సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రవాస నేతగా తయారయ్యారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అవినీతి, హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు.. ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే మాత్రం హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ర్టానికి ఏమీ ఉపయోగపడలేదని కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి ఉపయోగపడిందన్నారు.
అయినప్పటికీ చంద్రబాబు తన కుమారుడిని సైతం గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి టీడీలు నేతలు అడ్డుకుంటున్నారని, పేదలకు మంచి చేస్తుంటే కూడా ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. సీబీఐ విచారణకు తాను సిద్ధమని, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమా సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సూటిగా ప్రశ్నించారు. (కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’)
Comments
Please login to add a commentAdd a comment