లారీ బోల్తా: క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్
Published Sat, Nov 26 2016 11:15 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM
నందివాడ: ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నందివాడ మండలం పెదలింగాల వద్ద శనివారం చోటు చేసుకుంది. హనుమాన్ జంక్షన్ వైపు నుంచి గుడివాడ వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా.. కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement