సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జీ.కొండూరు వివాదంలో టీడీపీ మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు బుధవారం నందివాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగా.. నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. మీడియాతో సహా సాధారణ ప్రజలను సైతం గ్రామంలోకి వెళ్లనివ్వలేదు. పోలీసులు పలుచోట్ల భారీకేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు దేవినేని ఉమాకు కోవిడ్ పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జి.కొండూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతల దాడి చేసిన విషయం తెలిసిందే. దళిత కార్యకర్త సురేష్‌పైనా రాళ్లు, కర్రలతో దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీ.కొండూరు వివాదానికి మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌లు తెలిపాన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment