సీఎంగా ఉండి రాష్ట్రమంతా అట్టుడికి పోవాలని పిలుపునిస్తారా? అంటూ చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు.మీ వాలకం చూస్తుంటే పోలింగ్‌ను కూడా అడ్డుకునేలా ఉన్నారని ట్విటర్‌లో ధ్వజమెత్తారు. 'ఎన్నికల సభలో కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు నడుం మొత్తం వంచి దీనాలాపన చేసిన వీడియో వైరల్‌గా మారింది. డబ్బు, పచ్చ మీడియా, పాల్, పావలా పార్ట్‌నర్‌ల వల్ల గెలవడం సాధ్యం కాదని అర్థమైనట్టుంది. దొంగ నమస్కారాలు, కొంగ జపాలు చేస్తున్నారు. ఆర్నెల్లు స్నేహం చేస్తే వారు వీరవడం అంటే ఇదేనేమో. చంద్రబాబు యూ-టర్నుల అలవాడు ఆయన పార్ట్‌నర్‌కు వచ్చింది. మొన్నేమో తెలంగాణలో ఆంధ్రా వాళ్లని కొట్టి తరుముతున్నారని అన్నాడు. ఇప్పుడేమో తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నారట. ఆంధ్రాలో జన్మించి దురదృష్టవంతుడయ్యాడట.