
గొల్లపూడిలో నవరత్నాల గురించి వివరిస్తున్నవసంత కృష్ణప్రసాద్, దేవినేని చంద్రశేఖర్
గొల్లపూడి(విజయవాడ రూరల్): వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. గ్రామంలో రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమం కరకట్ట, రజకపేట, ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో నిర్వహించారు. దేవినేని చంద్రశేఖర్‌తో కలసి కృష్ణ ప్రసాద్ గడప గడపకు వెళ్లి పథకాలను వివరించారు.
ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి ఉమాకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ మాట్లాడుతూ గొల్లపూడి ప్రజల అండ చూసుకుని మైలవరం ప్రాంతంలో ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణ ప్రసాద్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, పేదలకు న్యాయం జరుగుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిక..
గొల్లపూడి మౌలానగర్‌కు చెందిన ముస్లింలు షేక్ రఫీ, షేక్ అతిజ, అబ్దుల్ రజాక్, ఎండీ నాయిమ్, అబ్దుల్ రెహమాన్‌లు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. గొల్లపూడి వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద వసంత కృష్ణ ప్రసాద్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కన్వీనర్ కారంపూడి సురేష్, మండల కన్వీనర్ వి.సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యులు బొల్నేడీ సౌజన్య, ఎన్.దుర్గారావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఈపూరి జయరావ్, జిల్లా అధికార ప్రతినిధి వడ్లమూడి నాని, ఎస్సీసెల్ మండల కన్వీనర్ కేతుపల్లి రాంబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెన్ను కిరణ్, లీగల్‌సెల్ ప్రతినిధి ఈపూరి నాగమల్లేశ్వరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.రవికుమార్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి గోపినాథ్ పాల్గొన్నారు.
జగనన్నను ఆశీర్వదించండి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు నియోజకవర్గం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని వసంత శిరీష కోరారు. కొండపల్లి 4వ వార్డులో రావాలి జగన్ కావాలి– జగన్ కార్యక్రమంలో గురువారం నిర్వహించారు. తొలుత స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ గ్రామ కన్వీనర్ అడపా వెంకయ్యనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.
నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి
మైలవరం: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జగన్ అమలు చేసే నవరత్నాలతో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ పట్టణ కన్వీనర్ షేక్ కరీం తెలిపారు. మైలవరం శుద్దిపేటలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం రావాలి జగన్– కావాలి జగన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు షేక్ రహీమ్, మైనార్టీ మడల కన్వీనర్ షేక్ నన్నేబాబు, పట్టణ కన్వీనర్ షఫీ, రవూఫ్ పాల్గొన్నారు.
21న వసంత నామినేషన్
మైలవరం: వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈనెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ కార్యాలయం గురువారం తెలిపింది. ఉదయం 8.30 గంటలకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వసంత కృష్ణప్రసాద్‌ను బలపర్చండి
ఇబ్రహీంపట్నం: వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ను ఎన్నికల్లో బలపర్చాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆత్కూరు ఆంజనేయులు కోరారు. ఇబ్రహీంపట్నంలోని దివ్యా కాంప్లెక్స్ దుకాణ సముదాయంలో ఆర్యవైశ్యులను గురువారం కలుసుకుని వైఎస్సార్ సీపీ విధివిధానాలు వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. జగనన్న పాలనలో వసంత కృష్ణప్రసాద్ నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఆర్యవైశ్యులు పురోభివృద్ధి సాధిస్తారనే నమ్మకాన్ని ఆయన వెలుబుచ్చారు. ఆర్యవైశ్య సమాజమంతా కృష్ణప్రసాద్‌కు అండదండలుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధికార ప్రతినిధి మేడా సాంబశివరావు, గొల్లపూడి పాండురంగదేవ్, చీమకుర్తి కల్యాణచక్రవర్తి, ఆనంద్, బచ్చు వెంకటేశ్వరరావు, పల్లపోతు బాలాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment