
సాక్షి, పామర్రు : మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. ఆదివారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పామర్రులో ఏర్పాటుచేసిన బహింరంగ సభలో ఆమె ప్రసంగించారు. హోదా కోసం రాజీనామా చేయని టీడీపీ నేతలు ప్రజాద్రోహులని ఆమె మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరు తన ఇంట్లో దొంగతనం చేసి తానే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు ధర్మ పోరాటమని నాటాకాలు ఆడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మంత్రి దేవినేని ఉమ అసెంబ్లీలో.. జగన్‌మోహన్ రెడ్డీ పోలవరం ప్రాజెక్ట్ 2018లోపు పూర్తవుతోంది.. మీ సాక్షి పేపర్‌లో రాసుకో అంటాడు. మరీ ఇప్పటివరకు పూర్తైన దాఖలాలు ఉన్నాయా’ అని రోజా నిలదీశారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో అడుగుపెడితే కృష్ణమ్మ పరవళ్లు తొక్కినట్లు జనసమూహం స్వాగతం పలికిందని, దీనికి భయపడ్డ తెలుగు తమ్ముళ్లు ధర్మ దీక్ష అని దొంగ దీక్ష పెట్టారని దుయ్యబట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్ పిల్లను ఇస్తే.. ఆయనకే వెన్నుపోటు పొడిచి.. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటే.. వైఎస్సార్, జగన్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వైఎస్సార్ సీపీకి ఓటేయాలన్నారు. అది ఎలా ఉండాలంటే ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోందో అలా పామర్రు ఓటర్లు ఉండాలన్నారు. డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తులు కూడా వైఎస్ జగన్ గురించి మాట్లాడుతున్నారని, జగన్ బొమ్మపై గెలిచి మోసం చేసిన ఆ శాసనసభ్యురాలికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment