Chitoor distict
-
అప్డేట్స్.. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అరాచకాలు
Election Update.. ఏపీలో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ భయభంత్రులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఉద్రిక్తర పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు..బుచ్చి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కామెంట్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ డౌర్జన్యాలకు పాల్పడింది. బుచ్చికి నగర పంచాయతీ హోదా ఇచ్చింది వైఎస్ జగన్ వైఎస్జగన్ బొమ్మను చూసే మాకు, కౌన్సిలర్లకు ఓట్లు వేశారు పార్టీ మారిన కౌన్సిలర్లకు మేము ఎక్కడా తక్కువ చెయ్యలేదు.. కానీ వారు మోసం చేసి వెళ్లిపోయారు.. ప్రలోభాలకు లొంగకుండా ఆరుగురు కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పక్కన నిలబడ్డారూ.. వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తాం..టీడీపీకి ఓట్లు వేసిన వారు వెన్నుపోటుదారులయ్యారు: మాజీ మంత్రి కాకాణి టీడీపీ తరపున ఓట్లు వేసిన వారందరూ వెన్నుపోటుదారులులాగా మిగిలిపోయారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికే టీడీపీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది. మంత్రి నారాయణకి ఫిరాయింపు చట్టాల మీద అవగాహన లేదు.. విప్ దిక్కరించిన వారందరూ అనర్హులవుతారు వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన అరుగుర్ని వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తాం.. వారికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చుకుని.. తమ బిడ్డగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటు ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. కార్యకర్తలకు అండగా ఉంటాం మేము రోడ్డెక్కి ప్రతిదాడులు చేస్తే.. జిల్లా అగ్నిగుండం అవుతుంది.. మా కార్యకర్తల జోలికి రావొద్దు.. క్యాష్, పేమెంట్స్ కోసం కార్పొరేటర్స్ టీడీపీ వైపు వెళ్లారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలుతమ పార్టీ కార్పొరేటర్లు ను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని, ఇవాళ కూడా ఎన్నిక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు హైకోర్టులో పిటిషన్కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్విచారణ జరిపిన హైకోర్టురక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్‌కు కోర్టు ఆదేశంకార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్‌కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలుతాడేపల్లి:అసలు చంద్రబాబు మనిషేనా: మాజీ మంత్రి జోగి రమేష్ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి పదవులు గెలుపొందారురాష్ట్రంలో ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదుకానీ మావారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటుమా కార్పోరేటర్లు వెళ్లే బస్సు మీద దాడి చేయడం దారుణంతిరుపతి ప్రతిష్టను దిగజార్చారుఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారుఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ, కేజ్రివాల్‌ని తిట్టారుఅసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా?సిద్దాంతాలు, విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబుఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవటానికే చంద్రబాబు ఢిల్లీ ప్రచారానికి వెళ్లారుఇది కూటమి ప్రభుత్వం కాదు, కుట్రల ప్రభుత్వంవైసీపి కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారుపవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారుఈ దాడులు, దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలిఅధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలిఎన్టీఆర్ జిల్లా:కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందిఎమ్మెల్సీ,మొండితోక అరుణ్ కుమార్రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికలే అందుకు నిదర్శనంఎలాగైనా గెలవాలని వైసీపీ కౌన్సిలర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారుటీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారుసైకిల్ గుర్తు పై గెలిచిన వారు కేవలం ఆరుగురేఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు 13 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని గెలవాలని చూశారువైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని కూడా ఎన్నికలను నిర్వహించుకోలేకపోయారునందిగామ ఎమ్మెల్యే ఓ డమ్మీ ఎమ్మెల్యేఎంపీకి , ఎమ్మెల్యేకి పొసగడం లేదని మీ అనుకూల మీడియాల్లోనే చెబుతున్నారుపార్టీ విప్ ను టీడీపీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారని వార్తలొస్తున్నాయిమీరు డమ్మీ ఎమ్మెల్యే అని మేం చెప్పడం లేదు...మీ పార్టీవాళ్లే చెబుతున్నారు13 మంది సభ్యుల బలం ఉందని చెప్పుకుంటున్న మీరు ఎందుకు ఎన్నిక జరుపుకోలేకపోయారువైఎస్సార్సీపీ కౌన్సిలర్ మంద మరియమ్మ ఇంటిని ప్రొక్లెయినర్లతో కూల్చేశారుటీడీపీకి ఓటేయకపోతే నీ ఇంటిని కూల్చేసినట్లు నిన్ను కూడా కూల్చేస్తామని మరియమ్మను హెచ్చరించారుబెదిరించి,భయపెట్టి మంద మరియమ్మను టీడీపీలో చేర్చుకున్నారుతమకు లొంగకపోతే బెదిరిస్తున్నారు...భయపెడుతున్నారు...ఆస్తులను ధ్వంసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నందిగామలో అరాచకాలు పెరిగిపోయాయిప్రభుత్వం రాగానే జగనన్న వాక్‌ను ధ్వంసం చేశారుమేం చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారుగత ఐదేళ్లలో నందిగామలో రాజకీయంగా ఒక్క 307 కేసు కూడా పెట్టలేదుకానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 307 కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారునందిగామ మున్సిపల్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పై మేం కోర్టుకు వెళ్లాంఛైర్మన్,వైస్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారు చనిపోతే ఆ వార్డులలో ఎన్నికల కోసం మేం కోర్టుకు వెళ్లాంనందిగామలో టీడీపీ అంతర్గత ప్రజాస్వామ్యం నడిపిస్తున్నారుకౌన్సిలర్లను ఐదు గంటలుగా బంధించారు.. ఫోన్లు లాక్కున్నారుస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సూచిస్తున్నాఇంకా ఎన్నాళ్లు డమ్మీ ఎమ్మెల్యేగా ఉంటారునందిగామ నియోజకవర్గాన్ని అపహాస్యం చేశారుటీడీపీ ప్రలోభాలకు గురిచేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లంతా మాతో టచ్ లో ఉన్నారుసరైన సమయంలో సరైన ట్విస్ట్ ఇస్తాం ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు..విజయవాడ..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదుతిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలపై ఫిర్యాదుఈసీకి ఫిర్యాదు చేసిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మికుట్రలతో టీడీపీ విజయం..ఏలూరు..కుట్రలతో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ను దక్కించుకున్న టీడీపీబలం లేకపోయినా గెలిచేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసిన మంత్రి పార్ధసారధితీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికకు హాజరైన 30 మంది కౌన్సిలర్లుఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గైర్హాజరు14 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లలో టీడీపీకి ఓటేసిన ఒక వైఎస్సార్సీపీ కౌన్సిలర్18 ఓట్లు రావడంతో టీడీపికి దక్కిన నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిమున్సిపల్ వైస్ చైర్మన్ గా పగడాల సత్యనారాయణగతంలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి వైస్ చైర్మన్ గా పనిచేసిన పగడాల సత్యనారాయణసత్యనారాయణను టీడీపీలో చేర్చుకుని మళ్లీ అతన్నే వైస్ చైర్మన్‌గా చేసిన టీడీపీ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా..తిరుపతి జిల్లా..డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేసిన ఎన్నికల అధికారులుటీడీపీ అడ్డదారుల్లో గెలిచింది: కాకాణి నెల్లూరు జిల్లా..మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో గెలిచింది.పార్టీ తరఫున అభ్యర్థికి బీఫామ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది.వైఎస్సార్సీపీ ధిక్కరించిన అందరిపై వేటు తప్పదువైఎస్సార్‌సీపీ నైతికంగా విజయం సాధించింది..తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఇదే చివరి విజయం అవుతుందిన్యాయస్థానాన్ని ఆశ్రయించి.. విప్ ధిక్కరించిన కార్పొరేటర్స్పై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటాం..నిస్సిగ్గుగా ఎన్నికల్లో టీడీపీ ప్రవర్తించింది.టీడీపీ విజయం అనైతికం: తోపుదుర్తిఅనంతపురం జిల్లా..మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..హిందూపురంలో టీడీపీ విజయం అనైతికం38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్సీపీకి బలం ఉందిఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ను లాక్కున్నారుఎమ్మెల్యే బాలకృష్ణ ఓ డాకూలా అరాచకాలు చేస్తున్నారుచంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను అడ్డుకుంటాంముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల ద్రోహిహంద్రీనీవా కాలువలను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులకు టెండర్లు పిలవడం దుర్మార్గంమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి టీడీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా..టీడీపీలో చిచ్చు రాజేసిన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికనందిగామ మున్సిపల్ చైర్మన్ కోసం కొట్లాటచైర్మన్ కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతుస్వర్ణలతకు బీఫామ్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానంతనకు తెలియకుండా బీఫామ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ నిలదీత14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఇవ్వాలని పట్టుపడుతున్న ఎమ్మెల్యే సౌమ్యఅధిష్టానం వద్దకు చేరిన ఎంపీ, ఎమ్మెల్యే పంచాయతీనేను ప్రకటించే అభ్యర్థే ఫైనల్ అంటున్న ఎమ్మెల్యే సౌమ్యఅభ్యర్ధి ఎవరో తేలకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం పల్నాడు జిల్లాలో ఎన్నిక వాయిదా..పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా10 గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గురజాల ఆర్డీఓ మురళినందిగామలో ఎన్నిక వాయిదాఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదారేపటికి చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డినెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టుకోలేక చేతులు ఎత్తేసింది.టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేయకుండా.. టీడీపీలో ఉన్న వారిపై అనర్హత వేటు తప్పదు.గెలిచింది టీడీపీ అభ్యర్థినా.. ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతాం..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి: లేళ్ల అప్పిరెడ్డిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలిప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించ వద్దుదాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందిఅలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాంపోలీసు బలగాలను పెంచాలని కోరాంమా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోందిప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారుతిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారుమావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారుబీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారుఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారుఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారునిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాంపోలీసులపై నమ్మకం లేదని చెప్పాంఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాంతిరుపతి ప్రతిష్టను టీడీపీ నేతలు దిగజార్చారుగతంలో లడ్డూ వ్యవహారం, అంతకుముందు అమిత్‌షా పై దాడి చేశారుప్రపంచవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించారు.హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ..శ్రీసత్యసాయి జిల్లా..హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీపార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీ నేతల బరితెగింపువైఎస్సార్సీపీకి చెందిన 16 మందిని లాగేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి.. బెదిరించిన టీడీపీ నేతలు23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకున్న టీడీపీహిందూపురంలో మొత్తం 38 వార్డులు తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం. నూజివీడులో ఉత్కంఠ..ఏలూరు..నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.32 మంది కౌన్సిలర్లలో టీడీపీ గెలిచింది ఏడుఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్వైఎస్సార్సీపీ బలం 24 , టీడీపీ బలం 8బలం లేకపోయినా వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీపడుతున్న టీడీపీవైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రలోభాలకు తెరతీసిన పచ్చ పార్టీ.ఫార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన మంత్రి కొలుసు పార్థసారథిరాత్రికి రాత్రి ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్న పచ్చ పార్టీ.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల చేరికతో 15కు పెరిగిన టీడీపీ బలంఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పార్థసారథి ఓటుమంత్రి ఓటుతో సమం కానున్న బలాబలాలునూజివీడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఇరు పార్టీల కౌన్సిలర్లుమహిళలపై దాడి అమానుషం: గడికోటవైఎస్సార్ జిల్లా..లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ ఇంటిని పరిశీలించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్..నిన్న రాత్రి జాండ్లపల్లిలో జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడికి దిగిన టీడీపీ మూకలుఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. కనిపించిన వాహనాల్ని దహనం చేసిన వైనం.ఇంట్లో ఉన్న జెడ్పీటీసీ రమాదేవి, గర్భిణీగా ఉన్న ఆమె కోడలిపై దాడి.జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యను హత్య చేసేందుకే పథకం ప్రకారం దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు.ప్రజలకు సేవ చేసే జెడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగడం దుర్మార్గంబీసీ వర్గానికి చెందిన ఆమె ఇంటిపై దాడికి దిగడం కూటమి ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టసొంత డబ్బులతో గ్రామంలో అభివృద్ధి చేసే వ్యక్తి జెడ్పీటీసీ కుటుంబంకూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు?ప్రశాంతంగా తయారు చేసిన నియోజకవర్గాన్ని కక్షల దిశగా తీసుకెళ్తున్నారు.ఇది మంచి పరిణామం కాదు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచించాలిబీసీ నాయకులపై ఈ విధంగా ఇళ్లలో దూరి దాడిచేయడం, కనిపించిన వాహనాలను దగ్ధం చేయడం దారుణంమీకు సిగ్గుందా.. ఇలాంటి దాడులతో మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరువృద్ధురాలు , గర్భిణీలపై కూడా దాడి చేయడం సిగ్గుమాలిన చర్యఎవరైతే దాడికి పాల్పడ్డారో.. వారిపై వెంటనే చర్యలు తీసుకోండి.ఆ రోజు ఎంపీడీవోపై దాడి జరగకపోయినా ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్ బీసీలపై దాడి జరిగితే ఎక్కడకు వెళ్లాడు?కార్యకర్తలు, నాయకులకు మేమంతా తోడుగా ఉంటాం.జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.కాకినాడ..కాకినాడలో పోలీసులు ఓవరాక్షన్..తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలలో పోలీసుల ఓవరాక్షన్మున్సిపల్ చైర్మన్ సుధా బాలుతో పాటుగా కౌన్సిలర్లను కౌన్సిల్ హల్లోకి అనుమతించని పోలీసులుఉదయం 11 గంటలకు లోనికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులుఉదయం 10 గంటలకు కౌన్సిల్ హల్లో ఉండాలని.. లేదంటే లోనికి అనుమతించమని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు ఆదేశాలు.చైర్మన్ ఛాంబర్లో కూర్చుంటామని చెప్పినా లోనికి అనుమతించని పోలీసులు.పోలీసుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహంనెల్లూరు..కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి.కార్పొరేటర్స్‌తో కలిసి కార్పొరేషన్‌కి బయల్దేరిన ఎమ్మెల్సీ, సిటీ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి.ఇప్పటికే విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ..ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారందరూ వైఎస్సార్సీపీ అభ్యర్డికి ఓటేయ్యాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తివిప్ ధిక్కరిస్తే వేటు తప్పదని హెచ్చరిక.తిరుపతి..మేయర్ డాక్టర్ శిరీష వ్యక్తిగత సహాయకుడు నచికేతన్పై టీడీపీ నేతలు దాడి.టీడీపీ నాయకులు అన్నారాం చంద్రయ్య, కార్యకర్తల హల్చల్ఈ క్రమంలో దాడి ఘటపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్న మేయర్ అట్టందర్తిరుపతి..భూమన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం విజయవాడ..నందిగామ, నూజివీడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలుబలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలుఅనారోగ్య కారణాలతో మృతి చెందిన నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుచనిపోయిన వారి వార్డులకు ఎన్నికలు జరపకుండానే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెడుతున్న కూటమి ప్రభుత్వంచనిపోయిన కౌన్సిలర్ల వార్డులకు ఎన్నికలు జరపకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎన్నిక పెట్టడంపై అభ్యంతరంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీనేడు తీర్పునివ్వనున్న కోర్టుకోర్టులో ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెట్టిన కూటమి ప్రభుత్వంఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న టీడీపీనూజివీడిలోనూ ప్రలోభాలకు తెర తీసిన టీడీపీ నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికబలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి టీడీపీ కుట్రలురాత్రికి రాత్రి వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ హిందూపురంలో టీడీపీ కుట్రలు..వైఎస్సార్సీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఎన్నికహిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు.ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు.టీడీపీ బరితెగింపు రాజకీయాలు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాడేపల్లి..నేడు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికఖాళీ అయిన పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీకార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటెయ్యాలని ఆదేశంపార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలువిప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంతిరుపతి..తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్దంఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తివైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరికీ విప్ జారీ.విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు చేస్తామన్న విప్ రాధాకృష్ణ రెడ్డితిరుపతి..తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీడిప్యూటీ మేయర్ ఎన్నికలు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణ రెడ్డి విప్‌గా నియామకంతిరుపతి కార్పొరేషన్ 46 మంది డివిజన్ కార్పొరేటర్లకు వాట్సాప్ ద్వారా విప్ ఆదేశాలువిప్ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరికతిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ టీమ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్హిందూపురంలో 144 సెక్షన్..శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 30 యాక్ట్, 144 సెక్షన్ విధింపు. చైర్మన్ ఎన్నిక అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్లు లేదన్న డీఎస్పీ మహేష్తిరుపతి..పద్మావతిపురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుభూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులువైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కొనసాగుతున్న బెదిరింపులు, పోలీసుల వేధింపులుఆటో నగర్లో కార్పొరేటర్ ఉమా అజయ్‌కు చెందిన షాపును ధ్వంసం చేసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులుకూటమికి మద్దతు ఇవ్వకుంటే మిగిలిన ఆస్తులు విధ్వంసానికి దిగుతామని హెచ్చరికలు తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అలర్ట్
-
యశ్వంతపూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్ లో మంటలు
-
చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ
సాక్షి,చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం సమీపంలోని కొట్టార్లపల్లెలో ఐటీ హబ్ ఏర్పాటు కానుంది. బెంగళూరుకు చెందిన స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ కంపెనీ అధినేత దీపక్‌కుమార్ తాల శనివారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. కొట్టార్లపల్లె వద్ద 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని 20 వేల కోర్లతో క్లౌడ్ సర్వీస్‌తో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈనెల 14న భూమి పూజ చేస్తున్నామని, జూన్‌లో పనులు ప్రారంభించి, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ కంపెనీలో తయారవుతున్న సెమీ కండక్టర్లు ప్రపంచంలోనే పేరున్న అన్ని ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తున్నారన్నారు. యాపిల్, ఐ వాచెస్, తోషిబా, శామ్సంగ్ ఉత్పత్తుల్లోను, కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థల్లోను తమ ప్రొడక్టస్ ఉపయోగిస్తున్నారని చెప్పారు. తమ సంస్థకు అమెరికాలో 2, చైనాలో 1, ఇండియాలో 2 చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని, జపాన్, సింగపూర్, రష్యాతో పాటు యూరప్ మొత్తం మార్కెటింగ్ చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఉన్నారు. (చదవండి: నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు) -
కుప్పంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు: ఎంపీ మిథున్‌రెడ్డి
-
భూమా సినీ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
-
చిత్తూరు : ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు కూల్చివేత
-
చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం
-
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్?
తిరుపతి ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్ర నేతలు క్షేత్ర స్థాయిలోకి దిగేసి రాజకీయ సమీకరణలకు తెర తీస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఆరు రోజులే గడువు ఉంది. అయితే బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, జనసేన వైఖరి చూస్తుంటే బీజేపీ తప్పులు ఎత్తి చూపించి బయటపడి.. ఆంతరంగిక మిత్ర పార్టీ టీడీపీకి మద్దతుగా నిలవాలనే లోపాయికారి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే జనసేన, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి కంటే.. నోటాకే అత్యధిక ఓట్లు రావడం.. జిల్లాలో ఆ పార్టీ బలాన్ని తేటతెల్లం చేస్తోంది. సాక్షి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రధాన పార్టీలు హడావుడి చేస్తుంటే.. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ ముందు నుంచే హడావుడి చేసినా.. నామినేషన్లు ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో స్నేహబంధాన్ని తెగదెంపులు చేసుకున్న జనసేన బీఎస్పీ పార్టీతో జతకట్టింది. ఎన్నికల తర్వాత ఎక్కడా ఆ పార్టీకి సరైన ఓట్లు రాకపోవడంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో స్నేహబంధానికి తెర తీసింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణలో ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేసిన జనసేన.. హఠాత్తుగా ఆ పార్టీతో విభేదించి తెగదెంపులు చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావించినట్లుగానే ఇటీవల విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సహకరించలేదంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలల్లో మాత్రం కలిసి పనిచేస్తామని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఎన్నికల సమన్వయ కమిటీలో స్థానం కల్పించలేదని అసహనంతో జనసేన నేతలు ఊగిపోతున్నారు. ఈ పరిస్థితే ఇంకా ఒప్పందంపై ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఆంతరంగిక మిత్ర పార్టీతో.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆంతరంగిక మిత్ర పార్టీతో కలిసి పనిచేయాలనే చీకటి ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ పరిధిలో జనసేన, బీజేపీ ఉమ్మడి కమలం అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం పొత్తు క్షేత్రస్థాయిలో పొడవలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలిసి రాని జనసేన నాయకులను పక్కన పెట్టి బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఉప ఎన్నికల బాధ్యుల కమిటీలో జనసేనకు చోటు ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన జంప్ జిలానీలకు పెద్ద పీట వేసింది. ఈ కమిటీలో చోటు ఇవ్వని కమలనాథులపై గ్లాసు నేతలు గుర్రుగా ఉన్నారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్నా ఇప్పటికీ జనసేనకు ఆహ్వానం కూడా లేదు. స్థానిక నేతలను కూర్చొ బెట్టుకొని మద్దతు ఇవ్వాలని కోరిన దాఖలాలు లేవు. తమను చిన్న చూపు చూస్తున్న కమలనాథులతో జత కట్టలేమని తెగేసి చెప్పి పాత స్నేహ హస్తం అందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన లోపాయికారికంగా పాత స్నేహం మనస్సులో పెట్టుకుని టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో అయితే టీడీపీతో జతకట్టడం కంటే నోటా వైపు మొగ్గు చూపితే బావుంటుందని ఆ నేతలు ఇప్పటికే రహస్య సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీజేపీకి ఆరో స్థానం 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఆరో స్థానం దక్కింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు రాగా మూడో ప్లేస్‌లో నోటాకు 25,781 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి 16,125 ఓట్లు రాగా ఆరో స్థానంలో నిలిచారు. వైఎస్సార్సీపీ, టీడీపీ మినహాయించి మిగిలిన రాజకీయ పార్టీలకు మాత్రం డిపాజిట్ కూడా రాకపోవడం విశేషం. -
మదనపల్లిలో అగ్ని ప్రమాదం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని మదనపల్లిలోని అప్పారావు వీధిలో సోమవారం ఉదయం ప్రదీప్ ట్రేడర్స్ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తును మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. అగ్నిప్రమాదంతో రూ.కోట్లలో నష్టం ఉండొచ్చని పోలీసులు ప్రథమిక అంచనా వేస్తున్నారు. ఇక మదనపల్లిలో అతిపెద్ద వ్యాపార సముదాయం ప్రదీప్ ట్రేడర్స్ అన్న విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
చిత్తూరు జిల్లా పుత్తూరులో టిడిపి నేత వీరంగం
-
త్రీస్టార్.. తిరుపతి వన్
స్మార్ట్ తిరుపతి మెరిసింది. త్రీస్టార్ రేటింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నందుకు అత్యున్నత గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వ మినిస్టరీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అఫైర్స్‌శాఖ పర్యవేక్షణలో ఫైవ్, త్రీస్టార్ ర్యాంకింగ్‌లను మంగళవారం ప్రకటించారు. ఆశాఖ మంత్రి హర్దీప్సింగ్పూరీ ర్యాంకుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా ప్రకటించారు. త్రీస్టార్ రేటింగ్‌లో పోటీపడ్డ తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సాక్షి, తిరుపతి: గార్బేజ్ ఫ్రీసిటీ స్టార్ రేటింగ్‌లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2019లో నిర్వహించి రేటింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న తిరుపతి నగరం 2020 పోటీల్లో టాప్–1 ర్యాంకులో నిలిచి తన సత్తాను చాటుకుంది. గత ఏడాది విజయవాడ నగరం 50వ స్థానంలో ఉండగా ఈ సారి జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరింది. త్రీస్టార్ రేటింగ్‌లో టాప్–10లో ఉన్న నగరాలు మాత్రమే టాప్ 5 ర్యాంకింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. త్రీస్టార్ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి వచ్చే ఏడాది ఫైవ్ స్టార్ ర్యాంకింగ్‌లో పోటీపడనుంది. 1,435 నగరాలు పోటీ స్వచ్ఛతను పాటించే నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్టార్ రేటింగ్స్ పోటీ నిర్వహించింది. నిపుణులు నగరాల్లో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రజలకు మౌలిక వసతులు, వాటి నిర్వహణకు ఉపయోగిస్తున్న అత్యున్నత ప్రమాణాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ర్యాంకింగ్‌ను కేటాయించారు. దేశంలోని 1,435 నగరాలు పోటీడ్డాయి. ఫైవ్ స్టార్ రేటింగ్‌లో ఆరు నగరాలు సొంతం చేసుకోగా 63 నగరాలకు త్రీస్టార్, 70 నగరాలు ఒక స్టార్ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది. మెరిసిన తిరుపతి కీర్తి పతాకం తిరుపతిలో స్వచ్ఛత, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెత్తను వంద శాతం సది్వనియోగం చేస్తున్నారు. ఇందుకోసం పీపీపీ పద్ధతిన కార్పొరేషన్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను స్వీకరిస్తున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో తూకివాకంలో నిర్మించిన బయో మెథనైజేషన్ ప్లాంట్‌కు తరలించి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో రామాపురం డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ద్వారా 5 లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను తూకివాకంలో నిర్వహిస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో పొడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టారు. ఇలా శాశ్వత ప్రతిపాదికన చెత్త నిర్వహణను నిర్వహిస్తున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తుండడంతో తిరుపతి ఈ ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి కృషితోనే సాధ్యం నగర ప్రజలకు పరిశుభ్రత, స్వచ్ఛతను అందించేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక వసతులు కలి్పస్తున్నాం. చెత్త నిర్వహణ కోసం కోట్లు వె చ్చించి పలు ప్లాంట్లు నిర్వహిస్తున్నాం. ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టం, అధికారుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధించాం. – పీఎస్ గిరీషా, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
లాక్డౌన్: 128 ఏళ్లనాటి వాతావరణం..!
సాక్షి, తిరుమల: నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్‌డౌన్‌తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల అడవుల్లోని జంతువులు తిరుమల వీధుల్లోకి వచ్చి స్థానికులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కల్యాణ వేదిక, శ్రీవారి సేవ సదన్ వద్ద చిరుత, ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మ్యూజియం వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దుప్పిలపై దాడికి దిగిన ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్లలో సైతం చిరుతలు, అడవి పందులు, దుప్పి, పాముల సంచారం అధికంగా ఉంటోంది. ఇక పాపవినాశనం మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది. ఘాట్ రోడ్డులో అధికం.. ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్లలో చిరుతల సంచారం పెరిగింది. నాలుగు రోజుల క్రితం రెండు ఘాట్ రోడ్లను అనుసంధానం చేసే లింక్ రోడ్డులో చిరుత కనపడింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యారు. మొదటి ఘాట్ రోడ్డుపై జింకలు, కణితి, దుప్పిలు సైతం గంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వన్య మృగాలు జనావాసంలోకి వస్తుండడంతో సాయంత్రం తరువాత బయట తిరగరాదని టీటీడీ, పోలీసు అధికారులు స్థానికులకు గట్టి ఆంక్షలు విధించారు. 128 ఏళ్లనాటి వాతావరణం..! 1900 తర్వాత నుంచి తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతూ రావడంతో వన్యమృగాలు జనసంచారంలోకి రావడంతో క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెండు వారాలుగా ఆలయం మూత, ఘాట్‌రోడ్లపై రాకపోకల నిషేధంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరుమల వీధుల్లోకి ఘాట్ రోడ్లపైకి వచ్చేశాయి. 128 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి రెండు రోజుల పాటు గుడి మూతపడిన సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడం, శ్రీవారి ఆలయం మాత్రమే తిరుమలలో ఉండడంతో ఉదయం తిరుపతి నుంచి గుర్రాలపై అర్చకులు తిరుమలకు చేరుకునేవారు. సంధ్యా సమయం మొదలు కాకముందే తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి వాతావరణం కనిపిస్తోంది. -
కరోనా: ఒక్క వారం ప్లీజ్..!
సాక్షి, చిత్తూరు: కోవిడ్–19 వైరస్ కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వారంలో ముగియనుంది. మరో ఏడురోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితమైతే కరోనా వ్యాప్తిని నియంత్రించే అవకాశముంది. జిల్లాలో రెండు వారాల క్రితం ఒక పాజిటివ్ కేసు నమోదు కాగానే యంత్రాంగం ఉలిక్కిపడింది. తర్వాత వారం వరకు మరో కేసు జాడ లేకపోవడంతో కొద్దిగా ఊపిరిపీల్చుకుంది. ఈ క్రమంలో 1వ తేదీ నుంచి 5 లోపు వరసగా 16 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో పరిస్థితి మారిపోయింది. తాజాగా మరో 3 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 20కి చేరుకుంది. పక్కజిల్లాలతో పోలిస్తే ఇక్కడ పాజిటివ్ కేసులు కాస్త తక్కువనే చెప్పాలి. చిత్తూరు అంతర్రాష్ట్ర జిల్లాలకు సరిహద్దు కావడంతో లాక్‌డౌన్‌ను పోలీసులు సమర్థవంతంగా వినయోగించుకున్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చేవారిని సరిహద్దుల్లో నిలువరిస్తున్నారు. అయితే స్థానిక ప్రజలను మాత్రం ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేయడంలో మాత్రం పూర్తిస్థాయిలో సఫలం కాలేదనే చెప్పాలి. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే జనాన్ని రోడ్లపైకి అనుమతించారు. అదే సమయంలో ఇంటికి ఒక్కరు మాత్రమే రావాలని సూచించారు. కానీ, జిల్లావ్యాప్తంగా నిత్యం సగటున 4 వేల మంది బయటకు వస్తున్నారు. అందులో అవసరం లేకపోయినా వెలుపలికి వచ్చేవారి సంఖ్య దాదాపు వెయ్యి వరకు ఉంటుంది. ప్రస్తుతం సమాజం ఎలాంటి ఆపదలో చిక్కుకుని ఉందో ఏమాత్రం ఆలోచించడం లేదు. వీళ్లు ఇకనైనా మేల్కొని ఈవారం రోజులు ఇళ్లలో ఉంటే పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే. ఈ వారం ఎంతో కీలకం విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 1816 మందిలో 1810 మంది ఇప్పటికే రెండు వారాల గృహనిర్భందం (క్వారంటైన్) పూర్తి చేసుకున్నారు. వీళ్లుకాకుండా మరో 554 మంది జిల్లాలోని పలు ఆసుపత్రులు, హౌస్ క్వారంటైన్లో ఉన్నారు. ఇందులో ఢిల్లీలోని జమాత్‌కు వెళ్లివచ్చిన వాళ్లు 163 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే 20 మంది మాత్రం జిల్లాకు చెందినవాళ్లు కాదని, మరొకరి ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. అంటే 142 మంది ఢిల్లీకి వెళ్లివచ్చినవాళ్లు క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే వారం రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న వీరందరికీ మరో ఏడురోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు లేకుంటే పెద్ద ప్రమాదం తప్పినట్లే. జిల్లాలో తొలి కాంటాక్టు కేసు.. బుధవారం అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో తిరుపతిలో ఓ కేసు, నగరిలో రెండు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తిరుపతిలోని త్యాగరాజనగర్‌లో వెలుగుచూసిన కేసులో తండ్రి నుంచి కుమారుడికి వైరస్ సంక్రమించినట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లాలో తొలి కాంటాక్టు కేసు ఇదేకావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి మరోచోట తలెత్తకుండా ఉండాలంటే ప్రజలు స్వీయనియంత్రణ పాటించడం ఉత్తమం. -
కరోనా నియంత్రణకు టీటీడీ సహకారం
సాక్షి, తిరుమల: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల లోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈఓ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్డౌన్ కారణంగా కొంత మంది తిరుపతిలో ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సూచనల మేరకు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ఈనెల 28 నుంచి తిరుపతిలో ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైతే ఒక పూటకు 50 వేల ఆహార పొట్లాలు తయారుచేసి పంపిణీ చేసేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని వివరించారు. బర్డ్ ఆస్పత్రిలో కరోనాకు వైద్యం రాయలసీమ జిల్లాల నుంచి కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా తిరుపతిలోని స్విమ్స్‌కు వస్తున్నాయని, అవసరమైతే బర్డ్ ఆస్పత్రిని కూడా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు, క్వారంటై¯Œన్గా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఈఓ వెల్లడించారు. ఇందుకోసం టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతిలోని రుయా ఆస్పత్రితోపాటు స్విమ్స్, పద్మావతి వైద్య కళాశాలలో కరోనా వ్యాధి అనుమానితుల కోసం తగిన ఏర్పాట్లు చేశారని, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వసతి సముదాయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వినియోగిస్తున్నారని తెలియజేశారు. స్విమ్స్‌కు అవసరమైన వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని ఈఓ తెలిపారు. -
చిన్నారి వర్షిత హత్య కేసు వాయిదా
-
చిత్తూరు చేరుకున్న సీఎం జగన్
-
పనులు చేశారా.. నిధులు దోచేశారా?
సాక్షి, బి.కొత్తకోట: గత టీడీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో జరిగిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువలు, కాంక్రీటు, సొరంగం, అండర్ రైల్వే టన్నెల్ పనులపై బుధవారం విజయవాడ, తిరుపతికి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య, విజయవాడ నుంచి ఎస్ఈ శ్రీనివాసమూర్తి, డీఈ నాగసురేష్, ఏఈలు సౌజన్య, ప్రకాష్, రామ్మోహన్ల బృందం విస్తృతంగా విచారణ, పరిశీలనలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో 27వ ప్యాకేజి (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) విలువ రూ.72.73 కోట్ల పనిలో మిగిలిన రూ.1.16కోట్ల పనిని రూ.9 కోట్లకు, 28వ ప్యాకేజీ (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) పని విలువ రూ.83.80కోట్లలో మిగిలిన రూ.78 లక్షల పనిని రూ.3.69కోట్లకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలుత బి.కొత్తకోట మండలంలో 27, 28 ప్యాకేజీల్లో జరిగిన పుంగనూరు ఉపకాలువ, శీతివారిపల్లె సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ టన్నల్ పనులను క్షణ్ణంగా పరిశీలించారు. బి.కొత్తకోట మండలంలోని జాతీయ రహదారికి సమీపంలో శీతివారిపల్లె వద్ద పాకాల –ధర్మవరం రైల్వే మార్గం వెళ్తోంది. ఈ మార్గం దాటి పుంగనూరు ఉపకాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే రైల్వే మార్గం కారణంగా రైల్వే లైను కింద సొరంగం పనులు చేసి ఇరువైపులా కాలువను కలిపే పనులు చేశారు. ఈ పనుల్లో భాగంగా కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేసినట్టు రికార్డుల్లో ఉంది. 27 ప్యాకేజీ పనుల్లో మిగిలిన పనిని 60సీ కింద తొలగించి, 28వ ప్యాకేజీ పరిధిలో వచ్చే కాంక్రీటు నిర్మాణాలు, సొరంగం పని కలిపి 60సీ కింద తొలగించి రూ.3.26 కోట్లకు టెండర్ పనిని అప్పగించారు. ఇందులో 1500 క్యూబిక్ మీటర్ల కంట్రోల్ బ్లాస్టింగ్ పనులుచేశారు. ఈ పనులు వాస్తవంగా చేశారా లేక అనవసరంగా చేయించారా.. అన్న కోణంలో పరిశీలించారు. అనంతపురం సరిహద్దులో పెద్దతిప్పసముద్రం మండలం మీదుగా బి.కొత్తకోట మండలంలో సాగే 27వ ప్యాకేజీ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం కురబలకోటలో జరిగిన పనులు, ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తూ మదనపల్లె సమీపంలోని సొరంగం చేరుకున్నారు. 59వ ప్యాకేజీలోని ఈ సొరంగం పనుల్లో రూ.36.92 కోట్ల పనులు పెండింగ్ ఉండగా గత ప్రభుత్వం అందులోంచి రూ.34.27 కోట్ల పనులు రద్దు చేసి 2.5కిలోమీటర్ల సొరంగం పనులు, కాలువ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి 59ఏ ప్యాకేజి కింద రూ.160.518 కోట్లకు అంచనాలు పెంచి నిర్వహించిన టెండర్‌ను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. అయితే 2.5కిలోమీటర్ల సొరంగానికి లైనింగ్ పనులు చేయలేదు. విజిలెన్స్ బృందం ఈ పనులతోపాటు కాలువలో కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేయించడంపైనా పరిశీలించారు. ప్రాజెక్టు అధికారుల నుంచి తీసుకున్న రికార్డుల ఆధారంగా ఈ విచారణ సాగుతుండగా, అసలు పనులు చేశారా, అవసరం లేని చోట కంట్రోల్ బ్లాసింగ్ పెట్టి నిధులు దోచుకున్నారా, అసలు పనులే చేయాలేదా అన్న కోణంలో విచారణ చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
సాక్షి, తిరుమల: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలంగాణ గవర్నర్‌కు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటం అందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ గవర్నర్ హోదాలో తొలిసారి తిరుమలేశుని ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. -
టీటీడీకి రూ. 5 కోట్ల డిపాజిట్
సాక్షి, తిరుపతి: వినాయక స్వర్ణరథం తయారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాకి గురువారం కాణిపాకం వినాయక దేవస్థానం రూ. 5 కోట్లను డిపాజిట్ చేసింది. ఈ మేరకు కాణిపాకం దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ మొత్తాన్ని వినాయక స్వర్ణరథం తయారీ కోసము డిపాజిట్ చేసినట్టు పేర్కొంది. గతంలో వినాయక బంగారు రథం తయారీ కోసం టీటీడీకి రూ. కోటి డిపాజిట్ చేసినట్టు కాణిపాకం దేవస్థానం వెల్లడించింది. అయతే తాజాగా కాణిపాకం వినాయక స్వర్ణరథం తయారీకి అంచనాలు పెరిగాయి. దీంతో రథం తయారికి రూ. 6.5 కోట్ల ఖర్చు అవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. కాగా వచ్చే ఏప్రిల్ నాటికి వినాయక స్వర్ణరథం సిద్ధం చేసేందుకు టీటీడీ టెండర్లు పిలువనుంది. -
సత్యవేడులో బాంబు కలకలం
సాక్షి, సత్యవేడు, చత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం తెల్లవారు జామున సత్యవేడులో బాంబు కలకలం సమాచారం స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు గురువారం తెల్లవారు జామున 3 గంటలకు రాష్ట్ర పోలీస్ అత్యవసర సేవ అయిన 100కు ఫోన్ చేసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపంలో బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీనిపై స్పందించిన తమిళనాడు రాష్ట్ర డీజీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ వెంటనే పుత్తూరు డీఎస్పీ మురళీకృష్ణ, సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. హుటాహుటిన వీరందరూ కలసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపాన్ని తెల్లవారుజామున పరిశీలించారు. అక్కడ ఆ సమయానికి వివాహం జరుగుతుండగా వారిని వెలుపలికి పంపి మండపం పరిసరాలను అణువణువునా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ వివాహ కార్య క్రమానికి వచ్చిన వారిని విచారణ చేశారు. అక్కడ ఎలాంటి బాంబులు అమర్చినట్లు ఆధారాలు లభ్యం కాకపోవడం, ఎలాంటి దుస్సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించేందుకు తమిళనాడు 100కు ఎవరో ఆగంతకుడు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన నెంబరు ఆధారంగా కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తనిఖీలలో సత్యవేడు ఎస్ఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నా కుమార్తె మృతిపై న్యాయం చేయాలి
సాక్షి, తిరుపతి: భవానినగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈనెల 5వ తేదీన అనుమానాస్పదంగా తన కుమార్తె పవిత్ర మృతి చెందడంపై సంబంధిత అధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని పవిత్ర తల్లి ప్రమీల కోరా రు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల ఒకటో తేదీన తన కుమార్తె పవిత్రను కళాశాలలో బీఎస్సీ కోర్సులో చేర్చి హాస్టల్లో ఉంచామన్నారు. అయితే 5వ తేదీన కళాశాలలో ఆరు అంతస్తుల భవనం నుంచి పడి తన కుమార్తె చనిపోయిందని కళాశాల యాజమాన్యం తెలిపిందని, తన బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోయినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె స్నేహితురాలి సమాచారంతో తాము రుయా ఆసుపత్రికి చేరుకున్నామని, పవిత్ర మృతి విషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెబుతోందని తెలిపారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని, సమగ్ర విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఆమెతో పాటు మృతు రాలి బంధువులు చంద్రశేఖర్, కుమార్, నాగరాజు, అనిత పాల్గొన్నారు. -
అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు
సాక్షి, తిరుపతి: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తిరుపతి రూరల్ జీవకోన క్రాంతినగర్‌కు చెందిన కుసునూరు చరణ్‌కుమార్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి రాంగోపాల్ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము రూ.25 వేలులో రూ.20వేలు బాధిత యువతికి చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతి స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాలలోని డీఎంఎల్టీ సెకండ్ ఇయర్ కోర్సు చదువుతూ స్థానిక ఎమ్మార్‌పల్లెలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉండేవారు. చరణ్‌కుమార్ అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ఆ యువతి వెంట ఇతడు ప్రేమ పేరుతో రోజూ వెంటపడేవాడు. 2011 ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 8.45 ప్రాంతంలో ఆ యువతి కళాశాలకు నడిచి వెళుతుండగా చరణ్‌కుమార్ క్రైమ్ పోలీసు స్టేషన్ సమీపంలో వెంబడించాడు. తన ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని, తనతో రావాలని తిరిగి వదిలి పెడతానని చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. అయితే అతడు మాయమాటలు చెప్పి బలవంతంగా ద్విచక్ర వాహనంలో టౌన్ క్లబ్ సమీపంలోని ఇంటిలోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని టీ గిరి, అతని బంధువు కే నాగరాజ సహాయంతో ఆమెకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటల తర్వాత మత్తు వదలిన ఆ యువతిని గిరి ఆటోలో హాస్టల్‌కు పంపాడు. బాధితురాలు ఈ సంఘటన విషయాలను ఇద్దరు స్నేహితురాళ్లకు, హాస్టల్ వార్డన్‌కు తెలిపింది. తరువాత కూడా నిందితుడు చరణ్‌కుమార్ బాధిత యువతికి ఫోన్‌చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. బాధితురాలు ఈ మేరకు స్థానిక వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు గిరి, నాగరాజపై నేరం రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు చరణ్కుమార్పై అత్యాచారం కింద కేసు నిరూపణ కావడంతో అతనికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
చుడా చైర్మన్‌గా పురుషోత్తంరెడ్డి
సాక్షి, చిత్తూరు: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కట్టమంచి పురుషోత్తం రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2005లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూ రు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆయన్ని మునిసిపల్ వైస్ చైర్మన్‌గా నియమించారు. 2009లో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కట్టమంచి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై కా ర్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. పార్టీకి నమ్మకంగా ఉన్న ఈయనకు చుడా చైర్మన్ పదవి దక్కడంతో చిత్తూరులోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఏడాది కాలంపాటు ఆయన చుడా చైర్మన్‌గా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.