devineni uma maheshwar rao
-
దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు ఏంటి..?
ఎన్టీఆర్: మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రానున్న శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు దేవినేని ఉమామహేశ్వరరావు పాటు అతని ముఖ్య అనుచరుడు గన్నే వెంకటనారాయణ ప్రసాద్(అన్నా), బొమ్మసాని సుబ్బారావుతో పాటు ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ సైతం పోటీ పడుతున్నారు. దేవినేని ఉమా మినహా ముగ్గురు ఆశావహులు తమ స్టైల్లో అంతర్గతంగా, బహిరంగంగా ప్రచారం చేస్తూ ముప్పేట దాడి చేస్తుండడంతో దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత కొన్ని నెలల క్రితం బొమ్మసాని సుబ్బారావు టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తూ నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహిండంతో పాటు శుక్రవారం నియోజకవర్గంలోని పలువురు నాయకులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదేవిధంగా గన్నె వెంకటనారాయణప్రసాద్(అన్నా) సైతం గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో సంచరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించడం, ఇటీవల నారా లోకేష్‌ని కలవడం చూస్తే తానూ మైలవరం స్థానాన్ని ఆశిస్తున్నట్లు అర్థమవుతోంది. నమ్మకం కలిగించేందుకు.. ఇదిలా ఉంటే అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో దేవినేని ఉమామహేశ్వరరావు తన అభ్యర్థిత్వం కోసం నానా యాతనలు పడుతున్నారు. తానే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని కేడర్‌కి నమ్మకం కలిగించేందుకు గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో బాబు గ్యారంటీ భవిష్యత్తు ష్యూరిటీ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమామహేశ్వరరావు కార్యక్రమానికి దూరంగా ఉండాలని పార్టీ ముఖ్య నాయకులకు ఇప్పటికే అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో దేవినేని ఉమా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకు పార్టీ కేడర్ పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తుంది. కారణమిదేనా.. దేవినేని ఉమాకి రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురు కావడానికి కారణాలు లేకపోలేదు. ఉమా తన వైఖరితో పార్టీ ముఖ్య నాయకులపై అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు ఆర్థిక పరమైన సహకారం ఇస్తానని మోసం చేయడం, కొంత మంది అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి చర్యలే దేవినేని ఉమాకి నేడు శాపాలుగా మారాయని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. -
టీడీపీ నేత దేవినేని ఉమాపై మండిపడ్డ ఆలూరి శేషారత్నం
-
గొల్లపూడి వన్ సెంటర్ లో టీడీపీ నేతల డ్రామా
-
టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా పార్టీలో తిరుగులేదనుకున్న దేవినేని ఉమాకు, గన్నవరం ఇన్చార్జిగా ఇటీవల వెళ్లిన బచ్చుల అర్జునుడుకు పార్టీ తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచీ ఉన్న విభేదాలు ఇటీవల మరింత ముదిరాయి. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా బుజ్జగింపులకు దిగినా.. అక్కడి నేతలు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చక్రం తిప్పిన ఉమాకు సెగ.. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమాకు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు నియోజకవర్గంలో ఎదురు నిలిచి మాట్లాడటానికే సాహసించని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం ఉమాను వ్యతిరేకిస్తూ.. బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు తీర్మానం చేశారు. మరోవైపు టీడీపీ అంతర్గత సర్వేలో సైతం ఉమాకు అనుకూలంగా లేకపోవడంతో, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు చేస్తున్న వాదానికి బలం చేకూర్చుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో దేవినేని ఉమాకు టికెట్టు దక్కడం కష్టమని స్థానిక టీడీపీ నేతలే బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఉమాలో అంతర్మథనం మొదలై, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి, పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. పశ్చిమంలో వర్గ పోరు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. అక్కడ పార్టీ ఇన్చార్జిగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. అయితే నియోజకవర్గంలో పేపర్ పులులుగా పేర్కొన్న ఇద్దరు ముఖ్యనేతలు నియోజకవర్గ ఇన్చార్జి చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, బహిరంగంగానే ఇన్చార్జిపై అసమ్మతి గళం విప్పుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సైతం పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్తిక వనసమారాధనల సమయంలోనూ.. విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేస్తున్నాయి. దీనికితోడు తాజాగా ఎంపీ సోదరుడు నియోజకవర్గంలో వేరు కుంపటి పెట్టడంతో పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గన్నవరం.. తమ్ముళ్ల పంతం.. అసలే అంతంత మాత్రంగా ఉన్న గన్నవరం టీడీపీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. గన్నవరంలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి నేతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బచ్చుల అర్జునుడునే అతికష్టం మీద ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా పంపించారు. అయితే బచ్చుల అర్జునుడుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పార్టీనేతలు సమావేశం ఏర్పాటు చేసుకొని, పార్టీ నేతలను కలుపుకుపోవటంలో అర్జునుడు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని తిరుగుబావూటా ఎగరవేశారు. సీనియర్ కార్యకర్తలకు విలువ ఇవ్వటం లేదని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని బహిరంగానే గన్నవరం టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటికి బలం చేకూర్చే విధంగా ఇటీవల ఏలూరు జిల్లా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు హనుమాన్ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురురేగిన టీడీపీ నేతలు, కార్యకర్తలు బాబు సమక్షంలో బచ్చుల అర్జునుడు వద్దంటూ నినాదాలు చేశారు. గన్నవరం టీడీపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఈ పరిణామాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. చదవండి: పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..! -
టీడీపీలో అసమ్మతి సెగ.. దేవినేని ఉమకు షాక్!
సాక్షి, ఎన్టీఆర్: మైలవరం టీడీపీలో అసమ్మతి సెగ బయటకు వచ్చింది. మాజీ మంత్రి దేవినేని ఉమాపై అసమ్మతి వర్గం భగ్గుమంది. టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు నిర్వహించిన సభలో దేవినేని వద్దు బొమ్మసాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆత్మీయ సమావేశం బ్యానర్లో దేవినేని ఉమ ఫొటోకు చోటు దక్కకపోవడం విశేషం. ఈ క్రమంలో మైలవరం టికెట్ సుబ్బారావుకే ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. ‘మీటింగ్ పెడితే కొందరు కంగారు పడుతున్నారు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తప్పు చేశాను. అప్పుడు లబ్ధి పొందినవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కాల్‌మనీ రాకెట్లో టీడీపీ నేతలు పాత్రధారులు: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబును.. సొంత పార్టీ నేతలే తిడతారు. విజయవాడలో టీడీపీ భూ స్థాపితం అయిపోయిందని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తే సహించేదిలేదని టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. దేవినేని అవినాష్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశం ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. చంద్రబాబు టీడీపీ నేతల్ని పిలిపించి సమావేశం పెట్టమన్నాడు. కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల మీద శపథాలు చేయండి.. తొడలు కొట్టండి అని చెప్పాడు. అలా చేసిన టీడీపీ నేతల చీకటి బ్రతుకులు నాకు తెలుసు. ఇప్పుడు తొడలు కొట్టిన వారే.. ఉదయం చంద్రబాబును పొగుడుతారు.. మళ్లీ వారే రాత్రి అయితే వెదవ అని తిడతారు. వైఎస్సార్సీపీ నేతల కన్నా.. టీడీపీ నాయకులే చంద్రబాబును ఎక్కువగా తిడతారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచింది కాబట్టే.. ఏమీ చేయలేక కవ్వింపు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కాల్‌మనీ రాకెట్లో పాత్రధారులు. టీడీపీ విజయవాడలో ఎప్పుడో భూ స్థాపితం అయిపోయింది. దేవినేని ఉమకు మైలవరంలోనే గతిలేదు. ఇంకా జిల్లాలో టీడీపీనేం గెలిపిస్తాడు?. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్ర నాశనాన్ని కోరతారా? -
‘డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి టీడీపీ తప్పిదమే కారణం’
సాక్షి, అమరావతి: టీడీపీపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ హయంలో దేవినేని ఉమ పోలవరంను ఎందుకు పూర్తి చేయలేదు?. జనం దేవినేని ఉమాను, టీడీపీని పీకి పారేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి టీడీపీ తప్పిదమే కారణం. కాపర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వరద రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారా?. గోదావరికి ఉధృతంగా వరదలు వచ్చాయి. ఎప్పుడు కూడా జూలై నెలలో ఈ స్థాయిలో వరదలు రాలేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సహాయక చర్యలు చేపట్టాము. కరకట్టలు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుక్షణం మానిటర్ చేస్తూనే ఉన్నారు అని స్పష్టం చేశారు. -
దేవినేని ఉమకు అంతా తెలిస్తే.. అప్పుడేం చేశారు: మంత్రి అంబటి
సాక్షి, ఏలూరు: టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి రాంబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘‘ఖరీఫ్ కోసం గోదావరీ డెల్టాకు నీరు విడుదల చేశాము. ఈరోజు పోలవరం పనుల పురోగతిపై అధికారుతో సమీక్ష నిర్వహించాము. సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తి చేస్తాము. పోలవరంపై అనేక అవాస్తవ కథనాలు రాస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ టీడీపీ అవగాహన రాహిత్యం వల్లే దెబ్బతిన్నది. రివర్స్ టెండరింగ్ వల్ల జరిగిందని చంద్రబాబు అంటున్నారు. నాకు మాములు వాల్కి డయాఫ్రమ్ వాల్కి తేడా తెలియదని వ్యంగంగా అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రావీణ్యం కలిగిన వ్యక్తి దేవినేని ఉమా అయితే.. డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నప్పుడు ఏం చేశారు. వారు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినటానికి కారణం ఎవ్వరు?. కాపర్ డామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ చేపట్టడం తప్పు కాదా?. ఏపీకి లైఫ్ లైన్ లాంటిది పోలవరం. దీనికి కారణమైన మిమ్మల్లి ప్రజలు క్షమించరు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి -
దళితులపై దాడిలో బాబు హస్తం!
దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్న చంద్రబాబుకు ఆయనపై ఎందుకు కేసు పెట్టారో తెలియదా అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి, అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్న విషయాన్ని బాబు గ్రహించాలన్నారు. అసలు దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర ఉందని.. పోలీసులు ఆయనపైనా కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దళితులపై దాడిచేసిన ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం అత్యంత దుర్మార్గమన్నారు. టీడీపీ అధినేత బుద్ధి కొంచెం కూడా మారలేదని.. అగ్రవర్ణ అహంకారం కొంచెం కూడా తగ్గలేదని వారు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మంత్రి పేర్ని నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. –సాక్షి, అమరావతి ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించినందుకే.. దేవినేని ఉమా ఇంట్లో పడుకుంటేనో లేక మీ సంచులు మోస్తుంటేనో కేసులు పెట్టలేదని.. దళితులపై దాడిచేసి, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్న విషయాన్ని బాబు గ్రహించాలని పేర్ని నాని తెలిపారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు, దేవినేని ఉమాలు కొండలను పిండిచేసి తినేసిన విషయాన్ని శాటిలైట్ మ్యాప్‌లే చెబుతున్నాయన్నారు. ఇవాళ డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే ఎవరూ ఊరుకోరు అని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఏం చేశాడని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయమన్నారు. 2019 నుంచి చెప్పిన ప్రతి మాటను నిజం చేస్తూ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ ఇంజినీరింగ్ అనే పదానికి ఆంధ్రప్రదేశ్‌లో అర్థం చూపించిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ఖాకీ యూనిఫామ్ నిఖార్సుగా పనిచేస్తున్నది సీఎం జగన్ ప్రభుత్వంలోనేనని పేర్ని పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావును అడ్డుపెట్టుకుని పోలీసుల్ని వాడుకున్నది చంద్రబాబేనని తెలిపారు. ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద రాజకీయాలు చేసే అవకాశంలేక, ఇవాళ దేవినేని ఉమా లాంటి వాళ్లను అడ్డంపెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కమిటీతో మేమూ వస్తాం.. సిద్ధమా? గొల్లపూడిలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే చంద్రబాబు వచ్చారని ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. పరామర్శ పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విరుచుకుపడ్డారు. మైనింగ్‌పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. మైనింగ్‌లో ఎవరు దోచుకున్నారో మొత్తం తేలుస్తామని.. ఉమా బండారం బయట పెడతామన్నారు. ఒక దళితుడిని కులం పేరుతో దేవినేని ఉమా దూషిస్తే చంద్రబాబు రంకెలేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని పరామర్శించేందుకు వెళ్లటమే పెద్ద తప్పని, దానిని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన తెలిపితే అది రౌడీయిజం అంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం నిరసన తెలిపే హక్కు దళితులకు లేదా అని ప్రశ్నించారు. ఉమా, టీడీపీ ఇతర నేతలు మైలవరంలో మైనింగ్‌తో పాటు అన్నింటినీ లూటీ చేశారన్నారు. దళితులపై బాబు పగబట్టారు ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత ద్రోహి అని మరోసారి నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. దళితులపై దాడిచేసిన దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇక ఎప్పటికీ చంద్రబాబును నమ్మరని చెప్పారు. మైనింగ్ జరిగిన కొండపల్లి అడవిలో ఏం జరిగిందో చంద్రబాబుకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి సీఎం జగన్‌పై దేవినేని ఉమా చేస్తున్న దుష్ప్రచారాలకు ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని తెలిపారు. చంద్రబాబుపై కేసు పెట్టాలి దళితులపై దాడిచేసిన దేవినేని ఉమా ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారని.. ఆ దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితులపై స్వారీ చేయాలనుకోవడం దారుణమన్నారు. పోలీసులు చంద్రబాబుపై ఏ–2 కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పటివరకూ ఈ అంశంపై క్షమాపణ చెప్పలేదని.. పైగా పశ్చాత్తాపం కూడా పడలేదని మేరుగ గుర్తుచేశారు. దళితుల పేర్లు చెప్పుకుని బాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని.. ఉమా అబద్ధాలను నిజం చేసేందుకు తాపత్రయపడుతున్నారని తెలిపారు. బాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాగార్జున హితవు పలికారు. అంబేడ్కరిజానికి తూట్లు పొడుస్తున్న ఆయన రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడన్నారు. -
మైనింగ్ పేరుతో హైడ్రామా.. గొల్లపూడిలో ఉద్రిక్తత
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ) : కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీ హైడ్రామాకు తెరలేపింది. నిజ నిర్ధారణ పేరుతో అక్కడకు వెళ్లి హడావుడి చేసేందుకు ఆ పార్టీ నాయకులు విశ్వప్రయత్నం చేశారు. అక్కడ మైనింగ్ జరుగుతోందంటూ లేనిపోని ఆరోపణలతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశారు. ఈ క్రమంలోనే జి.కొండూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి టీడీపీ నేతలు దళితులపై దాడిచేసే వరకూ వెళ్లింది. ఈ కారణాలతోనే దేవినేని ఉమాను పోలీసులు అరెస్టుచేశారు. మీడియా హడావుడితో తరచూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం ఉమాకు మొదటి నుంచి అలవాటైన విద్యగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కానీ, ఈసారి అది బెడిసికొట్టి ఆయనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని జీర్ణించుకోలేక వ్యవహారం మొత్తాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. రగడ సృష్టించి ఏదో జరిగిపోతోందని ప్రజల్లో భ్రమలు కల్పించడానికి నిజనిర్ధారణ కమిటీ ముసుగులో వ్యూహం రచించారు. కానీ పోలీసులు ఈ పథకాన్ని ముందే పసిగట్టడంతో వారి ప్రయత్నం సఫలం కాలేదు. టీడీపీ హయాంలోనే విచ్చలవిడి మైనింగ్ వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉండగానే కొండపల్లి సహా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా నేతృత్వంలో అనేకచోట్ల అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారం కోల్పోయాక ఏమీ జరక్కపోయినా కొండపల్లి అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించి రాజకీయంగా లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. చివరికి ఈసారి దాన్ని మరింత రచ్చచేసి అలజడులు సృష్టించడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఇలా ఏ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉమా కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి హైదరాబాద్ వెళ్లిపోయారు. ‘దళిత ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్, దేవినేని ఉమా అరాచకాలు నశించాలి, చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ఫ్లకార్డులతో ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు ఉమాపై కేసులు దుర్మార్గం : చంద్రబాబు దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసులు పెట్టడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులే దాడిచేసి రివర్స్ కేసు పెట్టడం దారుణమన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉమా కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీలపై దాడి చేశారంటూ దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే చెట్లను కొట్టేస్తుండడంతో ఉమాతోపాటు టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారని చెప్పారు. అక్రమ మైనింగ్ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని బాబు ప్రశ్నించారు. డీజీపీ గౌతం సవాంగ్ ప్రవర్తన అన్యాయంగా ఉందన్నారు. ఈ దాడులకు టీడీపీ భయపడబోదన్నారు. టీడీపీతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. రెండేళ్ల నుంచి వారిపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను అర్ధాంతరంగా ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. సీనియర్ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గొల్లపూడిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దళితులు దళిత ద్రోహి చంద్రబాబు గొల్లపూడిలో దేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారం చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న స్థానిక దళితులు.. టీడీపీ నేతలు తమపై చేస్తున్న అరాచకాలపై ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారికి గ్రామంలోని బీసీలు మద్దతు పలికారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా ప్లకార్డులు పట్టుకుని ‘దళిత ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్, దేవినేని ఉమా అరాచకాలు నశించాలి, చంద్రబాబు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘దాడికి గురైన దళితులను కాకుండా దాడిచేసిన వారిని పరామర్శించడానికి వెళ్తారా చంద్రబాబూ..?’ అంటూ వారు మండిపడ్డారు. ఒకానొక దశలో వారు ముందుకు చొచ్చుకు రావడంతో, పోలీసులు బలవంతంగా వెనక్కి నెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న పోలీసులు రెండు గంటల తర్వాత వారిని వెనక్కి పంపించేశారు. అనంతరం.. గ్రామానికి చెందిన దళిత నాయకులు కేతేపల్లి కోటేశ్వరరావు (దావీదు), గేరా సుమన్‌కుమార్, యడవల్లి శారమ్మ, చీదెళ్ల రవి, నందిపాముల సత్యం తదితరులు మాట్లాడుతూ.. తమపై టీడీపీ నేతల దౌర్జన్యాలు, దూషణలు పెచ్చుమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ నేతల వరుస దాడులను చూస్తుంటే చంద్రబాబే వారిని ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. -
దేవినేని ఉమా డ్రామాలాడుతున్నారు: వసంత కృష్ణ ప్రసాద్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డ్రామాలాడుతున్నాడని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వల్లే అనర్థాలు జరిగాయని మండిపడ్డారు. దేవినేని ఉమా అధికారంలో ఉన్నప్పుడు రెవిన్యూ భూములని, ఇప్పుడు ఫారెస్ట్ భూములని ఆరోపిస్తున్నాడాని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ఉమా చూస్తున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమా దౌర్జన్యాలు, డ్రామాలు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. ‘ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నాడు. దేవినేని ఉమాను ప్రశ్నిస్తే దాడి అంటాడు. తూర్పు, పడమర తెలియని వ్యక్తి లోకేష్. ఉమా వెకిలి చేష్టలతో టీడీపీ కార్యకర్తలే విసిగిపోయి ఎదురుతిరుగుతున్నారు. తెలుగు దేశం పార్టీ కాదు.. పక్కా తెలుగు దొంగల పార్టీ. 2014 నుంచి ఎలా క్వారీ జరిగిందో అన్నీ లెక్కలు తీస్తాం. అక్రమ మైనింగ్ చేసిందెవరో నిగ్గు తేల్చి ప్రజల ముందుపెడతాం’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. -
‘ప్రజలు ఛీ కొట్టినా దేవినేని ఉమా బుద్ధిమారలేదు’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమారలేదని ఎమ్మెల్మే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణప్రసాద్ చేతిలో ఓటమిని దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరిగితే.. అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. దేవినేని ఉమా అనుచరులతో రాత్రిపూట పరిశీలనకు వెళ్తారా.. దానిని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేస్తారా అని మండిపడ్డారు. ఏదోరకంగా వసంతకృష్ణప్రసాద్‌పై బురదజల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలని హితవు పలికారు. గతంలో జక్కంపూడిలో దేవినేని ఉమాను ప్రజలే తరిమికొట్టారని గుర్తుచేశారు. దేవినేని ఉమా రాజకీయ నాయకుడు కాదు.. గోబెల్స్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్‌లు సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్‌లని ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవినేని ఉమా కాదు.. సొల్లు ఉమా అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. మైలవరంలో మొత్తం దోచుకున్నది దేవినేని ఉమానేనని, దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్ దోచుకున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపారు. దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని అన్నారు. -
నందివాడ పీఎస్‌కు దేవినేని ఉమా తరలింపు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జీ.కొండూరు వివాదంలో టీడీపీ మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు బుధవారం నందివాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగా.. నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. మీడియాతో సహా సాధారణ ప్రజలను సైతం గ్రామంలోకి వెళ్లనివ్వలేదు. పోలీసులు పలుచోట్ల భారీకేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు దేవినేని ఉమాకు కోవిడ్ పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జి.కొండూరుకి చెందిన వైఎస్సార్సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతల దాడి చేసిన విషయం తెలిసిందే. దళిత కార్యకర్త సురేష్‌పైనా రాళ్లు, కర్రలతో దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడికి ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీ.కొండూరు వివాదానికి మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌లు తెలిపాన విషయం తెలిసిందే. -
ఎన్ని సోడాలు కొట్టి ఎమ్మెల్యే అయ్యావో చెప్పు ఉమా..?
సాక్షి, మైలవరం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైలవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవినేని ఉమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయాల్లోకి రాకూడదంటూ ఉమా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. గతంలో రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్కి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు టీడీపీ ఎందుకు టికెట్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న ఉమా.. ఎన్ని సోడాలు కొట్టి ఎమ్మెల్యే అయ్యాడో చెప్పాలని నిలదీశారు. నీ వదిన చావుకు కారణం నువ్వే అని ప్రజలందరూ అనుకుంటున్నారు, దీనికి సమాధానం ఏంటి. చెరువు మాధవరంలో సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోలేని నువ్వు, రాజకీయాలు చేయడం మానుకుంటే మంచిదని వసంతకృష్ణప్రసాద్ హితవుపలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విమర్శించడం నీలాంటి పనీ పాటా లేని వాళ్లకు అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు. కోవిడ్ పరీక్షల విషయంలో కానీ.. కోవిడ్ నియంత్రణలో కానీ.. తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. గొల్లపూడిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దిశా యాప్ ఆవిష్కరణ చేయడం ఆనందకరమని, మహిళలంతా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. -
ఊగిపోయిన ఉమా.. ఉద్యోగులకు బెదిరింపు
చిలకలపూడి(మచిలీపట్నం): ఉద్యోగులు గుర్తుపెట్టుకోండి అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సోమవారం అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయకులు అడుగడుగునా నిబంధనలు అతిక్రమించారు. వినతిపత్రం ఇచ్చేందుకు పదుల సంఖ్యలో వచ్చిన టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులకు పోలీసులు కరోనా నిబంధనల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు ఉండకూడదని వివరించారు. ఈ సమయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, చిలకలపూడి సీఐ అంకబాబుకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం డీఆర్వో ఎం వెంకటేశ్వర్లు ఆయన చాంబర్ నుంచి బయటకు వచ్చి నాయకులను నుంచి వినతిపత్రం స్వీకరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారించి వారిని కలెక్టరేట్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. బయటకు వచ్చిన దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని మాట్లాడనీయరా, బయటకు పంపేస్తారా, ఉద్యోగులు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు, అప్రకటిత ఎమర్జెన్సీలా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ఉద్యోగులపై ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జనసేన నాయకులు బి రామకృష్ణ, సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు తదితరులు ఉన్నారు. చదవండి: చంద్రన్న మార్కు మద్యం దందా: కాగ్ నివేదికలో వెల్లడి -
మైలవరం: టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం
సాక్షి, కృష్ణా: మైలవరంలో టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంపై బురదజల్లే యత్నంలో దేవినేని ఉమా భంగపాటుకు గురయ్యారు. ఇళ్ల స్థలాల వద్దకు దళిత మహిళలను దేవినేని ఉమా తీసుకెళ్లగా.. ఆయనపై దళిత మహిళలు తిరగబడ్డారు. దేవినేని ఉమా అండ్ కోపై తిట్ల పురాణంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా, అతని సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు. -
ఎవరి కోసం చేశారు?.. దేవినేని ఉమాపై సీఐడీ ప్రశ్నల వర్షం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేసి అనని మాటలను అన్నట్టుగా ఎందుకు చూపించారు? ఎవరి ప్రోద్బలంతో చేశారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు ఆపని చేశారు?.. అంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉమాను దాదాపు 10 గంటలపాటు సీఐడీ దర్యాప్తు అధికారులు పదేపదే ప్రశ్నించినా ఆయన పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. సీఎం వైఎస్ జగన్ వీడియోను మార్ఫింగ్ చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ నెల 7న దుష్ప్రచారం చేసిన ఉమాపై కర్నూలులో సీఐడీ ఈ నెల 9న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించాలన్న కోర్టు డైరెక్షన్ మేరకు ఆయన గురువారం మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. సీఐడీ కార్యాలయంలోని ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ప్రత్యేక గదిలో ఉదయం 10.40 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీఐడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ వీడియో, ఆడియోను మార్ఫింగ్ చేసి తిరుపతిలో మత విద్వేషాలు, అలజడులు రేపేందుకు ఎందుకు కుట్ర చేశారని, ఇందులో మీకు ఎటువంటి ప్రయోజనాలున్నాయని ప్రశ్నించినట్టు సమాచారం. వీడియో మార్ఫింగ్ ఎలా చేశారని, ఎందుకు చేశారని ప్రశ్నించగా.. ఆ వీడియోను తాను పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకున్నట్టు ఉమా బదులిచ్చారని తెలిసింది. తిరుపతి ప్రెస్మీట్లో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ వీడియో ప్రదర్శించిన సెల్‌ఫోన్, ట్యాబ్ గురించి సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో ఆయన సమాధానం దాటవేసినట్టు తెలిసింది. దాదాపు 10 గంటలపాటు సాగిన విచారణలో పదేపదే అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో వాస్తవాలు రాబట్టేందుకు శనివారం (మే 1వ తేదీ) మరోసారి విచారణకు హాజరుకావాలని ఉమాను సీఐడీ అధికారులు ఆదేశించారు. ఉమా ఉపయోగించిన సెల్‌ఫోన్, ట్యాబ్‌లతోపాటు సీఐడీ అధికారులు అడిగిన ఆధారాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు అందజేయాలని కోరినట్టు తెలిసింది. తొలిరోజు విచారణలో ఉమా చెప్పిన విషయాలను సీఐడీ అధికారులు రికార్డు చేసినట్టు తెలిసింది. చదవండి: ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి/కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో, ఆడియోను మార్ఫింగ్ చేసి తిరుపతిలో మత విద్వేషాలు, అలజడులు రేపేందుకు కుట్ర చేసిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ నోటీసు జారీ చేసింది. తిరుపతి ఉప ఎన్నికలకు వెళ్లిన దేవినేని ఉమ ఈ నెల 7వ తేదీన మీడియా సమావేశం నిర్వహించి సీఎం వైఎస్ జగన్ వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రదర్శించారు. దానిపై ఉమ ట్వీట్ కూడా చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే కుట్ర పన్నారు. దీనిపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ మార్ఫింగ్ వీడియో వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది. 2014 ఏప్రిల్ 13న వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా, 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన విలేకరుల సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి, వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్టు తేలింది. దీనిపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎన్.నారాయణరెడ్డి ఈ నెల 9న కర్నూలు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమపై ఐపీసీ 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్లతో కేసు నమోదు చేసిన కర్నూలు సీఐడీ డీఎస్పీ సీహెచ్ రవికుమార్ దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఎం జగన్ వీడియోను మార్ఫింగ్ చేసి ప్రెస్మీట్లో ప్రదర్శించిన ట్యాబ్, ఫోన్లను తీసుకుని కర్నూలు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ ఉమకు డీఎస్పీ రవికుమార్ గురువారం నోటీసు జారీ చేశారు. నోటీసు గురించి తెలియజేసేందుకు ఉమామహేశ్వర రావుకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదని, వాట్సాప్ నంబర్ 9848035405కు 14వ తేదీ రాత్రి 9.06 గంటలకు మెసేజ్ పంపినట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. నోటీసును స్వయంగా అందజేయడానికి విజయవాడ గొల్లపూడిలోని ఆయన ఇంటి వద్దకు కర్నూలు సీఐడీ పోలీసులు వెళ్లగా ఆయన లేనందున ఇంటికి నోటీసు అతికించి, అతని అనుచరునికి తెలియజేసినట్లు తెలిపారు. చదవండి: ‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్ -
మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): టీడీపీకి దెబ్బమీద దెబ్బపడుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనూ చతికిలపడింది. వైఎస్సార్ సీపీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్షం పట్టుఉందని చెప్పుకుంటున్న గ్రామాల్లోనూ పునాదులు కదిలిపోయాయి. మైలవరం నియోజకవర్గానికి గుండెకాయగా ఉండే గొల్లపూడిలో అధికార పక్షంలో చేరేందుకు క్యూ కడుతున్నారు. టీడీపీ కేడర్‌లో అయోమయం నెలకొంది. అత్యంత కీలకమైన గ్రామం మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడి అతి పెద్ద గ్రామం. ఒక్క గ్రామంలోనే 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉండేది ఇక్కడే. టీడీపీ తరఫున ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. గొల్లపూడి 1, 3, 5, 8 సెగ్మెంట్ అభ్యర్థులు చెరుకుమల్లి నరేంద్ర, దాఖర్ల కిషోర్‌బాబు, యడవల్లి శారమ్మ, పిళ్లా శివ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన సమీకరణలు ఒక్కప్పుడు దేవినేని ఉమాకు అండగా ఉన్న గ్రామం సంక్షేమ ప్రభుత్వం వెంట నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదుర్కొన్న దేవినేని ఉమాకు తాజా పరిణామాలతో దిమ్మతిరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియా ముందు హడావుడి చేసే ఉమాకు షాక్ తగిలింది. గొల్లపూడిలో ఇటీవలే సీఎం జగన్ ప్రభుత్వం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావుల చేతుల మీదుగా 3,648 ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. కాలనీల నిర్మాణంతో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ముందున్న తలశిల రఘురాం తన సొంత గ్రామంలో పేదలకు 3,648 ఇళ్ల పట్టాలను ఇచ్చి పాదయాత్ర కాలనీలను నిర్మించేలా పేదలకు మేలు చేశారు. దీంతో గొల్లపూడిలో రాజకీయం మొత్తం మారిపోయింది. దేవినేని ఉమా ఇప్పుడు ప్రభుత్వ పథకాల వలన తన పార్టీ అభ్యర్థ్ధులను కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. చదవండి: విజయవాడ టీడీపీలో లుకలుకలు.. బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! -
చంద్రబాబు ప్రవాసనేతలా మారారు
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రవాస నేతగా తయారయ్యారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అవినీతి, హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు.. ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే మాత్రం హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ర్టానికి ఏమీ ఉపయోగపడలేదని కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి ఉపయోగపడిందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు తన కుమారుడిని సైతం గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి టీడీలు నేతలు అడ్డుకుంటున్నారని, పేదలకు మంచి చేస్తుంటే కూడా ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. సీబీఐ విచారణకు తాను సిద్ధమని, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమా సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సూటిగా ప్రశ్నించారు. (కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’) -
దేవినేని ఉమాకు మంత్రి అనిల్ సవాల్
సాక్షి, నెల్లూరు : కృష్ణానదిపై తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్‌పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడంలేదని నిలదీశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా మంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా అని సవాలు విసిరారు. దేవినేని ఉమా నిత్యం అబద్దాలు చెబుతూనే ఉంటారని, అన్ని ప్రాజెక్టులు తామే కట్టామని గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. (అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్) పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని తొలుత పెంచింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, దానిని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని మంత్రి అనిల్ పేర్కొన్నారు. కృష్ణా నది వరద నీటిని పూర్తిగా ఉపయోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో మొదటిసారిగా వైఎస్ జగన్నేతృత్వంలో సోమశిలలో 78 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించామని తెలిపారు. టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులు కనీసం చేయలేదని, నిత్యం మాటలతోనే కాలయాపన చేశారని మండిపడ్డారు. -
దేవినేని ఉమా సోదరుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడట్టు తేటతెల్లమవుతోందని అన్నారు. టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపితే ప్రముఖుల బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కృష్ణా జిల్లా కంచికచర్ల మాజీ మార్కెటింగ్ చైర్మన్ లక్ష్మీనారాయణ సామాన్య రైతు కుటుబానికి చెందిన వారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము కూడగట్టారు. రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డారు. సీఐడీ సోదాల్లో దొరికింది చాలా తక్కువ. వారి అవినీతిపై మరింత లోతుల్లోకెళ్లి విచారణ జరిపితే చాలా అక్రమాలు బయటపడతాయి. లక్ష్మీనారాయణ కొడుకు సీతారామరాజు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు చేస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో లక్ష్మీనారాయణ వెనక ఉన్న ప్రముఖ నేతల బండారం కూడా బహిర్గతం అవుతుంది. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో కంచికచర్లలో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారు. సహకార బ్యాంకు రుణాల గోల్‌మాల్‌లో కూడా దేవినేని ఉమా అండదండలు ఉన్నాయి’ అని అన్నారు. -
దేవినేని ఉమాకు సుధాకర్‌బాబు సవాల్..
సాక్షి, తాడేపల్లి: దేవినేని ఉమా ఓ మానసిక రోగి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌లా ఆయన నడవడిక మారిందని ధ్వజమెత్తారు. చవకబారు నాయకులతో పోటీ పడాలంటే సిగ్గుగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇలానే మాట్లాడితే 23 నుంచి 3 సీట్లకు వెళతారని విమర్శించారు. అబద్ధాల ఛాంపియన్‌గా మారినందుకే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ఎన్ని డెడ్లైన్లు పెట్టారో అందరికి తెలుసునని, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది దివంగత మహానేత వైఎస్సారేనని ఆయన చెప్పారు.(రాజధాని భూముల అవినీతిపై సిట్ ఏర్పాటు) సజ్జల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు.. ఫ్లోరైడ్ బాధితులకు తాగు,సాగు నీరందించాలన్నది ఆనాటి వైఎస్సార్ లక్ష్యమని సుధాకర్ బాబు పేర్కొన్నారు. వెలిగొండను గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. వెలిగొండ టన్నెల్ కూడా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారని తెలిపారు. ‘గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును 2018 డిసెంబర్‌కు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత 2019 అన్నారు.. కమీషన్ల కోసమే గత పాలకులు కక్కుర్తి పడ్డారని’ సుధాకర్‌బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన తప్పులన్నీ బయటకొస్తున్నాయనే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడే అర్హత దేవినేని ఉమాకు లేదని.. దమ్ముంటే చర్చకు రావాలని సుధాకర్ బాబు సవాల్ విసిరారు. (ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!) -
ఆయన నుంచి ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టే..
సాక్షి, భీమవరం: టీడీపీ కర్ర పత్రాలుగా ఎల్లో మీడియా పనిచేస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంశంపై పదేపదే మీడియా ముందుకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఏమయ్యారని ప్రశ్నించారు. తన మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ శాఖ దాడులు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మీడియా ముందుకు రాలేదన్నారు. చంద్రబాబు నుంచి ఆర్థికంగా ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఐటీదాడులపై నోరు మెదపడం లేదన్నారు. (ఐటీ దాడులపై వారు నోరు మెదపరేం..!) చంద్రబాబు భజనపరులు తమ నాయకుడి మెప్పు కోసం ఐటీదాడులపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. దేవినేని ఐటీ దాడులు గురించి మాట్లాడకుండా బొత్సపై విమర్శలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజం కోసం మీడియా పనిచేయాలని..కానీ అవినీతి ఆధారాలు లభ్యమైన కూడా చంద్రబాబు తొత్తులుగా కొన్ని పత్రికలు,ఛానెల్స్ పనిచేస్తున్నారని మండిపడ్డారు.('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా') పవన్ కల్యాణ్ అహంకారి.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పవన్ అవకాశవాది అని.. ప్రజలను మోసగించడంలో చంద్రబాబు వద్ద తర్ఫీదు పొందిన వ్యక్తి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పక్కన కూర్చీ వేసి మరొకరిని కూర్చో పెట్టుకోవడానికి అంగీకరించని అహంకారి పవన్ అని విమర్శించారు. సిద్ధాంతాలు మాట్లాడే పవన్.. ఆచరణలో మాత్రం పెట్టరని దుయ్యబట్టారు. తను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని నెలల్లోనే భీమవరంలో వంద పడకల ఆసుపత్రికి తన కుటుంబం తరపున నాలుగు ఎకరాల స్థలాన్ని ఇచ్చామని తెలిపారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఉమాకు కొత్త బట్టలు పెడతా: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు : చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడి చేశారని, పోలవరం పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 35 శాతం కూడా పోలవరం పనులు చేయకుండా.. కాంక్రీటులో గిన్నిస్ రికార్డులు వచ్చాయని దుష్ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.. అదే విధంగా టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని.. దానికి దేవినేని ఉమాను కూడా ఆహ్వానిస్తామని.. కొత్త బట్టలు కూడా పెడతామని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్‌లో వెయ్యి కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదా చేశారని, తమ దోపిడి వ్యవహారం బయటకు వస్తుండటంతో తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తర కుమారుడు అంటే ఎవరో అందరికీ తెలుసని, ఆడా.. మగా కానీ ఉమా.. తనపై విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ‘నేను ఏం చదువుకున్నానో అందరికీ తెలుసు.. నువ్వు ఎవరిని చంపి రాజకీయాల్లోకి వచ్చావో తెలుసుకో’ అంటూ ఉమాపై విరుచుకుపడ్డారు. -
తమకో నీతి... ఇతరులకో నీతా..
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో చేసిందే నీతిగా.. ప్రస్తుత ప్రభుత్వం చేసేది నీతిలేని పనిగా.. ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను అవమానించేలా తెలుగుదేశం నేతలు మాట్లాడం సరికాదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ చైర్మన్ కె.రమేష్‌కుమార్ అన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేత బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా ఉద్యోగులుగా సహకరిస్తామని ఆయన చెప్పారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే దేవినేని ఉమా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఏడాదిలోనే అమరావతికి రావాలని కోరితే కట్టుబట్టలతో ఉద్యోగులు తరలివచ్చారని గుర్తుచేశారు. రాజధాని మారినా, రాష్ట్రాలు విడిపోయినా మొదట నష్టపోయేది ఉద్యోగులేనన్నారు. ఉద్యోగ సంఘాలను రాజకీయ ఉచ్చులోనికి లాగొద్దని హితవు పలికారు. సమావేశంలో ఏపీ అమరావతి జేఏసీ కో చైర్మన్ కృష్ణమోహన్, జనరల్ సెక్రటరీ వెంకట రాజేష్, జిల్లా కార్యదర్శి ప్రమోద్ కుమార్, లేబర్ డిపార్టుమెంటు రాష్ట్ర అధ్యక్షులు రాజేష్, డ్రైవర్ సంఘ జిల్లా అధ్యక్షులు నారాయణ పాల్గొన్నారు. -
‘ఆయన నోట్లో నోరుపెడితే బురదలో రాయి వేసినట్టే’
సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం హయంలో మంత్రిగా ఉన్న ఉమ ఇరిగేషన్లో వేల కోట్లు మింగేశాడని ఆరోపించారు. నిరంతరం ఆరోపణలు చేయడం ఉమకు అలావాటని విమర్శించారు. దేవినేని ఉమ నోట్లో నోరు పెడితే బురదలో రాయి వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ పనుల్లో ఏరకంగా కమీషన్లు తీసుకున్నారో చెప్పడానికి కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో ఉమ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజలు బుద్ది చెప్పారని, రాబోయే రోజుల్లో మరింత గట్టిగా బుద్ది చెబుతారని అన్నారు. -
కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా!
సాక్షి, అమరావతి : తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులం.. పచ్చ దొంగలకు కాదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటిచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా అధికారంలో ఉండగా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ టీడీపీ బండారం త్వరలోనే బయటపడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా.. రివర్స్ టెండర్లు, జ్యుడిషల్ కమిషన్ వల్ల ఫలితాలెలా ఉంటాయో తెలుస్తుంది’ అంటూ తనదైన శైలిలో మాజీ మంత్రి తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా బీజేపీలో చేరిన టీడీపీ నాయకులు క్రమంగా ఆ పార్టీలో కంట్రోల్ తీసుకుంటున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు...‘ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కార్యదర్శులను పక్కకు నెట్టి కొత్తగా పార్టీలో చేరిన బాబు కోవర్టులు కంట్రోలు తీసుకుంటున్నారు. మొన్న గవర్నర్ గారిని కలిసిన సుజనాచౌదరి బృందాన్ని చూస్తే అర్థమవుతుంది. అమిత్ షా గారి కంటే ఈ బానిసలకు నారా చంద్రబాబు నాయుడే ముఖ్యం’ అంటూ ట్వీట్ చేసి ప్రధానమంత్రి కార్యాలయం, బీజేపీ ఫర్ ఇండియాను ట్యాగ్ చేశారు. -
బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసిన కేశినేని నాని!
సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు...నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నారు....దౌర్బాగ్యం’ అంటూ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. కాగా కొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్లో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగా ట్వీట్స్ పెడుతున్న నేపథ్యంలో కేశినేని నాని టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చాలారోజుల నుంచి బుద్ధా వెంకన్నకు, కేశినేని నాని మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల టీడీపీలో షో మ్యాన్లు అవసరం లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతోంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తాను సూచించినవారికి ఇవ్వకుండా జలీల్ ఖాన్ కుమార్తెకు కేటాయించడం... దీని వెనుక మాజీమంత్రి దేవినేని ఉమతో పాటు బుద్ధా వెంకన్న కూడా ఉండటం కూడా నాని అసంతృప్తికి కారణం అని తెలుస్తోంది. మరోవైపు త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై కూడా ఇద్దరు నేతల మధ్య వార్ కొనసాగుతోంది. గతంలోనూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి కేశినేని నాని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. -
మీరే గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు
-
‘సీఎం నేమ్ ప్లేట్ సృష్టించి.. పిచ్చికూతలు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా? అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి దేవినేని ఉమాపై మండిపడ్డారు. ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరని ట్విట్టర్లో ధ్వజమెత్తారు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయిందని, ఫ్రస్టేషన్లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా ఉమా? ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఫ్రస్టేషన్ లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయి — Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2019 జీవితాంతం వ్యవస్థల్ని మేనేజ్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడని నిప్పులు చెరిగారు. ఫిర్యాదులుంటే చెప్పొచ్చని, ఇవసలు ఎన్నికలే కావనడం, పోలింగు ముగిసాక ఓటింగ్ మెషిన్లను ట్యాంపర్ చేస్తారనడం మానసిక నియంత్రణ కోల్పోయిన వ్యక్తి చేసే ఆరోపణలని ధ్వజమెత్తారు. జీవితాంతం వ్యవస్థల్ని మేనేజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫిర్యాదులుంటే చెప్పొచ్చు. ఇవసలు ఎన్నికలే కావనడం, పోలింగు ముగిసాక ఓటింగ్ మెషిన్లను ట్యాంపర్ చేస్తారనడం మానసిక నియంత్రణ కోల్పోయిన వ్యక్తి చేసే ఆరోపణలు. — Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2019 -
ఇసుకతో కోట్లు కొల్లగొట్టిన పచ్చనేతలు
సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన దానికి భిన్నంగా ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా బాబు మంత్రి వర్గంలో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు తన బినామీలతో ఇసుకను కొల్లగొట్టి రూ. వేల కోట్లు గడిం చారు. ఉచితం పేరుతో ఇసుకను క్వారీల నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి రాత్రికి రాత్రే అనేక మంది అక్రమార్కులు లక్షాధికారులుగా మారారు. క్వారీల వద్ద ఇసుక లేకపోయినా పంటచేలు, గ్రామాలు, పట్టణాల్లోని వివిధ ప్రాం తాల్లో ఖాళీగా ఉన్న ప్రాంతాలు ఇసుక గుట్టలతో దర్శనమిస్తున్నాయి. పగలు గుట్టలు కనిపిస్తాయి. రాత్రికి రాత్రే మాయమవుతాయి. అక్కడ గుట్టలు ఉన్నట్లు అధికారులకు తెలిసినా వారు అటువైపు కనెత్తి చూడరు. ఎందుకంటే వారికి అందవలసిన ముడుపులు చేరుతున్నాయి. జిల్లాలో ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, తోట్లవల్లూరు, కంకిపాడు, పెనమలూరు, విజయవాడ రూరల్ తదితర ప్రాంతాల్లో అధికారికంగా అనుమతి ఉన్న ఇసుక క్వారీలు 10 ఉన్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నం లో ఫెర్రీ, గుంటుపల్లి క్వారీలు ఉండగా.. జగ్గయ్యపేట మండలంలో వేదాద్రి రావిరాల, శెనగపాడు, లింగాల క్వారీలు ఉన్నాయి. వీటితోపాటు నందిగామ నియోజకవర్గ పరిధిలో కృష్ణా, మునేటి పరీవాహక గ్రామాల నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్వారీలన్నింటిపైనా మంత్రి దేవినేని అనుచరుల పెత్తనం నడుస్తోంది. దేవినేని అనుచరులు ముం దుగానే తమ సొంత వాహనాలతో ఇసుకను భారీగా నిల్వ చేశారు. రాత్రి సమయంలో జిల్లా వ్యాప్తం గా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఐదు యూనిట్ల లారీ రూ. 20 వేలు పైగానే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక ఉచితం. కానీ జిల్లాలో ప్రస్తుతం ఐదు యూనిట్ల లారీ ఇసుక ధర దూరాన్ని బట్టి రూ. 20 వేలు పైగానే పలుకుతోంది. ఇదంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా గతం నుంచి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉచిత ఇసుక అనే పదం వినడానికే తప్ప ఆచరణలో అమలు కాలేదని చెప్పవచ్చు. గొల్లపూడి గ్రామ శివారు సూరాయిపాలెం ఇసుక రీచ్‌లో ఇసుకను టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ రూ. లక్షలు ఆర్జి స్తున్నారు. ఇబ్రహీంపట్నం గుంటుపల్లి ఇసుక క్వారీలో మంత్రి అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా నది నుంచి అక్రమంగా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తోడేస్తున్నారు. ప్రతిరోజూ 650 లారీలు! నిత్యం 650 లారీలకు సరిపడా 4 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేసి.. లారీలతో రవాణా చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ వేదాద్రి రావిరాల, శెనగపాడు, లింగాల క్వారీల నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అనుచరులు నిత్యం వందలాది లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను తెలంగాణ రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక క్వారీలు బడాబాబుల కనుసన్నల్లో నడుస్తుండటంతో సామాన్య మధ్యతరతి వర్గాలకు ఉచిత ఇసుక అందని ద్రాక్షలా మారింది. దీని ప్రభావం నిర్మాణ రంగంపై గణనీయంగా పడుతోంది. ఇసుకాసురులు ఇసుకను అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ రూ. కోట్లు అక్రమార్జనకు పాల్ప డుతున్నారు. అందినంత దోచేశారు! ఇసుకను పిండి తైలం తియ్యవచ్చన్న నానుడిని టీడీపీ నేతలు వంటబట్టించుకున్నారు. దాన్ని కొంచెం మార్చేసి తైలం బదులు నగదును పిండేశారు. ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఉచిత ఇసుక విధానం అర్థమే మార్చేశారు. అడ్డగోలుగా ఇసుక తవ్వేసి కోట్లు తెలుగు తమ్ముళ్లు కోట్లు మూటగట్టారు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని గ్రామాల వెంబడి కృష్ణానది ఏటి పాయ ప్రవహిస్తుంది. పెద పులిపాక, యనమలకుదురు, చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు ప్రాంతాల్లో ఇసుక క్వారీలు ఉన్నాయి. 2014 ఎన్నికల తరువాత అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెనమలూరు మండలం పెద పులిపాక కేంద్రంగా ఉన్న క్వారీలో అమ్మకాలు చేపట్టారు. నిత్యం 400 నుంచి 600 ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను అమ్మి సొమ్ము చేసుకున్నారు. పేటలో రూ. వెయ్యి కోట్లకు పైగా.. మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు రూపాయి పెట్టుబడి లేకుండా అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లోరి వేదాద్రి–రావిరాల, సుబ్బాయిగూడెం, లింగాల ఇసుక క్వారీల నుండి అక్రమ ఇసుక రవాణాను అడ్డుఅదుపు లేకుండా చేశారు. ఈ ప్రాంతం తెలంగాణాకు సరిహద్దులో ఉండటంతో టీడీపీ నాయకులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నాయకులు యథేచ్ఛగా రవాణా సాగిం చారు. రోజుకు వంద ట్రక్కులకు పైగా తెలంగాణాకు తరలించారు. అంతే కాకుండా రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ట్రాక్టర్లతో డంప్ చేసి రాత్రి వేళల్లో లారీల్లో తెలం గాణ కు తరలించారు. మూడున్నరేళ్లలోనే వెయ్యి కోట్లకు పైగానే ఇసుక అక్రమ రవాణా సాగించారు. ఇసుక ధర భారమే ఉచిత ఇసుక విధానం కేవలం అధికార పార్టీ నేతలకే. సామాన్యుడికి అందుబాటులో లేదు. అధికార నేతలు, కొందరు దళారులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. పేదలు మాత్రం ఇల్లు కట్టాలన్నా, మరుగుదొడ్లకు ఇసుక తేవాలన్నా కూడా అధిక ధరకు ఇసుక తెచ్చుకోవాల్సిన పరిస్థితి. – కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన -
అక్కడ మంత్రి అయితే ఇంటికే!
సాక్షి,మైలవరం : రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్ రాజ్యమేలుతుంటాయి. మైలవరం నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి ఖాయం అనేది ఆ సెంటిమెంట్. 1983 ఎన్నికల నుంచి ఇదో సెంటిమెంట్‌గా మారింది. మైలవరం నుంచి చనమోలు వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 1989లో కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించి మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పదవినలంకరించారు. తదనంతరం కనుమరుగయ్యారు. 1999లో వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. 2004 ఎన్నికల్లో చనమోలు వెంకట్రావు గెలుపొంది, పదవీ కాలం పూర్తి కాకుండానే మృతి చెందారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత ఆయన జలవనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మైలవరం అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ఈ దఫా ఎటువంటి ఫలితాలు వస్తాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
చైతన్యానికి చిరునామా..నందిగామా
సాక్షి, నందిగామ : రాజకీయ చైతన్యం కల్గిన ప్రాంతం నందిగామ నియోజకవర్గం. 1955లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం నాలుగు మండలాలతో దేశంలోని అత్యంత రద్దీ రహదారుల్లో రెండో స్థానం ఆక్రమించిన 65వ నెంబరు జాతీయ రహదారి ఈ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా నందిగామ, కంచికచర్ల పట్టణాలు ఈ రహదారి పక్కనే విస్తరించి ఉన్నాయి. తొలిసారి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందిన వాడే కావడం విశేషం. దేశంలోని జీవనదుల్లో ఒకటైన కృష్ణా నది చందర్లపాడు, కంచికచర్ల మండలాల మీదుగానే తూర్పునకు సాగిపోతుంది. దీనికితోడు నందిగామ, వీరులపాడు మండలాల మీదుగా మున్నేరు, వైరా ఏరు, కట్టెలేరు వంటి ఉప నదులు ప్రవహిస్తాయి. చుట్టూ నీరు ఉన్నప్పటికీ నేటికీ మంచినీరందని గ్రామాలు అనేకం ఉన్నాయి. నందిగామ పట్టణంలో కూడా ఈ సమస్య అధికం. ఇక పారిశ్రామిక పరంగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి వసంత నాగేశ్వరరావు హోం మంత్రి పదవిని అలంకరించారు. అదేవిధంగా రాజకీయ కురు వృద్ధుడిగా పేరుపొందిన ముక్కపాటి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, దేవినేని వెంకట రమణ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అత్యధిక పంచాయతీలు నందిగామ నియోజకవర్గంలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మొత్తం నాలుగు మండలాలున్నాయి. నందిగామ మండల పరిధిలోని 13 గ్రామాలు మాత్రమే నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 10 గ్రామాలు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం నందిగామ మండలంలో 23 గ్రామ పంచాయతీలు, కంచికచర్ల మండలంలో 16, వీరులపాడు మండలంలో 24, చందర్లపాడు మండలంలో 18 పంచాయతీలున్నాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 గ్రామ పంచాయతీలు, ఓ నగర పంచాయతీ ఉన్నాయి. జీవన శైలి నందిగామ నియోజకవర్గంలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. మెట్ట ప్రాంతం కావడంతో పత్తి, మిర్చి, అపరాలు, సుబాబుల్, వరి, మొక్కజొన్న వంటివి అధికంగా సాగు చేస్తారు. దీనికితోడు పాడి పరిశ్రమపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. ఎన్నికల సమయం మినహా మిగిలిన సమయంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నందిగామకు పడమర వైపు దేశంలోని జీవ నదుల్లో ఒకటిగా ఉన్న కృష్ణా నది ప్రవహిస్తోంది. ఉత్తరాన జగ్గయ్యపేట నియోజకవర్గం, తూర్పున తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన మైలవరం నియోజకవర్గం ఉన్నాయి. అధిక శాతం నిరుపేదలే నియోజకవర్గంలో అధిక శాతం నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలే. వ్యాపారాలు చేసే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. సంపన్నుల శాతం అతి తక్కువ. నిరుద్యోగులు అధికం. పారిశ్రామికంగా కూడా నియోజకవర్గం ఎటువంటి వృద్ధి సాధించకపోవడంతో జీవనశైలిలో పెద్దగా మార్పులు కనపడటం లేదు. నందిగామకు ప్రత్యేక స్థానం ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ఇక్కడి నుంచి సీపీఐ తరపున బరిలో నిలిచిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సైతం విజయం ఆయననే వరించింది. 1955 నుంచి ఇప్పటివరకు మొత్తం 14 సార్లు (బై ఎలక్షన్‌తో కలిపి) ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల ద్వారా విజయం సాధించిన వారిలో మొత్తం ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో వసంత నాగేశ్వరరావు ఏకంగా హోం మినిష్టర్‌గా పనిచేయడం గమనార్హం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు నందిగామకు చెందిన వారే. మహిళలే కింగ్ మేకర్లు నందిగామ నియోజకవర్గంలో మహిళల ఓట్లే అత్యంత కీలకం, వారు ఎవరికి ఓటు వేస్తే వారినే విజయలక్ష్మి వరిస్తుంది. నియోజకవర్గంలో మహిళ ఓటర్లే అధికంగా ఉండటంతోపాటు జనాభా పరంగా కూడా వారే అధికం కావడమే కాకండా ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా వీరి శాతమే అధికంగా ఉంటోంది. దీంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ, సంబంధిత అభ్యర్థి ఎమ్మెల్యే కావడం ఖాయం. దాదాపుగా మొత్తం జనాభా 2,54,734 కాగా వీరిలో 1,28,531 మహిళా ఓటర్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో 65 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ జరుగుతుంది. ఓటు వేసే వారిలో మహిళల సంఖ్యే అధికంగా ఉంటోంది. నాడు కంచుకోట! పదకొండు పర్యాయాలపాటు జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. దీంతో 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు విజయం సాధించారు. అయితే ఎన్నికలు పూర్తయిన నెల రోజులకే ఆయన మృతిచెందారు. దీంతో ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గెలుపొందారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్ట లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచినా, డిపాజిట్లు కూడా దక్కలేదు. నందిగామ నియోజకవర్గం మొత్తం జనాభా : 2,54,734 పురుషులు : 1,26,203 మహిళలు : 1,28,531 నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య : 1,93,712 పురుషులు : 95,279 మహిళలు : 98,426 థర్డ్ జెండర్ : 7 విస్తీర్ణం(చదరపు కిలోమీటర్లలో : 718 రెవెన్యూ గ్రామాలు : 81 గ్రామ పంచాయతీలు : 69 -
పదకొండు స్థానాలపై స్పష్టత, మూడింటిలో సందిగ్ధత
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీలో సందిగ్ధం కొనసాగుతోంది. 14 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలపై స్పష్టత వచ్చినా.. కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్లు స్థానాల అభ్యర్థులను అధిష్టానం తేల్చలేదు. సిట్టింగ్‌లు, ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటంతో అధిష్టానం కూడా నాన్చుడి ధోరణి అవలంబిస్తోంది. దీంతో పాటు అనంతపురం స్థానానికి ప్రభాకర్‌చౌదరిని ఖరారు చేశారని మీడియాకు లీకులు ఇచ్చినా, చంద్రబాబు నుంచి ఇంకా హామీ దక్కలేదని తెలుస్తోంది. వీటితో పాటు హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్పను ప్రకటించారని టీడీపీ నేతలు చెబుతున్నా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసెళ్లిన చాంద్‌బాషాను మైనార్టీ కోటాలో ఎంపీగా నిలిపితే బాగుంటుందని పార్టీతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ స్థానాలపై ముఖ్యమంత్రితో పాటు ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, జిల్లా మంత్రి కాలవ శ్రీనివాసులు శుక్రవారం కూడా చర్చలు జరిపారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టిక్కెట్ ఇవ్వకూడదని వ్యతిరేక వర్గీయులైన మల్లిఖార్జున, రామ్మోహన్‌చౌదరి, రమేశ్, నారాయణ, ఉమామహేశ్వరరావు గట్టిగా పట్టుబట్టారు. ఈయనకు టిక్కెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. తమ ఐదుగురిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను చంద్రబాబు ముందుంచారు. అయితే అనంతపురం అసెంబ్లీ స్థానం ఆశించిన అమిలినేని సురేంద్రబాబు కూడా కళ్యాణదుర్గం సీటు కోరుతున్నారు. ఈయన ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వాడని, అతనికి కూడా టిక్కెట్ ఇవ్వొద్దని చౌదరి వ్యతిరేకవర్గం గట్టిగా చెబుతోంది. ఇక ఉమామహేశ్వరరావు కూడా ఇదే సీటు ఆశిస్తున్నారు. ఇతనికి వ్యతిరేకవర్గం మద్దతు ఉంది. అయితే ఇతను కూడా స్థానికేతరుడు. ఉరవకొండ నియోజకవర్గవాసే. దీంతో ఇద్దరూ స్థానికేతరులు కాబట్టి మల్లిఖార్జున, రామ్మోహన్చౌదరిలో ఒకరికి టిక్కెట్ ఖరారు చేయాలని కళ్యాణదుర్గం అసంతృప్తి నేతలు పట్టుబట్టారు. కానీ వీరికి టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదు. చౌదరికి.. లేదంటే సురేంద్రకు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సీఎం నివాసం నుంచి హనుమంతరాయ చౌదరి కన్నీళ్లు రాలుస్తూ బయటకు వచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే చౌదరికి టిక్కెట్ లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా వ్యతిరేకవర్గం అసమ్మతి స్వరం విన్పించడం వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చౌదరికి వ్యతిరేకంగా బలమైనవర్గం ఉందని చూపుతూ ఆ ముసుగులో పరిటాల శ్రీరాంకు టిక్కెట్ దక్కించుకోవాలనే ప్రయత్నం సునీత చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చారని, తమకూ ఇవ్వాలని టీడీపీ ఒత్తిడి తెచ్చి ఆఖరి నిమిషంలో శ్రీరాంకు ఖరారు చేసుకునే ఎత్తుగడ మంత్రి వేస్తున్నట్లు తెలుస్తోంది. మధుసూదన్ గుప్తా పేరే ఖరారయ్యే అవకాశం గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ను చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సర్వేలో పరిస్థితి బాగోలేదని, ఓడిపోయే అవకాశం ఉందని, కాబట్టి గుప్తాకు టిక్కెట్ ఇస్తున్నామని.. సహకరించాలని గౌడ్‌కు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. సర్వేలో తాను బలహీనంగా ఉన్నారనే కారణంతో గుప్తాకు టిక్కెట్ ఇస్తే మంచి మెజార్టీతో ప్రత్యర్థి గెలిచే అవకాశం ఉందని, గుప్తాకు నియోజకవర్గంలో మంచిపేరు లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జేసీ దివాకర్‌రెడ్డి, గుప్తా కోసం పట్టుబట్టడంతో చంద్రబాబు కూడా అతనిపేరు ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శమంతకమణిని తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో యామినీబాలకు ఇవ్వరనేది తేలింది. అయితే అంతా శైలజానాథ్ టీడీపీలోకి వస్తారని ప్రచారం చేసినా, టీడీపీలో చేరేందుకు ఆయన విముఖత ప్రదర్శించారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడం లేదని, అలాంటి పార్టీలోకి నేనెందుకు వెళతానని, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగానే బరిలో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రస్తావనకు తెరపడినట్లే. ఇకపోతే బండారు శ్రావణి, యామినీబాల మధ్య పోటీ ఉంది. వీరిలో ఓ వర్గం శ్రావణికి, మరోవర్గం యామినీకి గట్టిగా మద్దతు ఇస్తున్నారు. శ్రావణితో పోల్చితే యామినీ బాలకు ఇవ్వడమే మంచిదని.. శమంతకమణి ఎన్నికలు చేసుకోగలదని, శ్రావణి అయితే కష్టమని ఓ వర్గం చెప్పినట్లు చర్చ జరుగుతోంది. దీనికి తోడు శ్రావణి అయితే శమంతకమణి కూడా సహకారం అందించరని చెప్పినట్లు సమాచారం. దీనిపై కూడా టీడీపీ అధిష్టానం లాభనష్టాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఎంపీ రేసులో నిమ్మల, అత్తార్ కదిరి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టి టీడీపీలో చేరిన అత్తార్ చాంద్‌బాషాకు చంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోలేదు. మైనార్టీ కోటాలో చాంద్‌బాషాకు ఇవ్వాలని లోకేశ్ సిఫార్సు చేసినా కదిరిలో వైఎస్సార్సీపీ గెలుస్తోందని, చాంద్‌బాషా అభ్యర్థి అయితే గెలిచే ఓట్ల శాతం భారీగా ఉంటుందని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కనీస పోటీ ఇవ్వాలంటే చాంద్‌బాషా కంటే ప్రసాద్ కాస్త మేలని చెప్పినట్లు సమాచారం. దీంతో కదిరిపై టీడీపీ ఆశలు వదులకుని అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీతో పాటు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చాంద్‌బాషాకు టిక్కెట్ ఇస్తే మైనార్టీ ఓట్లు కొద్దిమేర అయిన కలిసొస్తాయని, ఎంపీగా అతను గెలవలేకపోయినా ఆ ప్రభావం రెండుమూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉన్నా పార్టీకి మేలవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిమ్మల అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చినా, చాంద్‌బాషాను కూడా ఆప్షన్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా టిక్కెట్ల కేటాయింపుల్లో పీఠముడి వీడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. -
మైలవరం వివాదంలో ఎస్ఐలే దోషులు..
సాక్షి, విజయవాడ : అధికారం ఉంది కదా.. మనకు అడ్డెవరు అనుకున్న టీడీపీ నేతలు బొక్కబోర్లాపడ్డారు. స్థానిక పోలీసులతో చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బుందులకు గురిచేయాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కొద్ది రోజుల క్రితం మైలవరంలో రాజుకున్న రాజకీయ వివాదాన్ని జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ముగింపు పలికారు. ఎన్నికల్లో తమకు సహకరించాలంటూ నియోజకవర్గంలోని పోలీసులకు వైఎస్సార్ సీపీ నేతలు డబ్బులు ఇవ్వజూపారనే ఆరోపణ అవాస్తమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఎస్ఐలకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని, అవన్నీ అసత్య ఆరోపణలని స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసిన జి.కొండూరు ఎస్ఐ అస్ఫక్, మైలవరం ఎస్ఐ శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వీఆర్‌లోకి పంపించారు. అసలేం జరిగిందంటే.. తమకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు. తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
మైలవరం వివాదంలో ఎస్ఐలే దోషులు..
-
‘సర్జరీ అవుతున్న వ్యక్తి ఆందోళన చేశాడా’
సాక్షి, మైలవరం : మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమ దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటున్న వెంకట రామారావు అనే వ్యక్తి ఆందోళన చేశాడని పోలీసులు కేసు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రలోభాలకు గురిచేశారని మరో కేసు పెట్టారు. పోలీసులు మాపై తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మంత్రికి వత్తాసు పలికి తమ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. నిజంగా మేం డబ్బులిచ్చి పోలీసులను ప్రలోభాలకు గురిచేసినట్టయితే సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలి’ అని కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు') -
మైలవరం పీఎస్ వద్ద ఉద్రికత్త
సాక్షి, విజయవాడ : మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్ఐ నమోదు చేసిన తప్పుడు కేసులు బటయపడతాయని మంత్రి ఆందోళన చెందుతున్నారని కృష్ణప్రసాద్ విమర్శించారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు') మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామనే కక్షతో సదరు సీఐ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. దమ్ముంటే పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
'మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు'
సాక్షి, విజయవాడ : మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులను ప్రయోగించి వేధింపులకు పాల్పడుతున్నారని మైలవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంత్రి దేవినేని ద్వారా మైలవరం సీఐ పోస్టింగ్ తెచ్చుకున్న సంగతి అందరికి తెలుసన్నారు. ఆ కృతజ్ఞతతో ప్రతిచోటా వైఎస్సార్సీపీ నేతలపై సదరు సీఐ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామనే కక్షతో సదరు సీఐ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు.పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. దమ్ముంటే పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాము ఏ పోలీసు అధికారిని డబ్బు కవర్లతో ప్రలోభ పెట్టలేదన్నారు. మంత్రి దేవినేని ఉమ చేతుల్లో పోలీసులు పావులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక దేవినేని తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మైలవరం సీఐని తమపై ప్రయోగించారన్నారు. ఎల్లో మీడియాలో తమపై అసత్య ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. -
గెలిచే నియోజకవర్గం ఏదీ!
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై పలువురు మంత్రులు ఊగిసలాడుతున్నారు. ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయని పలువురు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు తమపై వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని సురక్షిత స్థానాల కోసం పావులు కదుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రివర్గంలో ముఖ్యులుగా ఉన్న వారు పోటీ చేసే స్థానాలపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. రాజధాని వ్యవహారాల్లో కీలకంగా ఉన్న మంత్రి నారాయణ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో చిత్తూరు జిల్లా తిరుపతి స్థానంపై దృష్టి పెట్టినా చివరికి నెల్లూరు సిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండి గత ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా తెరవెనుక మంత్రాంగం నడిపి టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రి అయిన నాటి నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. లోకేష్‌కు సురక్షిత స్థానం కోసం అన్వేషణ విమర్శల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు ఈసారి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ ఇటీవలే ప్రకటించారు. దొడ్డిదారిన మంత్రివర్గంలో చేరారని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదని ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన సులువుగా గెలిచే నియోజకవర్గం కోసం అన్వేషిస్తున్నారు. మొదట్లో కృష్ణా జిల్లా పెనమలూరును పరిశీలించినా అక్కడ అంత ఈజీ కాదని తేలడంతో విరమించుకున్నారు. తన మామ, సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం అయితే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినా, కుటుంబంలో ఇబ్బంది వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీకాదు సొంత జిల్లా చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తే బాగుంటుందని, అదీ చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. చంద్రగిరిపైనా వారి దృష్టి కనిపిస్తోంది. అయితే చివర్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఆలోచనే విరమించుకునే అవకాశం కూడా లేకపోలేదు. పక్కచూపులు చూస్తున్న దేవినేని ఉమ కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు ఈసారి మైలవరాన్ని వదిలివేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉండి చక్రం తిప్పినా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన చూపు నూజివీడుపై పడినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు మైలవరం నుంచి గెలిచిన నేపథ్యంలో ఈసారి ప్రజలు మార్పు కోరుకునే పరిస్థితులున్నాయని ఆయన అనుమానిస్తున్నారు. మంత్రయ్యాక ఆయన తీరు మారిపోయిందని సొంత క్యాడరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మైలవరంలో తాను హ్యాట్రిక్ కొడతానని పైకి చెబుతున్నా లోలోపల మాత్రం ప్రత్యామ్నాయ సీటు కోసం చూస్తున్నారు. అయితే దేవినేని ఉమ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది. డోలాయమానంలో గంటా విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మళ్లీ భీమిలి నుంచి పోటీ చేసే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాను భీమిలిని వదిలేది లేదని ప్రకటించినా చివర్లోనైనా నియెజకవర్గం మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన టీడీపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రులు అచ్చెంనాయుడు, ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీట్లకు గ్యారంటీ కనిపించడంలేదు. అచ్చెంనాయుడు, ఆది, పుల్లారావులను ఎంపీలుగా పోటీ చేయించే ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. సీటు డౌటే ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్థానానికి గ్యారంటీ కనిపించడంలేదు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఆ సీటును దక్కించుకోవడం కష్టమేనని చెబుతున్నారు. ఆ సీటు కోసం రాజప్ప ప్రత్యర్థి బొడ్డు భాస్కరరామారావు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం, అది ఆయన సొంత నియోజకవర్గం కావడంతో రాజప్ప సీటు గల్లంతేనని ప్రచారం జరుగుతోంది. ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పార్టీ అధినేత సీటు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. -
మంత్రి ఉమ కనుసన్నలలోనే ఇసుక మాఫియా
భవానీపురం (విజయవాడ పశ్చిమ): మంత్రి దేవినేని ఉమా అండదండలతోనే అండదండలతోనే ఇసుక మాఫియా హల్చల్ చేస్తోందని ది విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లు నాగరాజు, మోతుకూరి రామకృష్ణ అన్నారు. భవానీపురంలోని అసోసియేషన్ ఆఫీస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇసుక రీచ్‌లన్నీ ఆయన నియోజకవర్గంలో ఉన్నందున ఇసుక అక్రమ రవాణా ఆయన కనుసన్నలలోనే జరుగుతోందని, టిప్పర్ యజమానులు ఇసుక ధరను పెంచేశారని దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఈ నెల 15వ తేదీన నారెడ్కో విజయవాడ చాప్టర్ అధ్యక్షుడు వి.సుబ్బారావు తాము ఇసుక ధరలను అమాంతం పెంచేశామని చెప్పటాన్ని వారు ఖండించారు. నిన్న మొన్నటి వరకు టిప్పర్ ఇసుక రూ.2 వేలకే అందించామని గుర్తు చేశారు. గొల్లపూడి పరిధిలోని సూరాయిపాలెం ఇసుక రీచ్‌ను ఆధిపత్య పోరుతో వారం రోజులుగా మూసేశారని, దీంతో ఇసుక సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఇక గుంటుçపల్లి రీచ్‌లో ప్రయార్టీ బళ్లు పేరుతో వారి టిప్పర్లకే ప్రాధాన్యతనిస్తున్నారని, తమలాంటి లారీ యజమానులు ఆ రీచ్‌లో ఉదయం బండి పెడితే సాయంత్రానికి ఒక లోడు వస్తుందని, అదికూడా గ్యారెంటీ లేదని వివరించారు. పెర్రి రీచ్లోకూడా ఇదే పరిస్ధితి నెలకొందని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు దూరా న్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు అమ్ముతున్నామని, అందులో రీచ్‌లో చెల్లించాల్సిన రూ.800లు, డ్రైవర్ బేటా, డీజిల్ ఖర్చులు పోను రూ.500లు మిగలటం కష్టంగా ఉందన్నారు. సుబ్బారావు చెప్పినట్లు ఎవరైనా రూ.6వేలకు అమ్మితే ఆయన ఫిర్యాదు చేయవచ్చని, అమ్ముతున్న వ్యక్తి పేరు, లారీ నెంబర్ తమకు తెలియపరిస్తే తామే పోలీసులకు అప్పగిస్తామన్నారు. తలపట్టుకున్నాం... సూరాయిపాలెం రీచ్‌లో జరుగుతున్న ఆధిపత్య పోరుపై ఆయనే ఏమీచేయలేక తలపట్టుకున్నట్ల తెలుస్తుందన్నారు. సూరాయపాలెం, గుంటుపల్లి ఇసుక రీచ్‌లలో జరుగుతున్న దందాపై ఫిర్యాదు చేసేందుకు 1100, 104 నెంబర్లకు ఫోన్‌చేస్తే ఎత్తి ఆ పేర్లు వినగానే పెట్టేస్తున్నారని తెలిపారు. గతంలో భవానీపురంలో ఇసుక రీచ్ ఉన్నప్పుడు లారీ ఇసుక రూ.15 నుంచి రూ.18వేలకే అమ్మామని గుర్తు చేశారు. ఇప్పటికీ భవానీపురంలో రీచ్‌ను తెరిచే అవకాశం ఉన్నా గొల్లపూడిలోని మంత్రి ఉమా అనుయాయులు ఒప్పుకోకపోవడంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. ఏడాది క్రితం అప్పటి సబ్ కలెక్టర్ తమకు రోజుకు నాలుగు ట్రిప్పులు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా అది అమలు కావడం లేదని చెప్పారు. ఇసుక ఎక్కువ ధరలకు అమ్మి పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, రీచ్‌ల నుంచి స్రక్రమంగా అందితే తక్కువ ధరకే విక్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, కె.లక్ష్మీనారాయణ, ఎమ్.చినవెంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పానీ’పట్టు యుద్ధం
సాక్షి, విజయవాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. పోలవరం కుడికాలువ పట్టిసీమపై ఏర్పాటు చేసిన పంపుసెట్లకు విద్యుత్ సరఫరా విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఉమా సొంత నియోజకవర్గం మైలవరంలో నీరు ఇచ్చి గన్నవరం నియోజకవర్గంలోని రైతులకు నీరు ఇవ్వకుండా తెర వెనుక రాజకీయం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి రోడ్డెక్కారు. త్వరలోనే ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానంటూ వెల్లడించారు. ఉమా ద్వంద్వనీతి.. పోలవరం కుడి కాల్వ మైలవరం, గన్నవరం నియోజకవర్గాల మీదుగా కృష్ణానదికి చేరుతుంది. ఈ కాల్వ కోసం గన్నవరం రైతులు భూములు ఇచ్చారు. దీనికి ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించింది. ఇక్కడ కాల్వల కంటే వ్యవసాయ భూములు ఎత్తుగా ఉండటంతో నీరు ఎక్కదు. పట్టిసీమ నీరు ఈ కాల్వ లో వెళ్తుండడంతో గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్లు పెట్టుకుని నీరు తోడుకుంటారు. అదే తరహాలో మైలవరం నియోజకవర్గంలోనూ రైతులు చేస్తారు. మంత్రి ఉమాకు, ఎమ్మెల్యే వంశీకి ఉన్న మనస్పర్ధల కారణంగా గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్ల ద్వారా నీరు తీసుకోవడం మంత్రికి మనస్కరించడం లేదు. తన నియోజకవర్గ రైతులకు మోటార్ల ద్వారా నీరు తోడుకునేందుకు అనుమతిచ్చే ఉమా గన్నవరం రైతుల విషయంలో మాత్రం పక్షపాత ధోరణి వహిస్తున్నారనే విమర్శలు ఆపార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఆది నుంచి వివాదమే.. పట్టిసీమ నీరు వచ్చిన తొలి ఏడాది నుంచి నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. మొదటి ఏడాది గన్నవరం రైతులు మోటార్లు పెట్టగానే ఇరిగేషన్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వివాదం అవ్వడంతో అనుమతించారు. రెండో ఏడాది అదే తంతు. దీంతో ఎమ్మెల్యే వంశీ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన తరువాత ఆ ఏడాది అనుమతిచ్చారు. మూడో ఏడాది మోటార్లకు కరెంటు ఇవ్వకుండా విద్యుత్ అధికారులు మోకాలు అడ్డుపెట్టి చివరకు విద్యుత్ ఇచ్చారు. ఈ ఏడాది తిరిగి మోటార్లకు విద్యుత్ ఇవ్వబోమంటూ తెగేసి చెప్పారు. ఎస్పీడీసీఎల్ అధికారి నాయక్‌తో ఎమ్మెల్యే వంశీ ఫోన్లో మాట్లాడినా విద్యుత్ చార్జీలు చెల్లిస్తామని చెప్పినా లాభం లేకపోయింది. దీంతో సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా సోమవారం ఉదయం టీడీపీ నాయకులు ధర్నా చేసి విద్యుత్ అధికారులకు మెమోరండం ఇచ్చినా ఫలితం లేకపోయింది. మైలవరం నియోజకవర్గంలో మోటర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి..గన్నవరం నియోకవర్గంలో మోటార్లకు విద్యుత్ ఇవ్వకపోవడంతో పై ఎమ్మెల్యే వంశీ సీరియస్ అవుతున్నారు. మంత్రి దేవినేని ఉమా వల్లనే తమకు ఈ ఏడాది సాగు నీరు అందడం లేదని రైతాంగం అభిప్రాయపడుతోంది. సీఎం దృష్టికి సమస్య.. విద్యుత్‌బిల్లులు చెల్లిస్తామని చెప్పినా మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడాన్ని నిరసిన్తూ ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. రైతులపై మంత్రి వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏమైనా అధికారపార్టీకి చెందిన ఈ ఇద్దరి నేతల కుమ్ములాటల మధ్య రైతన్నలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా కోరుతూ ధర్నా గన్నవరం: మండలంలోని మెట్ట ప్రాంతాల్లో సాగునీటి చెరువులకు పట్టిసీమ నీటిని పంపింగ్ చేసుకునేందుకు వీలుగా మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలవరం కాలువ భూసేకరణకు సహకరించిన రైతులకు పట్టిసీమ నీటి సరఫరా చేసేందుకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేసినప్పటికి ఆ శాఖ అధికారులు లెక్కచేయడం లేదని ఆ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గంలో నీటి పంపింగ్‌కు విద్యుత్ సరఫరా ఇస్తున్న అధికారులు, ఇక్కడే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అధికారుల వైఖరి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైన అధికారులు వైఖరి మార్చుకోకపోతే ఎమ్మెల్యే ద్వారా సీఎంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
‘దేవినేని ఉమ చేతకాని దద్దమ్మ’
విజయవాడ : ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతకాని దద్దమ్మ అని, కృష్ణా జిల్లాకు పట్టిన దరిద్రమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి పార్థసారథి తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారధి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కట్టినట్లు ఉందని విమర్శించారు. నీటిపారుదల శాఖా మంత్రిగా ఉంటూ ఇసుక దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు నాలుగేళ్లలో తామేదో సాధించినట్లు మంత్రిలా కాకుండా ఓ మంత్రసానిలా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ అఫిడవిట్ చూసి ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని తెలిపారు. బీజేపీకి ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేదని, అఫిడవిట్లో చెప్పిన అంశాలు అనేకసార్లు గొప్పగా చెప్పారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేతలు ఏ ప్రాతిపదికన బీజేపీతో జతకట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముంపు మండలాల సమస్య స్థాయలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడితే ఎగతాళి చేసింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి టీడీపీ వంతపాడిందని ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించడానికి టీడీపీకి ఎందుకు భయమన్నారు. ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజీ కోసం ఎందుకు సిద్ధపడ్డారని, నాలుగేళ్లు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా చూశారని ప్రశ్నించారు. -
సెక్స్ రాకెట్ వెనుక టీడీపీ పెద్దలు
విజయవాడ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ కేసులో నిందితులకు అండగా టీడీపీ పెద్దలు ఉన్నట్లు బట్టబయలైంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితురాలు శోభారాణితో మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు, ఇతర నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం బహిర్గతమైంది. విజయవాడ : నగరంలోని జక్కంపూడి కాలనీలో శోభారాణి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వన్‌టౌన్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఆయన అనుచరులతో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈ కేసును నీరుగార్చేవిధంగా పోలీసు అధికారులు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏకంగా కొందరు పోలీసు మిత్రులే ఏజెంట్లుగా ఉండటం పట్ల కూడా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు సూత్రధారులకు రక్షా కవచం.. అసలు సూత్రదారులు అయిన టీడీపీ నేతలలకు పోలీసులు రక్ష కవచంగా నిలిచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెక్స్ రాకెట్ బట్టబయలవటంతో అనివార్యంగా పోలీసులు శోభారాణిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు. జిల్లా ముఖ్యనేత ఒత్తిడితో ఈ కేసులో పోలీసులు వెనుకడుగ వేసినట్లు బహిరంగంగా ప్రజానీకం పోలీసు అధికారుల వద్దే ఆరోపించటం గమనార్హం. ఈ బహిరంగ విచారణకు వెళ్లిన జాయింట్ సీపీ కాంతి రాణా టాటాకు కూడా కొందరు స్థానికులు నిందితులకు రక్షణగా టీడీపీ నేతలు ఉన్నారని ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల కేసులో నిందితులు అరెస్టు... వైస్సార్ కాలనీలో ఓ యువతి ఇచ్చిన పిర్యాదుపై లోతైన విచారణ చేయటానికి సీపీ గౌతం సవాంగ్, జాయింట్ సీపీ కాంతిరాణా టాటాను నియమించారు. దాంతో ఆయన శుక్రవారం జక్కంపూడి కాలనీకి వెళ్లి బహిరంగంగా విచారణ జరిపారు. ఈ విచారణలో శోభారాణి ప్రవర్తనపై స్థానికులు పిర్యాదు చేశారు. గతంలో శోభారాణిపై తాము టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసు అధికారులు పట్టించుకోలేదని జాయింట్ సీపీకి చెప్పారు. దీంతో ఆయన స్థానికులతో మాట్లాడుతూ విచారణ జరిపి సంబందిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జాయింట్ సీపీ బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమెకు వైద్యపరీక్షలు జరిపించి పునరావాసకేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ ఓ ప్రకటన విడుదల చేస్తూ మహిళ ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ఆటో డ్రైవర్ సతీష్, శోభారాణిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేసి కేసును మాఫీ చేయటానికి ప్రయత్నించిన వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు గైకొంటామన్నారు. -
కథ బాగా చెప్పాడు... సినిమా బాగా తీశాడు
‘‘ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. ‘చాలా చిత్రాలకు రచయితగా పని చేసిన ఓ కుర్రాడి దగ్గర మంచి కథ ఉంది. ఓసారి విన’మని నాకు చెప్పారు కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, రైటర్ రమేశ్రెడ్డిగారు. విన్నాను. మొదటి సిట్టింగ్‌లోనే నచ్చింది. కథ బాగా చెప్పారు కానీ సినిమా ఎలా తీస్తారు? అని అడిగాను. ఆ రోజు ఆయనేమన్నా ఫీలయ్యాడేమో తెలియదు కానీ ‘అవకాశం ఇవ్వండి సార్ బాగా తీస్తా’ అన్నాడు. చెప్పినట్లే బాగా తీశాడు’’ అన్నారు గోపీచంద్. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో గోపీచంద్, మెహరీన్ జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. కె. చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. గోపీసుందర్ స్వరకర్త. జూలై 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. ఈ వేడుకలో ఆడియో బిగ్ సీడీని, సీడీని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ విడుదల చేసి, గోపీచంద్‌కు అందచేశారు. గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘నేను చేసిన 25 సినిమాల్లో ‘యజ్ఞం’లో మంచి మెసేజ్ ఉంటుంది.అలాంటి మెసేజ్‌తోపాటు మంచి కమర్షియల్ వేల్యూస్ ఉన్న సినిమా ‘పంతం’. ఈ చిత్రం ద్వారా ఓ స్ట్రాంగ్ మెసేజ్ చెప్పగలిగానని తృప్తిగా ఉన్నాను. రాధామోహన్‌గారు మేకింగ్‌లో కాంప్రమైజ్ కాలేదు. గోపీసుందర్‌గారు చక్కని బాణీలతో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు’’ అని చెప్పారు. ‘‘మన దేశాన్ని పట్టి పీడించే సమస్యను ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేశాం. గోపీచంద్ 25వ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు రాధామోహన్. ‘‘కమాండబుల్ యాక్టింగ్, మంచి వాయిస్ ఉన్న హీరో గోపీచంద్. మ్యాన్లీగా ఉంటారు. నేను ఓ సీన్ రాసుకున్నప్పుడు 70 మార్కులు పడితే నూటికి నూరు మార్కులు పడేలా గోపీచంద్ యాక్ట్ చేశారు’’ అన్నారు కె. చక్రవర్తి. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా ఎఫ్.డి.సీ చైర్మన్ అంబికాకృష్ణ, నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, దర్శకులు సంపత్ నంది, బాబి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
ఇది కసాయి ప్రభుత్వం : రఘువీరా
కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఆగిరిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న బెజవాడ శ్రీనివాస రావు కుటుంబాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలో కసాయి ప్రభుత్వం పాలన చేస్తోంది. ప్రత్యేక హోదా రాకపోతే తన కుమారుడికి ఉద్యోగం రాదనే బాధతోనే ప్రత్యేక హోదా కోసం శ్రీనివాస రావు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం శ్రీనివాస్ కుమారుడికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. పార్టీ తరపున మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.25 వేల ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు రఘువీరా రెడ్డి తెలిపారు. -
దేవినేని ఉమపై ధ్వజమెత్తిన రోజా
సాక్షి, పామర్రు : మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆదివారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పామర్రులో ఏర్పాటుచేసిన బహింరంగ సభలో ఆమె ప్రసంగించారు. హోదా కోసం రాజీనామా చేయని టీడీపీ నేతలు ప్రజాద్రోహులని ఆమె మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరు తన ఇంట్లో దొంగతనం చేసి తానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు ధర్మ పోరాటమని నాటాకాలు ఆడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రి దేవినేని ఉమ అసెంబ్లీలో.. జగన్మోహన్ రెడ్డీ పోలవరం ప్రాజెక్ట్ 2018లోపు పూర్తవుతోంది.. మీ సాక్షి పేపర్లో రాసుకో అంటాడు. మరీ ఇప్పటివరకు పూర్తైన దాఖలాలు ఉన్నాయా’ అని రోజా నిలదీశారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో అడుగుపెడితే కృష్ణమ్మ పరవళ్లు తొక్కినట్లు జనసమూహం స్వాగతం పలికిందని, దీనికి భయపడ్డ తెలుగు తమ్ముళ్లు ధర్మ దీక్ష అని దొంగ దీక్ష పెట్టారని దుయ్యబట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్ పిల్లను ఇస్తే.. ఆయనకే వెన్నుపోటు పొడిచి.. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటే.. వైఎస్సార్, జగన్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వైఎస్సార్ సీపీకి ఓటేయాలన్నారు. అది ఎలా ఉండాలంటే ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోందో అలా పామర్రు ఓటర్లు ఉండాలన్నారు. డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తులు కూడా వైఎస్ జగన్ గురించి మాట్లాడుతున్నారని, జగన్ బొమ్మపై గెలిచి మోసం చేసిన ఆ శాసనసభ్యురాలికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. -
మంత్రి మతి భ్రమించి మాట్లాడుతున్నారు
విజయవాడ: మంత్రి దేవినేని ఉమ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్ఆర్సీపీ ఎంపీలు చిత్తశుద్ధితో పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్షలు చేస్తున్నారని కానీ టీడీపీ ఎంపీలు పదవులను అంటిపెట్టుకుని, రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా అంటూ ముందుగానే పోలీసులకు లీకులు ఇచ్చిన ఘనత టీడీపీ నాయకులదేనన్నారు. సిగ్గులేకుండా ప్రత్యేక హోదా పోరాటం చేస్తున్నామని దేవినేని ఉమ సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు. -
మంత్రి ఉమాకు ఓటమి భయం పట్టుకుంది
ఇబ్రహీంపట్నం (మైలవరం) : జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి రమేష్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై బనాయించిన అక్రమ కేసుల అంశంపై ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో ఏమిచేయాలో తోచక అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను ఇబ్బందిపెట్టే పనుల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఈ నెల 8న వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు మేరకు ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయింపజేసిన మంత్రి ఉమా, పోలీసుల తీరుపై మండిపడ్డారు. గత నెల 29న కూడా కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు నిర్వహించిన ‘వాక్ విత్ జగనన్న’ పాదయాత్రలో భారీ జనసందోహం పాల్గొనడంతో ఖంగుతిన్న మంత్రి ఆ రోజు నుంచే అక్రమ కేసులు బనాయించేందుకు కుటిల యత్నాలు చేస్తున్నాడన్నారు. అనారోగ్యంతో మరణించిన ఓ వృద్ధుడి శవాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే పోస్టుమార్టానికి తరలించి పాదయాత్ర వల్ల మరణించాడని చిత్రించేందుకు విఫలయత్నం చేశాడన్నాడు. రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. పోలీసులు న్యాయం వైపు నిలవాలని, లేకుంటే పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చినవారవుతారన్నారు. అక్రమ కేసులను ప్రజాబలంతో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. -
హరీష్‌రావు లేఖకు దేవినేని స్పందన
అమరావతి: ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల రాసిన లేఖకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ హరీష్‌రావుకు రాసిన లేఖలో దేవినేని పేర్కొన్నారు. మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీష్‌కు సూచించారు. -
ఆర్డీఎస్ రైతులకు తుంగభద్ర జలాలు
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పథకం పరిధిలోని ఆయకట్టు రైతులకు శుభవార్త. వారికి ఒక ట్రెండు రోజుల్లో తుంగభద్ర జలాలు విడు దల కానున్నాయి. సుమారు 7వేల ఎక రాల్లో వేసిన ఆరుతడి పంటలకు ఈ నీరం దే అవకాశం ఉంది. తుంగభద్ర జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కే వాటాల అంశమై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఏపీ మంత్రి దేవినేనితో బుధ వారం ఫోన్లో మాట్లాడారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై చర్చిం చారు. నీటి విడుదలకు సంయుక్తంగా ఇండెంట్ ఇద్దామని, దీనిద్వారా ఇటు ఆర్డీఎస్కు అటు సుంకేసులకు నీరు చేరుతుందని తెలిపారు. హరీశ్ ప్రతి పాద నకు దేవినేని సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సంయుక్తంగా తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ సమర్పించి నీటిని కోరాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. -
'తెలంగాణ ప్రభుత్వానిది మొండి వాదన'
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం మొండి వాదన చేస్తోందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. నీటి పంపిణీపై బుధవారం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల భేటీ స్పష్టత లేకుండానే ముగిసింది. సమావేశం అనంతరం దేవినేని ఉమామహేశ్వర్రావు న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నీటి పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును తాము కోరడంలేదని దేవినేని తెలిపారు. విభజన చట్టం ప్రకారమే నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు గెజిట్ చేసేంత వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు వివాదాస్పదంగా మారాయని దేవినేని అన్నారు. తమ వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. మొండి వాదనలు చేసినంత మాత్రాన చట్టాలు అనుకూలంగా మారవని తెలిపారు. చట్టాల్లో ఏముందో లాయర్లను అడిగి తెలుసుకోండంటూ సూచించారు.