టీడీపీ దుశ్శాసన పార్టీ  | RK Roja Fires On TDP Leader Bandaru Satyanarayana | Sakshi
Sakshi News home page

టీడీపీ దుశ్శాసన పార్టీ 

Published Wed, Oct 4 2023 4:49 AM | Last Updated on Wed, Oct 4 2023 7:10 AM

RK Roja Fires On TDP Leader Bandaru Satyanarayana - Sakshi

మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెడుతున్న మంత్రి ఆర్కే రోజా

ఒక మహిళపై టీడీపీ నేత బండారు అభ్యంతరకర ఆరోపణలు చేస్తే లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటు. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పారీ్టకి జాతీయ అధ్యక్షుడు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే.. ఇలాంటి వారున్న టీడీపీకి మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? 

తిరుపతి రూరల్‌/సాక్షి అమరావతి: విశ్వ­వ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు దూసు­కెళ్తున్న నేటి రోజుల్లో ఇంకా పాతకాలం నాటి సంకుచిత ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బండారు సత్య­నా­రా­యణ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకు­రాలు, మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశిస్తూ నీచాతి నీచంగా విమర్శించడంపై సభ్య సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతు­న్నాయి. అయినా, టీడీపీ అధిష్టానం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పైగా.. అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆయన అరెస్టును తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తోంది.

మహిళలంటే టీడీపీకి ఇంత చిన్నచూపా అని మహిళాలోకం ప్రశ్నిస్తోంది. ఇంతలా స్త్రీలను కించపరుస్తున్న ఆ పార్టీ నేతలను కట్టడి చేయకుండా ఇంకా ప్రోత్సహించేలా వ్యవహరించడం ఏమిటని నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో.. తనకు ఎదురైన అవమానంపై మంత్రి రోజా మంగళవారం తిరుపతి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసత్య ఆరోపణలు, విమర్శలతో మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న టీడీపీ దుశ్సాసన పార్టీ అని ఆమె ఘాటుగా విమర్శించారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహిళా లోకాన్నే అవమానించేలా మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యక్తిగత విమర్శలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..

బ్లూ ఫిలిమ్స్‌లో నటించింది అంటూ నన్ను టార్చర్‌ చేస్తున్నారు.. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు.. కానీ, ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్‌ను జడ్జ్‌ చేయడానికి? మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది. దమ్ముంటే సీడీలను ప్రజల్లోకి విడుదల చేయాలి. నాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదు.

లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్యనారాయణ అరెస్టును ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా? మహిళపై అభ్యంతరకర ఆరోపణలు చేస్తే బండారు కుటుంబం, టీడీపీ ఖండించకుండా ఆయనకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు. ఎన్టీయార్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు. లోకేశ్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవడం బ్రాహ్మణి మానుకుని జగన్న చేస్తున్న అభివృద్ధిని స్వాగతించాలి. 

మహిళలంటే టీడీపీలో చిన్నచూపు..
టీడీపీ అంటే దండుపాళ్యం పార్టీ.. తెలుగు దొంగల పార్టీ, తెలుగు దుశ్శాసన పార్టీ. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలి అని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే.. మహిళలంటే అంత చిన్నచూపు చూసే టీడీపీలో మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? మహిళలు రాజకీయాల్లోకి రావటమే తప్పు అన్నట్లు దండుపాళ్యం నేతలు ఒళ్లు బలిసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నా.. మహిళా సాధికారితకు పాటుపడుతున్నా.

మహిళలను కానీ, మా నాయకుడు జగనన్నను కాని విమర్శిస్తే ఊరుకోను. ఇలాంటి దిగజారుడు విమర్శలతో తన గొంతు నొక్కాలని ప్రయత్నించినా ఊరుకోను. బండారును వదిలిపేట్టేది లేదు. అతనిపై పరువునష్టం దావావేసి న్యాయపోరాటం చేస్తా. ఇక నగరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా నా పనితీరుపై చర్చకు రావాలి. ధమ్ముంటే నా నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి చూడండి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. అంతేగానీ.. చేతకాని దద్దమ్మల్లాగా ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దు.

మానవమృగం బండారు ఆకృత్యాలను సమర్థిస్తారా?
– జాతీయ మీడియాను ప్రశ్నిస్తూ రోజా ‘ఎక్స్‌’లో పోస్ట్‌
పురుషాధిక్య ప్రపంచంలో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన మానవమృగం టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణను సమర్థిస్తారా? అంటూ జాతీయ మీడియాను ప్రశ్నిస్తూ మంత్రి ఆర్కే రోజా మంగళవారం ‘ఎక్స్‌’లో (ట్వీట్‌) పోస్టుచేశారు. ‘ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళలను కించపరిచిన మానవమృగం బండారును ఎందుకు ప్రశ్నించరు?’.. అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.

బండారు వంటి పురుషాహంకారం కలిగిన వారు,  వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోషించాలని కలలుగనే ప్రతి అమ్మాయి స్వప్నం సాకారం కాకుండా దెబ్బతీస్తారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పోస్టును ఆమె ఇండియా టీవీ, ఎన్డీటీవీ, సీఎన్‌ఎన్‌ న్యూస్‌18, రిపబ్లిక్‌ టీవీ ఛానళ్లను ట్యాగ్‌ చేశారు. ‘అన్ని రంగాల్లో మహిళలు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నా బండారు సత్యనారాయణ వంటి కొంతమంది మానవమృగాల మధ్యయుగం నాటి ఆలోచనలు మారలేదు. నా వ్యక్తిత్వంపై పాశవికంగా దాడిచేస్తూ.. నన్ను కించపరుస్తూ అత్యంత దారుణమైన నిరాధారమైన ఆరోపణలు నాపై చేశారు’.. అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement