
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
ఇక.. నిన్న(గురువారం) 76,695 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,395 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లుగా లెక్క తేలింది.
19న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల
ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల.. ఆగష్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక.. ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల.
మరోవైపు.. ఆగష్టు 23న అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల చేయనున్నారు. 24న తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల. ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదల.. https://ttdevasthanams.ap.gov.in సైట్ ద్వారా టికెట్ల బుక్ చేస్కోవాలని టీటీడీ సూచన