చిత్తూరు, సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది మొగిలి ఘాట్ రోడ్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇక్కడి బెంగళూరు - చెన్నై జాతీయ రహదారి.. బుధవారం అర్ధరాత్రి మళ్లీ నెత్తురోడింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్‌లో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రిపేరుతో ఆగివున్న ఓ కలప లోడ్ లారీని.. వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది మరో లారీ. దీంతో.. కలప లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ గాయపడ్డాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు.
డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్ పక్కన నిలిపి రిపేర్ చేస్తున్నాడు. అదే టైంలో.. హుబ్లీ(కర్ణాటక) నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అర్ధరాత్రి 2.30గం. ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. షుగర్ లోడ్ లారీ క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోగా.. క్లీనర్ స్పాట్‌లోనే కన్నుమూశాడు. స్థానికులు డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్‌తో పాటు, మరో లారీ డ్రైవర్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు.
అర్ధరాత్రి ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు.. 108, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసి.. ట్రాఫిక్‌ను పునరుద్ధరించాయి. మరో రెండు నిమిషాల్లో షుగర్ లోడ్ లారీ శ్రీని ఫుడ్స్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మొగలి ఘాట్.. ☠️ స్పాట్
ఈనెల 13 న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన లారీ ప్రమాదంలో 7 మంది మృతి, 33 మందికి గాయాలు
ఈనెల 14 గాజుల పల్లి వద్ద ఇన్నోవా వాహనం ఫ్రంట్ టైర్ పేలి బోల్తా.. ఇద్దరు మృతి
ఈనెల 15 న మొగిలి ఘాట్ లో రోడ్ ప్రమాదాలు నివారణ కు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు
ఈనెల 18 న మొగిలి ఘాట్ రోడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్స్ గుర్తించక.. టెంపో ట్రావెలర్ ను అతివేగంగా ఢీ కొన్న టమోటో బొలెరో ట్రక్ వాహనం. ఏడుగురికి తీవ్ర గాయాలు
తాజాగా.. రెండు లారీలు ఢీ కొట్టి.. ఒకరి సజీవ దహనం, మరోకరు క్యాబిన్‌లో ఇరుక్కుని మృతి
Comments
Please login to add a commentAdd a comment