‘ప్రజలు ఛీ కొట్టినా దేవినేని ఉమా బుద్ధిమారలేదు’ | Malladi Vishnu And Jogi Ramesh Slams On Devineni Uma Maheshwar Rao | Sakshi
Sakshi News home page

‘ప్రజలు ఛీ కొట్టినా దేవినేని ఉమా బుద్ధిమారలేదు’

Published Wed, Jul 28 2021 12:25 PM | Last Updated on Wed, Jul 28 2021 2:59 PM

Malladi Vishnu And Jogi Ramesh Slams On Devineni Uma Maheshwar Rao - Sakshi

సాక్షి,  విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమారలేదని ఎమ్మెల్మే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణప్రసాద్‌ చేతిలో ఓటమిని దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరిగితే.. అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు.

దేవినేని ఉమా అనుచరులతో రాత్రిపూట పరిశీలనకు వెళ్తారా.. దానిని ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేస్తారా అని మండిపడ్డారు. ఏదోరకంగా వసంతకృష్ణప్రసాద్‌పై బురదజల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలని హితవు పలికారు. గతంలో జక్కంపూడిలో దేవినేని ఉమాను ప్రజలే తరిమికొట్టారని గుర్తుచేశారు. దేవినేని ఉమా రాజకీయ నాయకుడు కాదు.. గోబెల్స్ అని ఎద్దేవా చేశారు.


చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్‌లు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్‌లని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవినేని ఉమా కాదు.. సొల్లు ఉమా అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. మైలవరంలో మొత్తం దోచుకున్నది దేవినేని ఉమానేనని, దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్‌ దోచుకున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపారు. దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement