RDS Canal
-
తుంగభద్రపై ఐదు టెలిమెట్రీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు రావాల్సిన జలాలకు మార్గంమధ్యలోనే గండి పడుతోంది. 19.5 టీఎంసీలు రావాల్సి ఉండగా, ఏటా 5 టీఎంసీలకు మించి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ కాల్వకు వస్తున్న జలాలను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడానికి ఐదు చోట్లలో టెలీమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్ కమిటీ వచి్చంది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై మెంబర్ కన్వీనర్‌గా, ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కో ఇంజనీర్ సభ్యులుగా ఉన్న బోర్డు సబ్ కమిటీ ఇటీవల సుంకేశుల, ఆర్డీఎస్, జూరాల ప్రాజెక్టులను సందర్శించింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు విడుదల చేసే రెగ్యులేటర్ వద్ద, కర్ణాటకలో 43 కి.మీ ప్రయాణించి తెలంగాణ సరిహద్దులకు ఆర్డీఎస్ కాల్వ చేరుకునే పాయింట్ వద్ద, తుమ్మిళ్ల ఎత్తిపోతల దగ్గర, సుంకేశుల జలాశయంతో పాటు ఈ జలాశయం నుంచి కేసీ కాల్వకు నీటి సరఫరా చేసే రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ సబ్ కమిటీ త్వరలో కృష్ణా బోర్డుకు నివేదిక సమర్పించనుంది. దీంతో తుంగభద్ర డ్యాం నుంచి ఎన్ని నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు విడుదల చేస్తున్నారు? అందులో ఎన్ని నీళ్లు రాష్ట్ర సరిహద్దులకు చేరుతున్నాయి? తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర నది నుంచి ఏ మేరకు నీళ్లను ఆర్డీఎస్ కాల్వకు మళ్లిస్తున్నారు? సుంకేశుల జలాశయానికి ఎన్ని నీళ్లు వస్తున్నాయి ? సుంకేశుల నుంచి ఏ మేరకు నీటిని కేసీ కాల్వకు తరలిస్తున్నారు ? అన్న విషయాలపై స్పష్టత రానుంది. త్వరలో జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ సబ్ కమిటీ సిఫారసుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
తుంగభద్ర బోర్డుకు తెలంగాణ వినతి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్నవాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టిన కాల్వల ఆధునీకరణ పనులను వేగవంతం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగభద్ర బోర్డుకు విన్నవించింది. కాల్వల ఆధునీకరణ పనుల్లో త్వరితగతిన పనులు పూర్తిచేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరింది. ప్రస్తుతం వర్కింగ్ సీజన్ ఆరంభమైన దృష్ట్యా పనులు మొదలు పెట్టేలా చూడాలంది. ఈ మేరకు రెండ్రోజుల కిందట తెలంగాణ బోర్డు కార్యదర్శికి లేఖ రాసింది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. దీంతో ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 25%, ప్యాకేజీ–2 పనులను మరో 55% వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయి రాష్ట్రానికి ఏటా కనీసం నాలుగు టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. కాల్వల ఆధునీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా ఏపీ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వారం రోజుల కిందట జరిగిన బోర్డు భేటీలో తెలంగాణ నిలదీసింది.దీనిపై ఏపీ, కర్ణాటకల నుంచి స్పందన లేకపోవడంతో మరోమారు లేఖ రాసింది. ఈ కాల్వల ఆధునీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఏపీలకు ఆదేశాలివ్వాలని కోరింది.( చదవండి: దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం) -
‘ఆర్డీఎస్, వేదవతి’ టెండర్లలో కుమ్మక్కు
సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) కుడి కాలువ పనులకు పెంచిన అంచనా వ్యయం రూ. 1,557.37 కోట్లు. ఈ టెండర్లో 4.75 శాతం ఎక్సెస్ (రూ. 1,631.34 కోట్లు)కు ఒక సంస్థ, 4.89 శాతం ఎక్సెస్ (రూ. 1,633.52 కోట్లు)కు మరో సంస్థ కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి. వేదవతి ఎత్తిపోతల పథకం పెంచిన అంచనా వ్యయం రూ. 1,536.28 కోట్లు. ఈ టెండర్లో రాజోలిబండలో రెండో సంస్థ 4.65 శాతం ఎక్సెస్ (రూ. 1,607.71 కోట్ల)కు, రాజోలిబండలో మొదటి సంస్థ 4.85 శాతం ఎక్సెస్ (రూ. 1,610.78 కోట్లు) కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి. ఈ రెండు టెండర్లలో ఆయా సంస్థలు దాఖలు చేసిన మొత్తాలను పరిశీలిస్తే ఏమనిపిస్తోంది? రెండు కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు స్పష్టమవుతోంది కదా! నిబంధనల ప్రకారమైతే ఈ టెండర్లను రద్దు చేయాలి. కానీ.. కాంట్రాక్టు సంస్థలను కుమ్మక్కయ్యేలా చక్రం తిప్పింది రాష్ట్ర ముఖ్యనేత కావడంతో కర్నూలు జిల్లా జలవననరుల శాఖ అధికారులు టెండర్లను రద్దు చేయలేదు. టెండర్లలో వెల్లడైన అంశాలను శనివారం కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కి పంపారు. వేదవతి ఎత్తిపోతలను ఒక సంస్థకు, ఆర్డీఎస్ కుడి కాలువ పనులను మరో సంస్థకు కట్టబెట్టాలని సీవోటీపై ముఖ్యనేత తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువ ధరలకే రెండు ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారు. మొదట అంచనా వ్యయం పెంచేయడంతో ఖజానాకు రూ. 805.29 కోట్ల మేర తూట్లు పొడిచారు. ఆ తర్వాత కమీషన్ల కోసం స్వయంగా ఆ ముఖ్యనేతే కాంట్రాక్టర్లను కుమ్మక్కు చేయడం వల్ల.. భారీ ఎక్సెస్‌కు పనులు అప్పగించాల్సి రావడంతో రూ. 460.02 కోట్ల భారం పడింది. ఈ వ్యవహారంలో రూ. 750 కోట్లకుపైగా ముడుపులు మారనున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. విచ్చలవిడిగా అంచనాల పెంపు కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువ నుంచి కాలువ తవ్వి నాలుగు టీఎంసీలు తరలించడం ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ. 1,557.37 కోట్ల అంచనా వ్యయంతో గత నెల 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్డీఎస్ కుడి కాలువ కోసం 2,15,47,550.42 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేపట్టాలి. 2018–19 ఎస్ఎస్ఆర్ ప్రకారం క్యూబిక్ మీటర్‌కు రూ. 120 చొప్పున మట్టి పనులకు రూ. 258.67 కోట్ల వ్యయం అవుతుంది. 4,40,261.88 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. క్యూబిక్ మీటర్ కాంక్రీట్‌కు సగటున రూ.ఐదు వేలు చొప్పున రూ. 220.13 కోట్లు ఖర్చు అవుతుంది. నాలుగు దశల్లో నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్‌లు, ప్రెజర్మైన్ల కోసం రూ. 600 కోట్లకు మించి ఖర్చు కాదు. కాంట్రాక్టర్ లాభం పది శాతాన్ని కలుపుకున్నా సరే ఈ పనుల అంచనా వ్యయం రూ. 1,186.6 కోట్లకు మించదు. అంటే రూ. 370.77 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. దీనికి ఎక్సెస్ అదనం. ఇదే జిల్లాలో వేదవతి నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 59.91 క్యూసెక్కుల చొప్పున 4.20 టీంఎసీలను ఎత్తిపోసి 80 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ. 1,536.28 కోట్ల వ్యయంతో గత నెల 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 1,66,17,781 క్యూబిక్ మీటర్ల మట్టి పనికి రూ. 199.41 కోట్ల వ్యయం అవుతుంది. 2,04,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు రూ. 102.25 కోట్ల వ్యయం అవుతుంది. మూడు దశల్లో ఎత్తిపోతల పనులకు రూ. 700 కోట్లకు మించి వ్యయం కాదు. కాంట్రాక్టర్ లాభం పది శాతం కలుపుకున్నా.. ఈ పనుల అంచనా వ్యయం రూ. 1,101.76 కోట్లకు మించదు. అంటే.. వేదవతి ఎత్తిపోతల అంచనా వ్యయం రూ. 434.52 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. దీనికి ఎక్సెస్ అదనం. లాలూచీ పర్వం బహిర్గతం..: వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే ముఖ్యనేత ఇద్దరు కోటరీ కాంట్రాక్టర్లతో భేటీ అయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లకు మాత్రమే షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం ఉండేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు ఎంపిక చేసిన ఆ రెండు సంస్థలు మాత్రమే రెండు ప్రాజెక్టుల టెండర్లలో షెడ్యూలు దాఖలు చేశాయి. రెండు సంస్థలు కుమ్మక్కవడం వల్ల చెరొక ప్రాజెక్టు దక్కించుకునేలా అధిక ధరలకు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి. ఈ లాలూచీపర్వం శుక్రవారం ప్రైస్ బిడ్ తెరిచినప్పుడు రట్టయింది. ఈ టెండర్లను ఆమోదిస్తే ఖజానాపై రూ.460 కోట్లకుపైగా భారం పడుతుంది. అంచనా వ్యయాలను నిక్కచ్చిగా లెక్కిస్తే రూ. 805.29 కోట్ల మేర తగ్గుతుంది. నిజాయతీగా టెండర్లను రద్దు చేస్తే ఖజానాకు కనీసం రూ. 1,265.31 కోట్ల మేర మిగులుతుంది. ముఖ్యనేత ఒత్తిళ్లకు తలొగ్గిన సీవోటీ టెండర్లను రద్దు చేస్తుందా? ఆమోదిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. -
మాకు సరిపోగా మిగిలింది మీకు
సాక్షి, హైదరాబాద్ తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ సాగు అవసరాలకు పోగా మిగిలిన జలాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కర్ణాటక మంత్రుల బృందానికి స్పష్టం చేశారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేశాక నీటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ నేతృత్వంలోని బృందం గురువారం ఇక్కడి జలసౌధలో హరీశ్‌రావుతో సమావేశమైంది. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికి, తాగునీటి అవసరాలకు ఆర్డీఎస్లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని ఎంబీ పాటిల్ మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు అవసరమయ్యే నీటి వినియోగం, కర్ణాటక నీటి వాడకానికి అనుమతిపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు 3.5 టీఎంసీల నీటి వాటా ఉందని, ప్రాజెక్టు కింద 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేశాక మిగిలిన నీటిని కర్ణాటక వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని హరీశ్‌రావు కర్ణాటక మంత్రులకు తేల్చి చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయం చెబుతామన్నారు. తుంగభద్ర నీటిని వాడుకున్న దానికి బదులుగా వచ్చే వేసవిలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కోరినా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతేడాది కూడా మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం తాము నారాయణ్‌పూర్ నుంచి ఒక టీఎంసీ నీటిని జూరాలకు తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు విడుదల చేసిన విషయాన్ని కర్ణాటక మంత్రులు గుర్తుచేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ స్నేహ సంబంధాలు కొనసాగిస్తోందని, కర్ణాటక ప్రభుత్వం గతేడాది ఒక టీఎంసీ నీటిని తెలంగాణకు విడుదల చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే రకమైన స్ఫూర్తిని చాటుతోందని మంత్రి హరీశ్ కితాబిచ్చారు. ఆర్డీఎస్‌పై త్వరలో మూడు రాష్ట్రాల భేటీ... ఆర్డీఎస్ ఆధునీకరణ పనులపై ఆంధ్రప్రదేశ్‌తో కలసి త్వరలో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని తెలంగాణ, కర్ణాటక మంత్రులు నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంత రైతాంగానికి 87 వేల ఎకరాలకు ఆర్డీఎస్ నుంచి నీరందాల్సి ఉన్నా ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందట్లేదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉమ్మడి ఏపీలో ఆధునీకరణ పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదని, ఆరు నెలల వర్కింగ్ సీజన్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే ఏపీ సహకారం లేకుండా పనులు పూర్తి కావని కర్ణాటక మంత్రి పాటిల్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ అంశంపై త్రైపాక్షిక సమావేశానికి తెలంగాణ చొరవ చూపాలన్నారు. ఈ ప్రతిపాదనకు హరీశ్‌రావు అంగీకరించారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో బుధవారమే తాను మాట్లాడానని, ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ఇండెంట్‌ను తుంగభద్ర బోర్డుకు పంపించడానికి అంగీకారం కుదిరిందన్నారు. త్రైపాక్షిక సమావేశానికి కూడా దేవినేనితో మాట్లాడతానని హరీశ్ హామీ ఇచ్చారు. సమావేశంలో కర్ణాటక మంత్రులు తన్వీర్‌సైత్, సంతోష్ లాడ్, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు శివరాజ్ తంగడగి, అంపుల గౌడ, ప్రతాప్ గౌడ, అంపయ్య నాయక్, ఎమ్మెల్సీలు కేసీ కొండయ్య, బోస్‌రాజు, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ రైతులకు తుంగభద్ర జలాలు
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పథకం పరిధిలోని ఆయకట్టు రైతులకు శుభవార్త. వారికి ఒక ట్రెండు రోజుల్లో తుంగభద్ర జలాలు విడు దల కానున్నాయి. సుమారు 7వేల ఎక రాల్లో వేసిన ఆరుతడి పంటలకు ఈ నీరం దే అవకాశం ఉంది. తుంగభద్ర జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కే వాటాల అంశమై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఏపీ మంత్రి దేవినేనితో బుధ వారం ఫోన్లో మాట్లాడారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై చర్చిం చారు. నీటి విడుదలకు సంయుక్తంగా ఇండెంట్ ఇద్దామని, దీనిద్వారా ఇటు ఆర్డీఎస్కు అటు సుంకేసులకు నీరు చేరుతుందని తెలిపారు. హరీశ్ ప్రతి పాద నకు దేవినేని సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సంయుక్తంగా తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ సమర్పించి నీటిని కోరాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. -
‘నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలే’
మానవపాడు: జూరాల ఆర్డీఎస్ కాలువలకు వెంటనే నీరు విడుదల చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులైన నీరు విడుదల చేయక పోవటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, దీంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వలు పరిశీలించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ వస్తున్నారని తెలుసుకున్న సుమారు 200 మంది రైతులు శనివారం ఆర్డీఎస్ ప్రధాన కాల్వ వద్దకు వచ్చారు. తమ సమస్యలను వివరించి, వెంటనే నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం సమర్పించనున్నారు. -
ఆర్డీఎస్ కాల్వలో తుంగభద్ర పరవళ్లు
మహబూబ్‌నగర్: తుంగభద్ర నీటితో ఆర్డీఎస్ కాల్వ కళకళలాడుతోంది. ఏటా ఖరీఫ్‌నకు కూడా సాగునీరు సరిగా అందించలేని ఆర్డీఎస్ మే నెలలోనూ ప్రవహిస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురియటంతో తుంగభద్ర నీటి ఉధృతి పెరిగింది. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్ద నీటి ప్రవాహం పెరగటంతో స్థానిక ప్రాజెక్టు అధికారులు కర్ణాటక నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఎగువన ఉన్న 12 తూములను మూసివేయించారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ 29 వరకు నీరు చేరింది. మరో మూడు రోజుల పాటు జిల్లాలోని శాంతినగర్ మండల పరిధిలోని కెనాల్లో నీరు ప్రవహించే అవకాశం ఉంది. -
అర్ధరాత్రి భారీవర్షం
- ఆదివారం రాత్రి కుండపోత వాన - మునిగిన పత్తి, మొక్కజొన్న పంటలు - ఆర్డీఎస్ కాల్వకు గండి - ఆలస్యంగానైనా కరుణించిన వరుణుడు - మానవపాడులో అత్యధికం సాక్షి, మహబూబ్‌నగర్: వరుణుడు మరిపించి.. ఆపై మురిపించాడు. దాదాపు నెలరోజుల తరువాత కాస్త కరుణ కురిపించాడు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జిల్లాలోని అలంపూర్, గద్వాల, కొల్లాపూర్, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో భారీవర్షం కురిసింది. దీంతో నిన్నటివరకు భానుడి నిప్పుల సెగకు వాడిపోయిన మెట్టపంటలకు ఊపిరి పోసినట్లయింది. అయితే, కొన్ని మండలాల్లో భారీవర్షంతో మొక్కజొన్న పత్తి, వరిపంటలు నీట ముని గాయి. వరద ఉధృతి పెరగడంతో ఆర్డీఎస్ కా ల్వకు గండి పడి పంటలు కొట్టుకుపోయాయి. మానవపాడు మండల కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. ఇక్కడ అత్యధికంగా 80 మి. మీ, అలంపూర్ మండలంలో అత్యల్పంగా 38.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీవర్షం తో నియోజకవర్గ రైతులకు కాస్త ఊరట లభిం చినట్లయింది. అయితే శాంతినగర్ మండలం లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రాజోలి శివారులోని వరిపొలాలు కోతకు గురయ్యాయి. పలు గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగా యి. వాగులు, వంకలు పొంగిపార్లడంతో పడమటి గార్లపాడు రోడ్డు కొట్టుకుపోవడంతో దిగువన ఉన్న పొలాల్లో భారీగా ఇసుకచేరింది. అ లాగే రోడ్డు తెగిపోవడంతో పడమటి గార్లపాడు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్డీఎస్ కాల్వకు గండి భారీవర్షానికి ఆర్డీఎస్ ప్రధానకాల్వ 29వ డ్రిస్టిబ్యూటర్కు మూడుచోట్ల గండిపడి సుమారు 100ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాశ్ తన సిబ్బందితో హుటహుటిన సోమవారం ఉదయమే డిస్ట్రిబ్యూటరీ వద్దకు చేరుకుని కాల్వను పరిశీలించారు. ఆర్డీఎస్ కాల్వకు గండ్లు పడినచోట పకడ్బందీగా మరమ్మతులు చేపట్టి కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆదివారం కురిసిన వర్షానికి పంటపొలాల్లోని నీరు కాల్వలోకి చేరడం, కొన్నిచోట్ల కాల్వలో చెత్తచెదారం పేరుకుపోవడంతోనే ఈ గండ్లు పడ్డాయని సీఈ తెలిపారు. కాల్వకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, రబీ సీజన్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సీఈ ప్రకాష్ వెంట ఈఈ రాజేంద్ర, డీఈ రమేష్, ఏఈలు రాజు, వరప్రసాద్‌లు, నీటిసంఘం అధ్యక్షుడు ప్రకాశంగౌడ్, వర్కుఇన్స్పెక్టర్ అబ్దుల్లాషేక్ తదితరులు ఉన్నారు. 24.3 మి.మీ వర్షపాతం నమోదు ఆదివారం అర్దరాత్రి కురిసిన వర్షం రైతులకు ఊరటనిచ్చింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. జిల్లాలో సరాసరిగా 24.3మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీపనగండ్ల, బిజినేపల్లి మండలాలలో 110మి.మీటర్లుగా నమోదైంది. కొన్ని మండలాలు మినహా చాలాచోట్ల చిరు జల్లులకే పరిమితమైంది. లింగాల, భూత్పూర్, అచ్చంపేట, ఉట్కూరు, నారాయణపేట, మిడ్జిల్ తదితర మండలాల్లో నాలుగైదు మి.మీ మాత్రమే కురిసింది. కొడంగల్, షాద్‌నగర్, కొత్తూరు, కోస్గి, దౌల్తాబాద్, బాలానగర్, ఆమన్‌గల్, మాడ్గుల మండలాలలో చుక్క వాన కురవలేదు. ఆగస్టు నెల ముగుస్తున్నప్పటికీ సాధారణ వర్షపాతానికి అందనంత దూరంలో ఉంది. ఈ నెలలో సాధారణంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా, ఇప్పటివరకు 56 మిల్లీమీటర్లే నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 154.6మిల్లీమీటర్లు నమోదైంది. నీటమునిగిన పంటలు ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షం రైతులకు నష్టం కలిగింది. ఇటీవల నాట్లువేసిన వరిపొలాలు కోతకు గురయ్యాయి. వీపనగండ్ల మండలంలోని వీపనగండ్ల, గోవర్ధనగిరి తదితర గ్రామాల్లో వరిపంట నీటమునగడంతో రైతులు ఆందోళనచెందారు. చిన్నంబావి చౌరస్తా, కొప్పునూర్ తదితర గ్రామాల్లో కూడా మొక్కజొన్న పంట పొలంలోనే నేలకొరిగింది. జూరాల పంటకాల్వ డిస్ట్రిబ్యూటర్ 27 సమీపంలోని పం టపొలం కోతకు గురైంది. అలాగే ధరూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపారాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి ఇంత పెద్దవర్షం కుర వడం ఇదే ప్రథమం. మండలంలోని పారుచర్ల, సోంపురం, ధరూరు గ్రామాల్లో చెరువులు నిండాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం లో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి ఓబులోనిపల్లి, ధరూరు చెరువులకు విడుదల చేస్తున్న నె ట్టెంపాడు జలాలకు వర్షపునీరు తోడవడంతో వాగులకు జలకళ సంతరించుకుంది. -
‘కృష్ణా బోర్డు’ ముందుకు సర్కారు అభ్యంతరాలు
* నేడు హైదరాబాద్‌లో కృష్ణా రివర్ బోర్డు భేటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నది యాజమాన్య మండలి సోమవారం ఇక్కడ భేటీ కానుంది. కేంద్ర జల సంఘం కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ పాండ్యా, సభ్యుడు గుప్తాతో పాటు ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరుకానున్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత, దాని ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, వినియోగం తదితర అంశాలపై బోర్డు సమగ్ర వివరాలు సేకరించనుంది. దీంతో పాటు బోర్డు నియంత్రణలో ఉంచాల్సిన ప్రాజెక్టులు, బోర్డు పర్యవేక్షణలో మాత్రమే ఉంచాల్సిన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల నుంచి వ చ్చే ప్రతిపాదనలపై చర్చించనుంది. వివాదాల పరిష్కారంలో భాగంగా మంగళవారం నుంచి బోర్డు సభ్యులు ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను సందర్శించనున్నారు. 6న బోర్డు సభ్యులు నాగార్జునసాగర్‌ను సందర్శించేఅవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాలకోసం నీటి విడుదలపై వివాదం జరుగుతున్న విషయం విదితమే. నెల రోజుల క్రితం డెల్టాకు నీటి విడుదలలో తలెత్తిన వివాదంలో బోర్డు కల్పించుకొని నీటి విడుదల జరిగేలా చొరవ చూపింది. ప్రస్తుతం దీనిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా జూన్‌లో డెల్టాకు నీటి విడుదలపై రాష్ట్రం అభ్యంతరం చెబుతోంది. తాగునీటి అవసరాలపేరుతో ఆంధ్రప్రదేశ్ ఆ నీటిని సాగుకోసం వాడుకుంటోందని, ఈ దృష్ట్యా డెల్టాకు నీటి విడుదలను ఆ సమయంలో కాకుండా మరో సమయానికి మార్చాలని రాష్ట్రం కోరనుంది. ఇక వీటితో పాటు కృష్ణా ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పు మేరకు కృష్ణానది నీటిలో ఉమ్మడి రాష్ట్రానికి 188 టీఎంసీల మిగులు జలాల వాటా దక్కింది. ఈ నీటిని ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులకు వాడుకోవచ్చని తెలిపిన ట్రిబ్యునల్ ఏయే ప్రాజెక్టుకు ఎంత వాడుకోవాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. కేవలం జూరాల ప్రాజెక్టుకు 7 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కెనాల్‌కు 4 టీఎంసీల మిగులు జలాలను వాడుకోవాలని స్పష్టంగా చెప్పిన ట్రిబ్యునల్ మిగతా ప్రాజెక్టులకు నీటి వాడకాన్ని తేల్చలేదు. దీంతో మిగులు జలాలను ఏయే ప్రాజెక్టులు.. ఎంతమేర వాడుకోవాలన్న దానిపై ఇరు రాష్ట్రాలు బోర్డును స్పష్టత కోరే అవకాశం ఉంది.