేస్తున్న అభివృద్ధిని స్వాగతించాలి. మహిళలంటే టీడీపీలో చిన్నచూపు.. టీడీపీ అంటే దండుపాళ్యం పార్టీ.. తెలుగు దొంగల పార్టీ, తెలుగు దుశ్శాసన పార్టీ. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలి అని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే.. మహిళలంటే అంత చిన్నచూపు చూసే టీడీపీలో మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? మహిళలు రాజకీయాల్లోకి రావటమే తప్పు అన్నట్లు దండుపాళ్యం నేతలు ఒళ్లు బలిసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నా.. మహిళా సాధికారితకు పాటుపడుతున్నా. మహిళలను కానీ, మా నాయకుడు జగనన్నను కాని విమర్శిస్తే ఊరుకోను. ఇలాంటి దిగజారుడు విమర్శలతో తన గొంతు నొక్కాలని ప్రయత్నించినా ఊరుకోను. బండారును వదిలిపేట్టేది లేదు. అతనిపై పరువునష్టం దావావేసి న్యాయపోరాటం చేస్తా. ఇక నగరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా నా పనితీరుపై చర్చకు రావాలి. ధమ్ముంటే నా నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి చూడండి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. అంతేగానీ.. చేతకాని దద్దమ్మల్లాగా ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దు. మానవమృగం బండారు ఆకృత్యాలను సమర్థిస్తారా? – జాతీయ మీడియాను ప్రశ్నిస్తూ రోజా ‘ఎక్స్’లో పోస్ట్ పురుషాధిక్య ప్రపంచంలో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన మానవమృగం టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణను సమర్థిస్తారా? అంటూ జాతీయ మీడియాను ప్రశ్నిస్తూ మంత్రి ఆర్కే రోజా మంగళవారం ‘ఎక్స్’లో (ట్వీట్) పోస్టుచేశారు. ‘ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళలను కించపరిచిన మానవమృగం బండారును ఎందుకు ప్రశ్నించరు?’.. అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. బండారు వంటి పురుషాహంకారం కలిగిన వారు, వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోషించాలని కలలుగనే ప్రతి అమ్మాయి స్వప్నం సాకారం కాకుండా దెబ్బతీస్తారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పోస్టును ఆమె ఇండియా టీవీ, ఎన్డీటీవీ, సీఎన్ఎన్ న్యూస్18, రిపబ్లిక్ టీవీ ఛానళ్లను ట్యాగ్ చేశారు. ‘అన్ని రంగాల్లో మహిళలు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నా బండారు సత్యనారాయణ వంటి కొంతమంది మానవమృగాల మధ్యయుగం నాటి ఆలోచనలు మారలేదు. నా వ్యక్తిత్వంపై పాశవికంగా దాడిచేస్తూ.. నన్ను కించపరుస్తూ అత్యంత దారుణమైన నిరాధారమైన ఆరోపణలు నాపై చేశారు’.. అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. -
బండారు సత్యనారాయణ వ్యాఖ్యలకు మహిళా లీడర్లు స్ట్రాంగ్ కౌంటర్
-
తాగుడేందుకు.. వాగుడేందుకు.. బాత్రూంలో దాక్కున్న బండారు..
-
బండ బూతుల బండారు అరెస్ట్.. టీడీపీ నేతలు బెదిరింపులు..
-
పీఎస్‌లో బండారు.. విచారిస్తున్న పోలీసులు..
-
బండ బూతుల ‘బండారు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అంటే ఆ పార్టీలోనే ఓ విధమైన వణుకు, జంకు. ఆయన నోరు అలాంటిది. ఎవరినైనా వినలేని, రాయలేని అత్యంత భాషలో తిట్టడం ఆయన నైజం. ఆయనకు వచ్చిన ఒకే ఒక్క విద్య బూతులే అని టీడీపీ నేతలే అంటుంటారు. బండారు బూతు పురాణం ఆయన కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకునేలా ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే.. ఎవరినైనా కనీస విచక్షణ లేకుండా జుగుప్సాకరంగా మాట్లాడతారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిని అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, సభ్యత, విచక్షణ మరిచి ఆయన లక్ష్యంగా చేసుకున్న వారిపై బూతులతో విరుచుకుపడుతుంటారు. తన తప్పుల్ని ఎత్తిచూపిన ప్రతి వారిపైనా బూతులు లంఖించుకుంటారు. అందుకే ఆయన్ను ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా బూతుల సత్యనారాయణ అని అంటుంటారు. మంత్రిగా వెలగబెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రి, మంత్రి రోజాపైనా ఇటీవల నోరు పారేసుకున్నారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకొనేలా చేశాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, యావత్ మహిళాలోకం మండిపడ్డాయి. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: అనుచిత వ్యాఖల కేసులో బండారు అరెస్టు మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల బండారు సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి రోజాపై రాయలేని వీలు లేని భాషలో జుగుప్సాకరమైన పదాలను ఉపయోగిస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. రోజా బతుకు ఎవరికి తెలీదని అన్నారు. బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారని, అవన్నీ తమ దగ్గర ఉన్నాయని, ఆమె బతుకు బయటపెట్టకూడదని వాటిని రిలీజ్ చేయలేదన్నారు. బజారు మనిషని నోరు పారేసుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిపై కూడా తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. బండారు అరెస్ట్‌పై హెబియస్ కార్పస్.. హైకోర్టు తిరస్కరణ సాక్షి, అమరావతి: మంత్రి రోజానుద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సోదరుడు సింహాద్రిరావు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. బండారు వ్యాఖ్యల వ్యవహారంపై గుంటూరు అరండల్‌పేట, నగరపాలెం పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి అరెస్ట్ చేసేందుకు విశాఖ జిల్లా వెన్నలపాలెంలోని బండారు ఇంటికి గుంటూరు పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తితో పాటు టీడీపీ హంగామా సృష్టించారు. పోలీసులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో బండారు సోదరుడు సింహాద్రిరావు హైకోర్టును ఆశ్రయించారు. హౌస్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఈలోపు పోలీసులు బండారుకు నోటీసులిచ్చారు. చట్టప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పూర్తిచేశారు. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు సిద్ధమవుతున్న దశలో హైకోర్టు రిజిస్ట్రీకి ఓ సమాచారం అందింది. సత్యనారాయణమూర్తి విషయంలో పోలీసులు సీఆర్పీసీ చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిసింది. దీంతో పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించి, ఆ విషయాన్ని పిటిషనర్ న్యాయవాదికి తెలిపినట్లు సమాచారం. -
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు
అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి ఆర్కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. వెన్నెలపాలంలో బండారు స్వగృహంలో బండారును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. 400/2023, 41 (A), 41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు గుంటూరు నుండి రాగా, చాలా సేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్నారు బండారు. ఎట్టకేలకు తలుపులు బ్రేక్ చేసి బండారును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న బండారును గుంటూరు తీసుకెళుతున్నారు పోలీసులు. -
బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా రియాక్షన్
సాక్షి, తిరుపతి: టీటీడీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్ర్యంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని, జైల్లో ఆయన దీక్ష చేయడమంటే గాంధీజీను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం అని చంద్రబాబును ఉద్దేశించి గతంలో ఎన్టీఆర్ అన్నారని రోజా గుర్తు చేశారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుంది చంద్రద్రబాబు నిరాహార దీక్షను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నాయకుల దొంగ నిరాహార దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. కోటి సభ్యత్వం అంటున్న టీడీపీకి కంచాలు మోగించడానికి జనాలు ముందుకు రాలేదని విమర్శించారు. 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు. చదవండి: పద్మనాభం పీఎస్ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు తిరుపతిలోని శిల్పారామంలో స్వాతంత్ర్య పోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్‌కు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ఆర్కే రోజా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ..‘దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీ జయంతి రోజు ట్రిబ్యుట్ వాల్‌కు శంకుస్థాపన చేస్తున్నాం. దేశం మొత్తం మీద 75 చోట్ల నిర్మాణం చేయాలని ప్రధాని చక్ర విజన్ ఫౌండేషన్ కోరారు. ఏపీలో మూడు చోట్ల ట్రిబ్యూట్ వాల్ నిర్మాణం చేస్తున్నాం. మహనీయుల గొప్పతనం గురించి స్మరించుకునేలా ఈ నిర్మాణం జరగబోతుంది. ప్రతి జిల్లాలో యువత, విద్యార్థులు సందర్శించాలి. దేశానికి పవర్ ఫుల్ శక్తి యువత. వీళ్ళు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చారు’ అని రోజా పేర్కొన్నారు. -
బండారు సత్యనారాయణ పరిస్థితి కూడా అదే...
-
టిడిపి నేత బండారు సత్యనారాయణ అరెస్ట్..!?
-
బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని లేఖ
-
దేశంలో మహిళా మంత్రికి దక్కే గౌరవం ఇదేనా : RGV
-
ఇలాంటి సమయంలో కూడా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానట్లేదు: ఎమ్మెల్యే పార్థసారధి
-
బీచ్‌రోడ్డులో మాజీ మంత్రి కుమారుడి హల్చల్
-
మద్యం మత్తులో మాజీ మంత్రి కుమారుడి హల్చల్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించిన ఘటన విశాఖలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలనాయుడు కొందరు స్నేహితులతో కలిసి కారులో ఆదివారం తెల్లవారుజామున ఆర్కే బీచ్ రోడ్డులో వెళుతున్నాడు. ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అదుపు తప్పి బీచ్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చంద్రకిరణ్, గౌతమ్ అనే యువకులు గాయపడడంతో వారిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో చంద్రకిరణ్ తలకు తీవ్ర గాయమైంది. మాజీ మంత్రి తనయుడు, అతని స్నేహితులు సెకండ్‌షో సినిమా చూసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. అప్పలనాయుడు మద్యం తాగి కారు నడిపాడని, కారులో ప్రయాణిస్తున్న వారిలో మాజీ డీఐజీ ఎస్.వెంకటేశ్వరరావు కుమారుడు మౌర్య కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్థానికులు అప్పలనాయుడుకు దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. వాహనానికి ఒక వైపు నంబర్ ప్లేట్ మాయం కావడంపై అనుమానిస్తున్నారు. -
యాభై ఏళ్ల తర్వాత...
సాక్షి ‘ఫన్డే’ జూన్ 22వ తేదీ సంచిక తిరగేస్తున్నాను. ‘తపాలా’ ఫీచర్ కింద ‘అయ్యో పాప’ శీర్షికన ఓ జ్ఞాపక శకలం... కింద పాలపర్తి ధనరాజ్ అన్న పేరు చూసి, ఉలిక్కిపడ్డాను. విషయం చదివాక, ‘వాడే వీడు’ అని నిర్ధారణైంది. యాభై ఏళ్ల క్రితం కలిసి హైస్కూల్లో చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. మాట్లాడదామంటే కాంటాక్ట్ నంబర్ లేదు. వెంటనే సాక్షి మిత్రుడు లక్ష్మణ్ గుర్తొచ్చాడు. ఎలాగైనా వాడి నంబర్ తెలుసుకుని చెప్పమన్నాను. కాసేపటికి ఎస్సెమ్మెస్ చేశాడు. అరక్షణం ఆలస్యం చేయకుండా ధనరాజ్‌తో అరగంటపైగా మాట్లాడాను. పాలకొల్లులో వాడి ఐదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెల్లెళ్లు, వాళ్లమ్మ, నాన్నగార్లతో నాకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నాను. క్షీరారామం, పాలకొలను, పాలకొల్లు... యాభయ్యవ దశకం చివరి వత్సరాలు... రెండు గోపురాలు- పెద్ద గోపురం చిన్నగోపురం- శైవం, వైష్ణవం... రెండే థియేటర్లు... రత్నం టాకీసు, లీలామహల్ (ఇప్పుడు దాసరి పిక్చర్ ప్యాలెస్)... ఎం.ఎం.కె.ఎన్.ఎమ్. హైస్కూలు... బాల్యమిత్రులు దాసరోడు, పినిశెట్టోడు, బండారోడు, గాదిరాజోడు, ఉలిసేవోడు, వంగావోడు పద్మశ్రీలు, భారతరత్నాలకంటే గొప్ప పిలుపులు... చదువుల్లో, కళల్లో పోటీ! స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక, అర్ధ శతాబ్ది పాటు ఒకళ్ల గురించి మరొకళ్లకి తెలీదు. కాలచక్రం ముందుకు దూసుకుపోతూ ఒక్కసారి మాకోసం వెనక్కి తిరిగిందనిపించింది. మా స్నేహానికి ఇంకో ఎడబాటు కలగకూడదని ఒట్టేసుకున్నాం. తెగిపోయిన మా స్నేహ బంధాన్ని మళ్లీ కలిపిన ‘సాక్షి’కి మనసారా కృతజ్ఞతలు. - బండారు సత్యనారాయణ, హైదరాబాద్ -
‘చదువు - సంస్కారం’
తపాలా: ‘చదువు - సంస్కారం’ అని విన్నప్పుడు చదువు ఉంటే సంస్కారముంటుందని, చదువు లేకపోతే సంస్కారముండదని చాలామంది భావిస్తుంటారు. నేనూ అలానే భావిస్తూ ఉంటిని. కానీ నేను కర్నూల్ జిల్లా ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన, చదువు లేకపోయినా మంచి సంస్కారముండే వ్యక్తులుండవచ్చని రుజువు చేసింది. ప్యాపిలి నేషనల్ హైవేలోని ఒక చిన్న గ్రామం. అక్కడ కొంతమంది హమాలీలు, వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక కట్ట కట్టించుకున్నారు. వారు ఆ కట్టమీద కూర్చుని ఉంటారు. ఏదైనా లారీ వస్తే, అందులోని మూటలు దించటానికి పోతారు. వారి పని అయిపోయిన తర్వాత, మళ్లీ వచ్చి ఆ కట్టమీద కూర్చుని ఇంకొక లారీ కోసం ఎదురుచూస్తుంటారు. రోజూ సాయంత్రం మేం కూడా కొంతమంది లెక్చరర్లు అక్కడికి చేరి, ఆ కట్టమీద కూర్చుని కొంతసేపు మాట్లాడుకుని పోయేవాళ్లం. ఒకరోజు నేను మామూలుగా పోయే టైమ్ కంటే కొంచెం ముందుగా ఆ స్థలానికి వెళ్లాను. అప్పటికే ఆ కట్టమీద ఒక ముసలివాడైన హమాలీ కూర్చుని ఉన్నాడు. వస్తున్న నన్ను గమనించి, తన భుజంపైనున్న టవల్‌తో తన పక్కనున్న స్థలాన్ని శుభ్రం చేశాడు. నన్ను చూసి, ‘‘రండి సార్, రండి కూర్చోండి’’ అన్నాడు. నేను వెళ్లి కూర్చున్నాను. ఇక ఆ హమాలీ అక్కడి నుంచి లేచి పోబోయాడు. ‘‘మీరూ కూర్చోండి’’ అన్నాను నేను. అతడు ‘‘వద్దులెండి సార్, నేను సారా తాగాను. మీకు వాసనొస్తింది, మీకు సరిపోయేల్లేదు కదా, మీరు ఇక్కడ కూర్చోండి. ఏదో కొంతసేపు కూర్చునిపోయేవాళ్లు మీరు, అంతసేపు నేను దూరంగా అక్కడ కూర్చుంటాలే’’ అంటూ దూరంగా వెళ్లిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. బహుశా ఆయన ఏ బడికీ వెళ్లి ఉండడు. పైగా ఆ కట్ట వాళ్లు చందాలు వేసి కట్టించుకున్నది. దానిపైన నేను కూర్చోవటానికి, తాను ముఖం తుడుచుకునే టవల్‌తో శుభ్రం చేసి, నన్ను కూర్చోమని, తాను తాగి ఉండటం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని తాను దూరంగా వెళ్లిపోవటమా! ఎంత సంస్కారం! కొంతమంది బాగా చదువుకొన్నవారు, పెద్ద ఉద్యోగాలు చేసేవారు ఇతరుల ఇబ్బందిని గమనించక, సిగరెట్లు తాగి, పొగను ఇతరుల ముఖాలపైకి దర్జాగా వదులుతుంటారు. బస్సుల్లో స్త్రీలకోసం కేటాయించబడిన సీట్లలో కూర్చుని ఉంటారు. ఒక వృద్ధుడు నిలుచుని ఉన్నా, దర్జాగా కాలుమీద కాలేసుకొని కూర్చునే కుసంస్కారం యువతకు అలవడరాదు. చదువు ఒక్కటే సరిపోదు, తగిన సంస్కారం ఉండాలి. సంస్కారముంటే చదువు లేకపోయినా పర్వాలేదు. చదువు - సంస్కారం రెండూ ఉంటే మరీ మంచిది. అలాంటివాళ్లే కావాలి ఈ సంఘానికి. - రాచమడుగు శ్రీనివాసులు అనంతపురం