సాక్షి, సత్తన్నపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు జనసేన పవన్ కల్యాణ్ మధ్య ఉన్న ముసుగు మరోసారి తొలిగిపోయింది. వీరిద్దరూ రెండోసారి సమావేశం కావడంతో టీడీపీకి జనసేన మద్దతుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, వీరి భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. జనసేనను టీడీపీలో కలిపేయాలి. చంద్రబాబు, పవన్ కలిసినా మాకు నష్టం లేదు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్‌కు నైతిక విలువలు లేవు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 175 సీట్లకు 175 గెలుస్తుంది.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లాడు. దత్త తండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడు. కందుకూరు, గుంటూరుతో అమాయకులు చనిపోతే పరామర్శించలేదు. పవన్ కల్యాణ్‌కు సిగ్గులేదు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం పవన్‌కు సిగ్గుగా అనిపించడం లేదా?. చంద్రబాబు, పవన్ కలిసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అంగుళం కూడా కదపలేరు.
విజయవాడ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. బాబు చెప్పినట్టు ఆడతాడు కాబట్టే పవన్ దత్తపుత్రుడు అయ్యాడు. ఇప్పుడు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలో పవన్ చెప్పాలి?. ఈ భేటీతో వీరిద్దరి మధ్య ముసుగు తొలిగిపోయింది. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటి?. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడు. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదు అంటూ కామెంట్స్ చేశారు.
సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి@ncbn వద్దకు దత్త పుత్రుడు@PawanKalyan
— Gudivada Amarnath (@gudivadaamar) January 8, 2023
సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్‌కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ! @ncbn @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) January 8, 2023
Comments
Please login to add a commentAdd a comment