సార్వత్రిక ఎన్నికల ముంగిట అందివచ్చిన ప్రతి అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు. ‘బడికొస్తా’ పథకం సైకిళ్లను ఇప్పుడు ఎన్నికల ముందు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సైకిళ్ల పంపిణీ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుంది. పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్లకు లోగోను అమర్చుతున్నారు. ఈ లోగోపై సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఫోటోలను ముద్రించారు. లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు రంగు వేయడం గమనార్హం.