Vasantha Krishna Prasad
-
దేవినేని ఉమా, ఎమ్మెల్యే వసంత కృష్ణ వర్గీయులు రచ్చ రచ్చ
-
నీకు నిజంగా దమ్ముంటే.. వసంత కృష్ణ ప్రసాద్ కి జోగి రమేష్ సవాల్
-
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వీరప్పన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దొంగకోళ్లు పట్టేవాడికి, టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు తేడా లేదని.. మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణ ప్రసాద్‌ను మైలవరం వీరప్పన్‌గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్నా వసంత కృష్ణప్రసాద్‌కు కమీషన్లు ఇవ్వాలి’’ అంటూ దుయ్యబట్టారు.‘‘గతంలో కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడనే నేను మైలవరానికి ఏనాడూ రాలేదు. వసంత కృష్ణప్రసాద్‌కు మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘‘పర్వతనేని ఇంటి ముందు సీటు కోసం అబ్బా కొడుకులు తిట్టుకుని, కొట్టుకున్నారు. ఎన్ని పుస్తకాలు రాసినా మీ చరిత్రకి సరిపోవు. సిగ్గుమాలిన, సంస్కారం లేని కుటుంబం మీది. వసంత కృష్ణప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతాం’’ అని జోగి రమేష్ హెచ్చరించారు.జగన్, జోగి రమేష్ ఫోటోలు చూస్తే భయమా? బ్యానర్లు తీసేయమని అధికారులకు చెబుతున్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడిని ఒప్పిస్తా.. నువ్వు కూటమికి రాజీనామా చెయ్యి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా మైలవరంలో పోటీచేద్దాం... సిద్ధమా?. రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్సార్సీపీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 2027 తర్వాత కృష్ణ ప్రసాద్ చాప, దిండు సర్దుకుని వెళ్లిపోతాడు’’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
వారిని వదిలిపెట్టను.. జోగి రమేష్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేసులకు భయపడను.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉన్నా.. నా మీదకు రాకుండా.. నా కుమారుడిపై కేసు పెట్టారు. ఈ రోజుతో అయిపోదని గుర్తు పెట్టుకోండి’’ మాజీ మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. బుధవారం.. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకోండి. నా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.మంచి మనసున్న నేత వైఎస్ జగన్. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా.. ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు. రావాల్సిన బిల్లులన్నీ రాగానే పార్టీ మారిపోయాడు’’ అంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ మండిపడ్డారు.‘‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు. మా మోచేతి నీళ్లు తాగి.. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే కారు కూతలు కూస్తున్నాడు. ఇక పై జగనన్న గురించి మాట్లాడితే తాటతీస్తాం. కేసులకు మేం భయపడం.. మా వాళ్లజోలికి వస్తే చూస్తూ ఊరుకోం’’ అని జోగి రమేష్ చెప్పారు.‘‘జనవరిలో మైలవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించుకుందాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. ఈ రోజు ఓడిపోయాం.. కానీ మళ్లీ వైఎస్ జగన్‌ని సీఎంగా చేసుకుందాం. ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చింది. 2027లో ఎన్నికలు రాబోతున్నాయ్.. మళ్లీ గెలిచేది మనమే’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.బ్లేడు బ్యాచ్ అంటూ... వసంత వెంకటకృష్ణప్రసాద్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పారీ్టలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్‌తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు. ఏం చేస్తాడో స్పష్టత లేదు... మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
కలసిన చేతులు.. కలవని మనసులు
జి.కొండూరు: వారిద్దరూ ఐదేళ్లుగా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. సభ్యత మరిచి నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీ నాయకుల య్యారు. వారే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ ఇద్దరూ ఇప్పుడు చేతులు కలిపారు. తమ వర్గం నాయకులను కూడా కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వసంత నామినేషన్ కార్యక్రమంలోనూ కలసి చేతులు ఊపారు. అందరం కలసి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తామంటూ గొప్పలు చెప్పారు. ఇదంతా పైకి కనిపిస్తున్న వ్యవహారం. అంతర్గతంగా మాత్రం రెండు వర్గాలు కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. కలసి పనిచేయడం అన్న మాట అటుంచి ఒకరిపై మరొకరు నమ్మకమే ఉంచలేకపోతున్నారు.వెంటాడుతున్న వెన్నుపోటు భయంమైలవరం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి వసంత వెంకటకృష్ణప్రసాద్, టీడీపీ నుంచి దేవినేని ఉమా పోటీ చేశారు. ఉమా ఓటమిపాలవగా వసంత ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత ఎన్నికలు వచ్చేసరికి వసంత కృష్ణప్రసాద్ టీడీపీ గూటికి చేరారు. అతను టీడీపీలో చేరడాన్ని, ఎమ్మెల్యే టికెట్ పొందడాన్ని దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతర పరిణామాల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారిద్దరూ చేతులు కలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఉమా వర్గం, వసంత వర్గం కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. ఉమా వర్గాన్ని వసంత వర్గమే కాదు టీడీపీ కేడర్ కూడా నమ్మలేకపోతోందని సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు కలసి పనిచేస్తున్నట్లు నటిస్తున్నా ఓటు వేసే సమయానికి ఉమా వర్గీయులు వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం వసంతను వెంటాడుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది.ఉమా వర్గీయులపై నిఘాఉమా వర్గీయులపై నమ్మకం ఉంచలేని వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల్లో పని చేసే రెండు వేల మంది ఉద్యోగులను రంగంలోకి దింపారు. వారితో ఉమా వర్గంపై నిఘా ఉంచారని, అంతటితో ఆగకుండా ప్రచారం నుంచి డబ్బు పంపిణీ వరకు అన్ని పనులు ఆ ఉద్యోగులే చక్కబెట్టేందుకు సిద్ధమ య్యారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వసంత తీరును జీర్ణించుకోలేని ఉమా వర్గీయులు అతనితో కలిసి పనిచేయలేమని తమ నాయకుడి వద్ద వాపోతున్నారని సమాచారం.మళ్లీ ఇన్చార్జులే దిక్కా?వసంత వెంకటకృష్ణప్రసాద్ స్థానికుడు కాదు. వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. దీంతో మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అస్తిత్వం గందరగోళంలో పడింది. ఒక వైపు ఉమా వర్గీయులు, మరో వైపు ఆయన వ్యతిరేకులు, ఇంకో వైపు వైఎస్సార్ సీపీ నుంచి వసంతతోపాటు టీడీపీలో చేరిన చిన్నాచితకా నాయకుల వర్గంగా టీడీపీ విడిపోయింది. ఈ మూడు వర్గాల పోరుతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో తెలియక, ఎవరికి బాధ్యతలు ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనన్న భయంతో వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల నుంచి ఉద్యోగులను దింపి పెత్తనమంతా వారికే అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వసంత, స్థానికులను కాదని మండలానికి ఒక ఇన్చార్జ్ని నియమించి పార్టీలో వర్గ పోరుకు కారణమయ్యారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో వసంత తీరును చూసిన టీడీపీ కేడర్, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మళ్లీ ఇన్‌చార్జులతోనే పాలన చేస్తాడేమోనని ఆందోళనచెందుతోంది.మద్యం కేసులో ఉమా వర్గీయులు‘సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు కష్టం మాది, కేసులు మాకు, పెత్తనం మీకా?’ అంటూ ఉమా వర్గీయులు కుమిలిపోతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెలంగాణ నుంచి భారీగా మద్యం తరలిస్తూ పట్టుబడిన చేబ్రోలు రాజు, మరో నలుగురు నిందితులు సైతం ఉమా వర్గానికి చెందిన నాయకులే. పట్టుబడిన మద్యంతో తనకు ఎటువంటి సంబంధంలేదని వసంత తప్పుకోవడంతో ఉమా వర్గీయులు మరింత ఆవేదన చెందుతున్నారని సమాచారం. కావాలనే మద్యం రవాణా, పంపిణీ వంటి అసాంఘిక కార్యకాలపాలను తమకు అప్పజెప్పి పెత్తనం మాత్రం వసంత అనుచరులు, ఆయన కంపెనీల ఉద్యోగులు చేస్తున్నారని ఉమా వర్గీయులు రగిలిపోతున్నారు. ఐదేళ్లు తమ నాయకుడికి జరిగిన అవమానంతో పాటు తమకు నియోజకవర్గంలో ఎదురవుతున్న క్షోభకు తగిన బుద్దిచెప్పాలని ఉమా వర్గీయుల్లో చర్చ జరుగుతోందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. -
ప్రలోభాల పన్నాగం
జి.కొండూరు: టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే నాయకులను తన వైపు తిప్పుకునేందుకు తాయిలాలు ఎరవేస్తున్న వసంత, ఓటర్లను సైతం ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో డబ్బు పంపిణీ చేసేందుకు 2వేల మంది తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులను రంగంలోకి దింపిన వసంత, ఇప్పుడు మద్యాన్ని సైతం పంపిణీ చేసేందుకు తన అనుచరులు, కార్యకర్తలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి మద్యం బాటిళ్లను రవాణా చేస్తూ వసంత వెంకటకృష్ణప్రసాద్ అనుచరులు ఐదుగురు ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు పట్టుబడ్డారు.దొరికారు ఇలా..మైలవరం నియోజకవర్గంలోకి భారీగా తెలంగాణ మద్యం సరఫరా అవుతోందని ఉన్నతాధికారుల సమాచారం మేరకు మైలవరం డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి. భార్గవ నేతృత్వంలో ఎస్ఈబీ సీఐ నాగవవల్లి, మైలవరం డీటీపీ ఎస్ఐ ఎల్. రమాదేవి, ఎస్ఐ సుబ్బిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మైలవరం మండల పరిధి అనంతవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రధాన అనుచరుడు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలు విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులు మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ ఐదుగురు నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనంలో తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి తరలిస్తున్న 150కేస్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రెడ్డిగుంటలో భారీ డంపు స్వాధీనం..ఈ ఐదుగురు నిందితులను విచారించిన అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటలోని చేబ్రోలు కృపారాజుకి చెందిన మామిడితోటలో భారీగా డంపు చేసిన 250కేస్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మామిడితోట యజమాని చేబ్రోలు కృపారాజు సైతం వసంతకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడు చేబ్రోలు రాజుకి బంధువు కావడం గమనార్హం.అన్న క్యాంటీన్ నడుపుతున్న నిందితుడు..ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలలో ఒకడైన చేబ్రోలు రాజు రెండేళ్లుగా మైలవరంలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావుకి ప్రధాన అనుచరుడిగా ఉన్న రాజు, వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆయన పంచన చేరి మద్యం సరఫరా బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మద్యం బాటిళ్లను డంపు చేసిన మామిడితోట సైతం రాజు బంధువు చేబ్రోలు కృపారాజుకు చెందినది కావడం, ఆయన కూడా వసంతకు ప్రధాన అనుచరుడు కావడం, పట్టబడిన మిగిలిన నలుగురు నిందితులు కూడా టీడీపీ కార్యకర్తలు కావడంతో వసంత వెంకటకృష్ణ ప్రసాదే ఈ మద్యంను డంపు చేయిస్తున్నారు అనడానికి బలం చేకూరింది.మద్యం విలువ రూ.30లక్షలు..పట్టుబడిన మద్యం విలువ రూ.30లక్షలు ఉంటుందని మైలవరం డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి. భార్గవ విలేకరుల సమావేశంలో తెలిపారు. మద్యం రవాణా చేస్తున్న రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులను ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనం, 150కేస్లు మద్యం బాటిళ్లు, డంపు చేసిన మరో 250కేస్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికలలో ఈ మద్యం బాటిళ్లను పంపిణీ చేసేందుకే తెలంగాణ నుంచి నియోజకవర్గంలోకి తీసుకొస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. -
గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
-
తాయిలాల ఎర
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రజాక్షేత్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే, ప్రతిపక్ష టీడీపీలో మాత్రం నైరాశ్యం నెలకొంది. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినా నేతలకు స్పందన కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తిలో ఉన్న టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులకు ఎర వేసి, వారిని తమవైపు తిప్పుకొనేందుకుప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా గన్నవరం, గుడివాడ, మైలవరం, తిరువూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లోనూ డబ్బుతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలు చేజారిపోకుండా నోట్ల కట్టలతో బేరం పెడుతున్నారు. మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరికి ఎదురుగాలి వీస్తుండటంతో కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలకు తాయిలాలు ఇచ్చి తమ వైపు తిప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు. ప్రచారంలోనూ డబ్బు పంపిణీ విజయవాడ వెస్ట్ నియోజక వర్గంలో ప్రచారంలో తొలిరోజే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వినూత్న మార్గాన్ని ఎంచుకొన్నారు. హారతి ఇస్తే రూ.వెయ్యి, కొబ్బరికాయలు కొడితే రూ.వెయ్యి అంటూ మహిళలకు తాయిలాల ఎర వేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా అభ్యర్థులకు హారతి ఇవ్వడం తంతుగా మారింది. గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు కూడా ఇదే తరహాలో డబ్బు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.500, చికెన్, మటన్ భోజనాలు, పార్టీ జెండాలు మోసిన వారికి విచ్చల విడిగా మద్యం బాటిళ్లు పంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రచారంలో పెయిడ్ ఆర్టిస్ట్ లను ఏర్పాటు చేసుకొన్నారని తెలుస్తోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్ డబ్బునే ఆయుధంగా ఎంచుకొన్నారు. గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే గన్నవరంలో టీడీపీ అభ్యరి్థ యార్లగడ్డ వెంకటరావు గ్రామ కమిటీల ద్వారా ఇళ్ల స్థలాలు ఇస్తామని దర ఖాస్తులు స్వీకరించి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ద్వితీయ శ్రేణి నాయకులకు వల వైఎస్సార్ సీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నానికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌తోపాటు టాటా ట్రస్ట్ ద్వారా సేవలు అందించిన మంచి పేరుంది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ప్రచారానికి ప్రజా స్పందన లేకపోవడంతోపాటు అసంతృప్తితో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను ప్రలోభాలుపెడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. నాయకుని స్థాయిని బట్టి డబ్బు ముట్టజెప్పి, పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజక వర్గాలో వారి స్థాయిని బట్టి ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బు పంపిణీ పూర్తి చేశారు. మైలవరం నియోజక వర్గంలో నేతలంతా తమ వెంటే ఉన్నారని చెప్పుకొనేందుకు వసంత కృష్ణ ప్రసాద్ తంటాలు పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నేతలు ఎవ్వరూ ఆయనకు మద్దతుగా లేకపోవడంతో, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బులతో గాలం వేస్తున్నారు. విజయవాడ వెస్ట్‌లో సుజనాచౌదరి సైతం ద్వితీయ శ్రేణి నాయకులపై ఫోకస్ పెట్టి, తాయిలాల పంపిణీ చేసి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మొత్తం మీద కూటమి అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తుండటంతో, ఓటర్లను, ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. -
‘ఈ ఎన్నికలు.. టీడీపీకి చావుబతుకుల సమస్య’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ సీటుపై సందిగ్ధత వీడలేదు. ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికలు చాలా కీలకమని, టీడీపీకి చావు బతుకుల సమస్య అంటూ కార్యకర్తల సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు. నాకు మద్దతివ్వండి.. నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు. నేను, దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే ధీటుగా పని చేస్తా. నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి. టీడీపీకి చావు బతుకుల సమస్య’’ అంటూ వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు, స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ శ్రేణులు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి. స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు. ఇదీ చదవండి: ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు -
మైలవరం టీడీపీలో రచ్చ రచ్చ.. బొమ్మసాని బల ప్రదర్శన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీలో లోకల్ ఫైట్ ముదురుతోంది. స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ శ్రేణులు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి. స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు. నిన్న ఇబ్రహీంపట్నంలో బొమ్మసానికి టిక్కెట్ ఇవ్వాలంటూ ప్రజా పాదయాత్ర నిర్వహించగా, నేడు గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ చేపట్టారు. నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ నినాదాలు చేశారు. ప్రజల మద్దతు తనకే ఉందంటూ చంద్రబాబుపై బొమ్మసాని ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ మైలవరం టీడీపీలోని అసమ్మతి నాయకులందరూ ఒకటవుతున్నారు. గతంలో దేవినేని ఉమాకు వ్యతిరేకంగా బొమ్మసాని సుబ్బారావు టికెట్ తనకే కావాలంటూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తనకే టికెట్టు ఇవ్వాలంటూ పలుమార్లు అధిష్టానాన్ని కోరారు. దేవినేని ఉమాతో కలవకుండా ప్రత్యేక వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలో చేరడం, టికెట్టు హామీ దక్కడంతో, ఈ రెండు వర్గాలు ఒక్కటై కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను జయప్రదం చేసే విధంగా పనిచేస్తామని ప్రకటించారు. వసంత కృష్ణ ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. -
ఏ మోహం పెట్టుకుని వసంత టీడీపీలోకి వెళ్తున్నారు: కేశినేని నాని
-
టీడీపీలోకి వసంత ఎంట్రీ మూడు ముక్కలుగా విడిపోయిన మైలవరం టీడీపీ
-
వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైలవరం టీడీపీ రాజకీయాలు గందరగోళంగా మారాయి. టిక్కెట్టు లేదని దేవినేని ఉమాకు చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆయనకు మైలవరం నియోజక వర్గం టిక్కెట్టుపై ఆశలు మాత్రం చావలేదు. ఏదో పని కలి్పంచుకొని మైలవరం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏదో అనారోగ్యంతో సాధారణంగా చనిపోయిన, దేవినేని ఉమాకు టిక్కెట్ రాకపోవడంతో బాధతో గుండె ఆగిపోయిందని ప్రచారం చేసుకొనే స్థాయికి ఆయన దిగజారారు. మొదటి నుంచి శవ రాజకీయాలు చేయడంలో స్పెషలిస్టుగా పేరున్న దేవినేని ఉమా చివరి యత్నంగా శవరాజకీయ అ్రస్తాన్ని బయటికి తీశారు. ఇది నియోజక వర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దేవినేని ఉమా చీప్ ట్రిక్స్ చూసి, నియోజక వర్గ ప్రజలు సైతం నవ్వుకొంటున్నారు. వసంత వర్గంలో కల్లోలం.... అధిష్టానం పిలిచి మాట్లాడినప్పటికీ దేవినేని ఉమా పోకడలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వసంత వెంకటకృష్ణప్రసాద్ కోటరీలో కల్లోలం మొదలైంది. దేవినేనికి మైలవరం ఎమ్మెల్యే సీటు లేదంటూ గత ఆదివారం న్యూస్ వైరల్ అయిన రోజున మైలవరం మండలం, చండ్రగూడెంకు చెందిన టీడీపీ కార్యకర్త పుల్లారావు, సోమవారం ఇబ్రహీంపట్నంకు చెందిన నూతక్కి సురేష్‌లు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఈ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దేవినేని ఉమాకి సీటు రానందుకే మృతి చెందారని చిత్రీకరించి వీరిద్దరి కుటుంబాలను దేవినేని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమా అనుచరులు వసంత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన వైరల్ కావడంతో కల్లోలానికి గురైన వసంత వెంకటకృష్ణప్రసాద్ తన అనుచరుల చేత ఉమా శవరాజకీయాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. చండ్రగూడెంకు చెందిన పుల్లారావు అనారోగ్యంతోనే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న ఆడియోలను సైతం వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా ఉమ కుటుంబ చరిత్రను సైతం టచ్ చేసి ఆయన సోదరుడు రమణ మరణానంతరం వదిన ప్రణీతను చంపింది దేవినేని ఉమానేనంటూ, ఇటీవల మృతి చెందిన ఉమా సోదరుడు చంద్రశేఖర్ మృతికి సైతం పరోక్ష కారణం ఉమానే అంటూ సోషల్ మీడియాలో వసంత వర్గీయులు పోస్టులు పెట్టడం కలకలం రేపింది. ఆది నుంచి రాజకీయ శత్రువులే.. మెలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమానుకాదని, వసంత కృష్ణ ప్రసాద్‌కు సీటు కేటాయించడం అక్కడ టీడీపీ క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా, దేవినేని ఉమా మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేడన్న భావన టీడీపీ క్యాడర్లో నెలకొంది. వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరకముందే. సోషల్‌మీడియా వేదికగా వస్తున్న పోస్టులు, వారి మధ్య సాగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే టీడీపీ పుట్టి మునగడం ఖాయమని భావిస్తున్నారు. నోటా ఓటు వేయాలని.... వసంత వెంకటకృష్ణప్రసాద్పై టీడీపీ అధిష్టానం సోమ, మంగళవారాల్లో సర్వే జరిపింది. వసంతకు నో చెబుతూ నోటాకే తమ ఓటు అనేలా టీడీపీ కేడర్‌ను దేవినేని ఉమా వర్గీయులు సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వసంతకు ఎదురుదెబ్బ
-
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు లీగల్ నోటీసు
-
ఎప్పటికీ జగన్ వెంటే ఉంటా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తాను ఎప్పటికీ సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. అనివార్య కారణాలవల్ల నియోజకవర్గంలో తాను కొంతకాలంగా చురుగ్గా లేనని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేశారన్నారు. తన మనసు సహకరించకపోతే తన పని తాను చేసుకుంటూ పోతానే తప్ప పార్టీ మారబోనన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తనను పిలిపించి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై తనకు స్పష్టతనిచ్చారన్నారు. మరో వారం రోజుల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానన్నారు. టీడీపీకి లోకేశ్ పెనుభారం లోకేశ్ పాదయాత్ర టీడీపీకి పెనుభారమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇక ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టీడీపీని ఏ విధంగా దొంగిలించాడో అదే రీతిలో మాజీమంత్రి దేవినేని ఉమా కబ్జాల సంస్కృతి నేర్చుకున్నాడని వసంత ఆరోపించారు. పార్టీ కార్యాలయం కోసం వృద్ధ మహిళ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన ఉమా.. రూ.300 కోట్లపై చిలుకు ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.20 కోట్లు తీసుకుని ఎన్నికల్లో ఖర్చుచేశాడన్నారు. గుంటుపల్లికి చెందిన ఒక నాయకుడి వద్ద రూ.7 కోట్లు, కొండపల్లికి చెందిన మరో వ్యక్తి వద్ద రూ.5 కోట్లు, మూర్తి అనే కాంట్రాక్టర్ వద్ద రూ.3 కోట్లు తీసుకున్నాడని, మరో ఇద్దరి వద్ద రూ.50లక్షల చొప్పున తీసుకుని తిరిగి చెల్లించలేదని, పైగా వాళ్ల ఫోన్లు కూడా ఎత్తడంలేదని వసంత చెప్పారు. -
మైలవరానికి దేవినేని ఉమా చేసింది శూన్యం : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
-
ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్ష పార్టీల ఆరాటం
-
సంక్షేమ పథకాల వల్లే పరిషత్ ఎన్నికల్లో విజయం
-
మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు: ఎమ్మెల్యే వసంత
-
టీడీపీలో ‘విద్యార్హతల’ చిచ్చు!.. పట్టాభిరాంపై ఫైర్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్లు ఆ పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా కార్యాలయంలో మీడియా ఎదుట కూర్చుని ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ పార్టీని, నాయకులను బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (కేపీ) విద్యార్హత గురించి తీవ్ర పదజాలంతో పదే పదే ప్రస్తావించడం పార్టీకి తలవంపులు తెచ్చేవిధంగా ఉందని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పట్టాభి తీరు చూస్తుంటే తమ విద్యార్హతలను కూడా ఏదో విధంగా తెరపైకి తెచ్చి అందరి నోళ్లలో నానేలా చేయాలనే దురుద్ధేశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. సెల్ఫ్ గోల్.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విద్యార్హత గురించి అంతగా గుచ్చి గుచ్చి మాట్లాడటమంటే పరోక్షంగా ఎంపీ కేశినేని నానిని ఎద్దేవా చేయడమేనని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. ఎంపీ విద్యార్హత కూడా పదో తరగతే. తన ఎన్నికల అఫిడవిట్లో పది పాస్ అయినట్లు పేర్కొన్నారు. అంతేకాదు బొండా ఉమామహేశ్వరరావు ఎనిమిదో తరగతి పాస్ అయినట్లు చూపారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకటేశ్వరరావు (వెంకన్న) అయిదు వరకు చదివినట్లు పేర్కొన్నారు. టీడీపీకే చెందిన పెనమలూరు, కైకలూరు మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జయమంగళ వెంకటరమణలు పదో తరగతి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎనిమిది వరకు చదివినట్లు వారి ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా తెలిపారు. టార్గెట్ కేశినేని! తమ ఎంపీ కేశినేని నాని, నగరంలోని ఇతర సీనియర్ల విద్యార్హతలను పరోక్షంగానైనా తెరపైకి తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ విధంగా విమర్శలు చేసినట్లు స్వపక్షీయులు అభిప్రాయపడుతున్నారు. క్వారీ రగడ గురించి మాట్లాడటం, అందులో లోపాలను ఎత్తిచూపడం వరకు అభ్యంతరం లేదంటున్నారు. పట్టాభి తీరువల్లే లోకేశ్ చదువు గురించి తాజాగా చర్చనీయాంశంగా మారిందంటున్నారు. అధికార ప్రతినిధిగా బాధ్యతలను పార్టీ అప్పగిస్తే దాన్ని స్వపక్షీయుల మీదే తన వ్యక్తిగత రాజకీయ విభేదాలకు వాడుకుంటున్నారని, దీనిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎంపీ వర్గీయులతో పాటు సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం. ‘అతను ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో, ఏయే వ్యవహారాలు ఎలా చక్కబెట్టాడో మాకు తెలియకేమీ కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. లెక్కలన్నీ సరిపోతాయి’ అని కేశినేని ముఖ్య అనుచరుడు ‘సాక్షి’వద్ద అభిప్రాయపడ్డారు. -
టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు . కొండపల్లి మైనింగ్‌పై టీడీపీ నేత పట్టాభి ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలను నిజం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 1993లో ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్‌పై లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారన్నారు. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉందని, ఎప్పటినుంచో ఉందనడానికి ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంటే, వైఎస్ హయాంలో 143 సర్వే నెంబర్ సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. దేవినేని ఉమా ఏడాదిన్నరగా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. -
దేవినేని ఉమా అబద్ధాలకు ఎల్లోమీడియా వత్తాసు పలుకుతోంది : వసంత కృష్ణప్రసాద్
-
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో స్ట్రెయిట్ టాక్
-
టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా
-
దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
అక్రమ మైనింగ్ చేసింది టీడీపీ వాళ్లే
సాక్షి, అమరావతి: అక్రమ మైనింగ్ పేరుతో తనపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. టీడీపీలో ఉంటేనే కమ్మ కులంగా ఎల్లో మీడియా భావించడం దుర్మార్గమన్నారు. దేవినేని ఉమా ఆరోపిస్తున్న మైనింగ్ జరిగిన ప్రాంతం అటవీ భూమా? రెవెన్యూ భూమా? నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. అటవీభూమి అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్, శ్రీధర్‌తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనుమతులిచ్చింది వాళ్లే ‘ఇవి రెవెన్యూ భూములని, వీటికి సర్వే నంబర్లు కేటాయించాలని టీడీపీ హయాంలో జేసీ విజయకృష్ణన్ నివేదిక ఇచ్చారు. ఇవి రెవెన్యూ భూములు కాదని దేవినేని ఉమా రద్దుచేయించి, తరువాత కేఈ కృష్ణమూర్తితో స్టే ఇప్పించారు. సర్వేనంబర్ 143లో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నుబోయిన రాధాకు లీజు అనుమతి ఉంది. ఇదే సర్వేనంబర్‌లో 2016 డిసెంబర్ 4న దేవినేని ఉమా ఆ క్రషర్‌ను ప్రారంభించాడు. ఈ సర్వేనంబర్‌లో 105 ఎకరాలు డాక్టర్ సుదర్శన్‌రావుకిచ్చారు. ఇవి అటవీ భూములంటూ దేవినేని హైడ్రామా చేస్తున్నాడు. 15 సార్లు క్వారీ భూముల వద్దకు వెళ్లాడు. నాకు సంబంధం లేకున్నా అక్రమ మైనింగ్ చేస్తున్నానంటూ సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నాడు. డాక్టర్ సుదర్శన్‌రావు రాయల్టీలు చెల్లించినా లీజు పునరుద్ధరించలేదు. 20 ఏళ్ల కిందట జరిగిన మైనింగ్ అంతా కృష్ణప్రసాద్ చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా భయపడం’ అని కృష్ణప్రసాద్ అన్నారు. -
చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్: వసంత కృష్ణ ప్రసాద్
-
చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్: వసంత కృష్ణ ప్రసాద్
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్ జరిగిందని మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారులను బెదిరించి అప్పటి రెవెన్యూ మంత్రి ద్వారా లీజులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో కొండ పోరంబోకు భూములుగా రికార్డుల్లో మార్చారని దుయ్యబట్టారు. తనపై దేవినేని ఉమ అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, దేవినేని ఉమాకు ఎల్లోమీడియా వత్తాసు పలుకుతోందని ఆయన ధ్వజమెత్తారు. ‘‘ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టికెట్లు తెచ్చుకున్నవారు ఆయనపైనే చెప్పులు వేశారు. టీడీపీలో లేకుంటే కమ్మ కులస్తులు కాదా?. దేవినేని ఉమాను సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారు. అక్కడున్నవి రెవెన్యూ భూములా..? ఫారెస్ట్ భూములా? తేల్చాలి. అబద్ధపు ప్రచారాలను ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలని’’ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హితవు పలికారు. -
దేవినేని ఉమా డ్రామాలాడుతున్నారు: వసంత కృష్ణ ప్రసాద్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డ్రామాలాడుతున్నాడని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వల్లే అనర్థాలు జరిగాయని మండిపడ్డారు. దేవినేని ఉమా అధికారంలో ఉన్నప్పుడు రెవిన్యూ భూములని, ఇప్పుడు ఫారెస్ట్ భూములని ఆరోపిస్తున్నాడాని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ఉమా చూస్తున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమా దౌర్జన్యాలు, డ్రామాలు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. ‘ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నాడు. దేవినేని ఉమాను ప్రశ్నిస్తే దాడి అంటాడు. తూర్పు, పడమర తెలియని వ్యక్తి లోకేష్. ఉమా వెకిలి చేష్టలతో టీడీపీ కార్యకర్తలే విసిగిపోయి ఎదురుతిరుగుతున్నారు. తెలుగు దేశం పార్టీ కాదు.. పక్కా తెలుగు దొంగల పార్టీ. 2014 నుంచి ఎలా క్వారీ జరిగిందో అన్నీ లెక్కలు తీస్తాం. అక్రమ మైనింగ్ చేసిందెవరో నిగ్గు తేల్చి ప్రజల ముందుపెడతాం’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. -
దేవినేని ఉమ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
-
ఎన్ని సోడాలు కొట్టి ఎమ్మెల్యే అయ్యావో చెప్పు ఉమా..?
సాక్షి, మైలవరం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైలవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవినేని ఉమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయాల్లోకి రాకూడదంటూ ఉమా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. గతంలో రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్కి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు టీడీపీ ఎందుకు టికెట్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న ఉమా.. ఎన్ని సోడాలు కొట్టి ఎమ్మెల్యే అయ్యాడో చెప్పాలని నిలదీశారు. నీ వదిన చావుకు కారణం నువ్వే అని ప్రజలందరూ అనుకుంటున్నారు, దీనికి సమాధానం ఏంటి. చెరువు మాధవరంలో సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోలేని నువ్వు, రాజకీయాలు చేయడం మానుకుంటే మంచిదని వసంతకృష్ణప్రసాద్ హితవుపలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విమర్శించడం నీలాంటి పనీ పాటా లేని వాళ్లకు అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు. కోవిడ్ పరీక్షల విషయంలో కానీ.. కోవిడ్ నియంత్రణలో కానీ.. తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. గొల్లపూడిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దిశా యాప్ ఆవిష్కరణ చేయడం ఆనందకరమని, మహిళలంతా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. -
దేవినేని ఉమపై సోదరుడు చంద్రశేఖర్ వ్యంగ్యస్త్రాలు
సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమాపై ఆయన సోదరుడు చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తన సోదరుడు ఉమాకు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని దేవినేని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో మంగళవారం మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంపుడుగత్తెలా వ్యవహరస్తున్నాడని నిప్పులు చెరిగారు. టీడీపీ ఇచ్చిన 650 హామీల్లో అయిదు హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే అన్ని వర్గాలకు సంక్షేమం అందించారన్నారు. చదవండి: వల్లభనేని సవాల్.. దేవినేని ఉమ హైడ్రామా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ రాజకీయ నాయకులని భుజాలు చరుచుకునే చంద్రబాబు.. పేదలకు ఎన్ని పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు ఒకేసారి లక్షలాది మందికి పట్టాలు ఇస్తుంటే కన్నుకుట్టి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతల ఉత్తర ప్రగల్బాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం విచారణ జరిపించాలని దేవినేని చంద్రశేఖర్ కోరారు. చదవండి: ‘ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నాం’ టీడీపీ నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ప్రజలందరికీ తెలుసు అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. పోలీసులు ఎలాగూ ధర్నా చేయనివ్వరని తెలిసి గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చి దేవినేని ఉమా డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పతకం అమలువుతున్నప్పుడు వెంటనే ప్రభుత్వం బురదజల్లడానికి తెలుగుదేశం పార్టీ తయారవుతుందని ధ్వజమెత్తారు. గొల్లపూడిలో నిన్న 3648 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. చూసి ఓర్వలేక దేవినేని ఉమ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. దేవినేని ఉమకు చిత్తశుద్ధి ఉంటే.. పత్రికా ముఖంగానైనా లేదా ఒక టీవీ స్టూడియోకి వస్తే చర్చకు రావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. పోలీసులు ఎలాగూ అడ్డుకుంటారని తెలిసి తెలిసి రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గొల్లపూడిలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని దేవినేని ఉమా మాట్లాడుతున్నారని, ‘ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం, గొల్లపూడి లబ్ధిదారులను పిలిపించి సమావేశం పెడదాం.. మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా..’ అని దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. -
అది ఆ మహనుభావుల భిక్షే: సుచరిత
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రపంచ దేశాల్లో బానిసత్వం ఉంటే.. మన దేశంలో అంటరానితనం చూశామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమించారని, దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్, జగ్జీవన్రామ్లు ఆనాడే పునాదులు వేశారని తెలిపారు. ‘‘నేడు మా లాంటి వారు పదవులు అనుభవిస్తున్నారంటే, దానికి ఆ మహనుభావుల భిక్షే కారణం. అంబేద్కర్ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.. కానీ చేతల్లో చూపించే వారుండరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. (చదవండి: హక్కులను పోరాడి సాధించుకోవాలి: సుచరిత) పథకాల ద్వారా లబ్ధిపొందే వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. సీఎం చేపట్టిన పథకాల వలన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనే మహత్తర కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. డిసెంబర్ 25న దాదాపు 30 లక్షలకు పైగా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజలందరి బాగు కోరుకుంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్’’ అని పేర్కొన్నారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మంత్రి సుచరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: చంద్రబాబుకు బాధ్యత లేదు: శ్రీరంగనాథరాజు) -
పనికి మాలిన ప్రేలాపనలు మానేయ్
సాక్షి, కృష్ణా జిల్లా: మాజీ మంత్రి దేవినేని ఉమా నోరు తెరిస్తే తప్పుడు మాటలేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జక్కంపూడిలో ప్రజలు ప్రశ్నించినా ఆయనకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ‘‘తప్పుడు కేసులు అంటూ పిచ్చిపట్టిన వాడిలా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు నాతో సహా, నా తండ్రి మీద, నా ప్రచార రథం డ్రైవర్‌తో పాటు అనేక మందిపై తప్పుడు కేసులు, సస్పెక్ట్ షీట్లు పెట్టించింది నువ్వు కదా. పచ్చ చొక్కా సీఐ సూరిబాబును అడ్డం పెట్టుకుని నీవు చేసిన అరాచకాలు మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం. కానీ నీలా ఎక్కడైనా ఒక్క తప్పుడు కేసు పెట్టించిన దాఖలాలు లేవు. (చదవండి: ఆమె ఆరోపణలు నిరాధారం..) పోలవరం కాలువ మట్టి, గ్రావెల్, నీరు-చెట్టు, ఇసుక, మద్యం అన్నింటిలో దోపిడీకి పాల్పడ్డావు. 15 నెలల నా పాలన గురించి ప్రతి నిత్యం పనికి మాలిన పోస్టులు, పిచ్చి పట్టిన వాడిలా ప్రేలాపనలు చేస్తున్నావు. నీకు జక్కంపూడిలో సరైన సమాధానం చెప్పినా బుద్థి రాలేదని’’ ఆయన ధ్వజమెత్తారు. 2024 ఎన్నికలే తనకు గీటురాయి అని, అభివృద్ధి చేసి చూపించి ప్రజల్లోకి వెళ్తానని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా తమ వాలంటీర్ల వ్యవస్థ పార్టీల రహితంగా ప్రజల కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. (చదవండి: చెమ్మచెక్క ఆడుతున్నావా? మంత్రి అనిల్ ఫైర్) -
హాస్యాస్పదంగా ఉంది
-
నువ్వేమైనా మైసూర్ మహారాజువా: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందేలా చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులు వాడుకున్న విద్యుత్‌కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని శుక్రవారం పునరుద్ఘాటించారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులను కరెంట్ విషయంలో ఇబ్బందులకు గురిచేసిందని.. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయన హయాంలో రైతులను మానసికంగా హింసించి ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమంపై దృష్టి సారించారని తెలిపారు. మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ.. కుల, మత, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తూ.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని తెలిపారు.(చదవండి: పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరాలెందుకు?) దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు తనపై విమర్శలకు దిగిన టీడీపీ నేత దేవినేని ఉమాకు కొడాలి నాని ఈ సందర్భంగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘దేవినేని ఉమా చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. నువ్వేమైనా మైసూర్ మహారాజువా..?. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు.. వాటిని ఈయన కడిగేవాడు. చంద్రబాబే పెద్ద భిక్షగాడు.. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టడమేంటి? నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్’’ అంటూ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఆయన వల్లే తాను మంత్రిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. (చదవండి: రైతులకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమే) ‘‘పథకాలను అటకెక్కించిన ఘనత చంద్రబాబుదే. డబ్బులు కట్టలేదని కరెంటు మీటర్లు పీకించిన ఘనత ఆయనదే. ఆయన ప్రభుత్వం పెట్టిన బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించాం. అలాంటి వ్యక్తి చెబుతున్న అబద్ధాలకు ఎల్లోమీడియా వంత పాడుతోంది’’అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హాస్యాస్పదంగా ఉంది: వసంత కృష్ణప్రసాద్ ఉచిత విద్యుత్ గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని.. ఇప్పడు చంద్రబాబు, దేవినేని ఉమా చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. బాబు హయాంలో క్వారీలకు దేవినేని ఉమా అనుమతులు ఇప్పించారని.. త్వరలోనే టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలన్నింటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు ఏపీకి వచ్చారన్న వసంత కృష్ణప్రసాద్.. మంగళగిరిలో లోకేశ్ ఎందుకు ఓడిపోయారో చెప్పగలరా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
చంద్రబాబు ప్రవాసనేతలా మారారు
-
చంద్రబాబు ప్రవాసనేతలా మారారు
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రవాస నేతగా తయారయ్యారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అవినీతి, హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు.. ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే మాత్రం హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ర్టానికి ఏమీ ఉపయోగపడలేదని కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి ఉపయోగపడిందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు తన కుమారుడిని సైతం గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి టీడీలు నేతలు అడ్డుకుంటున్నారని, పేదలకు మంచి చేస్తుంటే కూడా ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. సీబీఐ విచారణకు తాను సిద్ధమని, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమా సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సూటిగా ప్రశ్నించారు. (కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’) -
‘వారికి వారే అభినందించుకునే దుస్థితి ఏర్పడింది’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ జనరల్ బాడీ తీర్మానాలు దిగజారుడు తీర్మానాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనరల్ బాడీ మీటింగ్‌లో టీడీపీ నేతలు దీక్షలు చేసినందుకు వారికి వారే అభినందనలు తెలుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.వారు చేసే దొంగ దీక్షలకు వారికి వారే అభినందించుకునే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. (‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాము రాసిన లేఖల వల్లే ప్రజలకు మేలు జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు భజన కోసమే టీడీపీ జనరల్ మీటింగ్‌ను ఆన్లైన్లో పెట్టారని విమర్శించారు. అధికారం పోయినా భజన చేయించుకోవాలనే యావ టీడీపీ నేతలకు, బాబు ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. రిటైర్ఢ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పెన్షన్ చెల్లిస్తామని చెబితే తన లేఖ వల్లే ఇది జరిగిందని పచ్చి అబద్దాలు చెపుతున్నారని ధ్వజమెత్తారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని, గుజరాత్ నుంచి మత్స్యకారుల్ని ప్రభుత్వం తీసుకువస్తే దానితో చంద్రబాబుకు ఏమిటి సంబంధం? అని పేర్కొన్నారు. అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు బయటకు వస్తే వారివల్ల కూడా కరోనా వ్యాపించిందని, ప్రజలకు సాయం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల వల్లే కరోనా వైరస్ వ్యాపించిందని తప్పు పడుతున్నారని ధ్వజమెత్తారు. (బాబు భయపెడుతుంటే.. జగన్ భరోసా కల్పిస్తున్నారు) హైదరాబాద్‌లో హెరిటేజ్ ఉద్యోగులకు కరోనా వ్యాపించడానికి కారణం ఎవరంటే చంద్రబాబు ఇంతవరకూ సమాధానం చెప్పలేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాగా కరోనాపై పోరాటానికి మద్దతు పలుకుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుద్దాం.. అన్న ఒక వాక్యం కూడా టీడీపీ జనరల్ బాడీ తీర్మానంలో లేదన్నారు. రాష్ట్ర ఆదాయంలో లోటు మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దమన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదని, కంటికి కనిపించని వైరస్‌తో జరుగుతున్న యుద్ధంలో రాజకీయాలు పక్కన పెడదామన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు మండిపడ్డారు. అన్ని వర్గాల కోసం డిమాండ్ చేస్తున్నట్లు డ్రామా ఆడితే, దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనమని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
‘ఆయన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనాను ఐక్యమత్యంతో ఎదుర్కోవాల్సిన సమయంలో దేవినేని ఉమా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే తాడేపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రం విపత్తులో ఉన్న సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటుంటే టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ రోజు అయినా ఉమా ప్రజలు గురించి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. (టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు.. ) టీడీపీ నేతలు ప్రజలను కరోనాపై భయాందోళనకు గురిచేస్తున్నారని, ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదు భరోసా అని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కరోనా పోరాటంలో కలిసి రాకపోగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, ప్రజలకు ధైర్యం చెప్పకపోగా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవి పోయి దేవినేని ఉమాకు పిచ్చి పట్టిందని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉమా జిల్లాకు ఏం చేశారని నిలదీశారు. కొడాలి నాని గురించి మాట్లాడుతున్న ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్ మంత్రి చేశారని ప్రశ్నించారు. (మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్! ) ‘మరొక ఏడాదిలో మళ్ళీ నేను మంత్రి అవుతానని దేవినేని ఉమా అందరికి చెపుతున్నాడంటా. ఆయనను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి. దేవినేని నెహ్రూ ఇంట్లో కాపీలు మోసుకుంటూ పీఏ గా పని చేసిన వ్యక్తి ఉమా. మంగళగిరి పేరు పలకని వ్యక్తి లోకేష్‌ను ఐటీ మంత్రిగా చంద్రబాబు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడాలనేది టీడీపీ ఉద్దేశ్యం. ప్రజలు ఇబ్బంది పడితే రాజకీయాలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం. కరోనా విషయంలో సీఎం జగన్ సూచనలను ప్రధాని మోదీ పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉంది’. అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. (‘దేవినేని ఉమాకు మతి భ్రమించింది’) -
‘దేవినేని ఉమాకు మతి భ్రమించింది’
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నల మాదిరిగా తాము సంస్కార హీనంగా మాట్లాడలేమని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక టీడీపీ నేతలు వెకిలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో గెలవలేమని అర్థమయిన టీడీపీ నేతలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దేవినేని ఉమా పిచ్చి ఆస్పత్రిలో చేరుతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమాను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తాము టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విమర్శలు చేయగలమని.. కానీ తమకు సంస్కారం ఉందని పేర్కొన్నారు. గౌరవం, మర్యాద అనేది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుంటుం సొంతమని తెలిపారు. -
బడుగులకు ఇంగ్లిష్ కావాలి
ఇంగ్లిష్ భాషను నేర్చుకోవటం అంటే, తెలుగు భాషను వదిలేయమని అర్థం కాదు. ఇంగ్లిష్‌లో మాట్లాడటం అంటే, తెలుగులో మాట్లాడొద్దు అని ఆదేశించటమూ కాదు. తెలుగు కావాల్సిందే. కానీ ఇంగ్లిష్ కూడా తప్పనిసరిగా కావాలి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధన అత్యంత అవసరం. సమాజం ఆధునికత వైపు పరిగెడుతున్నప్పుడు, సరళీకరణ విధానాలు చేతివేళ్ళ సందుల్లోకి వచ్చి చేరుతున్నప్పుడు, స్వదేశంలోకి విదేశీ భాషలు వస్తున్నప్పుడు, ఇంగ్లిష్ భాషలో విశ్వవ్యాపిత గుర్తింపు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పుడు మాతృభాషకు భంగం కలుగకుండానే ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడంలో తప్పేంటి. మాతృభాషా ప్రేమికులు, తెలుగు భాషాభిమానులు, శత సహస్రావధానులు, తెలుగు పీఠాధిపతులు ఇంగ్లిష్ విద్య పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయటం సహజమే. కానీ వారి పిల్లలు ఏ భాషలో చదువుతున్నారో తెలియపర్చాలి. ఇంగ్లిష్ భాషను వంట పట్టించుకోకుండా రాణిస్తున్నారో లేదో తెలియజేయాలి. అన్ని రంగాలలోవలే ప్రభుత్వ సెక్టారు తగ్గి, ప్రయివేట్ సెక్టారు వృద్ధి చెందుతున్న యుగం ఇది. అరచేతిలో ఆధునికతను గట్టిగా పట్టుకొని బతికేస్తున్న కాలం యిది. ఒకరి ఇష్టాయిష్టాలతో పనిలేకుండానే వ్యవస్థలన్నీ ఇంటి గుమ్మాల్లోకి వచ్చేశాయి. పగలు రేయి తేడా లేకుండా ఆధునిక వ్యవస్థల్లో సమస్త జనులు బతకక తప్పటం లేదు. ఆ వ్యవస్థలను అధ్యయనం చేయకుండా, అలాంటి వ్యవస్థలతో పోటీ పడకుండా విద్యావ్యవస్థల మనుగడ సాధ్యమా అలాంటి పోటీ తత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆంగ్లమాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనాలు లేవా? సర్కారు బడులంటే బడుగుల బడులు అని అర్థం. ప్రయివేట్ స్కూళ్ళు అంటే బడుగులు కానివారి, పై వర్గాలకు చెందినవారి పాఠశాలలు అని అర్థం. ఇప్పటి వరకూ సర్కారీ బడుల్లో తెలుగు భాషే ప్రామాణికం. ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమమే ప్రామాణికం. అంటే బడుగులు కాని పైవర్గాలకు చెందినవారి బిడ్డలు ఇంగ్లిష్‌లో విద్యాభ్యాసం చేస్తుంటే, బడుగుల పిల్లలు మాత్రమే తెలుగు భాషలో విద్యనభ్యసిస్తున్నారన్న విషయం కాదనని వారు లేరు. అయితే, సమాజంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు, గుర్తింపు ఏ భాషలో ఉన్నాయి స్వదేశీ ప్రమాణాలు, విదేశీ ప్రయాణాలు, స్వదేశీ విదేశీ కొలువులు ఏ భాషా ప్రాతిపదికన మెండైన అవకాశాలు దొరుకుతున్నాయి. తెలుగు ఒక్కటే నేర్చుకోవటం వల్ల దేశ, విదేశాలలో అవకాశాలు నేటి తరానికి వస్తాయా పోనీ, తెలుగు భాషాసంయుక్త రాష్ట్రాలలో ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే నడుస్తుందా ప్రభుత్వాలు యిచ్చే జీవోలు, సర్కులర్లు, ఆదేశాలు తెలుగులోనే ఇస్తున్నారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు, కోర్టు తీర్పులు, వాదోపవాదాలు తెలుగు మాధ్యమంలోనే జరుగుతున్నాయా, తెలుగు భాషలోకి మనకి తెలియకుండానే ఇంగ్లిష్ భాష పరకాయ ప్రవేశం చేయలేదా అచ్చమైన తెలుగు పదాలకు స్వస్తి చెప్పి ఇంగ్లిష్ మాటలను మనం మాట్లాడటం లేదా ప్రతి గ్రామంలోనూ, మండల కేంద్రాలలోనూ ప్రభుత్వ పాఠశాలలు ఒకటో లేదా రెండో ఉంటే, ఇంగ్లిష్ స్కూళ్లు, కాన్వెంట్లు పదుల సంఖ్యలో ఉంటున్న మాట నిజం కాదా ఏమాత్రం ఆర్థిక పరిస్థితి సహకరించిన క్రింది కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సైతం ఇంగ్లిష్ మీడియం వైపు వెళ్ళటం లేదా, ఇంగ్లిష్ పాఠశాలల్లో చేరటం లేదా అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ భాషను ప్రవేశపెడితే వచ్చే ఇబ్బందులు ఏమిటి, ప్రయోజనం ఎవరికి, ప్రమాదం ఎవరికి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, ఇంగ్లిష్ మాధ్యమ బోధనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనిని డిమాండ్ చేయటంలో ఏ తప్పు లేదు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడమే తప్పుగా, దీనివల్ల తెలుగు భాషకు ప్రమాదం వాటిల్లుతుందని వ్యాఖ్యానాలు చేయటం, అధైర్యపడటం అర్థరహితం. తెలుగు భాషా బోధన గూర్చి బలంగా మాట్లాడుతున్న తెలుగు భాషా ప్రేమికులు ముందుగా సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమం వద్దు అని ప్రశ్నించే ముందు, అత్యధికంగా ఉన్న ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను నిలిపివేయాలని డిమాండ్ చేయవచ్చు కదా లేదా ఉద్యమించవచ్చు కదా లేదా ప్రభుత్వానికి వినతులు సమర్పించవచ్చు కదా పై వర్గాలవారి పిల్లలకు నిలయంగా ఉన్న ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను ప్రశ్నించకుండా, ప్రభుత్వ పాఠశాలల్లోని బడు గుల పిల్లలకు ఇంగ్లిష్ బోధనను ప్రశ్నించటం వెనుక మతలబు ఏమిటి? ఇది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్దం కాదా! నిజానికి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ బోధనకు ప్రాధా న్యత ఇవ్వాల్సిన అవసరం ఎప్పుడో జరగాల్సి ఉంది. అలా జరిగి ఉండి ఉంటే, ప్రభుత్వ పాఠశాలలు సైతం ఇప్పటికే ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి ఉండేవి. అలా జరగనందునే ఇంగ్లిష్ భాషపై కొంతమందికే ‘పేటెంట్ రైట్స్’ వచ్చాయి. ఇప్పటికైనా ఏపీలో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనకు జీవో తీసుకు రావటం అభినందనీయం. రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు ‘తెలుగు ఉద్దారకులు’గా ముందుకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన ప్రవేశపెట్టడాన్ని మతమార్పిడులతోను, క్రిష్టియన్ మతవ్యాప్తితోను ముడిపెట్టి ప్రభుత్వంపై నిందలు వేయటం ఏమాత్రం సరియై నది కాదు. అలాంటప్పుడు ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన క్రిష్టియన్ మతవ్యాప్తికి దోహదపడుతుందని ఒప్పుకోవాలి కూడా. ఈ చర్య వల్ల నష్టమేదైనా జరిగితే ఇంగ్లిష్ పాఠశాలలకే. ప్రయివేట్ పాఠశాలల్తో పోటీతత్వం పెరిగి ప్రభుత్వ పాఠశాలలు కూడా వృద్ధి చెందుతాయి. విద్యార్థులు రాక పాఠశాలలు మూతపడే దయనీయ దుస్థితి తొలగిపోతుంది. ఏదైనా ఒక కొత్త విధానం తీసుకువచ్చినప్పుడు సందేహాలు, అసంతృప్తులు వస్తుంటాయి. కానీ నింపాదిగా, క్షుణ్ణంగా, హేతుబద్ధంగా ఆలోచన చేస్తే, రాజకీయ కోణాలను విడనాడితే, కొత్త విధాన సత్సంకల్ప ప్రయోజనం అర్థమవుతుంది. ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను పై వర్గాలవారు తప్ప, క్రింది కులాలకు చెందినవారు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థినీ విద్యార్థులు వ్యతిరేకించటంలేదు అనే సత్యాన్ని మరచిపోవద్దు. ఆంగ్ల విద్యపై రాద్ధాంతం చేసేవారంతా వారి వారి ఇళ్ళలో, దైనందిన కార్యక్రమాల్లో ఇంగ్లిష్‌ను నేర్చుకున్న వాళ్ళే అన్న సంగతి మరువవద్దు. వ్యాసకర్త: వసంత నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ శాఖామాత్యులు మొబైల్ : 99494 11779 -
‘ఆయన నోట్లో నోరుపెడితే బురదలో రాయి వేసినట్టే’
సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం హయంలో మంత్రిగా ఉన్న ఉమ ఇరిగేషన్లో వేల కోట్లు మింగేశాడని ఆరోపించారు. నిరంతరం ఆరోపణలు చేయడం ఉమకు అలావాటని విమర్శించారు. దేవినేని ఉమ నోట్లో నోరు పెడితే బురదలో రాయి వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ పనుల్లో ఏరకంగా కమీషన్లు తీసుకున్నారో చెప్పడానికి కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో ఉమ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజలు బుద్ది చెప్పారని, రాబోయే రోజుల్లో మరింత గట్టిగా బుద్ది చెబుతారని అన్నారు. -
వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు దీక్ష
సాక్షి, తాడేపల్లి : వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారని, ఆయనకు డేరా బాబాకు ఏం తేడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం వాళ్ల ఉనికి కాపాడుకోవడం కోసమే ఆయన తన కుమారుడితో కలిసి పనికిమాలిన దీక్షను చేపట్టారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు దండుకున్న చంద్రబాబే ఇప్పుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన గురువారం పార్టీ ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, కైలే అనిల్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదలతో ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమే అయినా రాష్ట్రంలో ప్రసుత్తం లక్షా 50 వేల టన్నుల సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల భరోసా కోసమే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన బ్లూ ప్రాగ్ సంస్థ యజమాని, చంద్రబాబు సన్నిహితులని వారిద్దరు కలిసి ఒకే ఛాపర్లో తిరిగేవారని ఆరోపించారు. ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సంస్థలు చంద్రబాబుకు పిల్ల కాలువలుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. బాబు విడుదల చేసింది దొంగ చార్జీషీట్ అని దమ్ముంటే ఇసుక ఆరోపణలపై ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు. అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమానే ! చంద్రబాబుకు మతి భ్రమించి దీక్షలు చేస్తున్నారని , ఇసుకపై ఆయన చేస్తున్న దీక్ష దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమామహేశ్వరరావు అని, అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని దీక్ష చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. టీడీపీ వేసిన దొంగ చార్జీషీట్‌ను ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని , ఎన్నికల ద్వారా ప్రజలు గట్టిగా బుద్ది చెప్పినా చంద్రబాబులో ఏ మార్పు రాలేదని తెలిపారు. ఉమా విధానం నచ్చకనే ఆయన తమ్ముడు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. తెలంగాణలో కనుమరుగైనట్లే ఏపీలో కూడా టీడీపీ కనుమరుగవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే గురువారం బాబు దీక్ష నిర్వహిస్తుండగానే దేవినేని అవినాష్ వైసీపీలో చేరిన విషయాన్ని కూడా కృష్ణ ప్రసాద్ ప్రస్తావించారు. టీడీపీ నాయకులు గత ఐదేళ్ల పాలనలో అడ్డుగోలుగా ఇసుకను తిని అరిగించుకున్నారని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ దుయ్యబట్టారు. గత ఐదేళ్ళలో ఇసుక దోచుకోవడంపై పవన్‌కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒకవేళ తమ పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కేసులు పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే స్వయంగా చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనటానికి ఇదే నిదర్శనమన్నారు. -
‘ఇంటికొచ్చి కాలర్ పట్టుకొని నిలదీస్తా’
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హెచ్చరించారు. మైలవరంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మీ లాగా ఇసుక వ్యాపారం చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు బుద్ది చెప్పినా కూడా తీరు మారని దేవినేని ఉమా వెకిలి మాటాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే సరైన బుద్ది చెబుతామని, ఉనికిని కాపాడుకోవడం కోసం ఎదుటి వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకునేది లేదని మండిపడ్డారు. మరోసారి తనపై నిరాధార ఆరోపణలు చేస్తే స్వయంగా మీ ఇంటికి వచ్చి కాలర్ పట్టుకుని నిలదీస్తానని ఆయన హెచ్చరించారు. -
‘అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ ఉనికి కోసమే దిగజారుడు రాజకీయాలు చేస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో ప్రశాంత వాతావరణం నెలకొందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. డ్యూటీలో ఉన్న ఐపీఎస్ అధికారిని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు యూజ్ లెస్ ఫెలో అనడం బాధాకరమని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. -
‘ఉమా నోరు అదుపులో ఉంచుకో’..
సాక్షి, కృష్ణా : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘ఉమా నీ నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ కెమెరాలతో వరద ఉధృతిని అంచనాలు వేస్తుంటే తమపై తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడే వరదలను మ్యాన్ మేడ్ వరదలుగా అభివర్ణించటం నీకే సాధ్యమైంది. అమరావతి రాజధాని మా ప్రభుత్వ హయాంలో ఇక్కడే ఉంటుంది. లేనిపక్షంలో నేను నా పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే నువ్వు శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతావా?. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూయించాల్సిన అవసరం మాకు లేదు’’ అని స్పష్టం చేశారు. -
‘నాలుగు పంపుహౌస్‌ల్లో ఒకటే పనిచేస్తోంది’
సాక్షి, కృష్ణా జిల్లా : తారకరామా ఎత్తిపోతల పథకం పనులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. అందులో భాగంగా జి కొండూరు మండలం పినపాక, కట్టుబడిపాలెం సమీపంలో ఉన్న పంపు హౌస్‌లను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో నాలుగు పంపుహౌస్‌లు ఉంటే కేవలం ఒకటే పనిచేస్తుందని తెలిపారు. చాలా కాలంగా పనులను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మోటర్లకు మరమత్తుల చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులకు నీళ్లు అందించాల్సిన సమయంలో పంపు సెట్లు పని చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాలుగు పంపు హౌస్‌లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఆయన వెంట అధికారులు, రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు ఎత్తిపోతల పథకం పనులను సందర్శించారు. -
‘ఆయన చిల్లర రాజకీయాలు మానుకోవాలి’
సాక్షి, తాడేపల్లి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. దేవినేని రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దేవినేని ఉమ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణలను నిరూపించగలరా? ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే దేవినేని రాజకీయాలనుంచి తప్పుకుంటారా? అంటూ సవాల్ విసిరారు. గతంలో ఇసుక మాఫియాపైనే దేవినేని బతికారన్నారు. కృష్ణా జిల్లాలో దేవినేని అండతో డీగ్యాంగ్ విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. గతంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన దోపీడీపై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కడా జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో 90 ఆవులు చనిపోయాయని, దానిని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో 28 గోవులు చనిపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం గోశాల ఘటనపై విచారణ జరిపి.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. -
‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం తీరుతో సుబాబుల్ రైతులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుబాబుల్ రైతుల విషయంలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. సుబాబుల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనకు చెప్పారని తెలిపారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి వసంత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా సుబాబుల్ రైతులను దేవినేని సోమరిపోతులని విమర్శలు చేశారని మండిపడ్డారు. అదేవిధంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. సుబాబుల్ రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలో మంచి శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుబాబుల్ రైతులకు రూ.5.40 కోట్ల బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు రూ. 12, 500 ఇస్తామని సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగం మరింత విస్తరించనుందని సామినేని ఉదయభాను ఆశాభావం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్ హయాంలోనే చింతలపుడి ప్రాజెక్టు
అమరావతి: చింతలపుడి ప్రాజెక్టు పూర్తయితే మైలవరం రైతులకు మేలు జరుగుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శాసనసభలో గురువారం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయితే.. లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందుతుందని తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా మాట్లాడుతూ... రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. జగన్ ప్రభుత్వం చింతలపుడి ప్రాజెక్టు కోసం పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించారని తెలిపారు. అదే విధంగా చింతలపుడి పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అని.. చింతలపుడి ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలో ప్రారంభించారని వెల్లడించారు. గత ప్రభుత్వం చింతలపుడిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రైతులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో కూడా చంద్రబాబు సర్కార్‌లో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అదే విధంగా నీటిపారుదల శాఖలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. వెంటనే గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
దేవినేని మైలవరం నియోజవర్గం సమస్యలను నిర్లక్ష్యం చేశారు
-
పేదలందరికీ పక్కా ఇళ్లు
గొల్లపూడి(విజయవాడ రూరల్): వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. గ్రామంలో రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమం కరకట్ట, రజకపేట, ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో నిర్వహించారు. దేవినేని చంద్రశేఖర్‌తో కలసి కృష్ణ ప్రసాద్ గడప గడపకు వెళ్లి పథకాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి ఉమాకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ మాట్లాడుతూ గొల్లపూడి ప్రజల అండ చూసుకుని మైలవరం ప్రాంతంలో ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణ ప్రసాద్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, పేదలకు న్యాయం జరుగుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిక.. గొల్లపూడి మౌలానగర్కు చెందిన ముస్లింలు షేక్ రఫీ, షేక్ అతిజ, అబ్దుల్ రజాక్, ఎండీ నాయిమ్, అబ్దుల్ రెహమాన్‌లు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. గొల్లపూడి వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద వసంత కృష్ణ ప్రసాద్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కన్వీనర్ కారంపూడి సురేష్, మండల కన్వీనర్ వి.సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యులు బొల్నేడీ సౌజన్య, ఎన్.దుర్గారావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఈపూరి జయరావ్, జిల్లా అధికార ప్రతినిధి వడ్లమూడి నాని, ఎస్సీసెల్ మండల కన్వీనర్ కేతుపల్లి రాంబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెన్ను కిరణ్, లీగల్‌సెల్ ప్రతినిధి ఈపూరి నాగమల్లేశ్వరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.రవికుమార్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి గోపినాథ్ పాల్గొన్నారు. జగనన్నను ఆశీర్వదించండి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు నియోజకవర్గం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని వసంత శిరీష కోరారు. కొండపల్లి 4వ వార్డులో రావాలి జగన్ కావాలి– జగన్ కార్యక్రమంలో గురువారం నిర్వహించారు. తొలుత స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ గ్రామ కన్వీనర్ అడపా వెంకయ్యనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు కె.లక్ష్మణరావు పాల్గొన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి మైలవరం: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జగన్ అమలు చేసే నవరత్నాలతో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ పట్టణ కన్వీనర్ షేక్ కరీం తెలిపారు. మైలవరం శుద్దిపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం రావాలి జగన్– కావాలి జగన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు షేక్ రహీమ్, మైనార్టీ మడల కన్వీనర్ షేక్ నన్నేబాబు, పట్టణ కన్వీనర్ షఫీ, రవూఫ్ పాల్గొన్నారు. 21న వసంత నామినేషన్ మైలవరం: వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈనెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ కార్యాలయం గురువారం తెలిపింది. ఉదయం 8.30 గంటలకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వసంత కృష్ణప్రసాద్‌ను బలపర్చండి ఇబ్రహీంపట్నం: వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ను ఎన్నికల్లో బలపర్చాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆత్కూరు ఆంజనేయులు కోరారు. ఇబ్రహీంపట్నంలోని దివ్యా కాంప్లెక్స్ దుకాణ సముదాయంలో ఆర్యవైశ్యులను గురువారం కలుసుకుని వైఎస్సార్ సీపీ విధివిధానాలు వివరించారు. జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. జగనన్న పాలనలో వసంత కృష్ణప్రసాద్ నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఆర్యవైశ్యులు పురోభివృద్ధి సాధిస్తారనే నమ్మకాన్ని ఆయన వెలుబుచ్చారు. ఆర్యవైశ్య సమాజమంతా కృష్ణప్రసాద్‌కు అండదండలుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధికార ప్రతినిధి మేడా సాంబశివరావు, గొల్లపూడి పాండురంగదేవ్, చీమకుర్తి కల్యాణచక్రవర్తి, ఆనంద్, బచ్చు వెంకటేశ్వరరావు, పల్లపోతు బాలాజీ పాల్గొన్నారు. -
దేవినేని ఉమ అసలు బండారం బట్టబయలు..
-
దేవినేని ఉమ బండారం బట్టబయలు..
సాక్షి, మైలవరం : నిత్యం నీతులు చెప్పే ఏపీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమా అసలు బండారం బట్టబయలు అయిందని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికలు సమీపిస్తుండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పేదలను మభ్యపెట్టేందుకు తోపుడు బళ్లు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారన్నారు. అర్థరాత్రి సమయంలో లారీల్లో తోపుడు బళ్లు తీసుకొచ్చి పంపిణీ చేస్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు జారుకున్నారని ఆయన పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న దేవినేని ఉమ చేసేవి మాత్రం పనికిమాలిన పనులు...చెప్పేవి శ్రీరంగనీతులు అని ఎద్దేవా చేశారు. కాగా ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లిలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అయితే సాక్షాత్తూ మంత్రి అండతో కోడ్ ఉల్లంఘించి, తోపుడు బళ్లు పంపిణీచేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
మంత్రి ఉమా స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారు!
సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు తాయిలాలతో ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మరో మేనిఫెస్టో కమిటీ అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. కంత్రి మంత్రి దేవినేని ఉమా తనస్థాయి మరచి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, దాసరి జైరమేశ్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని పేర్కొన్నారు. టీడీపీలో రాముడి సంతతి పోయి రావణ సంతతి వచ్చిందని, టీడీపీలో అందరూ రావణులే మిగిలారని కృష్ణప్రసాద్ మండిపడ్డారు. మంత్రి ఉమా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏం చేయలేదని, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏదో చేసినట్టు ఆయన హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ళు మంత్రిగా ఉండి పేదలకు పట్టాలు ఇవ్వకుండా.. ఉమా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని, ఆయన ఓటమి తప్పదని పేర్కొన్నారు. మంత్రి ఉమాకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. -
డ్వాక్రా రుణమాఫీ ఏమైంది?