
వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు(పాత చిత్రం)
విజయవాడ: మంత్రి దేవినేని ఉమ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్ఆర్సీపీ ఎంపీలు చిత్తశుద్ధితో పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్షలు చేస్తున్నారని కానీ టీడీపీ ఎంపీలు పదవులను అంటిపెట్టుకుని, రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా అంటూ ముందుగానే పోలీసులకు లీకులు ఇచ్చిన ఘనత టీడీపీ నాయకులదేనన్నారు. సిగ్గులేకుండా ప్రత్యేక హోదా పోరాటం చేస్తున్నామని దేవినేని ఉమ సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు.