తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.
ఇక.. నిన్న(గురువారం) 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 41,927 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.
నేటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు
నేటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
నారాయణ గిరి ఉద్యాన వనంలో పరిణయోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు.
మొదటి రోజు మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై దర్శనం
మే 17 నుండి 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు.
1992వ సంవత్సరం పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ.
Comments
Please login to add a commentAdd a comment