Election Update.. ఏపీలో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ భయభంత్రులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఉద్రిక్తర పరిస్థితులు నెలకొన్నాయి.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా..
- తిరుపతి జిల్లా..
- డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేసిన ఎన్నికల అధికారులు
టీడీపీ అడ్డదారుల్లో గెలిచింది: కాకాణి
- నెల్లూరు జిల్లా..
- మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..
- తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో గెలిచింది.
- పార్టీ తరఫున అభ్యర్థికి బీఫామ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది.
- వైఎస్సార్‌సీపీ ధిక్కరించిన అందరిపై వేటు తప్పదు
- వైఎస్సార్‌సీపీ నైతికంగా విజయం సాధించింది..
- తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఇదే చివరి విజయం అవుతుంది
- న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. విప్ ధిక్కరించిన కార్పొరేటర్స్‌పై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటాం..
- నిస్సిగ్గుగా ఎన్నికల్లో టీడీపీ ప్రవర్తించింది.
టీడీపీ విజయం అనైతికం: తోపుదుర్తి
- అనంతపురం జిల్లా..
- మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..
- హిందూపురంలో టీడీపీ విజయం అనైతికం
- 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీకి బలం ఉంది
- ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ను లాక్కున్నారు
- ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ డాకూలా అరాచకాలు చేస్తున్నారు
- చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.
- హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను అడ్డుకుంటాం
- ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల ద్రోహి
- హంద్రీనీవా కాలువలను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులకు టెండర్లు పిలవడం దుర్మార్గం
- మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి
టీడీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
- ఎన్టీఆర్ జిల్లా..
- టీడీపీలో చిచ్చు రాజేసిన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
- నందిగామ మున్సిపల్ చైర్మన్ కోసం కొట్లాట
- చైర్మన్ కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
- 8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతు
- స్వర్ణలతకు బీఫామ్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం
- తనకు తెలియకుండా బీఫామ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్
- నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ నిలదీత
- 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఇవ్వాలని పట్టుపడుతున్న ఎమ్మెల్యే సౌమ్య
- అధిష్టానం వద్దకు చేరిన ఎంపీ, ఎమ్మెల్యే పంచాయతీ
- నేను ప్రకటించే అభ్యర్థే ఫైనల్ అంటున్న ఎమ్మెల్యే సౌమ్య
- అభ్యర్ధి ఎవరో తేలకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం
పల్నాడు జిల్లాలో ఎన్నిక వాయిదా..
- పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా
- 10 గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గురజాల ఆర్డీఓ మురళి
నందిగామలో ఎన్నిక వాయిదా
- ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
- రేపటికి చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
- కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి
టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
- నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..
- టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టుకోలేక చేతులు ఎత్తేసింది.
- టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు.
- వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయకుండా.. టీడీపీలో ఉన్న వారిపై అనర్హత వేటు తప్పదు.
- గెలిచింది టీడీపీ అభ్యర్థినా.. ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.
- ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతాం..
తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి: లేళ్ల అప్పిరెడ్డి
- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..
- తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి
- ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించ వద్దు
- దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది
- అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?
- ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం
- పోలీసు బలగాలను పెంచాలని కోరాం
- మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు
- 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?
- వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?
- ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది
- వైఎస్సార్‌సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది
- ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు
- తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు
- మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు
- బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు
- ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు
- ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు
- నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం
- పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం
- ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం
- తిరుపతి ప్రతిష్టను టీడీపీ నేతలు దిగజార్చారు
- గతంలో లడ్డూ వ్యవహారం, అంతకుముందు అమిత్‌షా పై దాడి చేశారు
- ప్రపంచవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించారు.
హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ..
- శ్రీసత్యసాయి జిల్లా..
- హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ
- పార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ
- ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీ నేతల బరితెగింపు
- వైఎస్సార్‌సీపీకి చెందిన 16 మందిని లాగేసుకున్న టీడీపీ
- వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి.. బెదిరించిన టీడీపీ నేతలు
- 23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకున్న టీడీపీ
- హిందూపురంలో మొత్తం 38 వార్డులు
తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..
- కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.
- పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.
- మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.
- మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.
- మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.
- మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.
- మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం.
నూజివీడులో ఉత్కంఠ..
- ఏలూరు..
- నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
- 32 మంది కౌన్సిలర్లలో టీడీపీ గెలిచింది ఏడు
- ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్
- వైఎస్సార్‌సీపీ బలం 24 , టీడీపీ బలం 8
- బలం లేకపోయినా వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీపడుతున్న టీడీపీ
- వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రలోభాలకు తెరతీసిన పచ్చ పార్టీ.
- ఫార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన మంత్రి కొలుసు పార్థసారథి
- రాత్రికి రాత్రి ఏడుగురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్న పచ్చ పార్టీ.
- వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల చేరికతో 15కు పెరిగిన టీడీపీ బలం
- ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పార్థసారథి ఓటు
- మంత్రి ఓటుతో సమం కానున్న బలాబలాలు
- నూజివీడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఇరు పార్టీల కౌన్సిలర్లు
మహిళలపై దాడి అమానుషం: గడికోట
- వైఎస్సార్ జిల్లా..
- లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ ఇంటిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.
- శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్..
- నిన్న రాత్రి జాండ్లపల్లిలో జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడికి దిగిన టీడీపీ మూకలు
- ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. కనిపించిన వాహనాల్ని దహనం చేసిన వైనం.
- ఇంట్లో ఉన్న జెడ్పీటీసీ రమాదేవి, గర్భిణీగా ఉన్న ఆమె కోడలిపై దాడి.
- జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యను హత్య చేసేందుకే పథకం ప్రకారం దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు.
- ప్రజలకు సేవ చేసే జెడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగడం దుర్మార్గం
- బీసీ వర్గానికి చెందిన ఆమె ఇంటిపై దాడికి దిగడం కూటమి ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట
- సొంత డబ్బులతో గ్రామంలో అభివృద్ధి చేసే వ్యక్తి జెడ్పీటీసీ కుటుంబం
- కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు?
- ప్రశాంతంగా తయారు చేసిన నియోజకవర్గాన్ని కక్షల దిశగా తీసుకెళ్తున్నారు.
- ఇది మంచి పరిణామం కాదు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచించాలి
- బీసీ నాయకులపై ఈ విధంగా ఇళ్లలో దూరి దాడిచేయడం, కనిపించిన వాహనాలను దగ్ధం చేయడం దారుణం
- మీకు సిగ్గుందా.. ఇలాంటి దాడులతో మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరు
- వృద్ధురాలు , గర్భిణీలపై కూడా దాడి చేయడం సిగ్గుమాలిన చర్య
- ఎవరైతే దాడికి పాల్పడ్డారో.. వారిపై వెంటనే చర్యలు తీసుకోండి.
- ఆ రోజు ఎంపీడీవోపై దాడి జరగకపోయినా ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్ బీసీలపై దాడి జరిగితే ఎక్కడకు వెళ్లాడు?
- కార్యకర్తలు, నాయకులకు మేమంతా తోడుగా ఉంటాం.
- జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.
కాకినాడ..
- కాకినాడలో పోలీసులు ఓవరాక్షన్..
- తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలలో పోలీసుల ఓవరాక్షన్
- మున్సిపల్ చైర్మన్ సుధా బాలుతో పాటుగా కౌన్సిలర్లను కౌన్సిల్ హల్‌లోకి అనుమతించని పోలీసులు
- ఉదయం 11 గంటలకు లోనికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులు
- ఉదయం 10 గంటలకు కౌన్సిల్ హల్‌లో ఉండాలని.. లేదంటే లోనికి అనుమతించమని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు ఆదేశాలు.
- చైర్మన్ ఛాంబర్‌లో కూర్చుంటామని చెప్పినా లోనికి అనుమతించని పోలీసులు.
- పోలీసుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం
నెల్లూరు..
- కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి.
- కార్పొరేటర్స్‌తో కలిసి కార్పొరేషన్‌కి బయల్దేరిన ఎమ్మెల్సీ, సిటీ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి.
- ఇప్పటికే విప్ జారీ చేసిన వైఎస్సార్‌సీపీ..
- ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారందరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్డికి ఓటేయ్యాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి
- విప్ ధిక్కరిస్తే వేటు తప్పదని హెచ్చరిక.
తిరుపతి..
- మేయర్ డాక్టర్ శిరీష వ్యక్తిగత సహాయకుడు నచికేతన్‌పై టీడీపీ నేతలు దాడి.
- టీడీపీ నాయకులు అన్నారాం చంద్రయ్య, కార్యకర్తల హల్‌చల్
- ఈ క్రమంలో దాడి ఘటపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్న మేయర్ అట్టందర్
తిరుపతి..
- భూమన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
- ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం
విజయవాడ..
- నందిగామ, నూజివీడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు
- బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు
- అనారోగ్య కారణాలతో మృతి చెందిన నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులు
- చనిపోయిన వారి వార్డులకు ఎన్నికలు జరపకుండానే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెడుతున్న కూటమి ప్రభుత్వం
- చనిపోయిన కౌన్సిలర్ల వార్డులకు ఎన్నికలు జరపకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎన్నిక పెట్టడంపై అభ్యంతరం
- కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
- నేడు తీర్పునివ్వనున్న కోర్టు
- కోర్టులో ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెట్టిన కూటమి ప్రభుత్వం
- ఇప్పటికే పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ
- నూజివీడిలోనూ ప్రలోభాలకు తెర తీసిన టీడీపీ
- నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక
- బలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి టీడీపీ కుట్రలు
- రాత్రికి రాత్రి వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ
హిందూపురంలో టీడీపీ కుట్రలు..
- వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఎన్నిక
- హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు.
- ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు.
- టీడీపీ బరితెగింపు రాజకీయాలు.
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
తాడేపల్లి..
- నేడు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక
- ఖాళీ అయిన పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
- కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటెయ్యాలని ఆదేశం
- పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలు
- విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధం
తిరుపతి..
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్దం
ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అందరికీ విప్ జారీ.
విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు చేస్తామన్న విప్ రాధాకృష్ణ రెడ్డి
తిరుపతి..
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్‌సీపీ
డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణ రెడ్డి విప్‌గా నియామకం
తిరుపతి కార్పొరేషన్ 46 మంది డివిజన్ కార్పొరేటర్లకు వాట్సాప్ ద్వారా విప్ ఆదేశాలు
విప్‌ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ టీమ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
హిందూపురంలో 144 సెక్షన్..
శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 30 యాక్ట్, 144 సెక్షన్ విధింపు.
చైర్మన్ ఎన్నిక అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్లు లేదన్న డీఎస్పీ మహేష్
తిరుపతి..
పద్మావతిపురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కొనసాగుతున్న బెదిరింపులు, పోలీసుల వేధింపులు
ఆటో నగర్‌లో కార్పొరేటర్ ఉమా అజయ్‌కు చెందిన షాపును ధ్వంసం చేసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు
కూటమికి మద్దతు ఇవ్వకుంటే మిగిలిన ఆస్తులు విధ్వంసానికి దిగుతామని హెచ్చరికలు
తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.
తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment