సత్య దేవుని బడ్జెట్ రూ.135.02 కోట్లు
సత్య దేవుని బడ్జెట్ రూ.135.02 కోట్లు
Published Thu, Sep 29 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
గత ఏడాదితో పోల్చితే రూ.19 కోట్లు పెరుగుదల
అన్నదానం ట్రస్ట్‌కు రూ.32.18 కోట్లు
అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్ట్‌కు 2016–17 సంవత్సరానికిగాను ప్రత్యేకంగా రూ.32.18 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్‌ను కూడా కమిషనర్ ఆమోదించారు. అన్నదానంలో ముడి సరుకుల కొనుగోలుకు రూ.2.90 కోట్లు, సిబ్బంది జీతభత్యాల కింద రూ.45 లక్షలు, ఇతర ఖర్చుల కింద రూ.32.45 లక్షలు కేటాయించారు. అన్నదాన ట్రస్ట్‌కు రూ.28.50 కోట్లు డిపాజిట్లను తిరిగి బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి నిర్ణయించారు.
గో సంరక్షణకు రూ.35 లక్షలు...
ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.35 లక్షలతో రూపొందించిన బడ్జెట్‌కు కూడా కమిషనర్ ఆమోదం తెలిపారు. ఇందులో రూ.12 లక్షలు గోవుల మేత, గడ్డికి, రూ.80 వేలు గోవులకు ఇన్సూరెన్స్ చేయించడానికి, రూ.17.40 లక్షలు సిబ్బంది జీతభత్యాలకు కేటాయించారు.
అన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి 2016–17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.135.02 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ వైవీ ఆనూరాధ ఆమోదించారు. 2015–16 వార్షిక బడ్జెట్ రూ.119 కోట్లు. దాంతో పోల్చిచూస్తే ఈసారి రూ.16 కోట్లు అదనంగా బడ్జెట్ పెరిగిందని దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు.
బడ్జెట్‌లో ప్రతిపాదించిన ముఖ్యమైన అంశాలిలా...
సత్యదేవుని ప్రసాదాల తయారీకి ముడిపదార్దాల కొనుగోళ్లకు రూ.16 కోట్లు, వ్రతాలలో వాడే పూజా సామాగ్రి కొనుగోళ్లకు రూ.ఆరు కోట్లు, ఇతర వైదిక కార్యక్రమాలలో వాడే సామాగ్రి కొనుగోళ్లకు రూ.67 లక్షలు కేటాయించారు.
సిబ్బంది జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లు, కాంట్రాక్టు సిబ్బంది , ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.22.11 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
వివిధ భవనాల నిర్మాణం కోసం రూ.ఏడు కోట్లు, విద్యుత్తు, నీటిసరఫరా కోసం రూ.కోటి కేటాయించారు. విద్యుత్ ఛార్జీల చెల్లింపునకు రూ.మూడు కోట్లు, విద్యుత్ ఉపకరణాల కొనుగోలుకు రూ.92 లక్షలు కేటాయించారు.
దేవస్థానం సెక్యూరిటీ ఖర్చు కింద రూ.2.25 కోట్లు కేటాయించారు.
దేవాదాయశాఖకు చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ రూ. ఆరు కోట్లు, ఆడిట్ ఫీజు కింద రూ. 68 లక్షలు, సీజీఎఫ్ కంట్రిబ్యూషన్ కింద రూ.2.30 కోట్లు, అర్చక సంక్షేమ నిధి కింద రూ.కోటి , ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.15 లక్షలు బడ్జెట్‌లో కేటాయించారు.
వ్రత పురోహితుల పారితోషకం రూ.ఏడు కోట్లు, కేశఖండనశాలలో నాయీబ్రాహ్మణుల పారితోషకం రూ.38.50 లక్షలు, ప్రసాదం ప్యాకర్లు పారితోషకం రూ.90 లక్షలు బడ్జెట్‌లో కేటాయించారు.
దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణకు రూ.3.75 కోట్లు, షామియానాలు, పందిర్లు వేయడానికి రూ.45 లక్షలు బడ్జెట్‌లో కేటాయించారు.
దేవస్థానం ప్రచార రథం ద్వారా ధర్మప్రచారానికి రూ.40 లక్షలు బడ్జెట్‌లో కేటాయించారు.
రూ.41.25 కోట్లు వివిధ బ్యాంకుల్లో రీ–డిపాజిట్ చేయడానికి బడ్జెట్‌లో కేటాయించారు.
Advertisement
Advertisement