
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పథకం పరిధిలోని ఆయకట్టు రైతులకు శుభవార్త. వారికి ఒక ట్రెండు రోజుల్లో తుంగభద్ర జలాలు విడు దల కానున్నాయి. సుమారు 7వేల ఎక రాల్లో వేసిన ఆరుతడి పంటలకు ఈ నీరం దే అవకాశం ఉంది. తుంగభద్ర జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కే వాటాల అంశమై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఏపీ మంత్రి దేవినేనితో బుధ వారం ఫోన్‌లో మాట్లాడారు.
తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై చర్చిం చారు. నీటి విడుదలకు సంయుక్తంగా ఇండెంట్ ఇద్దామని, దీనిద్వారా ఇటు ఆర్డీఎస్‌కు అటు సుంకేసులకు నీరు చేరుతుందని తెలిపారు. హరీశ్ ప్రతి పాద నకు దేవినేని సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సంయుక్తంగా తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ సమర్పించి నీటిని కోరాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు.