సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో ఇవాళ హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిగింది. పిటిషన్ల విచారణ సందర్భంగా.. ఓ ఎస్సై స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేయడం గమనార్హం. తిరుపతి లోకేష్ అనే వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు. ఈ విచారణకు ఎస్సై జానకీ రామయ్య హాజరు కాగా, ఆయన స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసింది.
‘‘ఐదో తేదీనే 41 నోటీస్ ఇచ్చి లోకేష్‌ను వదిలేశాం. బెయిల్ షూరిటీల విషయంలో ఏడో తారీఖు రావాలని చెప్పాం’’ అని ఎస్సై జానకి రామయ్య కోర్టుకు తెలిపారు. అయితే.. లోకేష్ 5వ తేదీన బయటకు వెళ్లి ఇంటికి రాలేదని, పోలీసులు అతన్ని అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో.. లోకేష్‌ను సోమవారం ఉదయం పదిన్నర గంటలకల్లా తమ ముందు హాజరు పర్చాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ ను సీల్డ్ కవర్ లో సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే.. జింకల రామాంజనేయులు కేసులో కూడా సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించాలని ఆదేశించింది.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధులైన జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి-వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాజాభాషాలను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ వాళ్ల కుటుంబ సభ్యులు ఆరు హెబియస్ కార్పస్ పిటిషన్లను దాఖలు చేశారు.
ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
Comments
Please login to add a commentAdd a comment