పవన్‌.. ఆడ బిడ్డ తండ్రిగా ఆలోచించండి: రోజా | Ex Minister Roja Serious Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బాబు, లోకేష్‌.. ఆడ బిడ్డ విలువ తెలుసా?: రోజా

Published Mon, Oct 21 2024 12:29 PM | Last Updated on Mon, Oct 21 2024 1:16 PM

Ex Minister Roja Serious Comments On Chandrababu Govt

సాక్షి, నగరి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను కేవలం కక్ష సాధింపునకు మాత్రమే వాడుకుంటోందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. రాష్ట్రంలో మహిళలపై దాడులు పవన్‌కు, లోకేష్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశయాప్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి రోజా తాజాగా మాట్లాడుతూ..‘కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను కేవలం కక్ష సాధింపునకు మాత్రమే వాడుకుంటోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీస భరోసా ఇవ్వలేకపోతోంది. చంద్రబాబు అసమర్థత వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పవన్‌కు, లోకేష్‌కు కనిపించడం లేదా?. వైఎస్సార్‌సీపీ హయాంలో దిశ యాప్‌ తీసుకొచ్చాం. దిశ యాప్‌ ద్వారా ఎందరో అభాగ్యులకు న్యాయం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశయాప్‌ను వెంటనే పునరుద్ధరించాలి. 

ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్తుతులు పెట్రేగిపోతున్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి పెమ్మసాని అనుచరుడు అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు. హోం మంత్రి , డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది చేతల్లో శూన్యం. మీ చేతగానితనం వల్ల విజయవాడ వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 74 మందికి పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. బద్వేలులో మహిళను హత్య చేస్తే సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ వెళ్లి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ప్రజలు అందరూ కష్టాల్లో ఉన్నారు.. చంద్రబాబు రియాలిటీ షోలో సంతోషంగా ఉన్నారు. ఇంత మంది మహిళలపై అత్యాచారం రాష్ట్రంలో జరుగుతుంటే షూటింగ్‌లో పవన్ బిజీగా ఉన్నారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసింది పవన్‌ అని అడుగుతున్నాను.

మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే స్పెషల్ విమానంలో పంపిస్తారు. కేబినెట్‌లో  మహిళా భద్రత గురించి ఏ రోజైనా చర్చించారా?. దిశ చట్టం, మహిళ పోలీస్ స్టేషన్‌లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు ఆడ బిడ్డ విలువ తెలియదు. పవన్ ఒక ఆడ బిడ్డ తండ్రిగా ఆలోచన చేయండి. కంటి మీద కునుకు లేదు. రాష్ట్రంలో ఆడ బిడ్డల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. బాలకృష్ణ.. షూటింగ్స్‌ చేసుకునే వాళ్లకు ఎందుకు రాజకీయాలు?. మీ నియోజకవర్గంలో అత్తాకోడళ్ళపై అత్యాచారం చేస్తే కనీసం పట్టించుకోవడం లేదు. ఆడబిడ్డలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది.రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టండి. ఓట్లు వేసిన ప్రజల్ని పట్టించుకోండి’ అని హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement