devasthanam
-
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,416 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమలకు భారీగా పెరిగిన రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(గురువారం) 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 41,927 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలునేటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలునారాయణ గిరి ఉద్యాన వనంలో పరిణయోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు.మొదటి రోజు మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై దర్శనంమే 17 నుండి 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు.1992వ సంవత్సరం పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ. -
అద్భుతం.. 3డీ ప్రింటెడ్ ఆలయం
సిద్దిపేట అర్బన్: వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరి/జ్ఞనం మేళవింపుతో అసాధారణమైన రీతిలో నిర్మించిన ఆధ్యాత్మిక అద్భుతం.. ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హిందూ దేవాలయం సిద్ధపేటలో ఆవిష్కృతమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్‌తో కలిసి అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులోని చర్విత మెడోస్‌లో నిర్మించిన 3డీ ప్రింటెడ్ దేవాలయానికి శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా నామకరణం చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళవారం మొదలైన ప్రతిష్టాపన మహోత్సవ పూజలు మరో రెండు రోజులు జరగనుండగా.. 24 నుంచి ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఐకానిక్ టెంపుల్ సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అప్సుజా ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి వ్యాఖ్యానించారు. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని హరికృష్ణ తెలిపారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే మాట్లాడుతూ.. ఆలయం భూకంపాలకు దెబ్బతినకుండా నిర్మించినట్టు తెలిపారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి మాట్లాడుతూ గర్భగుడిలో వేదమంత్రాల ప్రతిధ్వనులతో భక్తులను మంత్రముగ్ధులను చేసేలా నిర్మాణం జరిగిందన్నారు. పూరీ జగన్నాథ ఆలయం శైలిలో గోపురం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు 70 రోజుల్లో పూర్తయ్యాయి. -
Gautam Gambhir Visit Lord Balaji Temple In Tirumala: తిరుమలలో టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ (ఫొటోలు)
-
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రూ.2 కోట్లతో శనైశ్చర స్వామి ఆలయ నిర్మాణం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కృష్ణా నదీ తీరాన ప్రత్యేక శనైశ్చరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ సమీపంలో శనీశ్వరునికి శనైశ్చరస్వామి దేవస్థానం పేరుతో రెండున్నర దశాబ్దాల క్రితం ఆలయాన్ని నిర్మించారు. శనీశ్వరునికి పూజలు నిర్వహించే భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతుంటారు. అటువంటి ఆలయాన్ని కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కూలగొట్టింది. ఆ తరువాత ఆలయ నిర్మాణాన్ని విస్మరించింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ ఆలయాన్ని అక్కడే పునఃనిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రూ. 2 కోట్లతో ధర్మదాయ శాఖ పరిధిలో ప్రభుత్వం భారీ నిర్మాణం పనులను చేపట్టింది. అలాగే నగరంలోని మరికొన్ని కూలగొట్టిన ఆలయాలను సైతం సీఎం ఆదేశాలతో పునఃనిర్మాణ పనులను మొదలుపెట్టారు. ముందుకు వచ్చిన దాత ఆలయ నిర్మాణం పూర్తిగా తానే చేపడతానని విజయవాడకు చెందిన వ్యాపారవేత్త చలవాది ప్రసాద్ ముందుకువచ్చారు. దేవదాయ శాఖ నిర్ణయించిన విధంగా ఆలయాన్ని పూర్తిగా తానే నిర్మాణం చేసి అప్పగిస్తానని తన సమ్మతిని తెలిపి పనులను ప్రారంభించారు. ఆలయంతో పాటుగా వంటశాల, గోశాల, ఆలయ కార్యాలయ నిర్మాణాలను అందులో చేపట్టనున్నారు. శనీశ్వరునితో పాటుగా అనుబంధంగా రాహుకేతువులను సైతం ఉపాలయంగా ఏర్పాటు చేయనున్నారు. 2 అంతస్తులుగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణంలో గర్భాలయాన్ని పూర్తిగా రాతితో చేపట్టనున్నారు. గర్భాలయం నుంచి గోపురం వరకు పూర్తిగా రాతితో నిర్మించనున్నారు. అత్యంత గట్టిగా దీని నిర్మాణం జరుగుతుంది.కాగా, ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఘంటశాల శ్రీనివాసు తెలిపారు. -
హమ్మయ్య సొమ్ములు దక్కాయి
‘సహజ ’ ఆస్పత్రిలో ‘ వెల్నెస్ సెంటర్ ’ ప్రతిపాదన రద్దు వడ్డీతో కలిపి రూ.31.15 లక్షలు దేవస్థానానికి తిరిగి చెల్లింపు అన్నవరం : దేవస్థానంలోని సహజ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో యోగా, నేచురోపతి, కేరళ తరహా ఆయర్వేద వైద్యాన్ని అందించే‘ వెల్నెస్ సెంటర్ ’ ఏర్పాటు చేస్తామని గతేడాది ఏప్రిల్‌లో రూ.30 లక్షలు వసూలు చేసిన బెంగుళూర్లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ (డీమ్డ్ యూనివర్సిటీ) ఎట్టకేలకు వడ్డీతో తిరిగి దేవస్థానానికి చెల్లించింది. వాస్తవానికి గత ఏడాది జూన్ కల్లా ఈ సెంటర్ ఏర్పాటై భక్తులకు సేవలందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ అలాంటి సెంటర్ ఏర్పాటు కాలేదు సరికదా, ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఈ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కాకపోవడం, దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలు విషయమై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయమై గత ఆగష్టు లో ‘ సాక్షి ’దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అధికారులలో స్పందన వచ్చి వెంటనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయండి లేదా నిధులను వడ్డీతో సహ వెనక్కి చెల్లించాలని ఆ యూనివర్సిటీకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలతో పాటు రూ.1.15 లక్షలు వడ్డీ కలిపి దేవస్థానానికి పంపించింది. ఈ విషయాన్ని ఈఓ నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. అన్నవరంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలలో బెంగళూర్‌లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ’ (డీమ్డ్ యూనివర్సిటీ)తో ‘వెల్నెస్ సెంటర్ ’ లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. తొలుత అన్నవరం దేవస్థానంలో సహజ ఆస్పత్రిలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. ఆ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న కంభంపాటి సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు ప్రతినిధులు అన్నవరం లోని సహజ ఆస్పత్రిని పరిశీలించారు. ‘వెల్నెస్ సెంటర్’ కు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు. సెంటర్ ను 11 ఏళ్లపాటు నిర్వహించేందుకు విడతల వారీగా దేవస్థానం రూ.80 లక్షలు చెల్లించేలా గత ఏప్రిల్‌లో దేవస్థానానికి, ఆ యూనివర్సిటీకి ఒప్పందం కుదిరింది. తొలి విడతగా రూ.30 లక్షలు ఆ యూనివర్సిటీ ప్రతినిధులకు అందించింది. ఆ తర్వాత ఆస్పత్రిని నెలరోజులు మూసివేసి ఆ భవనాన్ని వారికి అప్పగించారు. సహజ సిబ్బందికి బెంగళూరులోని ఆ యూనివర్సిటీలో మే నెలలో శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సెంటర్ ఏర్పాటు ప్రక్రియ ముందుకెళ్లలేదు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షల గురించి ఆందోళన నెలకొంది. దీనిపై గత ఏడాది ఆగస్టులో ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో ఈఓ నాగేశ్వరరావు స్పందించి ఉన్నతాధికారులకు, యూనివర్సిటీ ప్రతినిధులకు లేఖ రాశారు. దీంతో ఎట్టకేలకు ఆ నిధులు తిరిగి వచ్చాయి. సహజ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని ఈఓ కె.నాగేశ్వర రావు ‘సాక్షి’కి వివరించారు. దీనిపై త్వరలోనే ఆ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. -
సత్తెన్నకు రూ.45 లక్షలు శఠగోపం
దుకాణాల వేలం పాటలో తప్పుడు పత్రాలతో ధరావత్తు చెల్లింపు అర్ధంతరంగా వ్యాపారం నుంచి నిష్క్రమణ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఈఓ ఆగ్రహం.. గుమస్తా సస్పెన్షన్, ఆరుగురికి సంజాయిషీ నోటీసులు అన్నవరం : ఒక పాటదారుడు సాక్షాత్తు సత్యదేవుడికే రూ.45 లక్షల మేర శఠగోపం పెట్టాడు. ఈ వ్యవహారంలో దేవస్థానం సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని భావించిన ఈఓ కె.నాగేశ్వరరావు ఓ గుమాస్తాను సస్పెండ్ చేసి మరో ఐదుగురికి సంజాయిషీ నోటీసులు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. అన్నవరం దేవస్థానంలో 2014–15 సంవత్సరంలో నెంబర్ పది షాపు, రావిచెట్టు వద్ద ఆవునేతి దీపాలు విక్రయానికి వేలం నిర్వహించగా ద్వారపురెడ్డి రామకృష్ణ ఆవునేతి దీపాలు నెలకు రూ,5,55,555, పదో నెంబర్ షాపును రూ. 3,99,999కు పాడుకున్నాడు. ఈ సొమ్ముకు హామీగా తుని మండలం మర్లపాడు గ్రామంలోని ఎనిమిది ఎకరాల భూమి తాలూకు పాస్‌బుక్ అసలు కాకుండా నకలు ఇచ్చాడు. కాగా, 2015లో గోదావరి పుష్కరాల అనంతరం రామకృష్ణ తన రెండు వ్యాపారాలు వదలి వెళ్లిపోయాడు. ఏడాది కాలపరిమితికి వేలం పాట జరిగితే ఏడాదంతా వ్యాపారం చేసి దేవస్థానానికి పాట సొమ్ము చెల్లించాలన్నది నిబందన. కానీ మద్యలో వ్యాపారాలు వదిలేసి వెళ్లిపోవడం వల్ల రెండు వ్యాపారాలు కలిపి సుమారు రూ.45 లక్షల బకాయిలు దేవస్థానానికి చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు అతనిపై కోర్టులో కేసు వేశారు. కేసు తేలే వరకూ పాటదారుడు హామీగా ఇచ్చిన ఎనిమిది ఎకరాల భూమిని దేవస్థానానికి అటాచ్ చేయాలని కోరగా మెజిస్ట్రేట్ ఆ మేరకు ఆదేశాలిచ్చారు. ఆ ఉత్తర్వులను దేవస్థానం అధికారులు తుని సబ్‌రిజిస్ట్రార్‌కు అందజేశారు. సదరు భూమి వివరాలు పరిశీలించిన సబ్రిజస్ట్రా్టర్ 2012 సంవత్సరంలోనే ఆ భూమిలో కొంత భాగం విక్రయించారని, మిగిలిన భూమి కూడా మరొకరి స్వాధీనంలో ఉందని దేవస్థానం అధికారులకు వివరించారు. కాగా ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఆ భూమి తనదని, 2012 లోనే కొనుగోలు చేశానని దేవస్థానానికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ పాటదారునిపై న్యాయపరమైన చర్యలకు దేవస్థానం అధికారులు సమాయత్తం అవుతున్నారు. కాగా హామీ ఇచ్చిన పత్రాలు సరైనవో కాదో తేల్చుకోకుండా తీసుకున్నందుకు, భూమిపత్రాల స్టేటస్ తెల్సుకునేందుకు ఈసీ తీయనందుకు సీ సెక్షన్ గుమస్తా వి.సత్యనారాయణను ఈఓ సస్పెండ్ చేశారు. ఈ షాపుల వేలం సమయంలో సీ సెక్షన్ పని చేసిన ముగ్గురు ఏఈఓలు, ముగ్గురు సూపరింటెండెంట్లకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. -
సత్య దేవుని బడ్జెట్ రూ.135.02 కోట్లు
గత ఏడాదితో పోల్చితే రూ.19 కోట్లు పెరుగుదల అన్నదానం ట్రస్ట్‌కు రూ.32.18 కోట్లు అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్ట్‌కు 2016–17 సంవత్సరానికిగాను ప్రత్యేకంగా రూ.32.18 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్‌ను కూడా కమిషనర్ ఆమోదించారు. అన్నదానంలో ముడి సరుకుల కొనుగోలుకు రూ.2.90 కోట్లు, సిబ్బంది జీతభత్యాల కింద రూ.45 లక్షలు, ఇతర ఖర్చుల కింద రూ.32.45 లక్షలు కేటాయించారు. అన్నదాన ట్రస్ట్‌కు రూ.28.50 కోట్లు డిపాజిట్లను తిరిగి బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి నిర్ణయించారు. గో సంరక్షణకు రూ.35 లక్షలు... ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.35 లక్షలతో రూపొందించిన బడ్జెట్‌కు కూడా కమిషనర్ ఆమోదం తెలిపారు. ఇందులో రూ.12 లక్షలు గోవుల మేత, గడ్డికి, రూ.80 వేలు గోవులకు ఇన్సూరెన్స్ చేయించడానికి, రూ.17.40 లక్షలు సిబ్బంది జీతభత్యాలకు కేటాయించారు. అన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి 2016–17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.135.02 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ వైవీ ఆనూరాధ ఆమోదించారు. 2015–16 వార్షిక బడ్జెట్ రూ.119 కోట్లు. దాంతో పోల్చిచూస్తే ఈసారి రూ.16 కోట్లు అదనంగా బడ్జెట్ పెరిగిందని దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ముఖ్యమైన అంశాలిలా... సత్యదేవుని ప్రసాదాల తయారీకి ముడిపదార్దాల కొనుగోళ్లకు రూ.16 కోట్లు, వ్రతాలలో వాడే పూజా సామాగ్రి కొనుగోళ్లకు రూ.ఆరు కోట్లు, ఇతర వైదిక కార్యక్రమాలలో వాడే సామాగ్రి కొనుగోళ్లకు రూ.67 లక్షలు కేటాయించారు. సిబ్బంది జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లు, కాంట్రాక్టు సిబ్బంది , ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.22.11 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. వివిధ భవనాల నిర్మాణం కోసం రూ.ఏడు కోట్లు, విద్యుత్తు, నీటిసరఫరా కోసం రూ.కోటి కేటాయించారు. విద్యుత్ ఛార్జీల చెల్లింపునకు రూ.మూడు కోట్లు, విద్యుత్ ఉపకరణాల కొనుగోలుకు రూ.92 లక్షలు కేటాయించారు. దేవస్థానం సెక్యూరిటీ ఖర్చు కింద రూ.2.25 కోట్లు కేటాయించారు. దేవాదాయశాఖకు చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ రూ. ఆరు కోట్లు, ఆడిట్ ఫీజు కింద రూ. 68 లక్షలు, సీజీఎఫ్ కంట్రిబ్యూషన్ కింద రూ.2.30 కోట్లు, అర్చక సంక్షేమ నిధి కింద రూ.కోటి , ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.15 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. వ్రత పురోహితుల పారితోషకం రూ.ఏడు కోట్లు, కేశఖండనశాలలో నాయీబ్రాహ్మణుల పారితోషకం రూ.38.50 లక్షలు, ప్రసాదం ప్యాకర్లు పారితోషకం రూ.90 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణకు రూ.3.75 కోట్లు, షామియానాలు, పందిర్లు వేయడానికి రూ.45 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. దేవస్థానం ప్రచార రథం ద్వారా ధర్మప్రచారానికి రూ.40 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. రూ.41.25 కోట్లు వివిధ బ్యాంకుల్లో రీ–డిపాజిట్ చేయడానికి బడ్జెట్లో కేటాయించారు. -
ప్రయోగాత్మక పరిశీలనలో ఈ–టాయిలెట్స్
శ్రీశైలం స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా దేవస్థానం పరిధిలోని పలు రద్దీ ప్రదేశాల సమీపంలో ప్రయోగాత్మకంగా ఈ –టాయిలెట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఈఓ నారాయణ భరత్ గుప్త గురువారం తెలిపారు. ఇందులో భాగంగా గంగా గౌరి సదన్ రోడ్డుమార్గంలోని కర్ణాటక గెస్ట్ హౌస్ సమీపంలోని రోడ్డుమార్గం పక్కనే ఈ–టాయిలెట్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొ యూనిట్ రూ. 6.30 లక్షలు ఖర్చు అవుతుందని, ఈ టాయిలెట్లను రూ. 2 లేదా రూ. 5 కాయిన్ ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. ప్రస్తుతం రెండు పురుషులకు, ఒకటి స్త్రీలకు నిర్మిస్తున్నామన్నారు. దాతల సహకారం దొరికితే క్షేత్రవ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రదేశాలలో 50 నుంచి 60 ఈ టాయిలెట్స్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భక్తులందరికీ మినిరల్ వాటర్ అందించాలనే సంకల్పంతో సింటెక్స్ ట్యాంకులకు స్వస్తి చెప్పి ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. -
మహానందిలో రూ. 2.07 కోట్లతో మాడా వీధులు
· ఆలయంలో సైన్‌బోర్డుల ఏర్పాటు · పాలకమండలి సమావేశంలో తీర్మానాలు మహానంది : మహానంది దేవస్థానంలో రూ. 2.07 కోట్లతో మాడా వీధుల నిర్మాణానికి మరోసారి టెండర్లను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకరవరప్రసాద్ తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో గురువారం సాయంత్రం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన తీర్మాన వివరాలను వారు వెల్లడించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు కమిషనర్ ఉత్తర్వుల మేరకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అలాగే దేవస్థానంలో రూ.22 లక్షలతో ఏకాంత సేవ మండపం చుట్టూ అద్దాలు, నిత్యకల్యాణమండపంలో అల్యూమినియం పార్టీషియన్స్, రామాలయంలో అద్దాల మరమ్మతులు చేస్తామన్నారు. కానుకలు హుండీలలో వేయాలన్న సమాచారానికి సంబంధించిన బోర్డులను ప్రతి ఆలయంలో ఏర్పాటు చేయాలని పాలకమండలి సభ్యులు తీర్మానించారు. కమిషనర్ అనుమతిస్తే మహానంది క్షేత్ర అభివద్ధికి విశేష కషి చేసిన దివంగత మాజీ ధర్మకర్త మహానందయ్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. పందుల నివారణకు ఆలయ పరిసరాలలో గ్రిల్స్ ఏర్పాటు, ఉచిత దర్శనం కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఈఓ రాజశేఖర్, సూపరింటెండెంట్లు పరుశురామశాస్త్రి, ఈశ్వరరెడ్డి, ఏఈ మురళీధర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు సి బాలరాజు, రామకష్ణ, మునెయ్య, చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామయ్య, చింతకుంట్ల శివారెడ్డి, వేమూరి నారాయణ పాల్గొన్నారు. -
ముక్కంటిచెంత మాస్టర్ ప్లాన్
- దేవస్థానంలో భారీ మార్పులు - ఆలయం వద్ద భవనాల తొలగింపు - భవనాలన్నీ భరద్వాజతీర్థం వద్దకు తరలింపు శ్రీకాళహస్తి : మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో భారీ మార్పులు చేయనున్నట్లు ఈవో బి.రామిరెడ్డి తెలిపారు. శనివారం దేవస్థానంలోని పరిపాలన భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానంలో భారీ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఆల యాన్ని పరిశీలించడానికి సోమవారం(22వ తేదీ) ఆర్కియాలజీ శాఖకు చెందిన బృం దం వస్తోందని చెప్పారు. వారి సలహాల మేరకు భవనాల తొలగింపు, నిర్మాణాలు ఉంటాయన్నారు. అన్ని రకాల రాహుకేతు పూజలు ఇకపై ఆలయంలోపల కాకుండా ఆలయ ప్రాంగణంలోనే పెద్దఎత్తున భక్తులు విచ్చేసినా ఇబ్బం దులు లేకుండా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని అన్నదాన మండపం, పరిపాలన భవనం, జ్ఞానప్రసూనాంబ, త్రినేత్ర అతిథి భవనాలను తొలగించి భరద్వాజతీర్థం(ఆలయానికి 500 మీటర్ల దూరంలో) వద్ద నిర్మించనున్నట్లు చెప్పారు. సన్నిధివీధిలోని పలు ప్రైవేటు భవనాలు తొలగిస్తారని తెలిపా రు. ఆలయ ఈఈ కె.రామిరెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌లో చేపట్టాల్సిన అంశాలపై ఇటీవల తమకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగుమాడ వీధుల్లో రథోత్సవం నిర్వహించడం ఇబ్బందిగా ఉందన్నారు. ట్రాఫిక్, భక్తులకు సౌకర్యాల దృష్ట్యా నాలుగు మాడ వీధుల్లోనూ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పెద్ద ఎత్తున భవనాలు తొలగిస్తారని తెలిపారు. భరద్వాజతీర్థంలోనే గోశాలకు అవసరమైన షెడ్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. స్వర్ణముఖినదిలో మురుగునీరు తొలగించి భక్తులు స్నానాలు చేసే విధంగా మం చినీరు నిలువ ఉండడం కోసం చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. -
దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలు
ద్వారకాతిరుమల : రాష్ట్రంలో దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమౌతోంది. దీంతో చినవెంకన్న దేవస్థానంలో పలువురు ఉద్యోగులకు వచ్చే నెలలో స్థానచలనం కలగనుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కోరుతూ ఆయా దేవస్థానాల ఈవోలను కమీషనర్ ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్రంలోని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం రమా సహిత సత్యనారాయణస్వామి, కాణిపాకం విఘ్నేశ్వరుడు, భద్రాచలం శ్రీరాముడు, శ్రీశైలం మల్లికార్జునస్వామి, యాదిగిరిగుట్ట, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవస్థానం వంటి ప్రధాన దేవస్థానాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తయిన రికార్డు అసిస్టెంట్ స్థాయి నుంచి ఏఈవో స్థాయి వరకు బదిలీలకు రంగం సిద్ధమైంది. పాలనా సిబ్బందితో పాటు ఇంజినీరింగ్ విభాగ సిబ్బందికి కూడా ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. అభియోగాలున్న ఉద్యోగులపై బదిలీల్లో ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఈనెల 19న జారి అయిన జీవో 175 ను అనుసరించి వచ్చే నెల 1 నుంచి 30 వరకు ఈ బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు దేవాదాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది.