దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నందున ఆమె పార్థివదేహాన్ని వెలికితీసి ఎందుకు పరీక్షించకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్‌కే గాక తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.