nandiwada
-
నందివాడ పీఎస్‌కు దేవినేని ఉమా తరలింపు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జీ.కొండూరు వివాదంలో టీడీపీ మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు బుధవారం నందివాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగా.. నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. మీడియాతో సహా సాధారణ ప్రజలను సైతం గ్రామంలోకి వెళ్లనివ్వలేదు. పోలీసులు పలుచోట్ల భారీకేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు దేవినేని ఉమాకు కోవిడ్ పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జి.కొండూరుకి చెందిన వైఎస్సార్సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతల దాడి చేసిన విషయం తెలిసిందే. దళిత కార్యకర్త సురేష్‌పైనా రాళ్లు, కర్రలతో దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడికి ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీ.కొండూరు వివాదానికి మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌లు తెలిపాన విషయం తెలిసిందే. -
లారీ బోల్తా: క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్
నందివాడ: ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నందివాడ మండలం పెదలింగాల వద్ద శనివారం చోటు చేసుకుంది. హనుమాన్ జంక్షన్ వైపు నుంచి గుడివాడ వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా.. కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారు. -
టీడీపీ కార్యకర్తల దుశ్చర్య
నందివాడ: కృష్ణా జిల్లా నందివాడ మండలం పాతరామాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నత్తా శేషగిరిరావు ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు శేషగిరిరావు కుటుంబసభ్యులు నిద్రిస్తున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇరుగుపొరుగు వారు అప్రమత్తం చేయటంతో శేషగిరిరావుతోపాటు ఆయన భార్య నిర్మల, తల్లి నాగేశ్వరమ్మ, కుమారుడు మధుబాబు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై రాంబాబు, వీఆర్వో భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు.