
సాక్షి, తిరుపతి: వినాయక స్వర్ణరథం తయారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాకి గురువారం కాణిపాకం వినాయక దేవస్థానం రూ. 5 కోట్లను డిపాజిట్ చేసింది. ఈ మేరకు కాణిపాకం దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ మొత్తాన్ని వినాయక స్వర్ణరథం తయారీ కోసము డిపాజిట్ చేసినట్టు పేర్కొంది. గతంలో వినాయక బంగారు రథం తయారీ కోసం టీటీడీకి రూ. కోటి డిపాజిట్ చేసినట్టు కాణిపాకం దేవస్థానం వెల్లడించింది. అయతే తాజాగా కాణిపాకం వినాయక స్వర్ణరథం తయారీకి అంచనాలు పెరిగాయి. దీంతో రథం తయారికి రూ. 6.5 కోట్ల ఖర్చు అవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. కాగా వచ్చే ఏప్రిల్ నాటికి వినాయక స్వర్ణరథం సిద్ధం చేసేందుకు టీటీడీ టెండర్లు పిలువనుంది.
Comments
Please login to add a commentAdd a comment