ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి దేవినేని ఉమాపై మండిపడ్డారు. ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరని ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయిందని, ఫ్రస్టేషన్‌లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు.