సాక్షి,తిరుపతి: టీడీపీ నేత నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో చేపట్టబోయే యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. అది యువ గళమా లేక నారా గరళమా? అంటూ ఎద్దేవా చేశారు. కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నవారు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని నిలదీశారామె. తిరుపతి పర్యటనలో భాగంగా బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి రోజా.
టీడీపీకి ప్రతిపక్ష అర్హత కూడా లేదని విమర్శించారు మంత్రి రోజా. లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యాడు. నారా ఫ్యామిలీ ఏపీని అప్పుల్లో ముంచెత్తిందని విమర్శించారు. ‘ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్.. ఇవాళ అన్‌స్టాపబుల్ షోకి వెళ్ళాడు. చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్ళాడు. అలగా జనం, సంకర జాతి వంటి పచ్చి బూతులు తిట్టిన బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోకి వెళ్ళాడు.
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎంతకైనా దిగజారుతాడు. జనసేన కార్యకర్తలతో బీజేపీ, టీడీపీ జెండాలు మోయిస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజలకు మంచి చేసే జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడవండి. ప్రతిపక్షాలు.. కోడి గుడ్డుపై ఈకలు పీకే పని చేయకండంటూ హితబోధ చేశారామె.
అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. టీడీపీ హయాంలో 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 62లక్షల మందికి సంక్షేమ పథకాలు ఇస్తోంది. రెండున్నర లక్షల మందికి అదనంగా జనవరి నెలలో ఇస్తున్నారు అని మంత్రి రోజా తెలిపారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నాడు: మంత్రి అంబటి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment