సాక్షి, విజయవాడ: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు.
‘‘మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు’’ అంటూ మంత్రి రోజా మండిపడ్డారు.
చదవండి: ఆ మాటలనడానికి నోరెలా వచ్చింది
‘‘మాజీ మంత్రిగా పని చేసిన బండారు చాలా నీచంగా మాట్లాడారు. నాకు ఊహతెలిసినంతవరకూ ఎవరూ ఇంతలా ఒక మహిళ గురించి మాట్లాడలేదు. తన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు.. తన ఇంట్లో ఉన్న మహిళలకు ఎలాంటి గౌరవమిస్తాడో అర్ధమైంది. మహిళల పట్ల బండారుకు ఉన్న సంస్కారమేంటో తెలుస్తోంది. మంత్రిగా ఉన్న రోజాని అంటే తప్పించుకు తిరగొచ్చని బండారు అనుకుంటున్నారు. బండారు వంటి మగవాళ్లకు బుద్ధి చెప్పడానికే నేను పోరాటం చేస్తున్నాం. అరెస్ట్ చేసి బెయిల్ వస్తే బండారు తప్పు చేయనట్లు కాదు. బండారు చేసిన వ్యాఖ్యల వల్ల మేం చాలా అవమాన పడ్డాం. చట్టాల్లో మార్పు రావాలి. టీడీపీ, జనసేన ఉన్నది దిగజారుడు రాజకీయాలు చేయడానికే’’ అని ఆర్కే రోజా నిప్పులు చెరిగారు.
‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి
Comments
Please login to add a commentAdd a comment