
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై సినీనటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి రోజాకు పలువురు ప్రముఖులు అండగా నిలవగా, తాజాగా రమ్యకృష్ణ సైతం స్పందించారు. ‘మంత్రి రోజాని మాజీ మంత్రి బండారు అసభ్యంగా దూషించడం దారుణం.మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం. అలాంటి దేశంలో ఓ మహిళ పై ఇంత నీచంగా మాట్లాడతారా?, బండారు సత్యనారాయణని క్షమించకూడదు.
— Ramya Krishnan (@meramyakrishnan) October 7, 2023
మనదేశం ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?, కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి. నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా. ఈ దేశంలో మహిళలపై రేప్ లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరం. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బండారు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు రమ్యకృష్ణ.
బండారు.. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?: నటి, ఎంపీ నవనీత్ కౌర్
Comments
Please login to add a commentAdd a comment