సాక్షి, తిరుపతి: టీటీడీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్ర్యంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు.
బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని, జైల్లో ఆయన దీక్ష చేయడమంటే గాంధీజీను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం అని చంద్రబాబును ఉద్దేశించి గతంలో ఎన్టీఆర్ అన్నారని రోజా గుర్తు చేశారు.
సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుంది
చంద్రద్రబాబు నిరాహార దీక్షను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నాయకుల దొంగ నిరాహార దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. కోటి సభ్యత్వం అంటున్న టీడీపీకి కంచాలు మోగించడానికి జనాలు ముందుకు రాలేదని విమర్శించారు. 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు.
చదవండి: పద్మనాభం పీఎస్ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
తిరుపతిలోని శిల్పారామంలో స్వాతంత్ర్య పోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్‌కు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ఆర్‌కే రోజా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ..‘దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీ జయంతి రోజు ట్రిబ్యుట్ వాల్‌కు శంకుస్థాపన చేస్తున్నాం.
దేశం మొత్తం మీద 75 చోట్ల నిర్మాణం చేయాలని ప్రధాని చక్ర విజన్ ఫౌండేషన్ కోరారు. ఏపీలో మూడు చోట్ల ట్రిబ్యూట్ వాల్ నిర్మాణం చేస్తున్నాం. మహనీయుల గొప్పతనం గురించి స్మరించుకునేలా ఈ నిర్మాణం జరగబోతుంది. ప్రతి జిల్లాలో యువత, విద్యార్థులు సందర్శించాలి. దేశానికి పవర్ ఫుల్ శక్తి యువత. వీళ్ళు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చారు’ అని రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment