తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
మరోవైపు.. టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 56,711 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,775 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా లెక్క తేలింది.
నేడు తిరుమలలో గరుడసేవ...
కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడవాహనం పై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.
రాత్రి 7 గంటలకు గరుడవాహనం పై తిరు వీధుల్లో ఊరేగింపు.
ఈ నెల 17 న తిరుమలలో కార్తీక వనభోజనం.
18 టిటిడి పాలకమండలి సమావేశం
Comments
Please login to add a commentAdd a comment